sandra venkata veraiah
-
సండ్ర, పువ్వాడ అజయ్‌పై లోక్‌పాల్‌లో ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ : ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, పువ్వాడ అజయ్‌లపై లోక్‌పాల్‌లో ఫిర్యాదు నమోదు అయింది. ఖరీదైన ప్రభుత్వ స్థాలాలను కబ్జా చేసి కేసీఆర్ ప్రభుత్వంతో క్రమబద్దీకరణ చేయించుకున్నారంటూ తెలంగాణ పీసీసీ ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతా రాయ్ ఫిర్యాదు చేశారు. రాజకీయ అవినీతికి పాల్పడ్డారని, ప్రతిపక్ష కాంగ్రెస్, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరీదైన ప్రభుత్వ స్థలాలను జీవో నెం.5 ద్వారా తక్కువ ధరకు కట్టబెట్టారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు రాజకీయ అవినీతికి పాల్పడుతున్న కేసీఆర్ఫై, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేసీఆర్ స్థలాల తాయిలాలకు ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి లొంగిపోయారని అన్నారు. టీఆర్ఎస్ ఎల్పీలోకి విలీనానికి సంతకం పెట్టిన మొత్తం 11మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినట్లు మానవతా రాయ్ తెలిపారు. -
ముగ్గురిని ఓడించి..
సత్తుపల్లి: ‘రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు’ఉండరనే నానుడి నిరూపితమవుతోంది. సత్తుపల్లిలో ఒకప్పటి ప్రత్యర్థులు నేడు మిత్రులుగా మారి కలిసి వ్యూహాలు రచిస్తూ రాజకీయాలను రక్తికట్టిస్తున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్, పిడమర్తి రవిలతో అసెంబ్లీ ఎన్నికల పోరులో హోరాహోరీగా తలపడి విజయం సాధించారు. ప్రతీ ఎన్నికల్లో ఎవరో ఒకరితో కలిసి ప్రయాణం చేయాల్సి వస్తోంది. ప్రత్యర్థులుగా ఉన్న సంభాని చంద్రశేఖర్, డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్, పిడమర్తి రవిలతో వివిధ సందర్భాల్లో ఒకే వేదికను పంచుకోవటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సత్తుపల్లి నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ అయినప్పటి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా సండ్ర వెంకటవీరయ్య గెలుపొందటం విశేషం. ఐదుసార్లు తలపడిన సంభానితోనే కలిసి.. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌తో సండ్ర వెంకటవీరయ్య ఐదు సార్లు తలపడ్డారు. 1994 లో తొలిసారిగా పాలేరులో సీపీఎం నుంచి బరిలో దిగిన సండ్ర.. సంభాని చంద్రశేఖర్‌పై విజయం సాధించారు. తర్వాత రెండుసార్లు పరాజయం పాలైనా.. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి 2009, 2014లో సంభానిపై గెలుపొందారు. 2018 ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థిగా సంభాని చంద్రశేఖర్‌తో కలిసి పని చేసి సండ్ర వెంకటవీరయ్య భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఐదుసార్లు హోరాహోరీగా తలపడిన చంద్రశేఖర్‌తో ఆరోసారి కలిసి పనిచేయటం, ఆ ఎన్నికల్లో సంభాని చంద్రశేఖర్ తన ఎన్నికల తరహాలోనే పని చేయటం రాజకీయ వర్గాలలో ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. 2014 ఎన్నికల్లో.. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్, టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యకు మధ్య రసవత్తరమైన పోరు జరిగింది. ఖమ్మంజిల్లాలో వైఎస్ఆర్ సీపీ ప్రభజనం బలంగా ఉంది. ఫ్యాన్ గాలిని తట్టుకొని 2,485 ఓట్ల మెజారిటీ విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సంభాని చంద్రశేఖర్ మూడో స్థానం, పిడమర్తి రవి నాలుగో స్థానం దక్కించుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ టికెట్ కోసం మట్టా దయానంద్ అలుపెరగని పోరు జరిపినా అవకాశం లభించలేదు. దీంతో ఆ ఎన్నికల్లో దయానంద్ పోటీ చేయలేదు. ఇప్పుడు ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయం కోసం మట్టా దయానంద్‌తో కలిసి వ్యూహరచనలు చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో... 2018 ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థిగా సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవిపై పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ సండ్ర వెంకటవీరయ్య విజయం కోసం శ్రమించారు. రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ ప్రభంజనం వీచినా.. సత్తుపల్లిలో 19వేల ఓట్లతో సండ్ర వెంకటవీరయ్య గెలవటం రాజకీయాల్లో చర్చానీయాంశమైంది. మారిన రాజకీయ పరిణామాలలో సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరతానని ప్రకటించారు. ఇప్పుడు పిడమర్తి రవితో కలిసి రాజకీయంగా పని చేయాల్సి వస్తోంది. -
‘బతుకమ్మ’... బలిగొంది..
బొలేరో వాహనం అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని, బతుకమ్మ చీరలే బలిగొన్నాయా...? ఆ చీరెలకు, ఈ ప్రమాదానికి సంబంధమేమిటి..? అసలేం జరిగిందంటే.... సాక్షి, పెనుబల్లి: మహిళలను ట్రక్కులో ఎక్కించుకొని వెళ్ళుతున్న బొలేరో వ్యాను అదుపు తప్పి బోల్తా కొట్టడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా , ఆరుగురు మహిళలకు తీవ్ర గాయాలైన సంఘటన పెనుబల్లి మండల పరిధిలోని మండాలపాడు వద్ద బుధవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెనుబల్లి బీసీ కాలనీకి చెందిన ఎనిమిదిమంది మహిళలు సత్తుపల్లి వెళ్లేందుకని బుధవారం ఉదయం విఎంబంజర్ వచ్చారు. అంతలోనే, హైదరాబాద్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లావైపు బొలేరో వెళుతోంది. హైదరాబాద్‌లో కొబ్బరి బోండాలను అన్లోడ్ చేసి వస్తున్న ఈ వాహనంలో ఆ ఎనిమిదిమంది మహిళలు ఎక్కారు. పెనుబల్లి మండలంలోని మండాలపాడు వద్ద, వ్యాన్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో, ఆ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న భూక్యా రాంలీ(35), తేజావత్ రుక్మిణి(50) అక్కడికక్కడే మృతిచెందారు. దారవత్ లక్ష్మి, తేజావత్ అరుణ్, అజ్మీర పద్మ, తేజావత్ లలిత, తేళ్ళూరి వరలక్ష్మి, తోట అంజమ్మ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వీరిని ఆటోలలో పెనుబల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. వ్యాన్ డ్రైవర్ పరారయ్యాడు. సత్తుపల్లి ఎందుకు వెళుతున్నారంటే... ఈ ఎనిమిదిమంది మహిళలు నిరుపేదలు. బతుకమ్మ పండగ సందర్భంగా వీరికి ప్రభుత్వం చీరెలు పంపిణీ చేసింది. ఇవి నాసిరకంగా ఉండడంతో అనేకమంది ఇష్టపడలేదు. కొందరు మాత్రం.. పట్టరాని కోపంతో ఆ చీరెలను 2017, సెప్టెంబర్ 18న రోడ్డుపై వేసి నిప్పంటించారు. వియంబంజర్ పోలీసులకు ఇది ‘నేరం’గా, ‘ఘోరం’గా అనిపించింది. మొత్తం 18 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై సత్తుపల్లి కోర్టులో విచారణ సాగుతోంది. బుధవారం రోజున కోర్టు వాయిదా ఉండటంతో, కేసుతో సంబంధమున్న ఈ ఎనిమిదిమంది మహిళలు సత్తుపల్లికి బొలేరో వాహనంలో బయల్దేరారు. ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు గాయపడ్డారు. ఎమ్మెల్యే సండ్ర చొరవ... ప్రమాద వార్త తెలియగానే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పందించారు. క్షతగాత్రులను పెనుబల్లి ఆసుపత్రికి, అక్కడి నుంచి ఖమ్మం వైద్యశాలకు తరలించేంత వరకు పోలీసులతో, పెనుబల్లి వైద్యులతో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నారు. ఖమ్మం ఆసుపత్రికి క్షతగాత్రులు చేరుకున్న తరువాత, అక్కడి వైద్యులతోనూ ఫోన్లో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ప్రమాద స్థలాన్ని కల్లూరు ఏసీపీ బి.ఆంజనేయులు, సత్తుపల్లి రూరల్ సీఐ టి.రవికుమార్, వియంబంజర్ ఎస్సై తోట నాగరాజు పరిశీలించారు. పెనుబల్లి ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృత దేహాలను కుటుంబీకులకు అప్పగించారు. కేసును ఎస్సై తోట నాగరాజు నమోదు చేశారు. ఊపిరందిస్తా... కాపాడుకుంటా... పెనుబల్లి: ఈ ప్రమాదంలో, తలకు తీవ్ర గాయాలవడంతో భూక్యా రామ్లీ(35) అక్కడికక్కడే మృతిచెందింది. ప్రమాద వార్త చెవిన పడడంతోనే ఆమె భర్త భూక్యా రాము, పరుగు పరుగున ప్రమాద స్థలానికి వచ్చాడు. రోడ్డు పక్కన అచేతనంగా పడిపోయిన తన భార్య రామ్లీని చూసి చలించాడు. ఆమెకు ఊపిరి అందడం లేదనుకున్నాడేమో...! ఆమెను తన ఒడిలోకి తీసుకుని, తన నోటితో ఊదుతూ శ్వాసను అందించేందుకు ప్రయత్నించాడు. అప్పటికే ఆమె ప్రాణాలు పోయాయని అక్కడున్న పోలీసులు, స్థానికులు చెప్పినప్పటికీ నమ్మలేకపోయాడు. కొద్దిసేపటి వరకు తన ప్రయత్నాన్ని కొనసాగించాడు. ఆ తరువాత కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఈ దృశ్యం... చూపరులకు కూడా కంట తడి పెట్టించింది. -
నేనే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తా..
సత్తుపల్లి: ‘రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది.. మీ అందరికి అందుబాటులోనే ఉంటా.. నేనే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తా..? ఓటమి కొత్తేమీకాదు.. ఎన్నికల్లో అపజయం బాధకలిగించింది.. అయినా ఎవరికి విశ్రాంతి లేదు..’ టీఆర్ఎస్ సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ పిడమర్తి రవి అన్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చల్లగుళ్ల నర్సింహారావు నివాసంలో ఆదివారం కార్యకర్తల సమావేశం జరిగింది. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ఇన్చార్జ్గా ప్రభుత్వ పథకాలన్నీ రాబోయే రోజుల్లో మీ అందరికి అందిస్తామన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రభుత్వం మనదే ఉన్నది కాబట్టి ఎక్కడ ఆయన మాట చెల్లుబాటు కాదన్నారు. రాబోయే అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగిరేలా అందరం కలిసికట్టుగా పని చేద్దామన్నారు. అప్పటి వరకు విశ్రమించేదే లేదని.. సత్తుపల్లిలో నివాసం ఉండి టీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానన్నారు. ఇప్పటికే ఎస్‌డబ్ల్యూఎఫ్ రూ.25 కోట్లు నిధులు, రూ.10 కోట్లు సింగరేణి షేప్ నిధులు మంజూరు అయ్యాయని.. త్వరలో పనులు చేపడతామన్నారు. రెండు జోన్లకు నీళ్లు ఇవ్వాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చెప్పటం హాస్యాస్పదంగా ఉందని.. ఎమ్మెల్యేగా ఆయన చేయాల్సిన పని చేయకుండా అడగటం ఏమిటని ప్రశ్నించారు. సమావేశంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చల్లగుండ్ల కృష్ణయ్య, చెక్కిలాల లక్ష్మణ్‌రావు, వెల్ది జగన్మోహన్రావు, జ్యేష్ట అప్పారావు, కొత్తూరు ప్రభాకర్‌రావు, ఎస్కే మోనార్క్ రఫీ, రవీందర్‌రెడ్డి, మారుతి బాబురావు, దొడ్డాకుల గోపాలరావు, వినుకొండ కృష్ణ, మోరంపూడి ప్రభాకర్, ఎస్కె జాని పాల్గొన్నారు. నిరంతరం ప్రజలతోనే ఉంటా పెనుబల్లి: గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం ప్రజలతోనే ఉంటానని పిడమర్తి రవి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆదివారం మొదటిసారిగా మండలానికి వచ్చిన ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. నిత్యం ప్రజలతోనే ఉంటూ సమస్యల సాధనకే కృషి చేస్తానన్నారు. తనకు ఓటు వేసిన మండల ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
సత్తుపల్లిలో విచిత్రమైన పరిస్థితి
సాక్షి, ఖమ్మం : ఈసారి సత్తుపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో చిత్ర విచిత్రమైన పరిస్థితి నెలకొంది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కొలికపోగు స్వామికి 7,345 ఓట్లు వచ్చాయి. ఇవన్నీ టీఆర్ఎస్ కారు గుర్తుకు పడాల్సిన ఓట్లేనని.. ఓటర్లు తికమకపడటంతో ట్రక్కు గుర్తుకు పడ్డాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. ప్రతి రౌండ్లోనూ కనీసం 300లకు తగ్గకుండా 500 లోపు ఓట్లు రావటం ఆశ్చర్యానికి గురి చేసింది. 9వ రౌండ్లో కారు గుర్తుకు 638 మెజార్టీ రాగా ట్రక్కు గుర్తుకు 454 ఓట్లు, 10వ రౌండ్లో కారుకు 624 ఓట్లు మెజార్టీ, ట్రక్కుకు 614 ఓట్లు, 11వ రౌండ్లో కారుకు 1,029 ఓట్లు మెజార్టీ రాగా ట్రక్కుకు 462 ఓట్లు రావటం విశేషం. 9 మందికి డిపాజిట్ దక్కలేదు.. సత్తుపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో 11 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 2,22,711 ఓట్లకు గాను 1,96,740 ఓట్లు పోల్ అయ్యాయి. 1,450 మంది పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకున్నారు. వీటిలో 96 ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు చెల్లలేదు. సండ్ర వెంకటవీరయ్యకు 1,00,044 ఓట్లు, పిడమర్తి రవికి 81,042 ఓట్లు, స్వతంత్య్ర అభ్యర్థి కొలికపోగు స్వామికి 7,345 ఓట్లు, బీజేపీ అభ్యర్థి నంబూరి రామలింగేశ్వరరావు 1,380 ఓట్లు, బీఎల్ఎఫ్ అభ్యర్థి మాచర్ల భారతికి 2,670 ఓట్లు వచ్చాయి. మిగిలిన అభ్యర్థులు తక్కువ ఓట్లతోనే సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. -
ఫిరాయింపు పార్టీలకు చరమగీతం పాడాలి: సండ్ర
సత్తుపల్లి: రాజకీయ ఫిరాయింపులతో కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజల మీద భారం వేస్తున్న పార్టీలకు చరమగీతం పాడి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కోరారు. సత్తుపల్లి మండలం రామనగరం గ్రామంలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసి టీడీపీ ప్రజాదీవెన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, కలిసి వచ్చే శక్తులను కలుపుకుని తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందని వెల్లడించారు. ఎన్నికలకు గడువు ఉన్నా ముందస్తు ఎన్నికలకు ఎందుకు ప్రయత్నిస్తుందో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా నిరంతరం ప్రజల మధ్య ఉండే నాయకులను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. రాజకీయ సేవ చేసే ప్రజా నాయకులకు పదవీ వ్యామోహం ఉండదు..ప్రజాసేవలోనే రాజకీయ నాయకుడికి తుది శ్వాస విడిచే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు. -
కేసీఆర్‌ను విమర్శించే స్థాయి సండ్రకు లేదు
సత్తుపల్లి : ఎన్నికల మ్యానిఫెస్టోలో లేని సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించే స్థాయి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు లేదని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. సత్తుపల్లిలోని రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ గాదె సత్యనారాయణ నివాసంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎమ్మెల్యే సండ్ర చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తొమ్మిదేళ్ల పదవీ కాలంలో ఎమ్మెల్యే సండ్ర నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని సవాల్ చేశారు. సత్తుపల్లి నియోజకవర్గానికి ఎక్కడికి పోయి నిధులు తెస్తున్నారో చెప్పాలని కోరారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఘటన సండ్రకే దక్కుతుందన్నారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉండాలని సవాల్ చేశారు. సమావేశంలో ఎంపీపీ జ్యేష్ట అప్పారావు, జెడ్పీటీసీ సభ్యురాలు హసావత్ లక్ష్మి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ గాదె సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు చల్లగుళ్ల నర్సింహారావు, మాజీ ఎంపీపీ రాచూరి గంగరాజు, కొత్తూరు ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేపై ‘పిడమర్తి’ విమర్శలా.?
సత్తుపల్లి : నియోజకవర్గ ఎల్లలే తెలియని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి.. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యపై విమర్శలు చేస్తే సహించేది లేదని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గొర్ల సంజీవరెడ్డి హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరులతో మాట్లాడారు. గతంలో ఎప్పుడూ ప్రజల సంక్షేమం పట్టించుకోని ప్రభుత్వాలకు భిన్నంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రజా గొంతుకుగా మారి అసెంబ్లీలో సమస్యలపై గళమెత్తుతూ ఎంతో మందికి మేలు చేశారన్నారు. ఎమ్మెల్యే పనితీరు ఏమిటో గతంలో ఆయన వెంట తిరిగి రంగులు మార్చిన నేతలకు తెలుసన్నారు. మళ్లీ ఇక్కడే పోటీ చేసి హ్యాట్రిక్ విజయం సాధించి.. పిడమర్తి రవికి బుద్ధి చెప్పటం ఖాయమన్నారు. నియోజకవర్గంలో తాగునీటి బోర్లు, సిమెంట్ రహదారులు ఏర్పాటు చేయించటమే కాకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కష్ట సుఖాల్లో ఎమ్మెల్యే సండ్ర పాలుపంచుకుంటున్నారని తెలిపారు. సమావేశంలో టీడీపీ మండల, పట్టణ అధ్యక్షులు దొడ్డా శంకర్రావు, కూసంపూడి మహేష్, నాయకులు కూసంపూడి రామారావు, ఎస్కే చాంద్‌పాషా, తడికమళ్ల ప్రకాశరావు, వెలిశాల లక్ష్మాచారి, అద్దంకి అనిల్, దూదిపాల రాంబాబు, ఎస్కే మున్నీర్, చిల్లపల్లి చక్రవర్తి, మదీనాపాషా, రతికంటి గిరిగోవర్ధన్, మల్లూరు మోహన్, సత్యనారాయణ, కోటి, యునస్, కృష్ణ పాల్గొన్నారు. -
నియంతలకు పట్టిన గతే పడుతుంది
-
నియంతలకు పట్టిన గతే పడుతుంది
హైదరాబాద్: అసెంబ్లీ నిబంధనలను పక్కనబెట్టి హరీష్‌రావు, సదారాం కనుసన్నల్లో సభ నడుస్తున్నదని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విమర్శించారు. మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, అసెంబ్లీలా కాకుండా టీఆర్ఎస్ కార్యాలయంలా నడుస్తోందని విమర్శించారు. పార్టీ కార్యాలయాలకతీతంగా స్పీకర్ కార్యాలయం పనిచేయాలన్నారు. ఎమ్మెల్యేల హక్కులను కాపాడాల్సింది స్పీకరేనని, అయితే దురదృష్టంకొద్దీ అలా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ నిన్నటివరకు టీడీపీ జెండా కింద పనిచేసింది మరిచిపోయారా అని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలమైన తమను బీఏసీకి రావాలని పిలిచి అవమానించడం దారుణమన్నారు. ఇది తెలంగాణ సమాజానికి జరిగిన అవమానం అని అన్నారు. అసెంబ్లీ కార్యదర్శి సదారాంను సస్పెండ్ చెయ్యాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. నియంతలకు పట్టిన గతే పడుతుంది: సండ్ర ప్రభుత్వం, అసెంబ్లీ టీడీపీ గొంతు నొక్కుతున్నాయని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. శనివారం ఆయన స్పీకర్‌ను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. బీఏసీ తమను అనుమతించక పోవడం దారుణమన్నారు. బీఏసీ మీటింగ్ కు రావాలని ఆహ్వానించి, అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నామన్న అహంకారంతో, శాసన సభలో భజన చేసేవారే ఉండాలన్నట్లు ప్రభుత్వం వ్యవహరుస్తోందని ఆరోపించారు. తమనేందుకు సస్పెండ్ చేశారో.. ఫుటేజ్ బయటికివ్వమని అడిగితే స్పీకర్ దగ్గర సమాదానం లేదని తెలిపారు. చరిత్రలో నియంతలకు పట్టిన గతే ఈ సర్కార్‌కు పడుతుందని దుమ్మెత్తి పోశారు. -
సండ్ర పుష్కర స్నానానికి కోర్టు అనుమతి
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో కీలక నిందితుడుగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పుష్కర స్నానం ఆచరించేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు అనుమతించింది. సండ్ర కోరుకున్న చోట పుష్కర స్నానం చేసేందుకు న్యాయమూర్తి లక్ష్మీపతి అనుమతిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. సండ్రకు బెయిల్ మంజూరు చేసిన సమయంలో నియోజకవర్గం వదలి వెళ్లరాదని కోర్టు షరతు విధించింది. ఈ నేపథ్యంలో పుష్కర స్నానానికి అనుమతించాలని కోరుతూ సండ్ర ఏసీబీ కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. -
'డ్రైవర్ల ఎంపికలోనూ జాగ్రత్త పడ్డారు'
హైదరాబాద్ : మోతీనగర్, సికింద్రాబాద్ ప్రాంతాల చుట్టే ఈ వ్యవహారం జరిగిందని, డ్రైవర్ల ఎంపికలోనూ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య టీమ్ జాగ్రత్త పడిందని తెలుస్తోంది. ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లోనే కీలక భేటీలు జరిగాయని, పార్టీ ఆఫీసు ముందు, క్యాంటీన్లలోనూ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం భేటీలు జరిగాయని రిపోర్టులో తేలింది. మొదటి మూడు రోజులు పక్కా ప్లాన్ చేసుకుని, మే 30 న రేవంత్ రెడ్డిని ఈ ఆపరేషన్ లోకి సండ్ర దించినట్లు రిపోర్టు కథనంలో తేలింది. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఏం చేసినా జనార్ధన్ అనే వ్యక్తికి సండ్ర, సెబాస్టియన్ అప్డేట్ చేసేవారు. కొందరు వ్యక్తులను కలవడానికి టీడీపీ నేతలు క్రిస్టియన్ ప్రెసిడెంట్ బిషప్ సాయం తీసుకున్నారు. రెండు పార్టీలు కలుసుకునే విషయంలో సండ్ర టీమ్ చాలా జాగ్రత్తులు తీసుకుంది. సులభంగా గుర్తుపట్టే అడ్రస్‌లు చెప్పాలంటూ సండ్ర సూచనలిచ్చేవారు. ఈ వ్యవహారంపై ఎప్పటికప్పుడు స్టేటస్ రిపోర్టుపై సెబాస్టియన్ ఎస్ఎమ్ఎస్లు పంపేవాడని ఏసీబీ రిపోర్టులో పేర్కొంది. -
సండ్రను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలి: ఏసీబీ
-
సండ్రను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలి: ఏసీబీ
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను మంగళవారం ఏసీబీ కోర్టుకు తరలించారు. ఆయనను అయిదు రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈరోజు ఉదయం సండ్రను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. నిన్న ఉదయం నుంచి దాదాపు 7గంటల పాటు విచారించిన మీదట సండ్రను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సండ్ర అరెస్ట్ విషయాన్ని అధికారికంగా ప్రకటించడమేగాకుండా అతని కుటుంబసభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. ఓటుకు కోట్లు కేసులో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో సండ్ర కీలక పాత్ర వహించారని ఏసీబీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే కేసులో A-4 నిందితుడైన మత్తయ్యకు సండ్ర 8 కాల్స్ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. మరోవైపు ఏసీబీ ముందు హాజరుకావాల్సిన జిమ్మీబాబు జాడ లేకుండా పోయాడు. ముత్తయ్య దారిలోనే అతను కోర్టులో క్వాష్ పిటిషన్ వేసే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. అందుకే అతను ఏసీబీ విచారణకు హాజరుకాలేదని తెలుస్తోంది. అయితే ఈ కేసులో తనను కూట్రపూరితంగా ఇరికించారని టీడీపీ ఎమ్మెల్యే ఆరోపించారు. -
సండ్రకు ముగిసిన వైద్య పరీక్షలు
-
సండ్రకు ముగిసిన వైద్య పరీక్షలు
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో అరెస్టయిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు ముగిశాయి. తెలంగాణ అవినీతి నిరోధకశాఖ అధికారులు ఆయనను మంగళవారం ఉదయం వైద్యపరీక్షల నిమిత్తం ఉస్మానియాకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఏసీబీ అధికారులు ఎమ్మెల్యే సండ్రను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఏసీబీ అధికారులు సోమవారం కొన్ని గంటల పాటు విచారించగా నోరువిప్పని కారణంతో సాయంత్రం సండ్రను అరెస్టు చేసిన తెలిసిందే. ఏసీబీ ఈ కేసును త్వరగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
రాజమండ్రిలో ఎమ్మెల్యే సండ్ర కలకలం
ట్రీట్మెంటా.. ట్రైనింగా..? * బొల్లినేని ఆసుపత్రిలో హైడ్రామా * ఏసీబీకి జవాబిచ్చేందుకు తర్ఫీదు! కంబాలచెరువు (రాజమండ్రి): చంద్రబాబు ప్రభుత్వాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న ‘ఓటుకు కోట్లు’ కేసులో ఏసీబీ విచారణ నుంచి తప్పిం చుకు తిరుగుతున్న తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని బొల్లినేని ఆసుపత్రికి రావడం.. మళ్లీ మాయమవడం చర్చనీయాంశమైంది. తెలంగాణ ఏసీబీ అధికారుల కళ్లుగప్పి తిరుగుతున్న ఆయన... ఆరోగ్యం బాగా లేదం టూ శనివారం రాత్రే బొల్లినేని ఆసుపత్రిలో చేరారు. ఈ విషయూన్ని ఆసుపత్రి వర్గాలు రహస్యంగా ఉంచాయి. అందుకే ఎవరికీ అనుమానం రాకుండే ఉండేందుకు ఆసుపత్రి వద్ద కనీసం ఎటువంటి సెక్యూరిటీ లేకుండా చేశారు. విషయం తెలిసిన ‘సాక్షి’ ఆదివారం అక్కడకు వెళ్లింది. సండ్రను ఆసుపత్రి మూడో అంతస్తులోని 306 రూములో ఉంచినట్టు తెలియడంతో అక్కడకు చేరుకుంది. అయితే, అక్కడ ఆయన లేరు. దీనిపై సిబ్బందిని అడగ్గా, సండ్రను స్కానింగ్‌కు తీసుకెళ్లినట్టు తెలిపారు. కొద్ది గంటల తరువాత అడిగినా అదే సమాధానం చెప్పారు. ఆయన జ్వరం, గుండె సంబంధ సమస్యలతో ఆసుపత్రిలో చేరారని చెప్పారు. మరొకరైతే ఆ విషయూలేవీ తమకు తెలియవంటూ తప్పించుకున్నారు. అయితే, సండ్రకు రాజమండ్రి సేఫ్‌జోన్‌గా ఉంటుందనే ఆలోచనతో బొల్లినేని ఆసుపత్రిని వేదికగా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఓటుకు కోట్లు కేసులో సండ్రకు ఇప్పటికే తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయన ఈ నెల 19న ఏసీబీ ముందు హాజరు కావాల్సి ఉంది. అనారోగ్య కారణంగా విచారణకు హాజరుకాలేనంటూ ఆయన ఏసీబీకి లేఖ రాసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయూరు. ఏసీబీ అధికారులు ఆస్పత్రికి వస్తే విచారణకు సహకరిస్తానని చెప్పిన ఆయన.. ఏ ఆస్పత్రిలో ఉన్నదీ ఆ లేఖలో పేర్కొనలేదు. పైగా, ఫోనుకు అందుబాటులో లేకుండా పోయూరు. ఈ నేపథ్యంలో ఆయన రాజమండ్రి వచ్చారంటూ వచ్చిన వార్తలు నగరంలో కలకలం రేపాయి. తెలంగాణ ఏసీబీ అధికారుల ప్రశ్నలకు ఎలా జవాబివ్వాలనే దానిపై సండ్రకు తర్ఫీదు ఇచ్చేందుకే రాజమండ్రి వేదికగా చేసుకుని టీడీపీ అధిష్టానం ఈ హైడ్రామా నడిపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సండ్రను రహస్య ప్రదేశంలో ఉంచి నట్టు తెలుస్తోంది. కానీ, ఆయన ఆసుపత్రిలోనే ఉన్నట్టు, అక్కడ చికిత్స పొందుతున్నట్టు కేస్ షీట్ నడవడం గమనార్హం.