
మాట్లాడుతున్న పిడమర్తి రవి
సత్తుపల్లి : ఎన్నికల మ్యానిఫెస్టోలో లేని సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించే స్థాయి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు లేదని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. సత్తుపల్లిలోని రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ గాదె సత్యనారాయణ నివాసంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎమ్మెల్యే సండ్ర చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తొమ్మిదేళ్ల పదవీ కాలంలో ఎమ్మెల్యే సండ్ర నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని సవాల్ చేశారు. సత్తుపల్లి నియోజకవర్గానికి ఎక్కడికి పోయి నిధులు తెస్తున్నారో చెప్పాలని కోరారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఘటన సండ్రకే దక్కుతుందన్నారు.
అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉండాలని సవాల్ చేశారు. సమావేశంలో ఎంపీపీ జ్యేష్ట అప్పారావు, జెడ్పీటీసీ సభ్యురాలు హసావత్ లక్ష్మి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ గాదె సత్యనారాయణ, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు చల్లగుళ్ల నర్సింహారావు, మాజీ ఎంపీపీ రాచూరి గంగరాజు, కొత్తూరు ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment