Pidamarthi Ravi
-
వచ్చే ఎన్నికల్లో పోటీ.. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు: పొంగులేటి
సాక్షి, మధిర: తెలంగాణలో ముందుగా వచ్చే ఏ ఎన్నికలోనైనా తప్పనిసరిగా పోటీ చేస్తానని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో సోమవారం పర్యటించిన ఆయన పలువురి కుటుంబాలను పరామర్శించారు. ఆ తర్వాత మధిరలో టీఆర్ఎస్ నాయకుడు కోట రాంబాబు నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతానికి తాను అధికార పార్టీలోనే ఉన్నానని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచే పోటీ చేస్తానని చెప్పారు. అయితే, అనివార్య పరిస్థితుల్లో రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మొదట ఎన్నికల్లో పోటీచేస్తే జిల్లా ప్రజలు దీవించారని పొంగులేటి గుర్తు చేశారు. ఆ తర్వాత తాను పార్టీ మారతానని అనుకోలేదని, ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో మారాల్సి వచ్చిందన్నారు. అలాగే రాజకీయాల్లో ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చని పొంగులేటి వ్యాఖ్యానించారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు పిడమర్తి రవి, బొమ్మెర రామ్మూర్తి, వెంకటేశ్వరరెడ్డి ఉన్నారు. (క్లిక్: ఎన్టీఆర్ డైలాగ్‌తో అదరగొట్టిన కేటీఆర్.. అసెంబ్లీలో మెరుపులే!) -
రాముడిపై పిడమర్తి రవి వివాదాస్పద వ్యాఖ్యలు
కరీంనగర్: ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి శనివారం కరీంనగర్లో ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రాజ్యాంగ రక్షణ సదస్సు’లో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆయన మాట్లాడుతూ.. నిన్నమొన్నటి నుంచి చందాల దందా మొదలైందని, అయోధ్య రాముడికి చందాలు ఇవ్వాలంటూ బీజేపీ నేతలు బెదిరింపులకు గురి చేస్తున్నారని, రానున్న రోజుల్లో జై భీమ్– జై శ్రీరాం అనే నినాదాల మధ్య దేశంలో యుద్ధం జరగనుందన్నారు. ‘అసలు అయోధ్య రాముడు ఎక్కడ పుట్టాడో తెలవదు, ఇటీవల నేపాల్ ప్రధాని.. రాముడు తమ దగ్గరే జన్మించాడని అన్నారు. అసలు రాముడు భారతదేశంలో పుట్టాడా.. నేపాల్‌లో పుట్టాడా.. జర్మనీలో పుట్టాడో తేలాల్సి ఉంది’అని వ్యాఖ్యానించారు. ఎంపీ బండి సంజయ్ ప్రజా సమస్యలపై మాట్లాడాల్సింది పోయి నిత్యం గుళ్లు, గోపురాలంటూ టీఆర్ఎస్ను విమర్శించడం తగదని అన్నారు. దళితులు హిందువులే అయితే ఆలయాల్లోకి ప్రవేశం ఎందుకు నిరాకరిస్తున్నారని ప్రశ్నించారు. ఇదే సమయంలో వేదికపై ఉన్న బీజేపీ నాయకుడు ఎస్. అజయ్‌వర్మ.. పిడమర్తి రవి ప్రసంగానికి అడ్డు తగిలారు. ఎంపీ బండి సంజయ్‌పై విమర్శలు తగదని, ఇది రాజకీయ వేదిక కాదని అన్నారు. -
ముగ్గురిని ఓడించి..
సత్తుపల్లి: ‘రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు’ఉండరనే నానుడి నిరూపితమవుతోంది. సత్తుపల్లిలో ఒకప్పటి ప్రత్యర్థులు నేడు మిత్రులుగా మారి కలిసి వ్యూహాలు రచిస్తూ రాజకీయాలను రక్తికట్టిస్తున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్, పిడమర్తి రవిలతో అసెంబ్లీ ఎన్నికల పోరులో హోరాహోరీగా తలపడి విజయం సాధించారు. ప్రతీ ఎన్నికల్లో ఎవరో ఒకరితో కలిసి ప్రయాణం చేయాల్సి వస్తోంది. ప్రత్యర్థులుగా ఉన్న సంభాని చంద్రశేఖర్, డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్, పిడమర్తి రవిలతో వివిధ సందర్భాల్లో ఒకే వేదికను పంచుకోవటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సత్తుపల్లి నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ అయినప్పటి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా సండ్ర వెంకటవీరయ్య గెలుపొందటం విశేషం. ఐదుసార్లు తలపడిన సంభానితోనే కలిసి.. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌తో సండ్ర వెంకటవీరయ్య ఐదు సార్లు తలపడ్డారు. 1994 లో తొలిసారిగా పాలేరులో సీపీఎం నుంచి బరిలో దిగిన సండ్ర.. సంభాని చంద్రశేఖర్‌పై విజయం సాధించారు. తర్వాత రెండుసార్లు పరాజయం పాలైనా.. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి 2009, 2014లో సంభానిపై గెలుపొందారు. 2018 ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థిగా సంభాని చంద్రశేఖర్‌తో కలిసి పని చేసి సండ్ర వెంకటవీరయ్య భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఐదుసార్లు హోరాహోరీగా తలపడిన చంద్రశేఖర్‌తో ఆరోసారి కలిసి పనిచేయటం, ఆ ఎన్నికల్లో సంభాని చంద్రశేఖర్ తన ఎన్నికల తరహాలోనే పని చేయటం రాజకీయ వర్గాలలో ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. 2014 ఎన్నికల్లో.. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్, టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యకు మధ్య రసవత్తరమైన పోరు జరిగింది. ఖమ్మంజిల్లాలో వైఎస్ఆర్ సీపీ ప్రభజనం బలంగా ఉంది. ఫ్యాన్ గాలిని తట్టుకొని 2,485 ఓట్ల మెజారిటీ విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సంభాని చంద్రశేఖర్ మూడో స్థానం, పిడమర్తి రవి నాలుగో స్థానం దక్కించుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ టికెట్ కోసం మట్టా దయానంద్ అలుపెరగని పోరు జరిపినా అవకాశం లభించలేదు. దీంతో ఆ ఎన్నికల్లో దయానంద్ పోటీ చేయలేదు. ఇప్పుడు ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయం కోసం మట్టా దయానంద్‌తో కలిసి వ్యూహరచనలు చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో... 2018 ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థిగా సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవిపై పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ సండ్ర వెంకటవీరయ్య విజయం కోసం శ్రమించారు. రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ ప్రభంజనం వీచినా.. సత్తుపల్లిలో 19వేల ఓట్లతో సండ్ర వెంకటవీరయ్య గెలవటం రాజకీయాల్లో చర్చానీయాంశమైంది. మారిన రాజకీయ పరిణామాలలో సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరతానని ప్రకటించారు. ఇప్పుడు పిడమర్తి రవితో కలిసి రాజకీయంగా పని చేయాల్సి వస్తోంది. -
ఖమ్మం లోక్‌సభ సీటు నుంచి కేసీఆర్ పోటీ!
సాక్షి, ఖమ్మం జిల్లా : లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతున్నారు. ఆయన స్వయంగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా? పోటీ చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారా? పోటీ చేసి గెలిచినపక్షంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి.. కేంద్ర రాజకీయాల్లోకి వెళుతారా? ఇలాంటి అనేక ఆసక్తికర ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ టీఆర్ఎస్ నేత పిడమర్తి రవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సత్తుపల్లిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తే బాగుంటుందని పేర్కొన్నారు. కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేయాల్సిందిగా కార్యకర్తల తరఫున తాము విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కేసీఆర్ పోటీ చేయకపోతే ఆయన ఎవరు పేరు ప్రకటిస్తే.. వారికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న పొంగులేటి సుధాకర్‌రెడ్డి లేదా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులలో ఒకరిని ఖమ్మం సీటు నుంచి నిలబెట్టే అవకాశముందని, వారిలో ఎవరిని టీఆర్ఎస్ తరఫున నిలబెట్టినా తాము మద్దతు ఇస్తామని పిడమర్తి రవి తెలిపారు. -
నేనే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తా..
సత్తుపల్లి: ‘రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది.. మీ అందరికి అందుబాటులోనే ఉంటా.. నేనే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తా..? ఓటమి కొత్తేమీకాదు.. ఎన్నికల్లో అపజయం బాధకలిగించింది.. అయినా ఎవరికి విశ్రాంతి లేదు..’ టీఆర్ఎస్ సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ పిడమర్తి రవి అన్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చల్లగుళ్ల నర్సింహారావు నివాసంలో ఆదివారం కార్యకర్తల సమావేశం జరిగింది. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ఇన్చార్జ్గా ప్రభుత్వ పథకాలన్నీ రాబోయే రోజుల్లో మీ అందరికి అందిస్తామన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రభుత్వం మనదే ఉన్నది కాబట్టి ఎక్కడ ఆయన మాట చెల్లుబాటు కాదన్నారు. రాబోయే అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగిరేలా అందరం కలిసికట్టుగా పని చేద్దామన్నారు. అప్పటి వరకు విశ్రమించేదే లేదని.. సత్తుపల్లిలో నివాసం ఉండి టీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానన్నారు. ఇప్పటికే ఎస్‌డబ్ల్యూఎఫ్ రూ.25 కోట్లు నిధులు, రూ.10 కోట్లు సింగరేణి షేప్ నిధులు మంజూరు అయ్యాయని.. త్వరలో పనులు చేపడతామన్నారు. రెండు జోన్లకు నీళ్లు ఇవ్వాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చెప్పటం హాస్యాస్పదంగా ఉందని.. ఎమ్మెల్యేగా ఆయన చేయాల్సిన పని చేయకుండా అడగటం ఏమిటని ప్రశ్నించారు. సమావేశంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చల్లగుండ్ల కృష్ణయ్య, చెక్కిలాల లక్ష్మణ్‌రావు, వెల్ది జగన్మోహన్రావు, జ్యేష్ట అప్పారావు, కొత్తూరు ప్రభాకర్‌రావు, ఎస్కే మోనార్క్ రఫీ, రవీందర్‌రెడ్డి, మారుతి బాబురావు, దొడ్డాకుల గోపాలరావు, వినుకొండ కృష్ణ, మోరంపూడి ప్రభాకర్, ఎస్కె జాని పాల్గొన్నారు. నిరంతరం ప్రజలతోనే ఉంటా పెనుబల్లి: గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం ప్రజలతోనే ఉంటానని పిడమర్తి రవి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆదివారం మొదటిసారిగా మండలానికి వచ్చిన ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. నిత్యం ప్రజలతోనే ఉంటూ సమస్యల సాధనకే కృషి చేస్తానన్నారు. తనకు ఓటు వేసిన మండల ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
పేదలందరికీ సంక్షేమ పథకాలు
సాక్షి,సత్తుపల్లిరూరల్: కారు గుర్తుకు ఓటు వేస్తేనే అభివృద్ధి, సంక్షేమం అందుతుంది మాజీ మంత్రి జలగం ప్రసాదరావు అన్నారు. మండలంలోని రామానగరం, గంగారం, పాకలగూడెం, బేతుపల్లి గ్రామాలలో ఆదివారం టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవి, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, మట్టా దయానంద్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ పాలనలో పేదలందరికీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందుతున్నాయన్నారు. పిడమర్తి రవిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు. పిడమర్తి మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే గంగారంలో వెయ్యి ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. పలు కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీలో చేరాయి. కార్యక్రమంలో ఎంపీపీ జ్యేష్ట అప్పారావు, మండల అధ్యక్షుడు చల్లగుళ్ల నర్సింహారావు, గాదె సత్యనారాయణ, సోమరాజు సీతారామరాజు, రాచమళ్ల కృష్ణమూర్తి, మాదిరాజు వాసు, మోరంపూడి ప్రభాకర్, వినుకొండ కృష్ణ, మందపాటి రాజేంద్ర ప్రసాద్‌రెడ్డి, ఎస్కె ఖాసీం, దేవళ్ల దాసు, కొత్తూరు ప్రభాకర్‌రావు పాల్గొన్నారు. -
మహా కూటమిపై కేటీఆర్ విసుర్లు
సాక్షి, ఖమ్మం : తెలంగాణ ప్రాజెక్టులు ఆడ్డుకున్న నాయకులు ఇప్పుడు ఓట్ల కోసం కూటమిగా వస్తున్నారని, ప్రజలంతా వారికి గట్టిగా బుద్ది చెప్పాలని అపద్ధర్మ మంత్రి కేటీఆర్ కోరారు. పిడమర్తి రవి నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అవకాశవాద పొత్తులు, అవకాశవాద రాజకీయాలు తెలంగాణపై పట్టుకోసం పోటీ పడుతున్నాయన్నారు. సీతారాం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 30 ఉత్తరాలు రాసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని విమర్శించారు. సత్తుపల్లి పిడమర్తి రవిని భారీ మెజారిటితో గెలిపించాలని కోరారు. కరెంట్ అడిగితే కాల్పులు జరిపిన కాంగ్రెస్, టీడీపీ ఓ గట్టున, 24గంటలు కరెంట్ ఇచ్చిన టీఆర్ఓస్ మరో గట్టున ఉందన్నారు. సత్తుపల్లి నాగన్నలు ఏ గట్టున ఉంటారో నిర్ణయించుకోవాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మరల అమలులోకి వచ్చిన తర్వాత రైతు బంధు సాయాన్ని రూ.10వేలకు పెంచుతామన్నారు. సత్తుపల్లికి గోదావరి నీళ్లు కావాలంటే టీఆర్ఎస్ను గెలిపించాలన్నారు. రాహుల్ గాంధీ సీట్లు ఇచ్చినా, చంద్రబాబు నోట్లు ఇచ్చినా, టీఆర్ఎస్కే ఓట్లు వేసి కూటమికి బుద్ధి చెప్పాలని కోరారు. మహాకూటమి సీట్లు పంచుకునేలోపు టీఆర్ఎస్ స్వీట్లు పంచుకుంటుందని కేటీఆర్ అన్నారు. -
కేసీఆర్‌ను విమర్శించే స్థాయి సండ్రకు లేదు
సత్తుపల్లి : ఎన్నికల మ్యానిఫెస్టోలో లేని సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించే స్థాయి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు లేదని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. సత్తుపల్లిలోని రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ గాదె సత్యనారాయణ నివాసంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎమ్మెల్యే సండ్ర చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తొమ్మిదేళ్ల పదవీ కాలంలో ఎమ్మెల్యే సండ్ర నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని సవాల్ చేశారు. సత్తుపల్లి నియోజకవర్గానికి ఎక్కడికి పోయి నిధులు తెస్తున్నారో చెప్పాలని కోరారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఘటన సండ్రకే దక్కుతుందన్నారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉండాలని సవాల్ చేశారు. సమావేశంలో ఎంపీపీ జ్యేష్ట అప్పారావు, జెడ్పీటీసీ సభ్యురాలు హసావత్ లక్ష్మి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ గాదె సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు చల్లగుళ్ల నర్సింహారావు, మాజీ ఎంపీపీ రాచూరి గంగరాజు, కొత్తూరు ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ, కాంగ్రెస్‌లను ఓడించాలి
సాక్షి, న్యూఢిల్లీ: మాదిగల అస్తిత్వ నినాదమైన ఎస్సీ వర్గీకరణను పట్టించుకోని బీజేపీ, కాంగ్రెస్‌లను ఓడించాలని, ఈ నెల 14న మాదిగలు ప్రతిజ్ఞ చేయాలని తెలంగాణ మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు పిడమర్తి రవి మంగళవారం పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని మాదిగ సంఘాలన్నీ ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా స్వీకరించాలని, కాంగ్రెస్, బీజేపీలు చేసే మోసాన్ని పల్లెపల్లెకూ చేరవేయాలని కోరారు. తెలంగాణ భవన్లో ‘ఎస్సీ వర్గీకరణ’అనే అంశంపై మంగళవారం సెమినార్ నిర్వహించినట్టు ఆయన తెలిపారు. -
రాజకీయ నిరుద్యోగుల కోసమే కొత్త పార్టీ
సాక్షి, హైదరాబాద్: రాజకీయ నిరుద్యోగుల కోసమే జేఏసీ చైర్మన్ కోదండరామ్ కొత్త పార్టీ పెడతానంటున్నారని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. కోదండరామ్ పార్టీ పెడతాననడం పెద్ద జోక్ అని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం కోదండరామ్ జేఏసీలో ఎవరూ లేరని, టీజీవో, టీఎన్జీవో, ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వంతో కలసి ఉన్నారన్నారు. కోదండరామ్ వలలో విద్యార్థులు పడొద్దని సూచించారు. తెలంగాణ ఉద్యమకారులపై ప్రేమ ఉంటే కాంగ్రెస్‌తో పొత్తు లేకుండా విడిగా పోటీ చేయాలని, లేదంటే కాంగ్రెస్‌తో అంటకాగినట్టేనని భావించాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ ఇచ్చే ప్యాకేజీ కోసమే రాజకీయ పార్టీ పెడతానంటూ పాట పాడుతున్నారని ఆరోపించారు. ఉద్యమంలో కలసి పనిచేయని కోదండరామ్, గద్దర్, మందకృష్ణలు ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. కోదండరామ్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ అని, ఆయన పార్టీ పెట్టడం అంటే బంగారు తెలంగాణకు వ్యతిరేకమేనని అన్నారు. -
జిగ్నేశ్ మేవాని కాంగ్రెస్ ఏజెంట్: పిడమర్తి రవి
సాక్షి, హైదరాబాద్: గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవాని కాంగ్రెస్ ఏజెంట్లా మాట్లాడుతున్నారని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి విమర్శించారు. తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తోందన్న జిగ్నేష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో సంపూర్ణ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ, గుజరాత్లో జిగ్నేశ్ దళిత ఉద్యమాన్ని కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టారని ఆరోపించారు. తెలంగాణలో దళితులు చైతన్యశీలురని, ఇక్కడి దళిత సంఘాలకు మేవాని పాఠాలు అక్కర్లేదని అన్నారు. మాయావతి వంటి గొప్ప దళిత నాయకురాలిని విమర్శిస్తున్న జిగ్నేశ్ మేవానికి దళితుల మద్దతు లేదని అన్నారు. మంద కృష్ణ అంబేడ్కర్ సిద్ధాంతాన్ని గాలికొదిలి భౌతిక దాడులను నమ్ముకున్నారని, ఆయన జైల్లో ఉన్నా, బయట ఉన్నా మాదిగ ఏబీసీడీ వర్గీకరణ పోరాటం ఆగదని పేర్కొన్నారు. -
జిగ్నేశ్‌పై పిడమర్తి ఫైర్
సాక్షి, హైదరాబాద్: దళితుల గురించి మాట్లాడే అర్హత గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీకి లేదని తెలంగాణ ఎస్సీ కార్పొషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గుజరాత్లో దళిత ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందన్న జిగ్నేశ్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్‌తో ఆయన సమావేశం కావడాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని కోరారు. మంద కృష్ణమాదిగ జైల్లో ఉన్నా ఎస్సీ వర్గీకరణ పోరాటం ఆగదని పిడమర్తి రవి స్పష్టం చేశారు. కాగా, చంచల్‌గూడ జైల్లో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను జిగ్నేశ్ మేవానీ బుధవారం కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుశాఖ కుట్ర పన్ని మంద కృష్ణను జైల్లో పెట్టాయని, అక్రమ కేసులు పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పారు. -
మాదిగలకు టీఆర్ఎస్ పెద్దపీట
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మొదటి నుంచీ మాదిగలకు అం డగా నిలబడింది టీఆర్ఎస్ మాత్ర మేనని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన మాదిగ నేత లను గుర్తించి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా అవకాశం కల్పించారని తెలిపారు. తెలంగాణ భవన్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 19 ఎస్సీ రిజర్వుడ్ స్థానాల్లో 12 చోట్ల మాదిగలకు అవకాశం ఇచ్చారని, 3 ఎస్సీ లోక్‌సభ స్థానాల్లో రెం డు స్థానాలను మాదిగలకు ఇచ్చారని వివరించారు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు. సీఎం కేసీఆర్ ఇద్దరు డిప్యూటీ సీఎంలతో కలసి ప్రధానికి తీర్మానం కాపీ కూడా ఇచ్చారని చెప్పారు. ప్రధాని అపాయింట్మెంట్ కోరుతూ మంద కృష్ణ దీక్ష చేయాలని సూచించారు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో ప్రధాని అపాయింట్మెంట్ కోరుతూ దీక్ష లు చేయాలని మాదిగజేఏసీ, ఎమ్మార్పీఎస్ (రాయకంటి), టీఎమ్మార్పీఎస్, తెలంగా ణ మాదిగ దండోరాకు పిలుపునిచ్చారు. -
ఎస్సీ వర్గీకరణ కోసం ఢిల్లీలో నిరసన
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఎస్సీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం వర్గీకరించి మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మాదిగ జేఏసీ ఢిల్లీలో మౌనదీక్ష చేపట్టింది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ నిరసన కార్యక్రమాలు బుధవారం ఇక్కడి తెలంగాణ భవన్లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ.. అధికారంలోకి వచ్చాక దానిని విస్మరించిందని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టి మాదిగలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జేఏసీ నేతలు ధీరన్, గోపాల్, గాదె వెంకట్, ప్రభాకర్ తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు. -
వెంకయ్య నాయుడిపై ఆరోపణలు
న్యూఢిల్లీ: మాదిగలను బీజేపీ ఓటు బ్యాంకుగా చూస్తోందని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి విమర్శించారు. ఎస్సీలను ఏబీసీడీలు వర్గీకరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం జంతర్‌మంతర్ వద్ద మాదిగ జేఏసీ నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మాదిగలను వెంకయ్య నాయుడు ఉపయోగించుకుని ఉపరాష్ట్రపతి అవుతున్నారని ఆరోపించారు. దళితులపై దాడులు జరుగుతున్నా బీజేపీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును తక్షణమే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల వరకైనా వర్గీకరణ అంశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెడతామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని బీజేపీ విస్మరించిందని నిన్న పిడమర్తి ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయించిందన్నారు. అయినా కేంద్రం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు. -
కేసీఆర్ కిట్ ‘కిరికిరి..’
► టీఆర్ఎస్, టీడీపీ వాగ్వాదం ►బాలింతలను ఎండలో ఎంతసేపు..: పిడమర్తి రవి ►బజార్ రౌడీల్లా చిల్లరగా వ్యవహరించారు: ఎమ్మెల్యే సండ్ర సత్తుపల్లి: రాష్ట్ర ప్రభుత్వం బాలింతల కోసం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ల పంపిణీ ఖమ్మం జిల్లాలో రాజకీయ దుమారం రేపింది. అధికార టీఆర్ఎస్, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదంతో శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా సత్తుపల్లి ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో కేసీఆర్ కిట్ పంపిణీ చేసేందుకు అధి కారులు ఉదయం 9 గంటలకు ఏర్పాట్లు చేశారు. ఇంతలో మంత్రి పర్యటన రద్దు కావటంతో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు నేతృత్వంలో కార్యక్రమం చేపట్టాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. కార్యక్రమ సమాచారాన్ని ఆస్పత్రి సిబ్బంది ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు అందించగా, ఆయన రావాల్సి ఉంది. ఈ క్రమంలో పిడమర్తి రవి ‘ఎమ్మెల్యే కల్లూరు ప్రభుత్వాస్పత్రిలో కిట్ల పంపిణీలో ఉన్నారు.. ఆయన వచ్చిందాక ఆగం.. ఎండలో బాలింతలను ఎంతసేపు కూర్చోబెడతారు.. మీకు చేతకాకపోతే నేనే పంపిణీ చేస్తానని’అంటూ కిట్లు పంపిణీ చేశారు. దీంతో ఎమ్మెల్యే లేకుండా ఎలా పంపిణీ చేస్తారంటూ అక్కడ ఉన్న టీడీపీ నాయకులు అధికారులను నిలదీశారు. ఈ క్రమంలో టీఆర్ఎస్, టీడీపీ వర్గీయుల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. పోలీసులు జోక్యం చేసుకొని టీడీపీ నాయకులను పక్కకు పంపించారు దీంతో ఎమ్మెల్యే సండ్ర టీఆర్ఎస్ నేతలు బజారు రౌడీల్లా వ్యవహరించారన్నారు. -
కాళ్లు పట్టుకుంటే వర్గీకరణ రాదు:పిడమర్తి
ఖైరతాబాద్: ఉద్యమిస్తే వర్గీకరణ సాకారం అవుతుందని, కానీ కాళ్లు పట్టుకుంటే వచ్చేది కాదని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ఆదివారం మింట్ కాంపౌండ్‌లోని స్ఫూర్తి భవన్లో తెలంగాణ మాదిగ సంఘాల రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. రెండు దశాబ్దాలుగా వర్గీకరణ అంశంతో మాదిగలకు ద్రోహం చేస్తున్న మందకృష్ణ మాదిగ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారన్నారు. తెలంగాణలోని అన్ని సంఘాలతో కలిసి వర్గీకరణ సాధించేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. నవంబర్ 13న నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో బారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రానున్న శీతాకాల సమావేశంలో పార్లమెంట్‌ను ముట్టడిస్తామని తెలిపారు. తెలంగాణ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు ఇటుక రాజు, జీవ పాల్గొన్నారు. -
ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధంకావాలి
మోత్కూరు/యాదగిరిగుట్ట : కాలు పట్టుకునే సంస్కృతి కాకుండా మాదిగ యువతీ, యువకులు, విద్యార్థులు ఆత్మగౌరవ పోరాటం చేయడానికి సిద్ధం కావాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి పిలుపు ఇచ్చారు. ఆదివారం మోత్కూరు రహదారి బంగ్లాలో, యాదగిరిగుట్టలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 22 సంవత్సరాల మాదిగ ఉద్యమంలో మందకృష్ణ మాదిగ జాతి కాలు మొక్కే సంస్కృతిని ఇచ్చాడని ప్రపంచంలో ఏసామాజిక హక్కులు, ఉద్యమాలు కాళ్లు పట్టుకుంటే రాలేదని కాలర్ పట్టుకుంటేనే సాధించారని అన్నారు. 27 జిల్లా కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కమిటీల ఏర్పాటు అనంతరం అక్టోబర్‌లో అలాయ్‌బలాయ్ కార్యక్రమాన్ని నవంబర్‌లో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. వచ్చే పార్లమెంట్ సమావేశంలో ఏబీసీడీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో తీర్మానం చేసినా.. కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందన్నారు. సకల జనులకు జేఏసీగా ఉన్న కోదండరాం ఏ కులానికి మద్దతు ప్రకటించకుండా మోసం చేశారని ఆరోపించారు. ప్రాజెక్టులతో ప్రజలు నష్టపోతున్నారని అంటున్న కోదండరాంను ఏ కులం న్యాయం కోసం పోరాడుతున్నావు అని ఆయన ప్రశ్నించారు. వర్గీకరణ అయినా తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా కలిసి నూతన ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు. ఎస్సీ కార్పొరేషన్ కింద ఇప్పటి వరకు 4,500మందికి రూ.45కోట్లు సంక్షేమ ఫలాలు అందాయని, ఇంకా 20వేల మందికి త్వరలోనే వస్తాయన్నారు. జిల్లా జేఏసీ అధ్యక్షుడి ఎన్నిక నూతన యాదాద్రి జిల్లా మాదిగ జేఏసీ అధ్యక్షుడిగా యాదగిరిగుట్ట మండలం చొల్లేరు గ్రామానికి చెందిన డప్పు వీరస్వామిని నియమించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్ నియామక పత్రాన్ని అందజేశారు. అంతకు ముందు పిడమర్తి రవిని స్థానిక నాయకులు సన్మానించారు. యాదాద్రి క్షేత్రంలో ఎస్సీ సత్రం నిర్మించాలని కోరారు. దీనిపై ఆయన స్పందిస్తు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. ఈ సమావేశంలో తుంగతుర్తి నియోజకవర్గ జేఏసీ ఇన్చార్జి దాసరి ప్రవీణ్, గద్దల అంజిబాబు, ఎర్రబెల్లి కృష్ణ, కూరెళ్ల దాసు, మందుల కృష్ణ, పులిగిల నర్సింహ, చేడె మహేందర్, మధు, కృష్ణ, తొంట నవీన్, ఆదిత్య, మహేష్, నరేష్, నాగరాజు, యాదగిరిగుట్ట సర్పంచ్ బూడిద స్వామి, పులెపాక అశోక్, సుర్పంగ పాండు, కొన్నె వెంకటేష్, గ్యాదపాక బాలనర్సయ్య, నమిలె ఆంజనేయులు, మొగిలిపాక మహేందర్, పులెపాక వెంకటేష్ తదితరులున్నారు. -
మందకృష్ణకు మాట్లాడే హక్కులేదు: పిడమర్తి
దోమలగూడ: కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కాళ్లకు మొక్కి మాదిగల ఆత్మ గౌరవాన్ని తాకట్టుపెట్టిన మందకృష్ణకు మాదిగల గురించి మాట్లాడే హక్కులేదని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి విమర్శించారు. మాదిగలు, ఉపకులాలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు వద్ద నిరాహారదీక్ష చేపట్టారు. దీక్షలలో ఎంహెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజ్జెల నాగేశ్వర్రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సముద్రాల సంపత్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి కందుకూరి బాబు మాదిగ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కమకం కోమురయ్య మాదిగ, హైదరాబాద్ అధ్యక్షుడు ఐత రామకృష్ణ మాదిగ, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రెడ్డిగాని రాజు మాదిగ తదితరులు కూర్చున్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీబావం ప్రకటించిన రవి మాట్లాడుతూ.. ఉద్యమించి హక్కులను సాధించుకోవాలని డాక్టరు బిఆర్ అంబేడ్కర్ చెబితే, ధర్నాలు, దీక్షలు, ఆందోళనలు కాకుండా కాళ్లు మొక్కి సాధించుకోవాలనే రీతిలో మందకృష్ణ అగ్రకులాల వారికి మాదిగ జాతిని తాకట్టు పెట్టాడని విమర్శించారు. -
రోహిత్ మృతిపై నివేదిక కోరుతూ హెచ్ఆర్సీ ఆదేశాలు
హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న హెచ్‌సీయూ విద్యార్థి వేముల రోహిత్ మృతిపై విచారణ జరిపించాలని మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)లో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ ఎస్సీ కమిషన్ చైర్మన్ పిడమర్తి రవి హెచ్ఆర్సీలో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై హెచ్ఆర్సీ స్పందించింది. వచ్చే నెల ఒకటవ తేదీ లోగా విద్యార్థి రోహిత్ మృతిపై నివేదిక సమర్పించాలని హెచ్‌సీయూ వైస్ చాన్సలర్ అప్పారావు, సైబరాబాద్ సీపీని హెచ్ఆర్సీ ఆదేశించింది. -
రోహిత్ మృతిపై నివేదిక కోరుతూ హెచ్ఆర్సీ ఆదేశాలు
-
'అది పవనిజం కాదు.. బ్రోకరిజం'
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జాంబాగ్ డివిజన్ లో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ నేత, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి.. సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజాసమస్యలపై ఏనాడూ పోరాడని పవన్ కల్యాణ్ కు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకొస్తారని, జీహెచ్ఎంసీలో ఒకవేళ ఆయన ప్రచారం చేసినా తిరస్కరణకు గురవ్వడం ఖాయమని అన్నారు. 'జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ చేసేది, చెప్పేది పవనిజం కాదు... అంతా బ్రోకరిజం. ప్రతి ఎన్నికల ముందు ప్రజల ముందుకు వచ్చి బ్రోకరిజం చేస్తాడు. తెలంగాణ ప్రజలు ఆయన సినిమాలు చూస్తున్నారు కాబట్టే పవన్ కళ్యాణ్ జీవించగలుగుతున్నాడు. ఇక్కడి ప్రజలు ఎంతో తెలివైనవారు. పవన్ కల్యాణ్ లాంటివాళ్లను తరిమికొడతారు' అని పిడమర్తి వ్యాఖ్యానించారు. -
'వర్గీకరణ చేయకపోతే బీజేపీని ఓడిస్తాం'
బాన్సువాడ(నిజామాబాద్): ఎస్సీల రిజర్వేషన్ బిల్లును ఆమోదించకుంటే రానున్న ఎన్నికల్లో బిజెపిని ఓడిస్తామని ప్రతిజ్ఞ చేయాలని, అప్పుడే ఎస్సీల వర్గీకరణ సాధ్యమవుతుందని రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి పేర్కొన్నారు. సోమవారం బాన్సువాడలోని రెడ్డి సంఘంలో నియోజకవర్గ స్థాయి మాదిగల మహాజన సభ జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. గత 20 సంవత్సరాల్లో మాదిగల రిజర్వేషన్ కోసం మందకృష్ణ చేసిన ఉద్యమాలు ఫలితం లేనివని, ఉద్యమ పంథాను మార్చుకొని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఉద్యమాన్ని అనుసరించాలని అన్నారు. కేసీఆర్ చేసిన ఉద్యమంలో హింసకు తావులేదని, రాజకీయంగా, శాంతియుతంగా పోరాడారని, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా రాజీనామాలు చేసి, ఉప ఎన్నికల్లో గెలిచి ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని నింపారని గుర్తు చేశారు. ఇకపై తాము కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్‌కు ఎస్సీల వర్గీకరణ ఆవశ్యకతను తెలియజేస్తూ కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉందని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా మాదిగలందరినీ ఏకతాటిపైకి తెచ్చి, త్వరలో హైదరాబాద్‌లో లక్ష మందితో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని, అక్కడ బిజెపి సర్కార్ ఎస్సీల వర్గీకరణ బిల్లును ఆమోదించకుంటే వచ్చే నాలుగేళ్ళ తర్వాత జరిగే ఎన్నికల్లో ఓడించాలని ప్రతిజ్ఞ చేస్తామని పేర్కొన్నారు. గతంలో మందకృష్ణ మాదిగ ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించి, భంగపాటుకు గురయ్యారని, తాము అలా చేసేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చే తరుణంలో ఆయన టీఆర్ఎస్తో విభేదించి ఆంధ్ర రాష్ట్రంలోని చంద్రబాబుకు, బిజెపి పక్షాన చేరారని, వారు మోసం చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీల వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్రానికి పంపారని పేర్కొన్నారు. మాదిగల్లో ఐక్యత కోసం తాను అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. వర్గీకరణ ఉద్యమంలో రెడ్డీలను, వెల్మలను, మైనారిటీలను, బిసిలను అందరినీ కలుపుకొని తీసుకెళ్దామని, అందరి సహకారంతోనే ఉద్యమంలో విజయం సాధించగలుగుతామని రవి పేర్కొన్నారు. కాగా జిల్లా మాదిగ జెఎసి కన్వీనర్‌గా భీమన్నను, జిల్లా అధ్యక్షుడిగా రాజేశ్‌ను నియమిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీలకు 50శాతం సబ్సిడీపై రుణాలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఎస్సీలకు 50శాతం సబ్సిడీపై రుణాలు ఇస్తున్నట్లు పిడమర్తి రవి తెలిపారు. లక్ష లోపు రుణాలకు 80శాతం సబ్సిడీ, 5లక్షల లోపు రుణాలకు 70శాతం సబ్సిడీ, 10లక్షల లోపు రుణాలకు 50 శాతం సబ్సిడీ అందజేస్తున్నట్లు తెలిపారు. బ్యాంకర్లు ఇబ్బందులకు గురి చేయకుండా ఆదేశాలిచ్చామని అన్నారు. 2013-14లో రుణాల కోసం రూ. 86కోట్లు, 2014-15లో రూ. 80కోట్లు మంజూరు చేశామని తెలిపారు. వచ్చే నెల నుంచి కొత్త రుణాలు అందజేస్తామని ఆయన తెలిపారు. ఎస్సీలకు నిరంతరాయంగా భూములను పంపిణీ చేస్తామని, రూ. 7లక్షల లోపు ఎకరం కొనుగోలుకు ప్రభుత్వ అనుమతి ఉందని, ఎవరైనా అమ్మదలిచిన వారుంటే తహసిల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జె.సాయిలు, సాయిలు, శంకర్, డాకయ్య తదితరులు పాల్గొన్నారు. -
మందకృష్ణ, గద్దర్, మీరాలను ఎదిరిస్తా..
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి వరంగల్: సీఎం కేసీఆర్ ఆదేశిస్తే వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరిగే ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ఇక్కడ పోటీ చేసే అవకాశం కల్పిస్తే మంద కృష్ణమాదిగ, గద్దర్, పార్లమెంట్ మాజీ స్పీకర్ మీరాకుమార్లను ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా లద్నూరులో శనివారం విలేకరులతో మాట్లాడారు. 60 సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ.. ఒక సాథనంలో పోటీ చేసేందుకు దళితుడిని తయారు చేసేకోలేకపోయిందన్నారు. పదిహేను సంవత్సరాల క్రితం ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ పోటీచేసే పది మంది దళితులను తయారు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. వరంగల్ పార్లమెంట్ స్థానానికి సీఎం ఎవరిని నిలబెట్టిన వారి గెలుపు కోసం కృషిచేస్తామని అన్నారు. -
'రేసు'గుర్రం ఎవరు?
(సాక్షి వెబ్ ప్రత్యేకం) ప్రతిష్టాత్మక వరంగల్ ఉపపోరుపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. వరంగల్ ఎంపీ స్థానానికి ప్రధాన పొలిటికల్ పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. ఎంపీగా ఉన్న కడియం శ్రీహరి తెలంగాణ రాష్ట్ర విద్యామంత్రిగా బాధ్యలు చేపట్టడంతో వరంగల్ లోక్ సభ సీటుకు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో 'సూటబుల్ కేండిడేట్' కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ-బీజేపీ జల్లెడ పడుతున్నాయి. ఎస్సీకి రిజర్వు అయిన ఈ స్థానంలో ఉప పోరుకు ఇప్పటికే పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. కాంగ్రెస్ తరపున పెద్దపల్లి మాజీ ఎంపీ జి. వివేకానంద పేరు ప్రముఖంగా వినబడుతోంది. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ లో చేరిన వివేక్ తర్వాత మనసు మార్చుకుని మళ్లీ సొంతగూటికి వచ్చారు. వరంగల్ ఉప ఎన్నిక ద్వారా ఆయన సొంత జిల్లాకు వచ్చే అవకాశముందని అంటున్నారు. గత ఎన్నికల్లో కడియం శ్రీహరి చేతిలో ఓటమి పాలయిన కాంగ్రెస్ సిరిసిల్ల రాజయ్య కూడా మరోసారి పోటీకి సై అంటున్నారు. 'అధిష్టానమ్మ' భక్తుడు సర్వే సత్యనారాయణ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు గుసగుసలు విన్పిస్తున్నాయి. వరంగల్ టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలను సొమ్ము చేసుకోవాలని టీడీపీ-బీజేపీ కూటమి భావిస్తోంది. బలమైన అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా ఓరుగల్లులో పాగా వేయాలని వ్యూహాలు రచిస్తోంది. పొత్తులో భాగంగా గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థిని నిలబెట్టారు. ఈసారి కూడా కమలం పార్టీ కేండిడేట్ బరిలో దిగే అవకాశముంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన నేపథ్యంలో ఉపపోరును 'రెఫరెండం'గా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని విపక్షాలు భావిస్తున్నాయి. ఓయూ భూముల వివాదం, ప్రజాసంఘాల ఐక్యతతో కలవరపడుతున్న అధికార పార్టీ ఉపపోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా తమ సీటును నిలబెట్టుకోవాలని గులాబీ పార్టీ పట్టుదలతో పావులు కదుపుతోంది. దీటైన అభ్యర్థిని నిలిపి 'పోరుగడ్డ'పై తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తోంది. కేసీఆర్ అవకాశమిస్తే వరంగల్ పార్లమెంట్ స్థానం ఉప ఎన్నికలో రేసుగుర్రాన్ని తానే అవుతానని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి రేసులోకి దూసుకొచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన రవి మనసులోని మాట బయటపెట్టడంతో రేసు రసవత్తరంగా మారనుంది. టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ కూడా రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. రేసులో ఇంకెవరి పేర్లు తెరపైకి వస్తాయో చూడాలి. కాగా, ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత వారం రోజుల్లో తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కడియం శ్రీహరి ప్రకటించారు.