సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఎస్సీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం వర్గీకరించి మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మాదిగ జేఏసీ ఢిల్లీలో మౌనదీక్ష చేపట్టింది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ నిరసన కార్యక్రమాలు బుధవారం ఇక్కడి తెలంగాణ భవన్‌లో ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ.. అధికారంలోకి వచ్చాక దానిని విస్మరించిందని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టి మాదిగలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జేఏసీ నేతలు ధీరన్, గోపాల్, గాదె వెంకట్, ప్రభాకర్ తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment