సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మొదటి నుంచీ మాదిగలకు అం డగా నిలబడింది టీఆర్‌ఎస్ మాత్ర మేనని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన మాదిగ నేత లను గుర్తించి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా అవకాశం కల్పించారని తెలిపారు.
తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 19 ఎస్సీ రిజర్వుడ్ స్థానాల్లో 12 చోట్ల మాదిగలకు అవకాశం ఇచ్చారని, 3 ఎస్సీ లోక్‌సభ స్థానాల్లో రెం డు స్థానాలను మాదిగలకు ఇచ్చారని వివరించారు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు.
సీఎం కేసీఆర్ ఇద్దరు డిప్యూటీ సీఎంలతో కలసి ప్రధానికి తీర్మానం కాపీ కూడా ఇచ్చారని చెప్పారు. ప్రధాని అపాయింట్‌మెంట్ కోరుతూ మంద కృష్ణ దీక్ష చేయాలని సూచించారు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో ప్రధాని అపాయింట్‌మెంట్ కోరుతూ దీక్ష లు చేయాలని మాదిగజేఏసీ, ఎమ్మార్పీఎస్ (రాయకంటి), టీఎమ్మార్పీఎస్, తెలంగా ణ మాదిగ దండోరాకు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment