సాక్షి, ఖమ్మం : తెలంగాణ ప్రాజెక్టులు ఆడ్డుకున్న నాయకులు ఇప్పుడు ఓట్ల కోసం కూటమిగా వస్తున్నారని, ప్రజలంతా వారికి గట్టిగా బుద్ది చెప్పాలని అపద్ధర్మ మంత్రి కేటీఆర్ కోరారు. పిడమర్తి రవి నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అవకాశవాద పొత్తులు, అవకాశవాద రాజకీయాలు తెలంగాణపై పట్టుకోసం పోటీ పడుతున్నాయన్నారు. సీతారాం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 30 ఉత్తరాలు రాసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని విమర్శించారు.
సత్తుపల్లి పిడమర్తి రవిని భారీ మెజారిటితో గెలిపించాలని కోరారు. కరెంట్ అడిగితే కాల్పులు జరిపిన కాంగ్రెస్, టీడీపీ ఓ గట్టున, 24గంటలు కరెంట్ ఇచ్చిన టీఆర్‌ఓస్ మరో గట్టున ఉందన్నారు. సత్తుపల్లి నాగన్నలు ఏ గట్టున ఉంటారో నిర్ణయించుకోవాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మరల అమలులోకి వచ్చిన తర్వాత రైతు బంధు సాయాన్ని రూ.10వేలకు పెంచుతామన్నారు. సత్తుపల్లికి గోదావరి నీళ్లు కావాలంటే టీఆర్‌ఎస్‌ను గెలిపించాలన్నారు. రాహుల్ గాంధీ సీట్లు ఇచ్చినా, చంద్రబాబు నోట్లు ఇచ్చినా, టీఆర్‌ఎస్‌కే ఓట్లు వేసి కూటమికి బుద్ధి చెప్పాలని కోరారు. మహాకూటమి సీట్లు పంచుకునేలోపు టీఆర్‌ఎస్ స్వీట్లు పంచుకుంటుందని కేటీఆర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment