తెయూ(డిచ్‌పల్లి): బంగారు తెలంగాణ సాధనలో దళిత మేధావులు, విద్యార్థులు భాగస్వామ్యం కావాలని ఎస్‌సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి పిలుపునిచ్చారు. మంగళవారం తెలంగాణ యూనివర్సిటీ ఎస్‌సీ, ఎస్‌టీ సెల్ ఆధ్వర్యంలో ‘బంగారు తెలంగాణ- ద ళితుల భవిష్యత్తు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన స దస్సులో ఆయన ప్రసంగించారు. సీఎం కేసీఆర్ దళి తుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు.
ఉద్యమంలో క్రీయాశీలకంగా పని చేసిన విద్యార్థి జేఏసీ సేవలను గుర్తించి తనకు ఎస్‌సీ కార్పొరే షన్ చైర్మన్ పదవి ఇచ్చారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లేకుండా పోయాయన్నారు. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రా కుంటే ఉండే బాధలు ఏమిటో తనకు తెలుసునన్నా రు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిభ గల విద్యార్థులకు, ముఖ్యంగా దళిత విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు ఉంటాయన్నరు.
ఎస్‌సీ కార్పొరేషన్ ద్వారా రూ. లక్ష, రూ. రెండు లక్షల రుణాలు తీసుకుని బ తుకు వెళ్లదీస్తామనే చిన్న ఆలోచనలను పక్కన పెట్టేయాలన్నారు. చదువులో నైపుణ్యాలు పెంచుకుని ఉ న్నత ఉద్యోగావకాశాలు సాధించి, ఇతరులకూ ఉ పాధి కల్పించేలా కృషి చేయాలని సూచించారు. వి ద్యార్థి దశలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమా లు చేసి కేసులు ఎదుర్కొన్నామని, ఎందరో విద్యార్థులు అమరులయ్యారని గుర్తు చేశారు.
ప్రత్యేక రా ష్ట్రం వచ్చిన తర్వాత ప్రస్తుతం సామాజిక ఉద్యమా లు ఊపందుకుంటున్నాయన్నారు. సదస్సులో వర్సి టీ క ళాశాల ప్రిన్సిపాల్ కనకయ్య, ఎస్‌సీ, ఎస్‌టీ సె ల్ డైరక్టర్ ప్రవీణ్, అకడమిక్ ఆడిట్ సెల్ డైరక్టర్ ధర్మరాజు, డాక్టర్ ప్రభంజన్‌కుమార్ యాదవ్, ఎం ఆర్‌పీఎస్ రాష్ట్ర నాయకుడు నాంపల్లి, టీఆర్‌ఎస్ యూత్ నాయకులు బాజిరెడ్డి జగన్, మాలమహానా డు జిల్లా కార్యదర్శి నాయుడు రాజు, విద్యార్థి సం ఘాల నాయకులు యెండల ప్రదీప్, పులి జైపాల్, మర్రికిరణ్, ప్రగతికుమార్, రంజిత్, శరత్, శ్రీనివా స్, బాలాజీ, రాజ్‌కుమార్, సంతోశ్, టీఆర్‌ఎస్ నా యకులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బంగారు తెలంగాణ సాధనకు కదలండి
Published Wed, Dec 31 2014 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM
Advertisement