కాళ్లు పట్టుకుంటే వర్గీకరణ రాదు:పిడమర్తి | The classification does not get caught by the legs: pidamarti | Sakshi
Sakshi News home page

కాళ్లు పట్టుకుంటే వర్గీకరణ రాదు:పిడమర్తి

Published Sun, Sep 4 2016 11:25 PM | Last Updated on Tue, Oct 9 2018 5:22 PM

The classification does not get caught by the legs: pidamarti

ఖైరతాబాద్‌: ఉద్యమిస్తే వర్గీకరణ సాకారం అవుతుందని, కానీ కాళ్లు పట్టుకుంటే వచ్చేది కాదని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి అన్నారు. ఆదివారం మింట్‌ కాంపౌండ్‌లోని స్ఫూర్తి భవన్‌లో తెలంగాణ మాదిగ సంఘాల రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. రెండు దశాబ్దాలుగా వర్గీకరణ అంశంతో మాదిగలకు ద్రోహం చేస్తున్న మందకృష్ణ మాదిగ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారన్నారు.

తెలంగాణలోని అన్ని సంఘాలతో కలిసి వర్గీకరణ సాధించేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.  నవంబర్‌ 13న నిజాం కాలేజ్‌ గ్రౌండ్స్‌లో బారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  రానున్న శీతాకాల సమావేశంలో పార్లమెంట్‌ను ముట్టడిస్తామని తెలిపారు. తెలంగాణ ఎంఆర్‌పీఎస్‌ అధ్యక్షుడు ఇటుక రాజు, జీవ పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement