తెలంగాణ గడ్డపై ఉన్న అసెంబ్లీలో సీమాంధ్ర నేతల పెత్తనం ఏందని తెలంగాణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర చైర్మన్ పిడమర్తి రవి ప్రశ్నించారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రపతి నుంచి వచ్చిన తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. అల్పసంఖ్యాకులైన తెలంగాణపై సీమాంధ్ర పెత్తందారుల పెత్తనం చెలాయిస్తున్నారని, ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదన్నారు. అసెంబ్లీలో టీ ముసాయిదాపై చర్చ జరగకుండా సీమాంధ్ర సీఎం, చంద్రబాబులు అడ్డుకుంటున్నార ని మండిపడ్డారు. ఈ నెల 6వ తేదీ వరకు బిల్లుపై చర్చ జరగాలని, లేకుంటే 7వ తేదీ లక్షలాది మంది విద్యార్థులతో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.
చలో అసెంబ్లీని విజ యవంతం చేసేందుకు తెలంగాణ వ్యాప్తంగా ఎంపీ, ఎమ్మెల్యే నియోజక వర్గాలకు ఇన్‌చార్జీలను నియమించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఏజెండాతో పార్టీలకతీతంగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నామన్నారు. 7న నిర్వహించే చలో అసెంబ్లీకి జిల్లానుంచి వేలాదిగా విద్యార్థులు తరలి రావాలని కోరా రు.
అనంతరం టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు సయ్యద్ ఇబ్రహీం మాట్లాడుతూ సంపూర్ణ తెలంగాణ సాధించే వరకు టీఆర్‌ఎస్ పోరాటం చేస్తుందన్నారు. ఎవరెన్నీ కుట్రలు చేసినా తెలంగాణను అడ్డుకోలేరన్నా రు. అనంతరం చలో అసెంబ్లీ పోస్టర్‌ను విడుదలచేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు నరేష్‌రెడ్డి, టీఎస్‌జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రహీం, శ్యాంప్రసాద్, మై నర్‌బాబు, రామకృష్ణ ముదిరాజ్, సురేష్, దినేష్, తదితరులు పాల్గొన్నారు.
మా అసెంబ్లీలో మీ పెత్తనం ఏంది?
Published Sat, Jan 4 2014 9:29 AM | Last Updated on Sat, Aug 11 2018 7:54 PM
Advertisement
Advertisement