'అది పవనిజం కాదు.. బ్రోకరిజం'
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జాంబాగ్ డివిజన్ లో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ నేత, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి.. సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజాసమస్యలపై ఏనాడూ పోరాడని పవన్ కల్యాణ్ కు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకొస్తారని, జీహెచ్ఎంసీలో ఒకవేళ ఆయన ప్రచారం చేసినా తిరస్కరణకు గురవ్వడం ఖాయమని అన్నారు.
'జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ చేసేది, చెప్పేది పవనిజం కాదు... అంతా బ్రోకరిజం. ప్రతి ఎన్నికల ముందు ప్రజల ముందుకు వచ్చి బ్రోకరిజం చేస్తాడు. తెలంగాణ ప్రజలు ఆయన సినిమాలు చూస్తున్నారు కాబట్టే పవన్ కళ్యాణ్ జీవించగలుగుతున్నాడు. ఇక్కడి ప్రజలు ఎంతో తెలివైనవారు. పవన్ కల్యాణ్ లాంటివాళ్లను తరిమికొడతారు' అని పిడమర్తి వ్యాఖ్యానించారు.