గంగిరెద్దు అంటూ పవన్‌పై కవిత విసుర్లు | trs mp kavita satires on pawan kalyan | Sakshi
Sakshi News home page

గంగిరెద్దు అంటూ పవన్‌పై కవిత విసుర్లు

Published Sat, Jan 9 2016 5:37 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

గంగిరెద్దు అంటూ పవన్‌పై కవిత విసుర్లు - Sakshi

గంగిరెద్దు అంటూ పవన్‌పై కవిత విసుర్లు

హైదరాబాద్: సినీ నటుడు పవన్‌కల్యాణ్‌పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత సెటైర్లు వేశారు. ఎన్నికలనగానే కొందరు గంగిరెద్దుల్లా వస్తారని, అయినా తాము ఎవరికీ భయపడబోమని ఆమె పవన్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో ఆమె ప్రసంగించారు.

తిక్కున్న పవర్‌ స్టార్లకు సీఎం కేసీఆర్ ఎప్పుడో చుక్కలు చూపించారని కవిత కామెంట్‌ చేశారు. ఎన్నికలప్పుడు మేకప్‌ వేసుకొని వచ్చి ఆ తర్వాత ప్యాకప్‌ చెప్పే వాళ్లను ప్రజలను నమ్మరని ఆమె వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఆంధ్రావాళ్లు ఎక్కువగా ఉన్నందున పవన్ కల్యాణ్‌తో ప్రచారం చేయించాలని టీ టీడీపీ నేతలు అనుకుంటున్నారని, వారి ఆశలు ఆడియాసలేనని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏదో చేస్తారని చెప్పే బీజేపీ నేతలను, ఆంధ్రా- తెలంగాణ మధ్య హైదరాబాద్‌ విచ్ఛిన్నం చేయాలని చూసే టీడీపీ నేతలను ప్రజలు నమ్మే ప్రసక్తి లేదని కవిత అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement