
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: బీజేపీ జాతీయ నాయకులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఢిల్లీ వచ్చిన పవన్ మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు పలువురు నాయకులతో భేటీ అవుతారని జనసేన వర్గాలు తెలిపాయి.
ఈ సందర్భంగా తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ, జనసేనలో ఏ పార్టీ అభ్యర్థిని పోటీకి దించాలనే అంశంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన ప్రచారం గురించి కూడా పవన్ వారితో చర్చిస్తారని పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment