ప్రకాశరావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న చాడ వెంకటరెడ్డి
బోనకల్ ఖమ్మం : రాష్ట్రంలో ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయ లేని దద్దమ్మ ప్రభుత్వం కేసీఆర్‌దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. మం డలంలోని రాయనపేటలో బుధవారం జరిగిన తూము ప్రకాశరావు 35వ వర్ధంతి సభకు ఆయన హాజరయ్యారు.
ముందుగా ప్రకాశరావు విగ్రహా న్ని ఆవిష్కరించారు. ఆయన కుటుంబసభ్యులు గ్రామస్తుల కోసం నిర్మించిన నీరజ వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ.. పేద ప్రజల కోసం కమ్యూ నిస్టు నేతగా ప్రకాశరావు తన జీవితాన్ని త్యాగం చేశా రని నివాళులర్పించారు.
ఆయన స్ఫూర్తితో కుటుంబ సభ్యులు కూడా సమాజసేవ చేయడం అభినందనీయమన్నారు. ప్రజాసమస్యల పరిష్కా రం కోసం నిరంతర పోరాటాలు చేస్తామని తెలి పారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంతలా పాలన సాగిస్తున్నారని, పథకాల ప్రచారం బాగానే ఉన్నప్పటికీ అమలు శూన్యమని ఆరోపించారు.
భూ ప్రక్షాళనతో ప్రజలకు ఒరిగిందేమీ లేకపోగా, రెవెన్యూ అధికారులకు మాత్రం కాసుల పంట పండిందన్నారు. తాను అధికారంలోకి వచ్చాక వందరోజుల్లోనే మార్పు తీసుకొస్తానన్న ప్రధాని నరేంద్రమో దీ ప్రజలను మభ్యపెడుతూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు.
కార్పొరేట్లకు అనుకూలంగా బీజేపీ పాలన సాగుతోందని దుయ్యబట్టారు. మోదీపాలనలో మతోన్మాదం పెరిగి ప్రజలకు రక్షణ కరువైందన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నల్లదనం బయటకు తీసుకొస్తానని చెప్పి ఆచరణలో చేయలేక పోయారని మండిపడ్డారు. జీఎస్టీతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిసామాన్య ప్రజలు ఇబ్బందులు పడు తున్నారని వాపోయారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజలను చైతన్య పరిచేందుకు వచ్చే రెండు నెలల్లో తమ పార్టీ ఆధ్వర్యంలో ప్రచార జాతాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమం లో సీపీఐ జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, రాష్ట్రనాయకులు కూనంనేని సాంబ శివరా వు, టి.వి.చౌదరి, జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, యంగలఆనందరావు, తోటరామాంజనేయులు, బత్తినేని ట్రస్ట్ చైర్మన్ నాగప్రసాద్, సభ్యులు నీరజ, రాకేష్, సుశీల తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment