సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ‘చాడ’
సహాయ కార్యదర్శులుగా సిద్ది, పల్లా
తొమ్మిది మందితో రాష్ట్ర కార్యదర్శివర్గం
ఖమ్మం: సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా చాడ వెంకటరెడ్డి ఎన్నికయ్యా రు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తాత్కాలిక కార్యదర్శిగా వ్యవహరిస్తున్న చాడను ఖమ్మంలో జరిగిన సీపీఐ రాష్ట్ర మహాసభల్లో ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. నాలుగు రోజుల పాటు ఇక్కడ జరిగిన సీపీఐ తెలంగాణ రాష్ర్ట ప్రథమ మహాసభ మంగళవారం ముగిసింది.
ఈ సందర్భంగా చాడ పేరును రాజ్యసభ మాజీ సభ్యుడు అజీజ్‌పాషా ప్రతిపాదించగా సీనియర్ నేత ప్రతాప్‌రెడ్డి బలపరిచారు. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా ఖమ్మం జిల్లాకు చెందిన సిద్ది వెంకటేశ్వర్లు, నల్లగొండ జిల్లాకు చెందిన పల్లా వెంకటరెడ్డి పేర్లను కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. తొమ్మిదిమందితో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గం, 31 మందితో రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేశా రు. ఇప్పటివరకు ఏడుగురు కార్యదర్శివర్గ సభ్యులు, 27 మంది రాష్ట్ర కార్యవర్గంలో కొనసాగగా, కార్యదర్శివర్గ సభ్యుల సంఖ్యను తొమ్మిదికి, పార్టీ కార్యవర్గసభ్యుల సంఖ్యను 31కి పెంచారు. కార్యదర్శివర్గంలో చాడ, ఇద్దరు రాష్ట్ర సహాయ కార్యదర్శులు తదిత రులకు చోటు కల్పించారు.