critisizes kcr
-
బీజేపీ, టీఆర్ఎస్ కలసి పోటీ చేయవు: బండి సంజయ్
వికారాబాద్: తెలంగాణకు మొదటి ద్రోహి కేసీఆరేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర శుక్రవారం వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో కొనసాగింది. ఇందులో భాగంగా మన్నెగూడ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. బీజేపీ, టీఆర్ఎస్ కలసి పోటీ చేయబోవని తేల్చిచెప్పారు. ప్రజలను, ఎమ్మెల్యేలను, మంత్రులను కలిసేందుకు కేసీఆర్‌కు సమయం ఉండదన్నారు. ప్రధాని మోదీ మాత్రం దేశ ప్రజలందరినీ సమాన దృష్టితో చూస్తారని తెలిపారు. అందులో భాగంగా కేసీఆర్ ఎప్పుడు వెళ్లినా అపాయింట్మెంట్ ఇస్తారని చెప్పారు. ఇది ఆసరాగా చేసుకుని ప్రధాని తనను ప్రశంసించారని తన అనుకూల మీడియాలో ప్రచారం చేయించుకుంటారని ఎద్దేవా చేశారు. నీటి వాటా కోల్పోతున్నాం.. సీఎం కేసీఆర్ కమీషన్ల కోసం పక్క రాష్ట్ర సీఎంతో కుమ్మక్కయ్యా రని బండి ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే దళితబంధు పథకాన్ని తెరపైకి తెచ్చారని, అమలులో మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసినా హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెలవదని జోస్యం చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ఒట్టి బూటకం అని తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నీళ్లిచ్చే ఆలోచనేదీ ఆయనకు లేదన్నారు. నీటి కేటాయింపులో ద్రోహం చేసిన కేసీఆర్‌ను నిలదీయాలని పిలుపునిచ్చారు. రైతు వేదికలు, ఉచిత బియ్యం లాంటి పథకాలన్నీ బీజేపీ చలవేనని తెలిపారు. అన్యమతాల ముసుగులో ఎవరైనా హిందువుల జోలికొస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. ఎంఐఎంతో యుద్ధం చేస్తామని స్పష్టం చేశారు. ముస్లింల అభ్యున్నతిపై, పాతబస్తీ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే పాత బస్తీకి మెట్రో రైలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. యాత్రలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్, బీజేపీ నేతలు సదానంద్‌రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్ పాల్గొన్నారు. -
కేసీఆర్‌ను విమర్శించే స్థాయి సండ్రకు లేదు
సత్తుపల్లి : ఎన్నికల మ్యానిఫెస్టోలో లేని సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించే స్థాయి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు లేదని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. సత్తుపల్లిలోని రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ గాదె సత్యనారాయణ నివాసంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎమ్మెల్యే సండ్ర చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తొమ్మిదేళ్ల పదవీ కాలంలో ఎమ్మెల్యే సండ్ర నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని సవాల్ చేశారు. సత్తుపల్లి నియోజకవర్గానికి ఎక్కడికి పోయి నిధులు తెస్తున్నారో చెప్పాలని కోరారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఘటన సండ్రకే దక్కుతుందన్నారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉండాలని సవాల్ చేశారు. సమావేశంలో ఎంపీపీ జ్యేష్ట అప్పారావు, జెడ్పీటీసీ సభ్యురాలు హసావత్ లక్ష్మి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ గాదె సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు చల్లగుళ్ల నర్సింహారావు, మాజీ ఎంపీపీ రాచూరి గంగరాజు, కొత్తూరు ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ పాలనకు ముగింపు పలకాలి
జగిత్యాలటౌన్ : తెలంగాణలో టీఆర్ఎస్ పాలనకు ముగింపు పలకాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కోవ లక్ష్మణ్ అన్నారు. జనచైతన్యయాత్రలో భాగంగా సోమవారం జగిత్యాలకు చేరుకున్నారు. కొత్తబస్టాండ్ నుంచి అంగడిబజార్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారని, వాటిని అమలు పర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్‌పాలనలో దగా పడ్డ తెలంగాణను టీఆర్ఎస్ అవినీతి మయంలో ముంచిందన్నారు. దేశాన్ని పాలించడం కాంగ్రెస్ జన్మహక్కు అనే విధంగా వ్యవహరిస్తోందని, 2 శాతం ఓటర్లు ఉన్న రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. కాంగ్రెస్ కంచుకోటలను మోడీ కూల్చారని, అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉందన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి మోసం చేశారని, దళితులపై దాడులు పెరిగాయని, దీనికి నేరెళ్ల సంఘటనే ఉదాహరణగా పేర్కొన్నారు. 2012లో డీఎస్సీ ప్రకటించినా.. ఇప్పటికీ అతీగతీలేదన్నారు. ఇంకా నాలుగు వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 40 వేల మంది ఉద్యోగ విరమణ చేశారని, ఇంటికో ఉద్యోగం ఏమైందని ప్రశ్నించారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తామన్న కేసీఆర్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ప్రభుత్వంగా ప్రజలే మారుస్తారన్నారు. రేషన్‌డీలర్లకు కేంద్ర ప్రభుత్వం అందజేసిన నిధులను ఇవ్వకుండా 14 వేలమంది రేషన్ డీలర్లను రోడ్డుపాలు చేశారని ఆరోపించారు. నిజాంల మెడలు వంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణకు విముక్తి కల్పిస్తే గల్లీలో ఉన్న మజ్లిద్ పార్టీని ఢిల్లీకి పంపించిన ఘనత టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్దేనన్నారు. ఉత్తర తెలంగాణలో గల్ఫ్ బాధితులు పెరిగిపోతున్నారని, సీఎం బిడ్డ ఎంపీ కవిత పట్టించుకోవడం లేదని, గల్ఫ్ ఎన్ఆర్ఐ అమలు ఏమైందన్నారు. తెలంగాణ చిన్నమ్మ సుష్మస్వరాజ్ విదేశాల్లో ఉన్న బాధితులను స్వదేశానికి తీసుకురావడానికి కృషి చేస్తోందన్నారు. మెట్పల్లి షుగర్ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరిపిస్తామని హామీ ఇచ్చి ఫ్యాక్టరీ యజమాన్యంతో లాలూచీ పడి తెరిపించలేకపోతున్నారన్నారు. చేనేత కార్మికులకు ప్రోత్సాహం అందించేందుకు బతుకమ్మ చీరలకోసం కోట్లాది నిధులు మంజూరు చేసి నాణ్యత లేని సూరత్ చీరలను తెప్పించి తెలంగాణ ఆడబిడ్డలకు అందజేయడం బాధాకరమన్నారు. ఇటు చేనేత కార్మికులను అపహాస్యం చేస్తూ ఆడబిడ్డలకు అవమానం జరిగిందన్నారు. బీజేపీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కౌలురైతు చట్టం డ్వాక్రా గ్రూపులకు నిధులు మంజూరు చేస్తామన్నారు. జనచైతన్య యాత్ర పార్టీ యాత్ర కాదని, నాలుగున్నర కోట్ల ప్రజల యాత్ర అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్‌మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, కిసాన్ మోర్చ జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ చైర్మన్ మోరపల్లి సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు బాజోజి భాస్కర్, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, యెండల లక్ష్మినారాయణ, గుజ్జుల రామకృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సీపెల్లి రవీందర్, సత్యం, అనుమల్ల కృష్ణహరి, రమేశ్ పాల్గొన్నారు. -
కేసీఆర్‌ది చేతకాని ప్రభుత్వం
బోనకల్ ఖమ్మం : రాష్ట్రంలో ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయ లేని దద్దమ్మ ప్రభుత్వం కేసీఆర్‌దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. మం డలంలోని రాయనపేటలో బుధవారం జరిగిన తూము ప్రకాశరావు 35వ వర్ధంతి సభకు ఆయన హాజరయ్యారు. ముందుగా ప్రకాశరావు విగ్రహా న్ని ఆవిష్కరించారు. ఆయన కుటుంబసభ్యులు గ్రామస్తుల కోసం నిర్మించిన నీరజ వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ.. పేద ప్రజల కోసం కమ్యూ నిస్టు నేతగా ప్రకాశరావు తన జీవితాన్ని త్యాగం చేశా రని నివాళులర్పించారు. ఆయన స్ఫూర్తితో కుటుంబ సభ్యులు కూడా సమాజసేవ చేయడం అభినందనీయమన్నారు. ప్రజాసమస్యల పరిష్కా రం కోసం నిరంతర పోరాటాలు చేస్తామని తెలి పారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంతలా పాలన సాగిస్తున్నారని, పథకాల ప్రచారం బాగానే ఉన్నప్పటికీ అమలు శూన్యమని ఆరోపించారు. భూ ప్రక్షాళనతో ప్రజలకు ఒరిగిందేమీ లేకపోగా, రెవెన్యూ అధికారులకు మాత్రం కాసుల పంట పండిందన్నారు. తాను అధికారంలోకి వచ్చాక వందరోజుల్లోనే మార్పు తీసుకొస్తానన్న ప్రధాని నరేంద్రమో దీ ప్రజలను మభ్యపెడుతూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్లకు అనుకూలంగా బీజేపీ పాలన సాగుతోందని దుయ్యబట్టారు. మోదీపాలనలో మతోన్మాదం పెరిగి ప్రజలకు రక్షణ కరువైందన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లదనం బయటకు తీసుకొస్తానని చెప్పి ఆచరణలో చేయలేక పోయారని మండిపడ్డారు. జీఎస్టీతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిసామాన్య ప్రజలు ఇబ్బందులు పడు తున్నారని వాపోయారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజలను చైతన్య పరిచేందుకు వచ్చే రెండు నెలల్లో తమ పార్టీ ఆధ్వర్యంలో ప్రచార జాతాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమం లో సీపీఐ జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, రాష్ట్రనాయకులు కూనంనేని సాంబ శివరా వు, టి.వి.చౌదరి, జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, యంగలఆనందరావు, తోటరామాంజనేయులు, బత్తినేని ట్రస్ట్ చైర్మన్ నాగప్రసాద్, సభ్యులు నీరజ, రాకేష్, సుశీల తదితరులు పాల్గొన్నారు. -
మాట తప్పిన వ్యక్తి సీఎంగా అనర్హుడు
సుందరయ్యవిజ్ఞానకేంద్రం : తమ పార్టీ అధికారంలోకి రాగానే శ్రీశైలం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాట తప్పారని, మాట తప్పిన వారు ముఖ్యమంత్రి ఎలా అవుతారని తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షులు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్ అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజల పార్టీ, తెలంగాణ రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో రైతు సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న నలుగురు రైతు కుటుంబాలకు రూ.10 వేల చొప్పున చెక్కులను అందచేశారు. సభలో జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. జీఓలు 98, 67లను అనుసరించి నిర్వాసిత ప్రతి కుటుంబానికి వారసత్వ ఉద్యోగం ఇవ్వాలని, పునరావాసం కింద రూ.10 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇంతవరకు ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు పూర్తిస్థాయి పరిహారం చెల్లించలేదన్నారు. కార్పొరేట్ విద్యను అరికడతామని, విద్య, వైద్యం అందిస్తామని చెప్పిన ప్రభుత్వం మాటలు నీటి మూటలయ్యాయని ఎద్దేవా చేశారు. రైతు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, వాస్తవంగా సాగు చేస్తున్న రైతులకు సంక్షేమ పథకాలను అందచేయాలన్నారు. భూమిలేని దళిత గిరిజనులకు మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రభాకరాచారి, తెలంగాణ ప్రజల పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సాంబశివగౌడ్, సదరా బేగం, సుతారి లచ్చన్న, ఎడవెల్లి మోహన్, వేద వికాస్ తదితరులు పాల్గొన్నారు. -
జోన్ విషయం కోర్టులో తేల్చుకుంటాం
పరిగి: జోన్ విషయంలో జిల్లాకు ప్రభుత్వం అన్యాయం చేసింది.. ఇక ప్రభుత్వంతో కోర్టులో తేల్చుకుంటామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పరిగిలోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జోన్ విషయంలో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేసి న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పదేళ్ల పాటు కొత్త జోన్లు చేయటానికి వీలుకాదని చెప్పారు. దీని ఆధారంగా కోర్టులో పిల్ వేసి నిరుద్యోగులు, ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూస్తానని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా ప్రజల ఆకాంక్షల మేరకు చార్మినార్ జోన్లోనే చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆకాంక్షలను విస్మరించి సీఎం ఒంటెద్దు పోకడపోతున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ యువతకు కానిస్టేబుల్, వీఆర్వో శిక్షణ ఇప్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానించగా 1,350 దరఖాస్తులు అందాయని తెలిపారు. వారికి పీజేఆర్ టెక్నికల్ సపోర్టుతో త్వరలో ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. త్వరలో పార్టీ అనుబంధ కమిటీలు పార్టీ బలోపేతానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. 14 మంది అంకితభావం గల కార్యకర్తలు, నాయకులతో బూత్ స్థాయి కమిటీలు వేస్తామని చెప్పారు. వీరు ప్రతి బూత్ పరిధిలో 25 మంది కార్యకర్తలను శక్తి యాప్‌లో చేరుస్తారని పేర్కొన్నారు. శక్తి యాప్‌లో చేరిన ప్రతి కార్యకర్త బయోడేటా డిజిటలైజేషన్ అవుతుందన్నారు. శక్తి యాప్‌లో చేరిన ప్రతి కార్యకర్త ఆన్లైన్ ద్వారా రాహుల్‌గాంధీతో సంబంధం కలిగి ఉంటారని వివరించారు. ప్రతి ఐదు బూత్‌లకు ఒకరి చొప్పున బూత్ కో ఆర్డినేటర్లను నియమిస్తామని తెలిపారు. పార్టీ అనుబంధ కమిటీల్లో మహిళలు, యువతకు తగిన ప్రాధాన్యం ఇస్తామన్నారు. -
నిరుద్యోగ సమస్య పరిష్కారంలో టీఆర్ఎస్ విఫలం
అర్వపల్లి (తుంగతుర్తి) : నిరుద్యోగ సమస్య పరి ష్కారంలో టీఆర్ఎస్ ప్రభుత్వ విఫలమైందని తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మందడి అనిల్‌కుమార్‌యాదవ్, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి అన్నారు. లక్ష ఉద్యోగాల భర్తీకై రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరుద్యోగ చైతన్య యాత్ర బుధవారం అర్వపల్లికి చే రింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రా ష్ట్రంలో నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు కాదు కదా వందల ఉద్యోగాలు కూడా రాలేదన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. కేవలం కేసీఆర్ కుటుంబంలో తప్ప ఎవ్వరికి ఉద్యోగాలు రాలేదన్నారు. నిరుద్యోగులు ఎ లాంటి ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. నిరుద్యోగ భృతి కూడా చెల్లిస్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా అర్వపల్లి మండల కేంద్రంలో వేలాది మందితో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ర్యాలీ తుంగతుర్తికి వెళ్లింది. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు చెవిటి వెంకన్నయాదవ్, నియోజకవర్గ ఇన్చార్జ్ గుడిపాటి నర్సయ్య, డాక్టర్ వడ్డేపల్లి రవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దరూరి యోగానందచారి, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనిరెడ్డి రాజేందర్‌రెడ్డి, టి. రాంబాబు, అన్నెబోయిన సుధాకర్, ఆకుల బుచ్చిబాబు, సంకేపల్లి సుధీర్‌రెడ్డి, సంకేపల్లి కొండల్‌రెడ్డి, నాయకులు నర్సింగ శ్రీనివాస్‌గౌడ్, సోమయ్య పాల్గొన్నారు. -
కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం దురదృష్టం
బుగ్గారం(ధర్మపురి): తెలంగాణాకు తొలి ముఖ్య మంత్రిగా కె. చంద్రశేఖర్‌రావు పదవీబాధ్యతలు స్వీకరించడం ప్రజల దురదృష్టకరమని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లా ఇ ంద్రసేనారెడ్డి అన్నారు. స్థానిక ఎస్సారార్ గార్డెన్లో ఆదివారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రా నున్న ఎన్నికల్లో పార్టీని క్షేత్రస్థాయిలో ఎలా సమాయత్తం చేయాలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశా రు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలకు వివరించి, కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని పాంత్రాల ప్రజల సంక్షేమానికి ఏ విధంగా పాటుపడుతుందో తెలి యజేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. సీఎం అనాలోచిత నిర్ణయాలతో ఇబ్బందులు సీఎం అనాలోచిత నిర్ణయాలతో అనేక మంది ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లా ఇంద్రసేనారెడ్డి అన్నారు. బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలను మభ్యపెట్టే నిర్ణయాలతో మోసంచేయడం తప్పితే ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. రైతుల కోసం కేంద్రం ఎంతో డబ్బు ఖర్చు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని సరిగ్గా వినియోగించలేకపోతుందన్నారు. ప్రతీయేటా వ్యవసాయ సీజన్ ఆరంభంలో ప్రయాణిక తయారు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ తయారు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇష్టమొచ్చినట్లు జిల్లాలను విభజన చేయడం వల్లే అనేక సాంకేతిక, న్యాయపరమైన చిక్కులు ఏర్పడుతున్నాయని, దీనికి ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. జోన్లు అవసరం లేదని గతంలో ఉద్ఘాటించిన కేసీఆర్ ముఖ్యమంత్రి ఎలా పడితే అలా జోన్లను ఏర్పాటు చేయడానికి పూనుకుంటున్నారన్నారు. దీంతో భవిష్యత్‌లో అనేక సమస్యలు వస్తాయని తామెప్పుడో చెప్పామని గుర్తు చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భూసర్వే తప్పుల తడకగా మారడం ఏమిటని ప్రశ్నించారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర పెంచితే రైతుల్లో ఉత్సాహం పెరిగి మరింత దిగుబడి సాధించడానికి ఉత్సాహం చూపుతారన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాజోజీ భాస్కర్, రాష్ట్ర ప్రతినిధులు ముదుగంటి రవీందర్‌రెడ్డి, వుత్కూరి అశోక్, పూదెర్ల అరుణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సీపెల్లి రవీందర్, ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జి కన్నం అంజయ్య, నియోజకవర్గ కన్వీనర్ కొమ్ము రాంబాబు, ధర్మపురి మండల బీజేపీ అధ్యక్షుడు బండారి లక్ష్మణ్, నాయకులు పిల్లి శ్రీనివాస్, నందగిరి గిరిధర్, రంగు అశోక్, సంగెపు గంగారాం తదితరులు పాల్గొన్నారు. -
రీడిజైన్లతో తీరని అన్యాయం
చేవెళ్ల : రీడిజైన్ల పేరుతో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఆరోపించారు. చేవెళ్ల మండలకేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద శుక్రవారం ఎల్డీఎంఆర్సీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన భట్టి విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా కురుసిన అకాల వర్షంతో రైతులు త్రీవంగా నష్టపోయారన్నారు. జిల్లాలో మొక్కజొన్న, వరిపంట పూర్తిగా దెబ్బతిందని చెప్పారు. పంట నష్టాన్ని తక్షణమే అంచనావేసి రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేవారు. రీడిజైన్‌తో జిల్లా ప్రజలకు తీరని అన్యాయం... తెలంగాణాలోని ఏడు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును డిజైన్ చేయించారని, కానీ ప్రస్తుత సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ క్రెడిట్ ఎక్కడ కాంగ్రెస్‌ప్రభుత్వానికి దక్కుతుందోనని రీడిజైన్ పేరుతో ప్రాజెక్ట్‌ను ఆపేసే పరిస్థితి తీసుకువచ్చారని భట్టి విమర్శించారు. ఐటీఐఆర్‌ప్రాజెక్టును అటకెక్కించారు... రంగారెడ్డిజిల్లాకు వరప్రదాయని అయిన ఐటీఐఆర్ ప్రాజెక్టును నాటి యుపీఏ ప్రభుత్వం 2012లో మంజూరు చేస్తే కేసీఆర్ ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసిందన్నారు. ఈ ప్రాజెక్టుకై అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం భూములు కూడా కేటాయించిందని గుర్తుచేసారు. అన్ని అనుమతులు మంజూరైనా ఐటీఐఆర్ ప్రాజెక్టును ప్రభుత్వం పట్టించుకోవడంలేని ఆగ్రహం వ్యక్తం చేసారు. హామీల విషయమై బహిరంగ చర్చకు సిద్ధమా..? ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వందశాతం పూర్తి చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లీనరిలో చెప్పుకోవడం సిగ్గుచేటని, దీనిపై దమ్ముంటే జిల్లాలోని ఏదైనా గ్రామ సభలో బహిరంగంగా చర్చిందాం.. కేసీఆర్‌కు దమ్ముంటే తన సవాలు స్వీకరించాలని భట్టి సవాలు విసిరారు. పరిశ్రమల పేరుతో భూములు తీసుకుంటున్న రైతులకు 2013 చట్టం ప్రకారం డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈసమావేశంలో ఏఐసీసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ డాక్టర్ ప్రసాద్, ఎల్డీఎంఆర్సీ రాష్ట్ర కన్వీనర్ వేణుగోపాల్, రాష్ట్ర ఎస్సీ సెల్‌ఉపాధ్యాక్షుడు ప్రీతమ్, డీసీసీ అద్యక్షుడు క్యామ మల్లేశ్, చేవెళ్ల నియోజకవర్గం ఇన్చార్జి పి. వెంకటస్వామి, జిల్లా ఎస్సీ సెల్ అద్యక్షుడు దర్శన్ ఉన్నారు. కమిటీల బలోపేతానికి ఎల్డీఎంఆర్సీ ద్వారా కృషి... గ్రామ, మండలస్థాయిలోని కమిటీలను బలోపేతం చేసేందుకు ఎల్డీఎంఆర్సీ కార్యక్రమం ద్వారా కృషి చేస్తున్నామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క అన్నారు. చేవెళ్ల మండలకేంద్రంలో శుక్రవారం ఎల్డీఎంఆర్సీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన బూత్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. చేవెళ్ల నియోజకవర్గం ఇన్చార్జి పి.వెంకటస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎల్డీఎంఆర్సీ రాష్ట్ర కన్వీనర్ వేణుగోపాల్, ఏఐసీసీసీ ఎస్సీసెల్ కన్వీనర్ డాక్టర్ ప్రసాద్, రాష్ట్ర ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు ప్రీతమ్ హాజరైనారు. ఈసందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... రాష్ట్రంలోని ఎస్సీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను గెలిపించుకునేందుకు పక్కా ప్రణాళికలతో ఏఐసీసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నాయకత్వంలో ఎల్డీఎంఆర్సీ పనిచేస్తోందన్నారు. కమిటీల వారిగా చేయాల్సిన పనులు, చేపడుతున్న కార్యక్రమాలపై అడిగి తెలుసుకున్నారు. కమిటీ సభ్యుల సందేహాలను తీర్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు దర్శన్, జిల్లాపార్టీ కార్యదర్శి గోపాల్‌రెడ్డి, పీఏసీఎస్ ఆలూరు చైర్మన్ పి.క్రిష్ణారెడ్డి, మండలపార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్లు వనం మహేందర్‌రెడ్డి, కసిరె వెంకటేశ్, మానేయ్య, ఎ–బ్లాక్ అధ్యక్షుడు పి.ప్రభాకర్, నాయకులు వీరేందర్‌రెడ్డి, జంగారెడ్డి, శేఖర్‌రెడ్డి, మాధవ్‌గౌడ్, పర్మయ్య, శ్రీనివాస్‌గౌడ్, బాలయ్య, ప్రకాశ్‌గౌడ్, ఐదు మండలాలల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
'కేసీఆర్‌ది నిజాం పాలనే'
రాష్ట్రంలో రజాకార్లు, జమీందార్ల సంస్కృతినే టీఆర్ ఎస్ కొనసాగిస్తోందని, కేసీఆర్‌ది నిజాం పాలనేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు విమర్శించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో జరిగిన కిసాన్‌మోర్చా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న భూసేకరణ చట్టంతో రైతులకు ఎలాంటి నష్టం జరగదన్నారు. కాంగ్రెస్ హయాంలో మూతపడ్డ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తిరిగి తెరిపించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. సమావేశంలో బీజేపీ నాయకులు మర్పల్లి అంజయ్య, సుగుణాకర్ రావు, గోలి మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.