మాట్లాడుతున్న ఇంద్రసేనారెడ్డి
బుగ్గారం(ధర్మపురి): తెలంగాణాకు తొలి ముఖ్య మంత్రిగా కె. చంద్రశేఖర్‌రావు పదవీబాధ్యతలు స్వీకరించడం ప్రజల దురదృష్టకరమని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లా ఇ ంద్రసేనారెడ్డి అన్నారు. స్థానిక ఎస్సారార్ గార్డెన్‌లో ఆదివారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రా నున్న ఎన్నికల్లో పార్టీని క్షేత్రస్థాయిలో ఎలా సమాయత్తం చేయాలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశా రు.
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలకు వివరించి, కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని పాంత్రాల ప్రజల సంక్షేమానికి ఏ విధంగా పాటుపడుతుందో తెలి యజేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు.
సీఎం అనాలోచిత నిర్ణయాలతో ఇబ్బందులు
సీఎం అనాలోచిత నిర్ణయాలతో అనేక మంది ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లా ఇంద్రసేనారెడ్డి అన్నారు. బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలను మభ్యపెట్టే నిర్ణయాలతో మోసంచేయడం తప్పితే ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. రైతుల కోసం కేంద్రం ఎంతో డబ్బు ఖర్చు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని సరిగ్గా వినియోగించలేకపోతుందన్నారు.
ప్రతీయేటా వ్యవసాయ సీజన్ ఆరంభంలో ప్రయాణిక తయారు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ తయారు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇష్టమొచ్చినట్లు జిల్లాలను విభజన చేయడం వల్లే అనేక సాంకేతిక, న్యాయపరమైన చిక్కులు ఏర్పడుతున్నాయని, దీనికి ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. జోన్లు అవసరం లేదని గతంలో ఉద్ఘాటించిన కేసీఆర్ ముఖ్యమంత్రి ఎలా పడితే అలా జోన్లను ఏర్పాటు చేయడానికి పూనుకుంటున్నారన్నారు.
దీంతో భవిష్యత్‌లో అనేక సమస్యలు వస్తాయని తామెప్పుడో చెప్పామని గుర్తు చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భూసర్వే తప్పుల తడకగా మారడం ఏమిటని ప్రశ్నించారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర పెంచితే రైతుల్లో ఉత్సాహం పెరిగి మరింత దిగుబడి సాధించడానికి ఉత్సాహం చూపుతారన్నారు.
సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాజోజీ భాస్కర్, రాష్ట్ర ప్రతినిధులు ముదుగంటి రవీందర్‌రెడ్డి, వుత్కూరి అశోక్, పూదెర్ల అరుణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సీపెల్లి రవీందర్, ధర్మపురి నియోజకవర్గ ఇన్‌చార్జి కన్నం అంజయ్య, నియోజకవర్గ కన్వీనర్ కొమ్ము రాంబాబు, ధర్మపురి మండల బీజేపీ అధ్యక్షుడు బండారి లక్ష్మణ్, నాయకులు పిల్లి శ్రీనివాస్, నందగిరి గిరిధర్, రంగు అశోక్, సంగెపు గంగారాం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment