రాష్ట్రంలో రజాకార్లు, జమీందార్ల సంస్కృతినే టీఆర్ ఎస్ కొనసాగిస్తోందని, కేసీఆర్ది నిజాం పాలనేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు విమర్శించారు.
ఆదివారం రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో జరిగిన కిసాన్‌మోర్చా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న భూసేకరణ చట్టంతో రైతులకు ఎలాంటి నష్టం జరగదన్నారు. కాంగ్రెస్ హయాంలో మూతపడ్డ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తిరిగి తెరిపించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. సమావేశంలో బీజేపీ నాయకులు మర్పల్లి అంజయ్య, సుగుణాకర్ రావు, గోలి మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
'కేసీఆర్ది నిజాం పాలనే'
Published Sun, Apr 5 2015 8:37 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement