muralidhar rao
-
సీఎం రేవంత్‌కు కేసీఆర్ గతే పడుతుంది
సాక్షి, ఆదిలాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేసీఆర్ గతే పడుతుందని బీజేపీ జాతీయ నాయకుడు పార్టీ మధ్యప్రదేశ్ ఇన్చార్జ్ పి.ము రళీధర్‌రావు హెచ్చరించారు. గతంలో కేసీఆర్ మాట్లాడినట్లే ఇప్పుడు రేవంత్‌రెడ్డి కూడా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి చాలా తక్కువ సమయంలోనే సీఎం పదవిని కోల్పోతారన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన బీజేపీ ఆదిలాబాద్ పార్లమెంట్ పోలింగ్ బూత్ ఎన్నికల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎం సెంటర్ అయిందని, ఇక్కడి నుంచి పంపించిన 2 వేల కోట్ల రూపాయలనే పార్టీ ప్రచారం కోసం వినియోగిస్తోందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్లో ప్రవేశించేందుకు హస్తం పార్టీకి గ్యారంటీ లేదన్నారు. బీఆర్ఎస్కు ఓటు వేస్తే పనికి రాకుండా పోతుందని చెప్పారు. దేశం నడవాలంటే స్థిరమైన, బలమైన ప్రభుత్వం ఉండాలని అందుకు మూడోసారి మోదీని ప్రధాని చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 14 సీట్లు గెలుస్తుందంటున్న సీఎం రేవంత్‌రెడ్డి ఒక వేళ గెలుచుకోకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సవాల్ విసిరారు. సీఎం రేవంత్‌రెడ్డి సెటిల్మెంట్ల కోసమే పదవిలో కూర్చున్నారని వాటికి సంబంధించి ఆధారాలతో నిరూ పిస్తానని..బహిరంగ చర్చకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పార్టీ అభ్యర్థి గోడం నగేశ్, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పాల్వాయి హరీశ్‌బాబు ఇతర నేతలు పాల్గొన్నారు. -
TS: నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నీటిపారుదల శాఖలో తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రక్షాళన చేసింది. ఇరిగేషన్ ఈఎన్సీ(జనరల్)గా ఉన్న మురళీధర్‌ను రాజీనామా చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. అలాగే రామగుండం ఈఎన్సీ, కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావును తెలంగాణ ప్రభుత్వం సర్వీస్ నుంచి తొలగించింది. ఇటీవల ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్‌ను పదవి నుంచి తొలగించాలని పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు, రిటైర్డ్ ఈఎన్సీ అధికారులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మురళీధర్.. 11 ఏండ్లకు పైగా ఎక్స్‌టెన్షన్‌పై కొనసాగుతున్నారు. 2013లో ఈఎన్సీగా మురళీధర్ రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి మురళీధర్ ఎక్స్‌టెన్షన్‌పై కొనసాగుతున్న విషయం తెలిసిందే. మాజీ సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మురళీధర్ కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైనింగ్ సహా అనేక ప్రాజెక్టులకు పని చేశారు. ఇటీవల మురళీధర్‌ను పదవి నుంచి తొలగించి.. విచారిస్తే ప్రాజెక్టుల అక్రమాలు బయటకు వస్తాయని పలు డిమాండ్లు వెల్లువెత్తాయి. -
హైదరాబాద్‌కు నాలుగున్నర శతాబ్దాల చరిత్ర
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి నాలుగున్నర శతాబ్దాల చరిత్ర ఉందని, వాణిజ్యం, వ్యాపారం, విభిన్న సంస్కృతి, సాంప్రదాయాలు, కళలకు పేరొందిందని బీజేపీ జాతీయ నాయకులు, మధ్యప్రదేశ్ ఇన్చార్జి మురళీధర్‌రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాకుంటే హైదరాబాద్ సంకనాకిపోతుందంటూ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యల పట్ల బీజేపీ జాతీయ నాయకులు, మధ్యప్రదేశ్ ఇన్చార్జి మురళీధర్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...హరీశ్ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానన్నారు. ఓటమి భయంతో ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతున్నారన్నారు. నిజాం కాలం కంటే ముందు నుంచే హైదరాబాద్ ప్రపంచ ఖ్యాతి గడించిందని, హరీశ్ అతని మామ కేసీఆర్ పుట్టకముందు నుంచి ఎన్నో రకాలుగా ఘనత సాధించిన నగరమని వివరించారు. జనరిక్ మెడిసిన్ ఉత్పత్తిలో అతి ముఖ్యమైన నగరం హైదరాబాద్ అని, ఇందులో బీఆర్ఎస్ ప్రభుత్వ పాత్ర ఏంటి అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో మాఫియా రాజ్యం పోవాలన్నా వేగంగా అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ ఓడిపోవాలన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న బీజేపీ కార్యకర్తలను జైలులో వేస్తోందని, ఇప్పటివరకు హైదరాబాద్‌లో హమాస్‌కు మద్దతుగా ర్యాలీ తీస్తుంటే బీఆర్ఎస్ మద్దతు ఇస్తోందన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. -
పరిపాలన మాతృ భాషలోనే జరగాలి
మణికొండ: దేశంలో ప్రధాన పరీక్షలను మాతృభాషలోనే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం హర్షణీయమని, పరిపాలన, న్యాయ, వైద్య, శాస్త్ర సాంకేతిక లాంటి అన్ని రంగాలలో మాతృభాషను అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం నార్సింగిలో సీనియర్ బీజేపీ నాయకుడు పి.మురళీధర్‌రావు సారధ్యంలో తెలుగు సంగమం సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మాతృభాషను చిన్నచూపు చూసే భావన పోవాలన్నారు. గతంలో ప్రపంచానికే విశ్వగురువులుగా ఉన్న మనం రాబోయే పదేళ్లలో తిరిగి పూర్వవైభవం సంతరించుకుంటామని వెంకయ్య నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. మనది దీపం వెలిగించే సంస్కృతి అని.. అదే పాశ్చాత్య దేశాల వారు వాటిని ఆర్పి ఉత్సవాలు చేసుకుంటారని వ్యాఖ్యానించారు. బీబీసీ డాక్యుమెంటరీలో ప్రధానమంత్రి మోదీ పట్ల అవమానకరంగా కథనం ప్రసారం చేయటం దేశానికే అవమానంగా భావించాలన్నారు. తాను పదవీ విరమణే చేశానని, పెదవి విరమణ చేయలేదని, రిటైర్డ్ అయ్యాను తప్ప టైర్డ్ కాలేదని ఆయన చమత్కరించారు. మన సంస్కృతి ఎంతో గొప్పది.. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని, వాటిని ప్రస్తుతం ప్రపంచమంతా ఆచరిస్తున్నారని, మనం మాత్రం వారు వదిలిపెట్టిన సంస్కృతి వెంట పడుతున్నామని హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలు అన్నారు. కేంద్ర ప్రభుత్వం మాతృభాషకు మరింత ప్రాచుర్యం కల్పించేలా ప్రధాన పరీక్షలను స్థానిక భాషల్లోనే నిర్వహించేందుకు ముందుకు రావటం మంచి పరిణామమన్నారు. కార్యక్రమంలో సినీ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు, పద్మశ్రీ డాక్టర్ శోభరాజు, డాక్టర్ ఆకేళ్ల విభీషణ శర్మ, లక్ష్మీనారాయణ, కామినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
‘జవహర్‌నగర్‌లో కర్చీఫ్ లేకుండా తిరగలేం’
సాక్షి,మేడ్చల్‌జిల్లా: డంపింగ్ యార్డు కారణంగా జవహర్ నగర్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మాటల్లో చెప్పలేమని బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్చార్జ్ మురళీధర్ రావు అన్నారు. హైదరాబాద్ నగరాన్ని న్యూయార్క్, డల్లాస్, వాషింగ్టన్, లండన్‌లా మారుస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారని, అయితే పక్కనే ఉన్న జవహర్‌నగర్ లో కర్చీఫ్ అడ్డం పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. సోమవారం దమ్మాయిగూడ ప్రజాసంగ్రామ యాత్ర సభలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ఎన్నికలు అంటే వరద సాయం అన్నారని, దుబ్బాక ఎన్నికలకు మరో పథకం, హుజురాబాద్ ఎన్నికల సమయంలో ‘దళిత బంధు’ మునుగోడు అంటే ‘గిరిజన బంధు’ పథకాలను తెరపైకి తెస్తున్నారన్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ విషయంపై గత కొంతకాలంగా బీజేపీ పోరాటం చేస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇక్కడి నుంచి డంపింగ్ యార్డును ఎత్తివేస్తామన్నారు. టీఆర్ఎస్ పాలనలో ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. కుటుంబ పాలన, అవినీతి, మాఫియా రాజ్యాన్ని అంతమొందించాలంటే బీజేపీని గెలిపించాలన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే నీతివంతమైన పాలన ప్రజలకు అందుతుందన్నారు. సభలో బీజేపీ రాష్ట్ర నేతలు చాడ సురేష్‌రెడ్డి, డాక్టర్ విజయరామారావు , మాజీఎమ్మెల్సీ దిలీప్‌కుమార్, కొల్లి మాధవి, కొంపెల్లి మోహన్‌రెడ్డి, జిల్లా నేతలు పి.హరీష్‌రెడ్డి, పటోళ్ల విక్రంరెడ్డి, జిల్లాల తిరుమల్‌రెడ్డి, అమరం మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్లో త్వరలో అసమ్మతి బాంబ్ బ్లాస్ట్: మురళీధర్‌రావు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లో అసమ్మతి బాంబ్ త్వరలోనే పేలబోతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆపార్టీ మధ్యప్రదేశ్ ఇన్చార్జి మురళీధర్‌రావు అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీఆర్ఎస్లో రాబోతున్న భూకంపం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో యుద్ధం చేస్తే ఆగదని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ యుద్ధంలో కేసీఆర్‌కు ఓటమి తథ్యమని తేలిందన్నారు. ఈడీ తలుపులు తట్టే దూరం ఎంతో లేదని పసిగట్టిన కేసీఆర్.. ముందే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే నీతి ఆయోగ్ నిరర్థకమని చెప్పి ఆ సమావేశాన్ని కేసీఆర్ బహిష్కరించారన్నారు. ఇది కూడా చదవండి: ఈసారి బీజేపీ నుంచి పోటీ తప్పదా? -
ఉద్యోగులు టీఆర్ఎస్ నేతలను ఉరికించి కొడతారు
సాక్షి, హైదరాబాద్: చదువు ఎక్కువ అయితే ఉన్న మతి పోతుందనే విషయం కేటీఆర్‌ను చూస్తే నిజం అనిపిస్తుంది. తెలంగాణ రావడంలో సుష్మాస్వరాజ్.. అరుణ్ జైట్లీ ప్రమేయం ఉందా లేదా పార్లమెంట్ ప్రొసిడింగ్స్ చూసి తెలుసుకోండి. కేటీఆర్ ఓ చిన్న పిల్లాడిలా తెలంగాణ రావడానికి టీఆర్ఎస్ బాధ్యత అని చెప్తున్నారు. ఆయన మాటలు వింటుంటే భారతదేశాన్ని అభివృద్ధి చేసింది మేమే అని బ్రిటిష్ వాడు చెప్పినట్టు ఉంది అంటూ మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్చార్జ్ మురళీధర్ రావు ఎద్దేవా చేశారు. శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశలో ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం, పీఆర్సీ నివేదికపై మండి పడ్డారు. మురళీధర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం అంటే పార్లమెంటరీ వ్యవస్థను అవమానించడమే. పార్లమెంట్ చరిత్రలో చట్టం ఆమోదించిన తర్వాత 13 సార్లు చర్చలు జరపడం.. ర్యాలీకి అనుమతివ్వడం వంటివి చేసిన ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. రిపబ్లిక్ డే నాడు చెలరేగిన హింస కాంగ్రెస్ పన్నిన కుట్రే. ఆ పార్టీ మద్దతు లేకపోతే దుండగులు ఎర్రకోట వరకు రాలేరు’ అని మురళీధర్ రావు ఆరోపించారు. రాముడిని విమర్శిస్తే కనుమరుగవుతారు ‘‘దేశవ్యాప్తంగా నడుస్తోన తీర్థా ట్రస్ట్ కార్యక్రమాలను తెలంగాణలో తప్ప ఎక్కడా.. ఎవరు అడ్డుకోలేదు. షాడో వార్ చేయడం కాదు.. కేసీఆర్ ఎమ్మెల్యేలకు బదులుగా తనే నేరుగా మాట్లాడాలి. రాముడిని విమర్శిస్తే.. కనుమరుగవడం ఖాయం. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల వారు.. పార్టీలకతీతంగా విరాళాలు ఇస్తున్నారు. కానీ తెలంగాణలో మాత్రం ముఖ్యనేతలు విమర్శిస్తున్నారు. ఈ వైఖరి సరైంది కాదు’’ అని హెచ్చరించారు. (చదవండి: సీఎం పీఠంపై కేటీఆర్ ఖాయమే!) ఉద్యోగుల కడుపు కొట్టాలని చూస్తున్నారు ‘‘కేసీఆర్ ప్రభుత్వం పెరాలసిస్ గవర్నమెంట్. పీఆర్సీ రెండేళ్లు ఆలస్యంగా ఇచ్చింది. అది కూడా దేశంలోకెల్లా అత్యంత తక్కువ. గతంలో 1974లో అప్పటి ప్రభుత్వం 5శాతం ఫిట్మెంట్ ఇచ్చింది. అప్పటినుంచి ఇప్పటి వరకు ఇంత తక్కువ ఏ రాష్ట్రం ఇవ్వలేదు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి.. ఉద్యోగుల కడుపుకొట్టాలని చూస్తున్నారు. కరోనా వల్ల ఇంటి అద్దెలు ఏమైనా తగ్గాయా. ప్రభుత్వ వైఖరి ఇలానే కొనసాగితే.. ఉద్యోగులు టీఆర్ఎస్ నేతలను చెప్పులు లేకుండా ఉరికించి కొడతారు. ఉద్యోగులకు గ్రాట్యూటి కేంద్రం ప్రభుత్వంతో సమానంగా ఇవ్వాలి. రాష్ట్రంలో ఓ వైపు నిరుద్యోగం.. మరోవైపు కాంట్రాక్టర్ల దోపిడి పెరిగిపోతుంది. దీనికి చరమ గీతం పాడాలి’’ అన్నారు మురళీధర్ రావు. (చదవండి: ఫిట్మెంట్ 7.5%.. అంత తక్కువైతే.. మాకొద్దు) ‘‘తెలంగాణలో రాజకీయ ప్రత్యర్థి.. వ్యతిరేకి టీఆర్ఎస్నే. బీజేపీ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటెసే వారు బీజేపీకే వేస్తున్నారు. టీఆర్ఎస్ను కొట్టేది బీజేపీనే అని ప్రజలు డిసైడ్ అయ్యారు. పార్టీలు వాటికవే గ్రేట్ కాదు.. సిద్దాంతాలు.. పోరాటాలు ద్వారానే ప్రజలు గెలిపిస్తారు.తిట్టిన కొద్ది పెరిగేది బీజేపీ పార్టీ. ఎవరికి భయపడి పార్టీ కాదు. ప్రాణాలకు భయపడకండా పోరాటం చేసిన చరిత్ర తెలంగాణలో ఒక్క బీజేపీకే ఉంది’’ అన్నారు మురళీధర్ రావు. -
ఆయన దారి.. జాతీయ రహదారి
ఎక్కడి అరదలి.. ఎక్కడి ఢిల్లీ. ఎక్కడి కుగ్రామం.. ఎక్కడి రాజధాని నగరం! కాలినడకకు ఆనాడు మామూలు బాట కూడా లేని వెనుకబడిన వాతావరణం నుంచి.. నిరాశాజనక నేపథ్యం నుంచి ఇంత దూరం ప్రయాణం అంటే.. నేడు అత్యున్నత స్థాయి పదవీ పురస్కారమంటే.. అదో అద్భుతం కాదూ.! అదో అసాధారణం కాదూ! నీకూ నాకూ అది అసాధ్యమేమో. కానీ తనకు మాత్రం అది సాధ్యమని ఒక్కడు నిరూపించాడు. నడిచే సంకల్పమే ఉంటే ఎంతదూరమైనా.. ఎంత దుర్భరమైనా.. మంచినీళ్ల ప్రాయమని మన హైవే మీద నిలబడి మరీ ప్రపంచానికి చాటి చెప్పాడు. అతి సామాన్య పరిస్థితుల నుంచి వచ్చిన అతడు ఆత్మస్థైర్యంతో అత్యున్నత స్థాయికి ఎదిగాడు. తానే ఓ శిఖరమై నిలిచాడు. అతడే బుగత మురళీధరరావు. కుగ్రామం నుంచి వచ్చి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయిని అందుకున్న ఆ సంకల్ప ధీరుడి విజయాన్ని వర్ణించాలంటే నిజంగా మాటలు రావు. పేరు బుగత మురళీధరరావు. కొలువు ఎన్హెచ్ఏఐలో చీఫ్ జనరల్ మేనేజర్. స్వస్థలం పాలకొండ మండలం అరదలి గ్రామం... ఈ సాధారణ పరిచయం ఆయనకు సరిపోదు. మట్టి దారుల్లో నడుస్తూ అత్యున్నత శిఖరాలను పాదం కింద ఉంచుకోవచ్చని తెలిపే ఆయన ప్రయాణం అందరికీ తెలియాలి. జీరో నుంచి నడక మొదలుపెట్టి హీరోగా పరుగులు పెడుతున్న ప్రస్థానం అంతా తెలుసుకోవాలి. తండ్రికి ఉద్యోగం పోయి, అన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితుల నుంచి ఆయన ఎదిగిన వైనం స్ఫూర్తి రగిలించాలి. రోడ్డే లేని ఊరిలో చదివిన రోజుల నుంచి రహదారుల శాఖలో అత్యున్నత పదవి అధిరోహించే వరకు ఆయన సాగించిన విజయ విహారాన్ని ఓ బ్లాక్‌బస్టర్ సినిమాను తెరపై చూసినంత ఇష్టంగా ఆస్వాదించాలి. – సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం కుగ్రామం నుంచి.. పాలకొండ మండలం అరదలి గ్రామం జిల్లా వాసులకే తెలీని ఓ చిన్న పల్లెటూరు. పాలకొండకు దాదాపు 5 కిలోమీటర్లలో ఉంటుంది. బొబ్బిలి ఇనాం గ్రామం. 1987 వరకు ఈ ఊరికి రోడ్డు కూడా లేదు. ఆ ఊరిలో పుట్టి అక్కడే చదువుకున్న మురళీధర్ ఇప్పుడు జాతీయ రహదారుల శాఖలో చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగారు. ఉత్తర భారతీయుల ఆధిపత్యం ఉండే ఈ శాఖలో ఫైనాన్స్ విభాగానికి చీఫ్ జనరల్ మేనేజర్‌గా ఢిల్లీలో గురువారం బాధ్యతలు స్వీకరించడం గొప్ప విశేషం. ఈ విజయం వెనుక ఓ కథ దాగి ఉంది. ఆ కథ తెలియాలంటే ముందు మురళీ తండ్రి గురించి తెలియాలి. మురళీధర్ తండ్రి జోగినాయుడు అరదలి గ్రామ కరణంగా పనిచేశారు. 1987లో గ్రామ ఉద్యోగుల వ్యవస్థను ఎన్టీఆర్ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత ఉన్న కరణం ఉద్యోగం పోయింది. కుటుంబ పోషణ కష్టంగా మారింది. పెద్ద కొడుకు కృష్ణారావు విశాఖపట్నంలో ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తుండేవారు. కుటుంబమంతా ఆశలన్నీ పెద్ద కొడుకుపైనే పెట్టుకుంది. అప్పటికి మురళీ ఇంకా చిన్న పిల్లాడే. ఇలాంటి సమయంలో కృష్ణారావు వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటి నుంచి జోగినాయుడుకు పరీక్ష కాలం మొదలైంది. కష్టకాలం.. ఉద్యోగం పోయింది. పెద్ద కొడుకు దూరమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా మానసికంగా కుంగిపోతారు. కానీ జోగినాయుడు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ముందుకు సాగారు. అరదలిలోనే నాగవంశం వీధిలో కిరాణ దుకాణం ప్రారంభించారు. మిగిలిన దుకాణాలతో పోటీపడలేక నష్టపోయారు. చివరికి కన్న ఊరును, ఉన్న ఇంటిని విడిచిపెట్టి పాలకొండ వలసపోయారు. మంచి కరణంగా పేరున్న జోగినాయుడు తన కలాన్నే నమ్ముకున్నారు. ఆ కలంతోనే పిల్లలను ప్రభుత్వ బడుల్లోనైనా చదివించారు. నాన్న కష్టం గమనించి.. సొంత గ్రామంలో ఐదో తరగతి వరకు, పాలకొండలోని ప్రభుత్వ పాఠశాలలో కొన్నేళ్లు చదివిన మురళీధర్ నాన్న కష్టాన్ని కళ్లారా చూశారు. చదువులో ఎప్పుడూ వెనకబడలేదు. బీటెక్‌లో సీటు రావడం ఆయన జీవితం మేలిమలుపు. అదే ఊపులో ఎంఈ కూడా చేశారు. సింగరేణిలో ఇంజినీర్ ఉద్యో గం వచ్చింది. దాదాపు 30 ఏళ్లు సింగరేణిలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. అక్కడితో ఆగిపోతే ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకం ఎందుకవుతుంది. అన్నేళ్లు పనిచేశాక కూడా మురళీధర్ విద్యా దాహం తీరలేదు. మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలనే ధ్యేయం పెట్టుకున్నాడు. జాతీయ స్థాయి అధికారికి కావాల్సిన అర్హత కోసం ఐసీడబ్ల్యూఏ పరీక్ష రాశారు. దేశంలో 48వ ర్యాంకు వచ్చింది. ఆయనకు గల అర్హతలను, సింగరేణికి చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల శాఖకు తీసుకొచ్చింది. లక్షా 30వేల కోట్ల బడ్జెట్ గల విభాగం అది. ఫైనాన్స్ విభాగానికి జనరల్ మేనేజర్‌గా వెళ్లిన మురళీధర్ తన నిబద్ధతను, నిజాయితీ సేవలను నిరూపించుకున్నారు. కేంద్ర రహదారులు, ఉపరితల రవాణా శాఖ మంత్రిత్వ విభాగం ఆయనను చీఫ్ జనరల్ మేనేజర్‌గా ప్రమోట్ చేసి అదే ఫైనాన్స్ విభాగానికి అధిపతిని చేసింది. కృషి ఉంటే.. కృషి, నిబద్ధత, ధ్యేయం ఉంటే మనిషి ఏ స్థాయికైనా చేరగలడని ‘ఫోన్’లో సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ మురళీధర్ అన్నారు. డబ్బు కంటే చదువు గొప్పదనే సత్యం అందరికీ తెలియాలన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు దీన్ని గుర్తించాలన్నారు. ఢిల్లీలో తాను ఉన్నా తన పల్లె అరదలిని మరచిపోలేనని చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు గతం కన్నా మేలు చేయడానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి తన కోసం పడిన కష్టాన్ని గుర్తు చేసుకున్నారు. ఇదే సమయంలో మురళీధర్‌ను గుర్తు చేసుకున్న బాల్య మిత్రుల్లో నల్లి ధర్మారావు ఒకరు. మురళీతో బాల్య స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ తనతో వీధుల్లో, పొలాల్లో తిరిగిన మిత్రుడు ఈ స్థాయికి చేరడం తనకు ఎంతో గర్వంగా ఉందని రాష్ట్ర జర్నలిస్టు యూనియన్ నాయకుడు నల్లి ధర్మారావు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మురళీ ఈ స్థాయికి చేరడం చాలా ఆనందంగా ఉందని, ఊరి పేరును ఢిల్లీ స్థాయిలో నిలబెట్టడం గర్వకారణమని ధర్మారావు తండ్రి, గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన 94 ఏళ్ల కృష్ణంనాయుడు చెప్పారు. నాగవంశ కార్పొరేషన్ డైరెక్టర్ నల్లి శివప్రసాద్ మాట్లాడుతూ ఏ స్థాయికి చేరినా అహంలేని మనిషి, మూలాలు మరచిపోలేని నిరాడంబరుడని ఆనందం వ్యక్తం చేశారు. -
రామ్ మాధవ్, మురళీధర్‌రావుకు ప్రమోషన్?
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ గత ఆదివారం జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యులను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి డీకే అరుణ, దగ్గుబాటి పురందేశ్వరి, సత్యకుమార్‌కు చోటు కల్పించింది. డీకే అరుణకు జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి దక్కగా.. ఏపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, సత్యకుమార్‌కు కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవులు లభించాయి. అయితే, ఇన్నాళ్లు జాతీయ కార్యదర్శులుగా ఉన్న తెలుగు రాష్ట్రాల సీనియర్ నేతలు రామ్ మాధవ్, మురళీధర్‌రావును పక్కన పెట్టేయడంపై ఇంటా బయటా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ముందు నుంచీ పార్టీకీ విధేయులుగా సేవలు చేస్తున్నవారిని ఎందుకు దూరం పెట్టారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. (చదవండి: ఆపరేషన్ 2023) మరోవైపు రామ్ మాధవ్, మురళీధర్‌రావుకు ప్రధాని మోదీ కేబినెట్లో మంత్రులుగా అవకాశం ఇవ్వనున్నట్టు కొన్ని వార్తలు ప్రచారమవుతున్నాయి. అందుకనే జాతీయ కార్యదర్శులుగా తప్పించానేది ఆ వార్తల సారాంశం. అంతర్జాతీయ వ్యవహారాలపై పట్టు ఉన్న రామ్ మాధవ్‌కు విదేశాంగ శాఖ, వ్యాపార వ్యవహారాల్లో అనుభవం ఉన్న మురళీధర్ రావుకు వాణిజ్య శాఖలు కేటాయిస్తారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీకి చాలా కాలంగా సేవలు చేస్తున్న ఈ ఇద్దరికీ కీలక పదవులు దక్కడం ఖాయమని కొందరు బీజేపీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. కాగా, తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌కు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్ష పదవి లభించడం విశేషం. (చదవండి: నడ్డా టీంలో పురందేశ్వరి, డీకే అరుణ) -
‘గుడి కూలింది.. నీవు కూలతావు’
సాక్షి, హైదరాబాద్: సచివాలయం ఎందుకు కూలుస్తున్నాడో అర్థం కావడం లేదు.. నల్లపోచమ్మ గుడి కూల్చినందుకు ప్రజలు ఈ ప్రభుత్వానికి దినం పెడతారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడి కూలింది అంటే నీవు కూలతావు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కరోనా నేపథ్యంలో ఇతర పార్టీ నాయకలు ఐదు రోజులు కనిపిస్తే.. వారం రోజులు కనిపించడం లేదు. కానీ బీజేపీ నేతలు.. కార్యకర్తలు మాత్రమే నిరంతరం పేదలకు సేవ చేస్తున్నారు. కేంద్రం చేస్తున్న కార్యక్రమాలను తాను చేసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు సీఎం కేసీఆర్. దేవుడు ఇచ్చిన దానికి పూజారి చెప్పుకున్నట్టు వ్యవహరిస్తున్నారు. సొమ్మొకడిది సొకొకడిది అన్నట్లు ఉంది కేసీఆర్ తీరు’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో డెడికేటెడ్ ఆసుపత్రులు సరిగా లేవు. బెడ్స్ ఏర్పాటు చేయలేదు. కరోనా నేపథ్యంలో ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలు తీవ్రంగా భయపడుతున్నారు. తుపాకీ పేల్చినట్టు మాట్లాడి పోయే ముఖ్యమంత్రితో తెలంగాణ అభివృద్ధి జరగదు. ఎందుకు మాయమైపోతున్నాడని అడిగితే అరెస్ట్‌లు చేస్తున్నారు. కానీ బీజేపీ మిమ్మల్ని ఎదిరించి.. ప్రశ్నిస్తుంది. టీఆర్ఎస్ లాగా కమీషన్.. కాంగ్రెస్‌లాగా కాంట్రాక్టుల పార్టీ కాదు బీజేపీ. ప్రభుత్వం చేస్తున్నది అరెస్ట్‌లు కాదు కిడ్నాప్‌లు. టీఆర్ఎస్ పార్టీ దిగిపోయే రోజు దగ్గర పడింది. మోదీ కంటే ముందు ఉన్న ప్రభుత్వంలో అన్ని స్కాంలే.. మా ప్రభుత్వం వచ్చాక అవినీతి.. స్కాంలకు ఆస్కారం లేదు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అయోధ్య.. 370 ఆర్టికల్.. త్రిపుల్ తలాక్ సమస్యలు పరిష్కారం అయ్యాయి. తెలంగాణకు 60ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ చేయలేని సాయం 6 ఏళ్ళలో మోదీ సర్కార్ చేసింది’ అని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘దేశ సగటు కంటే అదనంగా తెలంగాణకు జాతీయ రహదారులు మంజూరు చేసింది కేంద్రం. కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి వంగి వంగి దండాలు పెట్టి ఇక్కడికి వచ్చి విమర్శలు చేస్తాడు. గతంలో పటేల్ ముందు నిజాం వంగి దండాలు పెట్టి ఆ తరువాత రజాకార్లను ఎగదోసినట్టు వ్యవహరిస్తున్నాడు కేసీఆర్. విద్యుత్ గ్రిడ్లను అనుసంధానం చేసి రాష్ట్రంలో 24గంటల కరెంట్ ఇస్తోంది కేంద్రం. విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులు వేగవంతం చేసింది. కేసీఆర్ మాయల మరాఠిలా వ్యవహరిస్తున్నాడు. మోదీని విమర్శించే అర్హత కేసీఆర్‌కు లేదు. తెలంగాణలో బీజేపీకి ఉజ్వల భవిష్యత్ ఉంది. కాంగ్రెస్ డీఎన్ఏ ఇప్పుడు టీఆర్ఎస్కు పట్టింది. కరోనా తెలంగాణ కాదు బంగారు తెలంగాణ కావాలంటే అది బీజేపీతోనే సాధ్యం’ అని మురళీధర్ రావు స్పష్టం చేశారు. -
లాక్డౌన్ ఎప్పుడు ఎత్తివేసేదీ చెప్పలేం
సాక్షి, హైదరాబాద్: మే 3 తర్వాత లాక్డౌన్ ఎత్తివేస్తారో లేదో ఇప్పుడే చెప్పలేమని, అప్పటి పరిస్థితిని బట్టి కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు అన్ని రాష్ట్రాలు ఐక్యంగా పోరాడుతున్నాయని, రాజకీయాలకు అతీతంగా అందరూ కేంద్రానికి సహకరిస్తున్నారని పేర్కొన్నారు. గురువారం మీడియాతో వర్చువల్ చిట్‌చాట్‌లో మాట్లాడారు. దేశంలో మరో ఏడాది వరకు పబ్లిక్ మీటింగ్‌లు ఉండకపోవచ్చన్నారు. శుక్రవారం దేశంలోని అన్ని గ్రామాల సర్పంచులతో, శనివారం ఆర్థికవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ మాట్లాడతారని చెప్పారు. చదవండి: సగానికిపైగా సేఫ్! తెలంగాణలో మరో 27 కేసులు -
ముగిసిన ఆర్ఎస్ఎస్ సమావేశాలు
-
దుర్జనులకు భయం సజ్జనులకు ప్రేమ
సాక్షి, రంగారెడ్డి జిల్లా/ఇబ్రహీంపట్నం రూరల్: ‘మన శక్తిని చూస్తే దుర్జనులకు భయం కలుగుతోంది. సమాజ శ్రేయస్సు కోరే సజ్జనుల్లో ప్రేమ పుడుతుంది’అని ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్ అన్నారు. సమాజంలో దేశ భక్తి పెంపొందించేలా పని చేయాలని కరసేవకు లకు పిలుపు నిచ్చారు. రంగారెడ్డి జిల్లా ఆది భట్ల మున్సి పాలిటీ పరిధిలోని మంగళ్ పల్లి వద్ద భారత్ ఇంజనీరింగ్ కాలేజీలో మూడు రోజులుగా జరుగుతున్న ఆర్ఎస్ఎస్ విజయ సంకల్ప శిబిరం ముగింపు కార్యక్రమం గురు వారం జరిగింది. ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మాట్లా డుతూ.. సంఘ కార్య విస్తరణకు సమాజం పట్ల ప్రేమ, శ్రమించే తత్వమే ప్రధాన సాధనాలని పేర్కొన్నారు. ప్రవర్తన, భాష, సమాజహితం కోరే ఆలోచ నలు స్వయం సేవకులకు ముఖ్యమని, వాటి ని తెలియజేసే విధానం కార్య విస్తర ణలో కీలకమని, వీటిని ఎప్పుడూ విస్మరించ కూడ దని చెప్పారు. శిబిరం, సార్వజనికోత్స వం ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసిం చారు. ఇదే స్ఫూర్తితో స్వయం సేవకులు తమ కార్య క్షేత్రాల్లో పని చేయాలని ఆకాంక్షించారు. నేను చీఫ్‌ను కాదు..: ‘బయట నన్ను అందరూ ఆర్ఎస్ఎస్ చీఫ్ అంటున్నారు. నేను మీకు చీఫ్‌ను కాదు. మీరు నియమించుకున్న వ్యక్తిని’అని మోహన్ భాగవత్ పేర్కొన్నారు. దండాలు పెట్టడం, దండలు వేయడం, ఫొటో ఫ్లెక్సీలు పెట్టడం హిందూ సమాజ సంస్కృతి కాదని చెప్పారు. ఇతర సంఘాలకు, ఆర్ఎస్ఎస్కు తేడా ఉందని, మనకంటూ ప్రత్యేకత ఉండాలన్నారు. ఇక్కడ నేర్చుకున్న విషయాలతో సమాజాన్ని జాగృతం చేయాలని, హిందు సమాజ నిర్మాణానికి కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అఖిల భారతీయ సహసర్ కార్యవాహ్ ముకుందా, దక్షిణ మధ్య క్షేత్ర సంఘ చాలక్ నాగరాజు, తెలంగాణ ప్రాంత సంఘ చాలక్ బూర్ల దక్షిణామూర్తి, క్షేత్ర ప్రచారక్ ఆలే శ్యామ్‌కుమార్, దూసి రామకృష్ణతో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రులు డీకే ఆరుణ, విజయ రామారావు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ పాల్గొన్నారు. కార్యకర్తలతో కలసి భోజనం.. మోహన్ భాగవత్‌తో పాటు బీజేపీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, మాజీ మంత్రులకు కూడా ఒకే రకమైన భోజనం వడ్డించారు. అందరూ సాధారణ కార్యకర్తలతో కలిసే భోజనం చేశారు. ఆహార పదార్థాలు వృథా కాకుండా ప్రతి ఒక్కరు భుజించడం ప్రత్యేకంగా కన్పించింది. కాగా, శిబిరం ముగింపు కార్యక్రమం వేదికపై మోహన్ భాగవత్‌తో పాటు దక్షిణ మధ్య క్షేత్ర సంఘ్‌చాలక్ నాగరాజు, తెలంగాణ ప్రాంత సంఘ్ చాలక్ దక్షిణామూర్తి ఉన్నారు. అయితే మోహన్ భాగవత్ ఒక్కరే ప్రసంగించారు. క్రమశిక్షణకు మారుపేరుగా.. మూడు రోజుల పాటు భారత్ కళాశాలలో సంఘ్ కార్యకర్తలు వసతి పొందారు. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన 7,940 స్వయం సేవకులు, మరో వెయ్యి మంది ప్రబంధకులు కలసిమెలసి ఉన్నారు. శిబిరం ముగియడంతో వారంతా తమ ప్రాంతాలకు తిరుగు పయనమయ్యారు. ఈ ప్రాంగణంలో జరిగిన అన్ని కార్యక్రమాలకు హాజరయ్యేందుకు చక్కటి నడవడిక, సమయ పాలన పాటించడాన్ని చూసి ఆహూతులు మంత్రముగ్ధులయ్యారు. విజయ సంకల్ప శిబిరంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు -
'రాష్ట్రంలో టీఆర్ఎస్సే మా ప్రధాన రాజకీయ శత్రువు'
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో తమ ప్రధాన రాజకీయ శత్రువు టీఆర్ఎస్ పార్టీనేనని, టీఆర్ఎస్తో యుద్ధం నడుస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియా చిట్‌చాట్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇక కోలుకునే పరిస్థితి లేదని, ఆ స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తుందన్నారు. దక్షిణాదిలో పాత రాజకీయాలు పోయి కొత్త రాజకీయాలు రాబోతున్నాయన్నారు. ఆర్టీసీ విషయంలో ప్రజలు, కార్మికుల దృష్టిలో కేసీఆర్ ఓడిపోయారన్నారు. టీఆర్ఎస్కు ఓవైసీ భూతం పట్టిందని, అందుకే పౌరసత్వ సవరణ బిల్‌ను ఆ పార్టీ వ్యతిరేకించిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్నారా? అన్న విలేకరుల ప్రశ్నకు సమాధానం దాటవేస్తూ, ఆ ఎన్నికకు ఇంకా టైం ఉందన్నారు. కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు కృషి చేసినందుకు పార్టీ నేతలు మురళీధరరావును సన్మానించారు. -
‘ఒకే దేశం ఒకే జెండా బీజేపీ నినాదం’
ప్రశాంత్‌నగర్ (సిద్దిపేట): ఒకే దేశం, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం అనేదే బీజేపీ లక్ష్యం అని ఈ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. దీనిలో భాగంగానే దేశంలో ఒకే రాజ్యాంగం అమల్లోకి తీసుకువచ్చిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. మంగళవారం సిద్దిపేటలో నేషనల్ యూనిటీ క్యాంపెయిన్‌లో భాగంగా నిర్వహించిన జన జాగారణం సమావేశంలో ఆర్టికల్ 370, 35(ఏ) రద్దుపై చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మురళీధర్‌రావు హాజరై మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం చరిత్రాత్మకమైందని, దీనివల్ల 70 ఏళ్లుగా కశ్మీర్లో ఉన్న ఆంక్షాలను మోదీ ఒక్క నిర్ణయంతో రద్దు చేశారన్నారు. ఈ ఆర్టికల్ వల్ల కశ్మీర్‌లోని మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలు, లదాఖ్‌లు రిజర్వేషన్లు పొందలేకపోయారని, మహిళలు తమ ఆస్తి హక్కు, ఓటు హక్కును కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. నెహ్రూ దేశ భక్తుడే, స్వాతంత్రం కోసం పోరాడిన నాయకుడే కానీ, దేశ విభజనకు ముఖ్య కారణం ఆయనే అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి విముక్తి కావాలి..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పటాన్‌చెరులోని ఎస్వీఆర్ గార్డెన్లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి ప్రహ్లద్ జోషి, హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీజేపీకి భయపడే కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేశారని, తీసేస్తామని అనుకున్న మంత్రులను కూడా తీయలేదని విమర్శించారు. రాష్ట్రంలో విమోచన దినోత్సవాన్ని ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదని ప్రశ్నించారు. హైకోర్టు మొట్టికాయ వేసినా కేసీఆర్‌కు బుద్ది రాలేదని మండిపడ్డారు. మజ్లిస్ దాయ దక్షిణ్యాల మీద టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తోందని, బంగారు తెలంగాణను కేసీఆర్ బూడిద తెలంగాణగా, అప్పుల తెలంగాణగా మార్చారని లక్ష్మణ్ ఆరోపించారు. కారు.. సారు.. బారు.. ఇది రజాకార్ల సర్కారు అని ఎద్దేవా లక్ష్మణ్ చేశారు. అప్పనంగా కల్వకుంట్ల కుటుంబం అధికారం అనుభవిస్తోందని, ఈ కుటుంబం నుంచి రాష్టానికి విముక్తి కావాలని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని లక్ష్మణ్ సూచించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ మజ్లిస్ చేతిలో కీలుబొమ్మగా మారిందని, రాష్ట్రంలో పరోక్షంగా ఎంఐఎం పార్టీనే పాలిస్తుందని ఆరోపించారు. నిజాం అడుగు జాడల్లో సీఎం కేసీఆర్ నడుస్తున్నారని, రజాకార్ల వారసత్వమే మజ్లిస్‌దని దుయ్యబట్టారు. తెలంగాణ విమోచన దినోత్సవ ఉత్సవాలు జరగాలంటే బీజేపీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పతనానికి ఈ విమోచన దినోత్సవ వేడుకలే ఆరంభమని కిషన్‌రెడ్డి తెలిపారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయ పార్టీ అని, కేంద్ర పథకాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం సహాకారం అందిచడం లేదని పేర్కొన్నారు. కేసీఆర్ ఎన్ని మంత్రివర్గ విస్తరణలు చేసినా టీఆర్ఎస్ పునాదులు కదలడం ఖాయమన్నారు. రాష్ట్రంలో త్రివర్ణ పతాకం ఎగరవేయడానికి ఎవరి అనుమతి అవసరం లేదని, ప్రభుత్వ కార్యాలయాలపై జెండా ఎగురవేయాల్సిందేనని తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలు,శ్రేణులు అధిక సంఖ్యలో హాజరైయ్యారు -
‘అలా అనుకుంటే ఆశాభంగం తప్పదు’
సాక్షి, విశాఖపట్నం: ఆర్టికల్ 370 రద్దు చారిత్రక నిర్ణయం అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు.విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..370 రద్దుతో బడుగువర్గాల ప్రజలే ఎక్కువగా లబ్ధిపొందారని వెల్లడించారు. రాజకీయాలను కుటుంబ రాజకీయాలుగా కాంగ్రెస్ మార్చేసిందని విమర్శించారు. దేశాభివృద్ధి, ఐక్యత విషయంలో బీజేపీ ఏ మాత్రం లాలూచీ పడదని స్పష్టం చేశారు. బీజేపీలో చేరినవారు కేసుల నుంచి రక్షింపబడతారని అనుకుంటే వారికి ఆశాభంగం తప్పదని మురళీధర్‌రావు పేర్కొన్నారు. -
ప్రభుత్వ యంత్రాంగానికి పార్టీకి సంబంధం లేదు
-
‘అది హిందూ వర్సెస్ ముస్లిం సమస్యకాదు’
సాక్షి, విశాఖపట్నం : అధికరణ 370 రద్దు హిందూ వర్సెస్ ముస్లిం సమస్య కాదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. ప్రజల కిచ్చిన హామీగా 370 అధికరణను రద్దు చేయడం చారిత్రక నిర్ణయమన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ అధికరణ 370 తాత్కాలికమైనది. కాంగ్రెస్ పార్టీ 370 అధికరణను శాశ్వత చట్టం కింద అమలు చేసింది. సామాజిక న్యాయం గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ.. కశ్మీర్లో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ అమలు చేయలేదు. రిజర్వేషన్ల అమలు విషయంపై కాంగ్రెస్ మాట్లాడ్డం లేదు. అధికరణ 370ని అమలు చేసి.. రిజర్వేషన్లు అమలు చేయకుండా కశ్మీర్ ప్రజలకు అన్యాయం చేసింది. 370 అధికరణ కారణంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీతో పాటు ఇతర వర్గాల ప్రజల హక్కులకు అన్యాయం జరిగింది. 370 అధికరణ తొలగించిన తర్వాత బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఎక్కువగా లబ్ది పొందారు. ఏ పార్టీలైతే రోహింగ్యాల కోసం పోరాటం చేస్తున్నాయో వారు కశ్మీర్ ప్రజల హక్కుల కోసం ఎందుకు పనిచేయడం లేదు. కాంగ్రెస్ పార్టీ దేశంలోని రాజకీయాలను కుటుంబ రాజకీయాలుగా మార్చేసింది. అది ఓ వైరస్లాగా పలు రాష్ట్రాలకు వ్యాపించింది. బీజేపీ దేశ అభివృద్ధి, ఐక్యత కోసం రాజకీయాల్లో ఏ మాత్రం లాలూచీ పడదు. అమిత్‌షా ఆదేశాల ప్రకారం 400 సభలు, 2000 మంది ప్రముఖులను కలసి 370 అధికరణ రద్దును గురించి చెప్పబోతున్నాం. వైఫల్యాలను ఎత్తి చూపే విషయంలో ఏపీలో బీజేపీ ప్రతిపక్షంగా పనిచేస్తుంది. ప్రభుత్వం చేసే పనులకు రాజకీయాలను అపాదించవద్దు. బీజేపీలో చేరే వారికి కేసులనుంచి రక్షణ ఉంటుందనునుకునే వారికి ఆశాభంగం కలుగుతుంది. బీజేపీకి అతిపెద్ద ప్రతిపక్ష చరిత్ర ఉంది. బీజేపీ బలంగా ఉన్నంత కాలం దేశంలో కుటుంబ రాజకీయాలు నడపడం అసాధ్య’’మని స్పష్టం చేశారు. -
‘ఏపీలో టీడీపీకి భవిష్యత్తు లేదు’
సాక్షి, న్యూఢిల్లీ : చంద్రబాబు తనయుడిపై పార్టీ నేతలకు, కార్యకర్తలకు నమ్మకం లేదని అందుకే టీడీపీ నేతలు పార్టీని వీడి వెళ్లిపోతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు మునుపటిలాగా ఉండటం లేదని, ఏపీలో టీడీపీకి ఇక భవిష్యత్తు లేదని వ్యాఖ్యనించారు. గత ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికి తీయవద్దని తాము అనడం లేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడంలో విఫలమయ్యిందని, క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం కనిపించడం లేదని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికీ అందుబాటులో లేకపోవడం ఆ పార్టీకి పెద్ద బలహీనతనని, రాబోయే రోజుల్లో టీఆర్ఎస్కు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితి తమకు సవాల్‌గా మారిందని, ఈ సవాల్‌ను త్వరలోనే అధిగమిస్తామని హామీ ఇచ్చారు. కశ్మీర్లో కొత్త నాయకత్వం తయారు కాబోతుందని, కశ్మీర్ పరిస్థితి రోజురోజుకు మెరగవుతుందని మురళీధర్ పేర్కొన్నారు. -
‘ఏపీ నేతలు చాలా మంది టచ్‌లో ఉన్నారు’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే బీజేపీ బలపడుతుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. త్వరలోనే ఏపీలో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించబోతుందని జోస్యం చెప్పారు. ఏపీ నేతలు చాలామంది టచ్‌లో ఉన్నారని, వారంతా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో చిచ్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా మురళీధర్‌రావు మాట్లాడుతూ... తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీయే తమ మొదటి టార్గెట్ అన్నారు. టీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ము ఒక బీజేపీకే ఉందన్నారు. తెలంగాణ బీజేపీ ప్రస్తుతం రెండు పొలిటికల్ చాలెంజ్‌లు న్నాయని, ఒకటి బీజేపీపై ప్రజలకు విశ్వాసం కల్పించడం, రెండోది రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఉన్న 29శాతం ఓట్లను బీజేపీకి మళ్లించడం అని మురళీధర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎదుర్కొనే దమ్ము తమ పార్టీ దగ్గర ఉన్నప్పుడే కాంగ్రెస్ ఓటు బ్యాంకు తమ పార్టీకి మల్లుతుందన్నారు. గవర్నర్‌తో రాజకీయం చేస్తే తమ పార్టీకే నష్టం జరుగుతుందన్నారు. ఏపీలో కులం కార్డు పనిచేస్తుందని, తెలంగాణలో అది పనిచేయదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్ఎస్కు వ్యతిరేక విధానమే బీజేపీ కొనసాగిస్తుందని మురళీధర్‌రావు స్పష్టం చేశారు. ఆర్టికల్370 రద్దు ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకు దేశవ్యాప్తంగా 400 సభలు పెడతామని వెల్లడించారు.అందులో తెలంగాణలో నియోజవర్గానికి ఒకటి చొప్పున 17 సభలు నిర్వహిస్తామని ప్రకటించారు. -
బిగ్‌షాక్; బీజేపీలోకి టీడీపీ, జనసేన నేతలు
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ నుంచి బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు నాయకులు గురువారం బీజేపీలో చేరారు. మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి (నంద్యాల), పసుపులేటి సుధాకర్ (కావలి జనసేన నుంచి పోటీ చేసిన అభ్యర్థి), కంచర్ల హరిప్రసాద్ (రిటైర్డ్ ఇన్కమ్ టాక్స్ కమిషనర్), డి. వెంకయ్య (టీడీపీ చిత్తూరు ఓబీసీ సెల్ సెక్రెటరీ), సి. చంద్రప్ప(బిసి వెల్ఫేర్ అసోషియేషన్ ప్రెసిడెంట్- శ్రీకాళహస్తి) షేక్ నిజాముద్దీన్, మాజహర్ భేగ్ కమలం పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్షీనారాయణ వీరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మురళీధర్‌రావు మాట్లాడుతూ... ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే సదుద్దేశంతో ఇతర పార్టీ నుంచి నాయకులు బీజేపీలో చేరుతున్నారని అన్నారు. ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ఇతర పార్టీ నేతలు బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా చేరికలను ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించారు. -
మురళీధర్‌రావుపై హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మురళీధర్‌రావు, ఆయన అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ప్రవర్ణరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనకు కేంద్రంలో నామినేటెడ్ పోస్టు ఇస్తామని మురళీధర్‌రావు పీఏ కిషోర్, కారా చైర్మన్ మందా రామచంద్రారెడ్డి రూ. 3 కోట్లు తీసుకున్నారని పిటిషనర్ ఆరోపించారు. ఆ తర్వాత నామినేటెడ్ పోస్టు ఇవ్వకుండా మోసం చేశారని తెలిపారు. దీనిపై తాను సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని.. నాలుగు నెలలు గడుస్తున్నా పోలీసులు నిందితులను అరెస్ట్ చేయలేదని కోర్టుకు తెలిపారు. ప్రవర్ణరెడ్డి పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. కేసు దర్యాప్తులో ఎందకు జాప్యం వహించారని పోలీసులను ప్రశ్నించింది. అయితే నాలుగు వారాల్లోగా నిందితులపై చార్జ్‌షీట్ దాఖలు చేస్తామని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. -
వారంతా బీజేపీ వైపు చూస్తున్నారు
సాక్షి, మహబూబ్‌నగర్ : తెలంగాణలో ముప్పైఆరు లక్షల మందిని సభ్యులుగా చేర్చడమే లక్ష్యంగా సాగుతామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు స్పష్టం చేశారు. సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశ రాజకీయ చరిత్రలో బీజేపీ మాత్రమే నిరంతర ప్రజా భాగస్వామ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తోందని తెలిపారు. టీఆర్ఎస్ను ప్రణాళికబద్ధంగా ఎదుర్కొనే పార్టీ బీజీపీనే అన్నారు. తమ పార్టీ అన్ని కులాల, వర్గాల పార్టీ అన్నారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాడలనుకునేవారు బీజేపీ వైపు చూస్తున్నారని మురళీధర్ రావు తెలిపారు. పేదలందరికి ఇల్లు.. ప్రతి ఇంటికి కరెంట్, టాయిలెట్ కల్పించడమే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు మురళీధర్ రావు. 2022 నాటికి రక్షిత నీరు లేని కుటుంబం ఉండకూడదనేది మోదీ ఆకాంక్ష అన్నారు. రానున్న ఐదేళ్లలో రోడ్ల కోసం రూ. 100 లక్షల కోట్లు, రైల్వే లైన్ల కోసం రూ. 50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశం లేదని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతిపక్షంగా ఫెయిల్ అయిన కాంగ్రెస్ పార్టీ.. చివరకూ టీఆర్ఎస్ జేబు పార్టీగా మారిందని ఆరోపించారు. తెలంగాణ, ఏపీలకు కేంద్రం చేసింది శూన్యం అంటున్నారు.. మరి ఏడు శాతం జీడీపీ ఎలా సాధ్యమయ్యిందని మురళీధర్ రావు ప్రశ్నించారు. తెలంగాణలో ఇంతవరకూ ఒక్క ఇంటికైనా పేదలకు తాళం చెవి ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. రైతులకు ఫసల్ బీమా యోజన ఎందుకు అమలు చేయడం లేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రగతి రిపోర్టుపై చర్చకు తాము సిద్ధమన్నారు మురళీధర్ రావు. -
కర్ణాటక సంక్షోభంపై స్పందించిన మురళీధర్‌రావు
-
కర్ణాటక సంక్షోభంపై స్పందించిన మురళీధర్‌రావు
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక ప్రభుత్వంలో సంక్షోభానికి తమ పార్టీ కారణం కాదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు స్పష్టం చేశారు. అయితే కర్ణాటకలోని రాజకీయ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. అవసరమైన సందర్భంలో సరైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఆదివారం ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాల్ని ప్రస్తావించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నిర్ణయాలే కర్ణాటకలో సంక్షోభానికి కారణమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేదని అన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాతో కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో పడిందని వ్యాఖ్యానించారు. దీనిపై తర్వలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్టు తెలిపారు. గవర్నర్, కోర్టు అన్ని విషయాలు గమనిస్తున్నాయని అన్నారు. అంతర్గత కుమ్ములాటలు, బ్లాక్మెయిల్ రాజకీయాలతో సాగే ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగదని ముందే చెప్పానని అన్నారు. అవకాశవాదంతో రాత్రికి రాత్రే కాంగ్రెస్, జేడీఎస్‌లు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని విమర్శించారు. ఈ అవకాశవాద పొత్తును ప్రజలు తిరస్కరించారని తెలిపారు. వీలైనంత త్వరగా కర్ణాటక సంక్షోభం ముగించాలని కోరుకుంటున్నామని చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి ప్రజలు ఆశలను, ఆకాంక్షలను నెరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. -
బీజేపీ అంటే రాహుల్‌కు భయం: మురళీధర్‌రావు
సాక్షి, సంగారెడ్డి: దేశమంతా భారతీయ జనతాపార్టీ వైపు చూస్తోందని, తమ పార్టీని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని చూసి రాహుల్ గాంధీకి భయం పట్టుకున్నదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో శనివారం ‘సంస్థాగత పథం–సభ్యత్వ నమోదు–2019 సన్నాహక కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మురళీధర్‌రావు మాట్లాడుతూ..స్వాతంత్య్రం వచ్చిన తరువాత వరుసగా రెండోసారి కాంగ్రెసేత ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిందన్నారు. భారతీయ జనతా పార్టీ గతంలో ఎన్నడూలేని విధంగా సంస్థాగతంగా బలపడుతోందని చెప్పారు. దీంతో పార్టీ ఎదుగుదల, ప్రధాని నరేంద్ర మోదీకి వస్తున్న ఆదరణ చూసి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్న రాహుల్ గాంధీ ఆ పదవిని వదులుకుంటున్నారని అన్నారు. కొన్ని పార్టీలు కులాలు, మతాలపేరుతో నడుస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఒక్క బీజేపీయే కార్యకర్తలు నడిపించే సిద్ధాంతం గల పార్టీ అని పేర్కొన్నారు. జనసంఘ్ పేరుతో ప్రారంభమైన బీజేపీ అంచెలంచెలుగా ఎదిగి వరుసగా రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చే ఉన్నత స్థానానికి ఎదిగిందన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనన్నారు. ఆపార్టీ నిజాం, రజాకార్ల వారసులకు తొత్తుగా మారిందన్నారు. చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని టీఆర్ఎస్ కోరుతున్న విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన, ఆయుష్మాన్, ప్రధానమంత్రి ఆవాస్‌యోజన తదితర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేయడంలేదని ఆరోపించారు. కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పటిష్టంగా సభ్యత్వ నమోదు చేయించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీని ఆపడం ఎవరితరం కాదు
సాక్షి, సంగారెడ్డి : స్వాతంత్రానంతరం ఇందిరాగాంధీ హయాం తర్వాత రెండవసారి పూర్తి మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చిన ఘనత బీజేపీకే దక్కుతుందని బీజేపీ అధికార ప్రతినిధి మురళీధర్‌రావు పేర్కొన్నారు. దేశంలోనే అన్ని పార్టీల కంటే బీజేపీ భిన్నమైనదని ఆయన పేర్కొన్నారు. చాలా పార్టీలు తమ కుటుంబం,కులం లేదా వ్యక్తుల కోసమే పనిచేస్తాయని , మా పార్టీ కార్యకర్తలు మాత్రం దేశం కోసం పని చేస్తారని పేర్కొన్నారు. అంతర్గతంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించలేని పార్టీలు బహిరంగంగా రక్షిస్తాయి అనడం కేవలం నినాదమేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీని ఆపడం ఎవరి తరం కాదని , భవిష్యతులో టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా మా పార్టీయే నిలుస్తుందని మురళీధర్ రావు ధీమా వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ హీరో కాదు జీరో' అని విమర్శించారు. కేంద్రంలో ఫసల్ భీమా యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు అమల్లో ఉన్నా తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం వీటిని ఇంత వరకు ప్రవేశపెట్టలేదని తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధులను టీఆర్ఎస్ పక్కదారి పట్టిస్తుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బ్యాటరీ లేని పార్టీ అని, దానికి చార్జింగ్ అయిపోయిందని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ 17 రాష్ట్రాలలో నామరూపాళ్లు లేకుండా పోయిందని వెల్లడించారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. -
హాయ్‌ల్యాండ్‌లో బీజేపీ నేతల సమావేశం
సాక్షి, గుంటూరు : మంగళగిరి హాయ్‌ల్యాండ్‌లో శనివారం ఏపీ బీజేపీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఇతర పార్టీల నుంచి వచ్చే సుమారు 75 మంది కీలక నేతల చేరికపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ, పురందరేశ్వరి, జీవీఎల్, వి మురళీదరన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత మురళీధర్ రావు మాట్లాడుతూ.. భారత్ మాతా కీ జై అనే పలికి.. దేశం కోసం పని చేసే కార్యకర్తలున్న ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెసేతర ప్రభుత్వం.. ఇందిరా గాంధీ తరహా పూర్తి స్థాయి మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చిన పార్టీ బీజేపీ అని మురళీధర్ రావు పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీని ఆపడం ఎవరి తరం కాదన్నారు మురళీధర్ రావు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ బీజేపీ మాత్రమే అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదు.. ఇక టీఆర్ఎస్ను వ్యతిరేకించే వారికి బీజేపీనే ప్రత్యామ్నాయం అన్నారు. బీజేపీకి 11 కోట్ల మందితో సభ్యత్వం ఉందని.. ప్రపంచంలో ఏ పార్టీకి ఇంత భారీ సభ్యత్వం లేదన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు తేడా లేదని.. రెండూ కాళ్లు పట్టుకునే పార్టీలే అని విమర్శంచారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్యకర్తలు పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు వచ్చే నెల జూలై 6 నుంచి ఆగస్టు11 వరకూ సంఘటనా పర్వత్ పేరుతో సభ్యత్వ నమోదు ఉంటుందన్నారు. -
‘అందుకే కొత్త సచివాలయం కడుతున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ పాత సచివాలయాన్ని కూలగొట్టి కొత్త సచివాలయాన్ని కడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఆరోపించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రూ. 600 కోట్ల విలువైన సచివాలయాన్ని కూలగొట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. సచివాలయానికే రాని సీఎం కేసీఆర్‌కు కొత్త సచివాలయం ఎందుకు అని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన 16మంది సీఎంలు రూ. 69వేల కోట్లు అప్పు చేస్తే.. కేసీఆర్ ఏకంగా దాన్ని లక్షా 80వేల కోట్లకు తీసుకెళ్లారని ఆరోపించారు. తెలంగాణలో ప్రతి వ్యక్తి మీద రూ. 40వేలు అప్పు ఉందన్నారు. సీఎం కేసీఆర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్తో కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు. అవినీతి కేసులు ఉన్న వారికి బీజేపీలో ఎటువంటి రక్షణ లేదన్నారు. బీజేపీలో చేరని వారు పార్టీ నియమాలను తగ్గట్టుగా వ్యవహరించాలని మురళీధర్‌రావు స్పష్టం చేశారు. -
తెలంగాణ బీజేపీలోకి భారీ చేరికలు
సాక్షి, ఢిల్లీ: బీజేపీ తెలంగాణలో పట్టు బిగిస్తోంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలుపొంది.. అందరినీ ఆశ్చర్యపరిచిన కమలం పార్టీ.. తాజాగా రాష్ట్రంలో పార్టీ బలోపేతం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికల్ని ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పలువురు టీడీపీ, కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. టీడీపీ నేతలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి, బోడ జనార్దన్, మాజీ ఎంపీ చాడ సురేశ్‌రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పటోళ్ల శశిధర్ రెడ్డి, పీసీసీ మైనారిటీ నేత షేక్ రహమతుల్లా గురువారం బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు నాయకులకు కమలం కండువా కప్పి.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. -
బీజేపీలో చేరికకు టీడీపీ నేతల ఆసక్తి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు వెల్లడించారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమి కోలుకునేది కాదని, ఇకపై గెలుపు దిశగా పయనించే అవకాశాలు ఆ పార్టీకి లేవని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఫలితాలు రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ మార్పునకు నాంది పలకబోతున్నాయని చెప్పారు. మరోవైపు వరుసగా రెండోసారి మోదీ గెలుపు తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుల చూపు బీజేపీపై పడిందన్నారు. బీజేపీ వల్లే తమ రాజకీయ భవిష్యత్ ఉంటుందని తమతో వ్యక్తిగతంగా జరుగుతున్న చర్చల్లో పలువురు టీడీపీ, కాంగ్రెస్ నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని వివరించారు. అలాంటి వారందరూ రానున్న రోజుల్లో బీజేపీలో చేరే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణలో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అని ఒక స్పష్టత వచ్చిందని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఆ పరిస్థితి ముందుముందు వస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి పట్ల బీజేపీ ఎలాంటి భేదాభిప్రాయాలు చూపదని.. రాష్ట్ర ప్రజలు కోరుకునేది ఇవ్వకపోయినా, ఆ ప్రయోజనాలను ఇతరత్రా ఏ రూపంలో ఇవ్వవచ్చో ఆ మేరకు ఇస్తామన్నారు. కాగా అంతకు ముందు హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఆయనకు పలువురు బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. జూలై 6 నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు దేశ వ్యాప్తంగా చేపట్టబోతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రత్యేక దృష్టితో మొదలు పెట్టాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి జూలై 6న శ్రీకారం చుట్టనున్నారు. ఈసారి పార్టీ సభ్యత్వ నమోదులో పశ్చిమబెంగాల్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌పై పార్టీ ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. డిసెంబరు నాటికి కొత్త అధ్యక్ష ఎన్నిక పూర్తి పార్టీ సభ్యత్వ నమోదు సమయంలో పార్టీ సంస్థాగత ఎన్నికలను కూడా పూర్తి చేసుకోవాలని జాతీయ నాయకత్వం నిర్ణయించింది. బూత్ స్థాయి నుంచి అధ్యక్ష ఎన్నికలను మొదలు పెట్టి జాతీయ అధ్యక్షుడి ఎన్నిక వరకు డిసెంబరు నెలాఖరకే పూర్తి చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
‘మెజారిటీ రాదన్నారు..కానీ అబద్ధమని తేలింది’
ఢిల్లీ: ప్రతిపక్ష కూటమిలోని అసమ్మతి తమకు ప్రయోజనకరంగా మారిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు వ్యాఖ్యానించారు. ఢిల్లీలో సాక్షిటీవీతో మురళీధర్ రావు మాట్లాడుతూ..లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 300 సీట్లు రావడం ఖాయమన్నారు. 2014 ఎన్నికల్లో మోదీకి మెజారిటీ రాదన్నారు..కానీ అది అబద్ధమని తేలిందని గుర్తు చేశారు. ఈసారి కూడా మోదీ తిరుగులేని మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. దేశమంతా మోదీ పేరు మారుమోగుతుందని పేర్కొన్నారు. సామాజిక సమీకరణాల కాంబినేషన్‌ను మోదీ ఫ్యాక్టర్ అధిగమించిందని వ్యాక్యానించారు. దేశంలో ఎక్కడా కూడా మోదీకి వ్యతిరేకత లేదని చెప్పారు. బీజేపీని మించి మోదీకి పాపులారిటీ వచ్చిందన్న విమర్శల్లో అర్ధం లేదన్నారు. బిడ్డను చూసి తల్లి గర్వపడినట్లుగా.. మోదీని చూసి బీజేపీ గర్విస్తుందని కొనియాడారు. మోదీకి ప్రజాదరణ పెరగడం బీజేపీలో అభద్రత పెంచదని చెప్పారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో రాజస్తాన్‌లోనూ మంచి సీట్లు సాధిస్తామని పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ శాశ్వతంగా నాశనం చేశారని విమర్శించారు. సిద్ధరామయ్య, మల్లికార్జున ఖర్గే తమ సొంత సీట్లకే పరిమితం కావాలసి వచ్చిందని చెప్పారు. కర్ణాటకలో గతం కంటే ఎక్కువ సీట్లను గెలుచుకుని తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు 110 సీట్లు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ అధికారంలోకి వస్తున్నారని ప్రముఖ సర్వే సంస్థలు అన్నీ చెబుతున్నాయని గుర్తు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 110 సీట్లు వచ్చే అవకాశముందన్నారు. చంద్రబాబు నాయుడు మైక్రో మేనేజ్మెంట్ వల్ల కనీసం పోటీలో నిలబడగలిగారని చెప్పారు. చంద్రబాబుకు ఎన్డీఏ ద్వారాలు శాశ్వతంగా మూసివేశామని అమిత్ షా బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయనను తిరిగి ఎన్డీయే కూటమిలోకి తీసుకునే అవకాశమే లేదన్నారు. అలాగే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం లేదన్నారు. మోదీ, అమిత్ షా కాంబినేషన్లో బీజేపీ ఎన్నికల నిర్వహణలో మరింత పదును తేలిందన్నారు. 2014 నుంచి వరసగా అనేక రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడం సాధారణ విషయం కాదన్నారు. జాతీయత, అభివృద్ధి, సంక్షేమ పరిపాలన మోదీ త్రిశూల విధానమన్నారు. కులాలకు అతీతంగా ఈ విధానాలకు జనం బ్రహ్మరథం పడుతున్నారని పొగిడారు. గత సార్వత్రిక ఎన్నికల కంటే ఈసారి అత్యధిక సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. తెలంగాణాలో టీఆర్ఎస్ వ్యతిరేకత శూన్యతను బీజేపీ పూరిస్తుందన్నారు. తెలంగాణలో 5 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఏపీ తెలంగాణాల్లో జరిగే నష్టాన్ని తమిళనాడుతో భర్తీ చేస్తామన్నారు. కర్ణాటకలో సిద్ధరామయ్యను రాహుల్ గాంధీ ఇంట్లో కూర్చోబెట్టడం ద్వారా బీజేపీకి బాగా లబ్ధి చేకూరిందని వ్యాఖ్యానించారు. -
లక్ష్మణ్ అరెస్ట్.. నిమ్స్‌కు తరలింపు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.. పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి నిమ్స్‌కు తరలించారు. విద్యార్థులకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆపేది లేదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఆస్పత్రిలోనే దీక్షను కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడం పట్ల ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ విద్యార్థులకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా లక్ష్మణ్ దీక్ష చేపట్టారని తెలిపారు. శాంతియుత వాతావరణంలో దీక్ష చేస్తున్న లక్ష్మణ్‌ని అరెస్ట్ చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు. పోలీసుల తీరుకు నిరసనగా మంగళవారం అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద నిరసన చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రగతి భవన్ ముట్టడితో సహా రేపటి అన్ని కార్యక్రమాలు యధాతథంగా కొనసాగుతాయని మురళీధర్ రావు స్పష్టం చేశారు. -
‘బారు, బీరు సర్కారు కావాలా?’
సాక్షి, కరీంనగర్ : దేశంలో 50 మంది దాకా ప్రధానమంత్రులు కావాలని కలలు కంటున్నారని, వారంతా వారానికొకరు ప్రధానిగా ఉండాలనుకుంటున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. విజయ సంకల్ప సభలో మురళీధర్ రావు మాట్లాడుతూ.. ప్రధానితో అత్యవసర సమావేశం ఉన్నందున కరీంనగర్ సభకు రాలేకపోతున్నానని అమిత్‌షా ఫోన్ చేశారని అన్నారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడుందని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ మాత్రమే దేశంలో మిగిలిన ఏకైక జాతీయ పార్టీ అని అన్నారు. నరేంద్రమోదీ మాత్రమే స్థిరమైన ప్రభుత్వాన్ని నడిపించగలరని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ నుంచి సంజయ్, పెద్దపల్లి నుంచి కుమార్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ చరిష్మా తట్టుకోలేక కేసీఆర్ ముందస్తుకు వెళ్లారని అన్నారు. యువరాజు పట్టాభిషేకానికి కేసీఆర్ గిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధిజీవులు కర్రుకాల్చి కేసీఆర్‌కు వాత పెట్టారని అన్నారు. కేసీఆర్ నిజమైన హిందూ కాదనీ, షేర్వాణి వేసుకున్న మరో ఓవైసీవని అన్నారు. కేసీఆర్ చేసిన యాగాలన్నీ తన స్వార్థం కోసమే చేశారన్నారు. కొండగట్టులో 60మంది బస్సు ప్రమాదంలో చనిపోతే.. పరామర్శించేందుకు రాని కేసీఆర్ హిందువెట్లా అవుతువాని ప్రశ్నించారు. శ్రీరామ కళ్యాణానికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు మనవడితో పంపిస్తావా అని నిలదీశారు. అసదుద్దిన్ చంకలో దూరి మోదీని తిట్టడం మైనార్టీ ఓట్ల కోసం కాదా అంటూ దుయ్యబట్టారు. పుల్వామాలో జవాన్లు చనిపోయినప్పుడు ఉగ్రవాద స్థావరాలపై మన సైనికులు దాడిచేస్తే కేసీఆర్ అవమానించేవిధంగా మాట్లాడరని విమర్శించారు. కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు 11సార్లు జరిగినవి సర్జికల్ స్ట్రైక్‌లు కాదని.. ప్రజలు స్ట్రైక్ చేశారని ఎద్దేవాచేశారు. ఫెడరల్ ఫ్రంట్ ఫ్యామిలీ ఫ్రంట్.. దాని టెంట్ కూలిపోయిందన్నారు. తెలంగాణ దాటితే.. కేసీఆర్ చెల్లని రూపాయి వంటివాడని విమర్శించారు. తెలంగాణను బారు, బీరుగా మార్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బారు, బీరు సర్కారు కావాలా? అంటూ ప్రశ్నిస్తూ.. ఫామ్‌హౌస్ పాలన కావాలనుకునే వాళ్లు టీఆర్ఎస్కు ఓటేయండని అన్నారు. కేటీఆర్.. ఢిల్లీ మెడలు వంచడం అంటే.. మీ బావ హరీష్ మెడలు వంచినంత సులభం కాదని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక కేసీఆర్ అవినీతి, కుటుంబపాలనపై భరతం పడతామన్నారు. -
రఫేల్: కాగ్ నివేదికతో మరోసారి రుజువైంది!
సాక్షి, హైదరాబాద్: రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీతోపాటు విపక్షాలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని కాగ్ నివేదిక తేలిపోయిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. రాజకీయ అవసరాల కోసమే రఫేల్ వ్యవహారంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినట్టు కాగ్ నివేదికతో ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు సరైనదేనని కాగ్ నివేదికతో మరోసారి రుజువైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన దళారి వ్యవస్థను అంతం చేసి మోదీ సర్కారు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ఇది రెండు ప్రభుత్వాల (భారత్-ఫ్రాన్స్) మధ్య జరిగిన ఒప్పందం ఇదని చెప్పారు. రఫేల్ వ్యవహారంపై విపక్షాల దుష్ప్రచారాన్ని, కాంగ్రెస్ పార్టీ దివాలాకోరుతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే.. అభ్యర్థుల ఎంపికతోపాటు పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తామన్నారు. -
‘మజ్లిస్‌ను చూస్తే కేసీఆర్‌కు వణుకు’
ఖిలా వరంగల్: మజ్లిస్ పార్టీ నాయకులను చూస్తే కేసీఆర్ వెన్నులో వణుకు పుడుతోందని, వారి ఆలోచనలనే టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా తూర్పు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కుసుమ సతీష్‌తో కలసి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలను మోసం చేసేందుకు మాయా కూటమి తయారైందని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ నాలుగేళ్ల పాలనలో ధనవంతులే లాభపడ్డారని, పేద, మధ్య తరగతి ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కేసీఆర్‌ను గద్దె దింపితేనే అన్ని వర్గాలకు సంక్షేమం జరుగుతుందని చెప్పారు. -
చంద్రబాబు జోక్యంలేని రాష్ట్రం కావాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో చంద్రబాబు జోక్యం లేని రాజకీయాలు ఉండాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. కూటమి పొత్తుల పేరుతో తెలంగాణకు మరోసారి చంద్రగ్రహణం పట్టే పరిస్థితి వచ్చిందని ప్రజలు దానిని తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకే తెలంగాణ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బరిలోకి దిగుతున్నామని స్పష్టం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే తమకు నాంది అని తెలిపారు. అందుకే రాష్ట్రంలో వందకు పైగా బీజేపీ బహిరంగ సభలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యతిరేకులకు కోవర్టుగా మారిందని ఆరోపించారు. చంద్రబాబు ముక్త్ తెలంగాణ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలను బాబు నిర్దేశించాలనుకుంటున్నారని, చంద్రబాబు ముక్త్ తెలంగాణ కావాలని మురళీధర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆయన నిర్దేశించే రాజకీయాలు నడవకూడదని అందుకు బీజేపీనే ప్రత్యామ్నాయమన్నారు. టీడీపీని తెలంగాణ ధోఖా పార్టీగా అభివర్ణించారు. తెలంగాణ అభివృద్ధికి, ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు రాసిన లేఖలపై చర్చలు జరగాలని, వాటిపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. -
‘చంద్రబాబు ముక్త్ తెలంగాణ కావాలి’
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది విస్తరణకు, 2019 లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే బీజేపీకి నాంది అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయడు, మహాకూటమిపై ఆయన నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యతిరేకులకు కోవర్టుగా మారిందన్నారు. టీడీపీ తెలంగాణ ధోఖా పార్టీ అంటూ అభివర్ణించారు. తెలంగాణ అభివృద్దికి, ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు రాసిన లేఖలపై చర్చలు జరగాలని, వాటిపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకా మురళీధర్ రావు ఏమన్నారంటే ఆయన మాటల్లోనే ఒంటరిగా ఎదుర్కోలేకనే కూటమి ‘తెలంగాణలో చంద్ర గ్రహణం రాకూడదు. ఫలితాలను చంద్రబాబు నిర్దేశించాలనుకుంటారు. కానీ తెలంగాణలో ఆయన నిర్దేశించే రాజకీయాలు రావు, రాకూడదు. చంద్రబాబు ముక్త్ తెలంగాణ కావాలి, చంద్రబాబు లేని రాజకీయాలు మాత్రమే ఉండాలి. తెలంగాణ ప్రజలను ఒంటిరిగా ఎదుర్కోలేకనే కాంగ్రెస్ మహా కూటమి తయారు చేసింది. కాంగ్రెస్ నేతలను బెంగళూరు, ఢిల్లీలో కలిసిన చంద్రబాబు.. తెలంగాణలో నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో వారితో ఎందుకు పాల్గొనడం లేదు. నరేంద్ర మోదీ సర్కార్ తెలంగాణకు ఇచ్చిన నిధులను ప్రజలకు వివరిస్తాము. తెలంగాణలో మోదీ, అమిత్ షా విస్తృతంగా పర్యటన చేస్తారు. జాతీయ ముఖ్య నేతలతో వందకు పైగా సభలు నిర్వహిస్తున్నాము. గిరిజన రిజర్వేషన్లు ఇవ్వలేకనే.. మత ఆధారిత రిజర్వేషన్లకు బీజేపీ ఎప్పటికీ వ్యతిరేకమే. నిజాం గులాంగిరిని, ఖాసీం రజ్వీ రాజకీయాలను బీజేపీ వ్యతిరేకిస్తోంది. టీఆర్ఎస్ గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వలేకే ముస్లింలతో ముడిపెడుతున్నారు. దేశంలో జరిగే ఎన్నికలు కుటంబ రాజకీయాలకు, జాతీయవాద రాజకీయాలకు మధ్య జరిగే పోరాటం. రాజస్తాన్‌లో కాంగ్రెస్ నాయకులు భారత్ మాతాకు జై అనొద్దు, సోనియా గాంధీకి జై అనాలన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అర్థమవుతోంది దేశమంటే కాంగ్రెస్‌కు ఎంత అభిమానమో’ అంటూ మురళీధర్ రావు కాంగ్రెస్, టీడీపీలప ధ్వజమెత్తారు. -
కొల్లాపూర్‌లో అభివృద్ది సాగాలంటే బీజేపీకి ఓటు వెయ్యాలి
-
ప్రచారానికి మోదీ, అమిత్ షా, యోగి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ అభ్యర్థులకు మద్దతుగా బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అదిత్యానాథ్‌లు ఎన్నికల ప్రచారానికి హాజరు కానున్నారు. వీరితో పాటు బీజేపీ జాతీయ నాయకులు, కేంద్రమంత్రులు కూడా త్వరలో ప్రచారంలో పాల్గొంటారని బీజేపీ నేత మరళీధర్‌రావు శుక్రవారం ఓ సమావేశంలో ప్రకటించారు. మహాకూటమి మహాకుంపటిలా తయారైందని ఎద్దేవా చేశారు. ఎఐఎం ఫెవికాల్ పార్టీ టీఆర్ఎస్ అని, రెండు పార్టీలు కుమ్మకై ఎన్నికలకు వెళ్లాయని ఆరోపించారు. కుటుంబ రాజకీయాలను దూరంగా ఉంచే పార్టీ బీజేపీ ఒక్కటేనని ఆయన వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్‌కు ఓటేస్తే ‘చంద్ర’ గ్రహణమే
సాక్షి, సిద్దిపేట/వనపర్తి: రాష్ట్రంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే అధికారం.. చంద్రబాబు చేతిలోకి వెళ్తుందని, తెలంగాణకు చంద్రగ్రహణం పడుతుందని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు విమర్శించారు. సోమవారం సిద్దిపేట బీజేపీ అభ్యర్థి నరోత్తంరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బూత్ కమిటీల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ఎన్నికల్లో 21 మంది కాంగ్రెస్, 15 మంది టీడీపీ, ఐదుగురు బీజేపీ అభ్యర్థులను ప్రజలు గెలిపించారని వీరిలో ఒక్క బీజేపీ మినహా మిగిలిన పార్టీల్లోని అత్యధిక మంది టీఆర్ఎస్కు అమ్ముడు పోయారని విమర్శించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన నాయకులకు ఓటడిగే హక్కు లేదని అన్నారు. ప్రజలు ఐదు సంవత్సరాలు పరిపాలించమని అధికారం చేతికిస్తే చేతకాక ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని, దీంతో ప్రభుత్వంపై వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని అన్నారు. అందులో భాగంగా సాధారణ కుటుంబం నుండి వచ్చిన నరేంద్ర మోదీకి ప్రధానమంత్రి పదవి అప్పగించారని అన్నారు. కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. ఈ నాలుగు సంవత్సరాల్లో విచ్చల విడిగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి ఎక్సైజ్ ఆదాయాన్ని ఆరింతలు పెంచారని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బంగారు తెలంగాణ చేయడం రాదని.. తాగుబోతుల తెలంగాణ మాత్రం చేస్తాడని రుజువైందని విమర్శించారు. అమరావతి నుంచి పాలన.. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే పాలన హైదరాబాద్ నుంచి కాకుండా అమరావతి నుంచి సాగుతుందని.. చంద్రబాబు అక్కడి నుంచే రిమోట్ ద్వారా పాలన నడిపిస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఎద్దేవా చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో పార్టీ అభ్యర్థి కొత్త అమరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన బూత్ కార్యకర్తల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. భావసారూప్యత లేని కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ వంటి పార్టీల నాయకులు కూటమిని ఏర్పాటు చేసి అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. అది మహాకూటమి కాదని.. మహా కుంపటి అని అభివర్ణించారు. రాహుల్ గాంధీ నాయకుడిగా ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీకి గెలుపు సాధ్యం కాదని.. ఇది దేశంలో జరిగిన అనేక ఎన్నికల్లో రుజువైందని మురళీధర్‌రావు అన్నారు. -
‘కాంగ్రెస్‌కు ఓటేస్తే చంద్రగ్రహణం వస్తుంది’
సాక్షి, సిద్దిపేట : తెలంగాణలో నిజమైన ప్రజాస్వామ్యం కావాలంటే తమ పార్టీని గెలిపించారలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. సోమవారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన పార్టీ బూత్‌కమిటీ సమావేశంలోఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీధర్ రావు మాట్లాడుతూ.. యాభై ఏళ్లు పాలించిన కాంగ్రెస్, ఐదేళ్లు పాలించిన టీఆర్ఎస్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఎక్కడ డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించలేదన్నారు. బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ తాగుబోతు తెలంగాణగా మర్చారని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే తెలంగాణలో చంద్రగ్రహణం వస్తుందన్నారు. గత ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కు అమ్ముడుపోయారని, కానీ బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా అమ్ముడుపోలేదని గుర్తు చేశారు. ఈ సారి కాంగ్రెస్, టీడీపీని గెలిపిస్తే మళ్లీ టీఆర్ఎస్కు అమ్ముడుపోతారన్నారు. టీఆర్ఎస్ ఓటమి సిద్దిపేట నుంచే మొదలవుతుందన్నారు. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి నాయిని నరోత్తంరెడ్డిని భారీ మెజారిటితో గెలిపించాలని కోరారు. -
కాంగ్రెస్, టీఆర్ఎస్ల డీఎన్ఏ ఒక్కటే
జహీరాబాద్: కాంగ్రెస్, టీఆర్ఎస్ల డీఎన్ఏ ఒక్కటే అని, ఆ రెండూ కుటుంబ పార్టీలే అయినందున వాటిని ఓడించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి గోపి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. నెహ్రూ నుంచి రాహుల్ వరకు కాంగ్రెస్‌లో కుటుంబ పాలనే సాగుతోందని, టీఆర్ఎస్లో సైతం ఇదే పరిస్థితి ఉందన్నారు. ఈ రెండు పార్టీలను ఓడించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీలో కులం, మతం ఉండదు.. చాయ్ అమ్ముకునే వ్యక్తిని ప్రధాన మంత్రిని చేసిన ఘనత ఒక్క బీజేపీకే సాధ్యమైందని మురళీధర్‌రావు అన్నారు. తమ పార్టీలో కులం, మతం ఉండదని తెలిపారు. టీఆర్ఎస్ చేతకాని పార్టీ అని, అందుకే ముందస్తుకు వెళ్లిందన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్లను ఓడించి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని, తమ పార్టీ అభ్యర్థి గోపిని గెలిపించాలని కోరారు. బంగారు తెలంగాణ ఏమో కాని తాగుబోతుల తెలంగాణగా సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని మార్చారన్నా రు. టీఆర్ఎస్ పార్టీ మజ్లిస్‌కు తొత్తుగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ గెలిస్తే పరోక్షంగా టీడీపీయే ప్రభుత్వాన్ని ఏలుతుందన్నారు. సమావేశంలో బీజేపీ అభ్యర్థి గోపి తదితరులు పాల్గొన్నారు. -
‘భగత్‌సింగ్ కలలుగన్న సుపరిపాలన అందిస్తున్నాం’
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ యువమోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహిస్తోన్న జాతీయ యువ సమ్మేళనాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... యువ శక్తి ఎక్కువగా ఉన్న ఏకైక దేశం కేవలం భారత్ మాత్రమేనని అన్నారు. దేశాభివృద్ధి లో యువతను భాగస్వామి చేసి మోదీ సర్కారు.. భగత్ సింగ్ కలలు కన్న సుపరిపాలనను అందిస్తోందన్నారు. విశ్వంలో దేశం పేరు నిలబెట్టిన స్వామి వివేకానంద కూడా యువకుడేనని.. అందుకే ఆయన యూత్ ఐకాన్ అయ్యారని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ పూర్తి మెజార్టీ పొందిన బీజేపీ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే నినాదంతో ముందుకు సాగుతున్న బీజేపీ అన్ని వర్గాలకు సమన్యాయం అందించేందుకు కృషి చేస్తుందని వ్యాఖ్యానించారు. ఇంకా మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే భారత్ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉందని రాజ్‌నాథ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి జాతి హితం కన్నా రాజకీయ హితమే ముఖ్యమని అందుకే ప్రజలకు మంచి జరుగుతుంటే వారు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందన్నారు. మోదీని, బీజేపీని ఓడించడమే తప్ప విపక్షాలకు దేశ అభివృద్ధి ఎజెండా లేదని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్‌తో జట్టుకట్టే పార్టీ లు తర్వాత.. మీటూ.. ఉద్యమం చేయాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. 2019లో భారత్ విశ్వగురువుగా అవతరించాలంటే.. 350 సీట్లు గెలిచేంత వరకు కార్యకర్తలు నిద్ర పోవద్దని పిలుపునిచ్చారు. కాగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు, ఎంపీ పూనమ్ మహాజన్, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు తదితరులు హాజరయ్యారు. వీరితో పాటు అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 40 వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ‘విజయ్‌లక్ష్య 2019 యువ మహా ఆదివిశేషణ్’ పేరుతో ఈ సమ్మేళనం రెండు రోజుల పాటు కొనసాగనుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ సమ్మేళనం హైదరాబాద్‌లో నిర్వహిస్తుండటంతో రాజకీయంగా కూడా ప్రాధాన్యం ఏర్పడింది. తెలంగాణలో సమ్మేళనం నిర్వహించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపవచ్చని, ముఖ్యంగా యువతను పార్టీ వైపు ఎక్కువగా ఆకర్షించవచ్చని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే రేపు(ఆదివారం) జరుగునున్న యువభేరీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరుకానున్నారు. -
తెలంగాణలో బీజేపీదే అధికారం: పరిపూర్ణానంద
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ కురుక్షేత్రం ప్రారంభం అయిందని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని స్వామి పరిపూర్ణానంద పేర్కొన్నారు. అమిత్‌షా నేతృత్వంలో ఇటీవల బీజేపీలో చేరిన పరిపూర్ణానంద తొలిసారిగా రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి వచ్చారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన అనంతరం ర్యాలీగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం ఆయన పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ దత్తాత్రేయ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఇతర నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. దేశాన్ని, ధర్మాన్ని బీజేపీ కాపాడుతున్నందుకే తాను బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. అలాగే కులాలకు, కుటుంబ వారసత్వానికి తావులేకుండా బీజేపీ పని చేస్తోం దన్నారు. మిషన్ 70 పేరుతో లక్ష్మణ్ నేతృత్వంలో బీజేపీ చక్కగా పనిచేస్తోందని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. తనకు పదవులు అక్కర్లేదని, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. ఇక్కడ పూర్తయ్యాక మరో రాష్ట్రానికి వెళతానన్నారు. అమిత్‌షా పదవి ఇస్తానన్నా..పదవి కాదు..పని చేస్తానని చెప్పానన్నా రు. తెలంగాణలో జనతా సర్కార్ రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకప్పుడు అద్వానీ, వాజ్‌పేయి జోడీ పార్టీని నడిపించిందని, ఇప్పుడు అమిత్ షా, మోదీ జోడీ పార్టీని అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకువస్తుందన్నారు. పార్టీ అధ్యక్షు డు లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల మొద టి విడత ప్రచారంలో భాగంగా హైదరాబాద్, నిజామాబాద్, సూర్యాపేటలో నిర్వహించే బహిరంగ సభలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని వెల్లడించారు. పరిపూర్ణానంద చేరికను స్వాగతిస్తు న్నామన్నారు. ఆయన చేరికతో ప్రజల నుంచి బీజేపీకి ఎనలేని మద్దతు లభిస్తుందన్నారు. రాష్ట్రంలో కూటముల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నార న్నారు. అధికారంలోకి వచ్చే వరకు ఉత్తమ్‌కుమార్ రెడ్డి గడ్డం తీయనని అంటున్నారని, అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదని, హిమాలయాలకు వెళ్లి సన్యాసం పుచ్చుకోవాల్సి వస్తుందన్నారు. -
రాబోయే రోజుల్లో కేసీఆర్ అంచనాలు తారుమారు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎన్నికల హామీలను విస్మరించిందని, రాబోయే రోజుల్లో కేసీఆర్ అంచనాలు తారుమారు కానున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. నవంబర్‌లో ఎన్నికలు వస్తాయని, తమ ప్రభుత్వం వస్తుందని కేసీఆర్ చెప్పారని, అయితే ఇప్పుడు ఎన్నికలు డిసెంబర్లో వస్తున్నాయన్నారు. దీనిలాగే రానున్న రోజుల్లో కేసీఆర్ అంచనాలన్నీ తలకిందులు కానున్నాయని తెలిపారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ తన మాట లతో ప్రజలను నమ్మించలేని పరిస్థితిలో పడ్డారన్నారు. కారణం లేకుండా అసెంబ్లీని రద్దు చేయడం బాధ్యతారాహిత్యమైన చర్యగా పేర్కొన్నారు. ఎస్సీలకు మూడెకరాల భూమి, అంబేడ్కర్ విగ్రహం, మాదిగ భవన్ ఏర్పాటు వంటి హామీలు అమలు చేయలేదని చెప్పారు. ఇసుక మాఫియాతోనే ప్రభుత్వాన్ని నడిపారని మండిపడ్డారు. రాష్ట్రంలో 10 శాతం ఎస్టీలు ఉంటే.. ఒక అడుగు ముందుకు వేసి 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసపూరిత మాటలు చెప్పారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ చార్జి్జషీట్ తయారు చేస్తోందన్నారు. -
ఓబీసిలకు ఇస్తామన్న లక్ష కోట్లు ఏమయ్యాయి?
-
ముందస్తుకు మేం సిద్ధం
-
టీఆర్ఎస్పై పోరుకు బీజేపీ సై
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్పై పోరుకు తమ పార్టీ అధినాయకత్వం పచ్చజెండా ఊపిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు తెలిపారు. ఆ పార్టీపై పోరాడేందుకు మండలస్థాయిలో చార్జ్‌షీట్ యాత్రలు చేపట్టనున్నామని చెప్పారు. తెలంగాణలో శాసనసభకు ఎన్నికలు ముందస్తుగా వచ్చినా, ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మంగళవారం ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్లుగా సంస్థాగతంగా, క్రమబద్ధంగా క్షేత్రస్థాయి నుంచి పైవరకు పార్టీని బలోపేతం చేసినట్టు తెలిపారు. సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ జరిపిన బహిరంగ సభలో వాగ్దానాలపై సీఎం కేసీఆర్ ఎలాంటి చర్చ చేయలేదని, చర్చ జరపకపోవడమే టీఆర్ఎస్ వైఫల్యానికి నిదర్శనమన్నారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రతి మండలంలో ఈ యాత్రలు చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదగడానికిగాను ఆ పార్టీపై పోరాడేందుకు కేంద్ర నాయకత్వం సుముఖత వ్యక్తం చేసిందన్నారు. ఎన్నికలకు సమాయత్తం కావడంలో భాగంగా క్యాలెండర్ తయారీపై కూడా పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా చర్చించారని పేర్కొన్నారు. తెలంగాణలో ఈ పోరాట బహిరంగ సభల్లో అమిత్ షా పాల్గొనబోతున్నట్టు తెలిపారు. రానున్న రోజుల్లో బీజేపీ అటు రాజకీయంగా, ఇటు సంస్థాగతంగా తెలంగాణలో ప్రత్యామ్నాయ దిశలో, స్వతంత్ర పంథాలో ముందుకు సాగుతుందని, టీఆర్ఎస్ను ఎదుర్కొనే పార్టీ బీజేపీయే అన్న రీతిలో వెళుతుందని తెలిపారు.టీఆర్ఎస్తో కలసి వెళుతున్నట్టు ప్రజలకు సంకేతాలు వెళ్లాయన్న మీడియా ప్రశ్నకు సమాధానంగా ‘పోరాటం చేస్తామంటున్నాం.. పొత్తు లేదని చెబుతున్నాం.. మళ్లీ అందులో బహిరంగ పొత్తు, లోపాయికారీ పొత్తు అనేవి ఉండవు’అని ఆయన స్పష్టం చేశారు. జమిలి ఎన్నికలకు వెళ్దామని ప్రధాని పిలుపునివ్వగా టీఆర్ఎస్ ముందస్తుకు ఆసక్తి చూపడంపై స్పందన కోరగా ‘ముందస్తుకు వెళ్లాలన్నది రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించే పార్టీ నిర్ణయం. వారిష్టం..’అని అన్నారు. ప్రధాన మంత్రితో ముఖ్యమంత్రి ఈ అంశాలు చర్చించలేదని పేర్కొన్నారు. -
పరిపూర్ణానంద బహిష్కరణ అప్రజాస్వామికం
సాక్షి, హైదరాబాద్: స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ నుంచి బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలవడానికి బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడే నిర్బంధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కె.లక్ష్మణ్, బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్, ఎన్వీఎస్ ప్రభాకర్‌ను పోలీసులు మంగళవారం అరె స్టు చేశారు. రాజాసింగ్‌ను గృహనిర్బంధం చేశారు. పరిపూర్ణానందపై పోలీసులు విధించిన బహిష్కరణను ఎత్తివేయాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వడానికి బీజేపీ ఎమ్మెల్యేలు గతంలోనే సీఎం అపాయింట్మెంటు కోరారు. సీఎం కార్యాలయం నుంచి స్పంద న లేకపోవడంతో నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లి, సీఎం కు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. అసెంబ్లీలోని బీజేపీ శాసనసభాపక్ష కార్యాలయంలో సమావేశమై, అక్కడి నుంచి బృందంగా వెళ్లాలని నిర్ణయించారు. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకోకుండానే పోలీసులు, వారిని నిర్బంధంలోకి తీసుకున్నారు. కె.లక్ష్మణ్‌ను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర అరెస్టుచేసిన పోలీసులు, తిరుమలగిరి పోలీసుస్టేషన్‌కు తరలించారు. కిషన్‌రెడ్డిని నగర పోలీసు కమిషనర్ కార్యాలయం దగ్గర అరెస్టు చేసి కంచన్‌బాగ్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్సీ రామచందర్రావును అరెస్టు చేసి, హబీబ్‌నగర్ పోలీసుస్టేషన్‌కు, ఎమ్మెల్యే ప్రభాకర్‌ను అంబర్‌పేటలో అరెస్టు చేశారు. ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డిని బొల్లారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో కార్యకర్తలు పెద్దఎత్తున పోలీస్ స్టేషన్లకు చేరుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అరెస్టులు అక్రమం: మురళీధర్‌రావు రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఆ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు ఒక ముఖ్యమైన విషయంలో కలవడానికి ప్రయత్నిస్తే అరెస్టు చేస్తారా అని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి పి.మురళీధర్‌రావు ట్విట్టర్లో మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో రావణరాజ్యం నడుస్తున్నదని బీజేపీ రాష్ట్ర ఇన్చార్జ్ కృష్ణదాస్ విమర్శించారు. కేసీఆర్ పాలన ఎమర్జెన్సీని గుర్తుకు తెస్తున్నదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి విమర్శించారు. -
‘వినతి పత్రం ఇవ్వబోతే అరెస్టులా?’
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామిని తెలంగాణ ప్రభుత్వం నగర బహిష్కణ చేయడంపై బీజేపీ శ్రేణులు మంగళవారం చేపట్టిన ‘ఛలో ప్రగతిభవన్’ ఆందోళనలో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యేలు జి.కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, సీనియర్ నాయకుడు బద్దం బాల్‌రెడ్డిని అరెస్టు చేసి ఠాణాలకు తరలించారు. సీఎం కేసీఆర్‌ను కలిసి వినతి పత్రం అందిద్దామని బయల్దేరిన నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు వ్యాఖ్యానించారు. అరెస్టులతో తెలంగాణలో ప్రజాస్వామ్య విలువలు పతనమవుతున్నాయని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు సమయం ఇవ్వకపోగా ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం కేసీఆర్ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. తెలంగాణలో సాగుతున్నది ప్రజాస్వామ్య పాలనా లేక నిజాం నిరంకుశ పాలనా అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విటర్లో తెలంగాణ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. తెలంగాణా లో బీజేపీ నాయకుల అక్రమ అరెస్ట్, మంటగలుస్తున్న ప్రజాస్వామ్య విలువలు, ఎమ్మెల్యేలకు కూడా కేసీఆర్ సమయం ఇవ్వరు, కలుద్దామని వచ్చే వారిని అరెస్టు చేస్తారు.. తెలంగాణా లో సాగుతున్నది ప్రజాస్వామ్య పాలనా లేక నిజాం నిరంకుశ పరిపాలననా? — P Muralidhar Rao (@PMuralidharRao) July 17, 2018 -
‘యావత్ హిందూ సమాజంపై దాడి’
సాక్షి, హైదరాబాద్ : స్వామి పరిపూర్ణానందను తెలంగాణ ప్రభుత్వం నగర బహిష్కరణ చేయడంపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. గత ఏడాది నవంబర్‌లో రాష్ట్రీయ హిందూసేన సమావేశంలో పరిపూర్ణానంద చేసిన ప్రసంగంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆరునెలల వరకు నగరంలోకి ప్రవేశించకూడదని నగర పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు బుధవారం ట్వీటర్లో స్పందించారు. నిజాం మత రాజకీయాలకు కేసీఆర్ ప్రభుత్వ పరిపాలన నిదర్శనమని ధ్వజమెత్తారు. పరిపూర్ణానంద బహిష్కరణ మానవహక్కుల ఉల్లంఘన అని విమర్శించారు. ఇది యూవత్ హిందూ సమాజంపై దాడి అని, ప్రభుత్వం ఓటు బ్యాంక్ రాజకీయాలకు పెద్దపీఠ వేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అర్థరాత్రి నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. ఎమ్ఐఎమ్ నేతలను బహిష్కరించాలి పరిపూర్ణానంద నగర బహిష్కరణపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కోరారు. కోట్లాది ప్రజలు ఆరాధించే శ్రీరాముడిని నిందించిన వారిపై చర్యలేవని, ఈ ప్రభుత్వం ఎవరి చేతిలో నడుస్తోందని ప్రశ్నించారు. ఆయన నగర బహిష్కరణ ప్రభుత్వ కుట్రని అన్నారు. హిందూ దేవుళ్లను తూలనాడిన ఎమ్ఐఎమ్ నేతలను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. స్వామిజీని బహిష్కరణ చేయడమంటే హిందూవులను బహిష్కరణ చేయడమే అని మండిపడ్డారు. పరిపూర్ణానందపై చర్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని, ఆయపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. బీజేపీ ధర్నా పరిపర్ణానంద స్వామిని హైదరాబాద్ నుంచి బహిష్కరించడాన్ని నిరసిస్తూ కరీంనగర్లో బీజేపీ ధర్నా చేపట్టింది. స్వామిపై వేసిన బహిష్కరణను వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ధర్నాలో పాల్గొన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు -
కాంగ్రెస్ జేబు సంస్థలుగా టీఆర్ఎస్, టీడీపీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలుగు రాష్ట్రాలను ఏలుతున్న టీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీలు కాంగ్రెస్ జేబు సంస్థలుగా మారాయని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి పి.మురళీధర్‌రావు అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న ఈ 2 పార్టీలకు దీటుగా తెలంగాణ, ఏపీల్లో బీజేపీ ప్రత్యా మ్నాయ శక్తిగా ఎదుగుతున్నదన్నారు. ఆదివారం కరీంనగర్ ఆర్అండ్బీ గెస్టుహౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ, దేశంలోనే అత్యంత అవినీతికర ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ నడిపిస్తోందని ధ్వజమెత్తారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు టీఆర్ఎస్ సర్కారు ఏం చేసిందని ప్రశ్నించారు. ‘మిషన్’అనే పదంతో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలన్నీ కమీషన్ల కోసమేనన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని చంద్రబాబు కాంగ్రెస్ జేబులో పెట్టారన్నారు. టీఆర్ఎస్, టీడీపీ ప్రభుత్వాల అవినీతి, వైఫల్యాలపై త్వరలోనే ప్రజలముందు చార్జ్ షీట్ పెడతామన్నారు. కర్ణాటక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించారని, ప్రస్తుతమున్న సర్కారు ఎక్కువ రోజులుండదని జోస్యం చెప్పారు. తెలంగాణలోనూ కర్ణాటక ఎన్నికల ప్రభావం ఉంటుందన్నారు. సమావేశంలో బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, పలువురు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. -
‘ఆంధ్ర అవసరాలను జీరో చేసిన వ్యక్తి బాబు’
సాక్షి, కరీంగనర్ : ఆంధ్రప్రదేశ్ అవసరాలను సీఎం చంద్రబాబు నాయుడు జీరో చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మండిపడ్డారు. బీజేపీ దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు సంస్థాగతంగా సిద్ధమైందని బీజేపీ నేత స్పష్టం చేశారు. కర్నాటక ఫలితాలతో కాంగ్రెస్ ఓటమి వైపు దూసుకెళ్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు బలమైన స్థానం లేదన్నారు. కర్నాటక ప్రభావం తెలంగాణలో కూడా ఉంటుంది. ఉగ్రవాదులు, వేర్పాటు వాదులు మాట్లాడే మాటలను కాంగ్రెస్ మాట్లాడుతుందని విమర్శలు గుప్పించారు. దేశ భద్రత, సమగ్రతకు బీజేపీ పాటుపడుతుందని ఆయన పేర్కొన్నారు. ‘2019 ఎన్నికల్లో వేర్పాటువాదంను సమర్థించే విషయాన్ని చర్చనీయాంశంగా మార్చుతాం. టీఆర్ఎస్ కాంగ్రెస్‌కు జేబు సంస్థ, టీఆర్ఎస్ను సమర్థిస్తే కాంగ్రెస్‌ను సమర్థించినట్లే అవుతుంది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా దివంగత ఎన్టీఆర్ టీడీపీ స్థాపించారు. ఆ పార్టీలో ఉంటూ ఎన్టీఆర్‌ను అవమానించేలా చంద్రబాబు రాహుల్ గాంధీని కలిశారు. ఆంధ్రప్రదేశ్ అవసరాలను జీరో చేసిన వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్‌తో చంద్రబాబు చేతులు కలపడం ఆంధ్రప్రజలకు అవమానం. నిరుద్యోగానికి మారుపేరు టీఆర్ఎస్, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై బీజేపి త్వరలో చార్జిషీట్ వేస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను గ్రామగ్రామానికి తీసుకెళ్తాం. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని’ బీజేపీ నేత మురళీధర్ రావు ధ్వజమెత్తారు. -
మాకోసారి అవకాశం ఇవ్వండి
-
మాకోసారి అవకాశం ఇవ్వండి
సాక్షి, యాదాద్రి : ‘ఎవరెవరికో అధికారం ఇచ్చారు. తెలంగాణలో ఈసారి మాకు అవకాశం ఇస్తే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందిస్తాం’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. మార్పుకోసం పేరిట శనివారం బీజేపీ జన చైతన్యయాత్రను యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రారంభించారు. ముందుగా పార్టీ నాయకులు యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి సన్నిధిలో పూజలు చేశారు. అనంతరం గుట్ట నుంచి భువనగిరికి ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లక్ష్మణ్ మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసమే తమ పార్టీ జన చైతన్యయాత్రను ప్రారంభించిందన్నారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన వైఫల్యాలు, మోదీ పాలనలో విజయాలు, కేంద్ర పథకాలపై ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు అన్ని రంగాల్లో దగా పడ్డారని ఆరోపించారు. తెలంగాణలో నవ్వులపాలవుతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే తమ లక్ష్యమని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం, రాష్ట్రానికి కోట్లాది నిధులను మంజూరు చేసిందని చెప్పారు. చంద్రబాబు, కేసీఆర్ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌తోనే ప్రారంభమైందన్నారు. అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలనతో కొనసాగుతున్న కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ యుద్ధం ప్రకటించిందన్నారు. కేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీల వల్ల అభివృద్ధి సాధ్యం కాదన్నారు. కేసీఆర్, చంద్రబాబుల తర్వాత వారి పార్టీల ఉనికి ప్రశ్నార్థకమన్నారు. రాష్ట్రంలో రైతులను ఆదుకోవడానికి ఫసల్ బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల రక్తాన్ని కాంట్రాక్టర్లు జలగల్లా తాగుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏ టీఆర్ఎస్లోకి బదిలీ అయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ నీతివంతమైన పాలన అందిస్తున్నారన్నారు. బీజేపీ శాసనసభాపక్షనేత కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మజ్లిస్ చెప్పుచేతల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. టీఆర్ఎస్ నుంచి అధికారాన్ని తమకు ఇస్తే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందిస్తామన్నారు. సమా వేశంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, పార్టీ నాయకులు పేరాల చంద్రశేఖర్‌రావు, కాసం వెంకటేశ్వర్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్‌సుందర్‌రావు పాల్గొన్నారు. -
‘టీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ము కాంగ్రెస్‌కు లేదు’
సాక్షి, భువనగిరి(యాదాద్రి): లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా టీఆర్ఎస్, బీజేపీల మధ్య తెలంగాణలో యుద్ధం ప్రారంభమైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉందని అన్నారు. ‘మార్పు కోసం బీజేపీ జన చైతన్య యాత్ర’లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు టీఆర్ఎస్తో తలపడే దమ్ములేదన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సమాధి వద్ద నివాళులు అర్పించలేని వాళ్లు ఇక ప్రతిపక్షం పాత్ర ఎలా వహిస్తారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్భాటాలకే పరిమితమవుతోందనీ, సుపరిపాలన ఎక్కడా కానరావడం లేదని విమర్శించారు. తెలంగాణలో కాంట్రాక్టర్ల రాజ్యం నడుస్తోందని ఆయన మండిపడ్డారు. కమీషన్ల కోసమే మిషన్ పథకాలు ప్రవేశపెట్టారని ఆరోపించారు. సుష్మా స్వరాజ్ పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తే, టీఆర్ఎస్ గద్దెనెక్కి పాలిస్తోందని అన్నారు. రాష్ట్ర అభివృద్దిని చూసి దేశం గర్విస్తోందని చెప్పకుంటున్న కేసీఆర్ ఒక్క డబుల్ బెడ్రూం ఇంటినైనా నిర్మించారా అని మురళీధర్‌రావు ప్రశ్నించారు. దేశం గర్వించదగ్గ అభివృద్ది జరిగినప్పుడు రైతు ఆత్మహత్యలు ఎందుకు చోటుచేసుకుంటున్నాయని ధ్వజమెత్తారు. దేశంలో అన్ని కులాలు, మతాలను కలుపుకొని పోయేది బీజేపీ మాత్రమేనని చెప్పారు. మార్పు కోసం వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలవాలని ప్రజలను కోరారు. -
కాంగ్రెస్ డీఎన్ఏ నుంచి పుట్టిందే టీఆర్ఎస్
సూరారం: జాతీయ పార్టీగా డబ్బాలు కొట్టుకునే కాంగ్రెస్ చేవలేని పార్టీగా తయారైందని, దాని డీఎన్ఏతోనే టీఆర్ఎస్ పార్టీ రూపొందిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు విమర్శించారు. కుత్బుల్లాపూర్ పరిధి షాపూర్‌నగర్ ఉషోదయ టవర్స్‌లో గురువారం నియోజకవర్గ బీజేపీ కార్యాలయాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పక్క పార్టీల నుంచి నాయకులను తెచ్చుకుని ఎదుగుతున్న పార్టీ టీఆర్ఎస్ అని, తెలంగాణ లో టీఆర్ఎస్ను ఎదుర్కొనే పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. ఓ పక్క మిషన్ కాకతీయ, మరో పక్క భూప్రక్షాళన కార్యక్రమాలు నిర్వహిస్తునే కబ్జాలు, ఆక్రమణల పర్వానికి తెర తీశారని దుయ్యబట్టారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఒకప్పటి దేవాదాయ శాఖ భూములు, ప్రభుత్వ భూములు ఇప్పుడు ఎవరి పరమయ్యాయో అందిరికి తెలుసని అన్నారు. భారతదేశంలో మోడీ ప్రభావంతో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో బీజేపీ పాలిస్తోందన్నారు. ఇందుకు కారణం కేవలం కింది స్థాయి కార్యకర్తలు చేస్తున్న కృషేనని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అంతకన్నా సిగ్గుమాలిన పని మరొకటి లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న పథకాలను తమ సొంత పథకాలుగా డప్పు కొట్టుకుని ప్రచార ఆర్భాటానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని టీఆర్ఎస్ పై ఆయన దుయ్యబట్టారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే సీటు, మల్కాజ్గిరి ఎంపీ సీటు బీజేపీ కి ఎంతో ముఖ్యమైనవని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ లో బీజేపీ గెలుపు ఇక్కడి నుంచే మొదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. -
అధికారం కోల్పోతే టీఆర్ఎస్ గల్లంతే: మరళీధర్
సాక్షి, హైదరాబాద్: పైకి బలంగా కనిపిస్తున్నట్టుగా ఉండే టీఆర్ఎస్ అధికారం కోల్పోతే ఉఫ్ అంటే గల్లంతవుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పేర్కొన్నారు. మంగళవారం పార్టీ తెలంగాణ ఓబీసీ మోర్చా సమావేశం ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఓబీసీ మోర్చా బలం వల్లనే కర్ణాటకలో మంచి ఫలితాలు సాధించిన బీజేపీకి తెలంగాణలో కూడా ఓబీసీ మోర్చా ప్రధాన బలం కావాలని సూచించారు. బీసీ కోటాలో ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు కల్పించటం ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. -
తెలంగాణలో పాగా వేద్దాం!
సాక్షి, హైదరాబాద్: దక్షిణ భారతదేశంలోని కర్ణాటకలో పార్టీని బలోపేతం చేసుకున్న తరహాలో తెలంగాణలోనూ పాగా వేద్దామని బీజేపీ శ్రేణులకు ఆ పార్టీ జాతీయ నాయకత్వం సూచించింది. కర్ణాటకలో మెజారిటీ సీట్లు సాధించడానికి అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడా అనుసరించాలని.. పార్టీ కార్యకర్తల నుంచి స్థానిక నేతలు, సీనియర్లు, అగ్రనేతలు అంతా కలసి ముందుకు సాగాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు దిశా నిర్దేశం చేశారు. ‘‘ప్రపంచంలో భారత సైన్యానికి మంచి పేరుంది. ఎందుకంటే సాధారణ సైనికులతోపాటు పైస్థాయి అధికారులు కూడా యుద్ధభూమిలో ముందుకు సాగుతారు. కర్ణాటకలో దీనినే అనుసరించాం. ఎన్నికల ప్రచారంలో స్థానిక నేతలతోపాటు రాష్ట్రనేతలు, ప్రధాని మోదీ, జాతీయాధ్యక్షుడు అమిత్‌షా కలసి ముందుకు సాగారు. అది మంచి ఫలితాలు ఇచ్చింది. పెద్దగా ప్రజావ్యతిరేకత లేని ముఖ్యమంత్రిగా సిద్దరామయ్యకు పేరున్నా.. వారి కాంగ్రెస్ పార్టీని నిలువరించగలిగాం. ఇందుకోసం బూత్ స్థాయి నుంచి మన బలాన్ని ఎప్పటికప్పుడు సన్నద్ధం చేసుకుంటూ, లోపాలు సరిదిద్దుకుంటూ ముందుకు కదిలి.. అత్యధిక స్థానాలు సాధించగలిగాం..’’అని మురళీధర్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణలోనూ ప్రతి ఒక్కరూ క్రియాశీలంగా పనిచేస్తూ, బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసుకుంటే బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బాటలో తెలుగు సీఎంలు.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారి సిద్ధాంతాలను పక్కనపెట్టి మరీ కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారని మురళీధర్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకించిన ఎన్టీఆర్ విధానాలను పక్కనపెట్టి చంద్రబాబు అధికారం కోసం కాంగ్రెస్‌తో కలవబోతున్నారని... కేసీఆర్ కూడా అదే బాటలో ఉన్నారని చెప్పారు. దీనిని ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. తెలంగాణలో ప్రజలు బీజేపీ పక్షాన ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. కర్ణాటకలో అధికారాన్ని పొందలేకపోయామని, కానీ అత్యధిక స్థానాలు సాధించడాన్ని విజయంగానే భావించాలని పేర్కొన్నారు. అక్కడ భవిష్యత్తులో ప్రజాభీష్టం మేరకు బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం గాని, మధ్యంతర ఎన్నికలు రావటంగానీ జరుగుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పథకాలన్నీ కమీషన్లమయమే: లక్ష్మణ్ తెలంగాణలో అధికార పార్టీ అవినీతి పెచ్చుమీరిపోయిందని, చాలా పథకాల్లో కమీషన్ల ఆధారంగానే పనులు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అక్రమాలు మితిమీరాయని, ముఖ్యమంత్రి సైతం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాలరాశారని, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని వ్యాఖ్యానించారు. మజ్లిస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, హిందూ సంస్థలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో పలు తీర్మానాలు తెలంగాణలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, పంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై సమావేశంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇక నాలుగేళ్ల మోదీ పాలనను అభినందిస్తూ పార్టీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కిసాన్‌మోర్చా అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి వ్యవసాయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. స్వచ్ఛభారత్ అభియాన్, ఆయుష్మాన్ భారత్, కిసాన్ కార్యశాల తదితర కార్యక్రమాలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి నివేదిక సమర్పించారు. -
డెమొక్రసీని కాంగ్రెస్ హైజాక్ చేసింది
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరును బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కన్నడ ప్రజల విశ్వాసాన్ని చురగొనడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని, అయినా అప్రజాస్వామికంగా ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిందన్నారు. పుంజుకున్నాం... ‘కాంగ్రెస్ పార్టీ ముక్త భారత్ నినాదంతో 2014 కేంద్ర ఎన్నికల్లో ప్రారంభం అయ్యింది. బీజేపీ కి కాంగ్రెస్ కు పోటా పోటీ ఎన్నికలు సాగాయి. ప్రతీచోటా కాంగ్రెస్‌కు పరాభవం తప్పడం లేదు. కర్నాటకలో బీజేపీకి 40 నుంచి 104 స్థానాలు వచ్చాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ 122 స్థానాల నుండి 78 సీట్లకు పడిపోయింది. కన్నడ ప్రజలు విప్లవాత్మక తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్ భూతం రూపంలో కుమారస్వామిని పట్టుకుంది. ప్రజాతీర్పును వ్యతిరేకిస్తూ జేడీఎస్-కాంగ్రెస్‌లు ఏకమమయ్యాయి. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ.. ఆ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ హైజాక్ చేశారు. కాంగ్రెస్ ఓ దిగజారుడు పార్టీ. సిద్ధరామయ్య ఘోరంగా ఓడిపోయారు. రాహుల్ గాంధీ నాయకత్వంపై ప్రజలకు నమ్మకం లేదన్న విషయాన్ని కర్ణాటక ఫలితాలే నిరూపించాయి. లింగాయత్‌లను ఓటు బ్యాంకుగా చూసిన వారు పతనం చూశారు’ అని మురళీధర్ రావు తెలిపారు. చంద్రబాబుకు ఛాలెంజ్... ‘కర్ణాటకలో చాలా చోట్ల క్లీన్ స్వీప్ చేశాం. 36.2 శాతం ఓట్లు సాధించాం. కర్ణాటక తీర్పుపై ఏపీ సీఎం చంద్రబాబుకు ఛాలెంజ్. అవసరమైతే డిబేట్ పెట్టుకుందాం రండి. ప్రజల్లో మోదీ ఛరిష్మా పెరిగిందే తప్ప..తగ్గలేదు అనటానికి ఆ ఫలితాలే నిదర్శనం. ఎన్ని దశలు మారినా చంద్రబాబు మోసచరిత్ర మారదు. ఎన్టీఆర్ ఆత్మ ఎక్కడ ఉన్నా చంద్రబాబు చేసిన మోసానికి క్షోభిస్తూనే ఉంటుంది. అవసరమైతే కాంగ్రెస్ పార్టీతో వెళ్లటానికి కూడా చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. నేతలు చేసే అవినీతిని, ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లలేని ఏ వ్యక్తి కూడా నాయకుడిగా పనికి రాడు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజాభీష్టానికి అనుగుణంగా పాలించేది ఒక్క బీజేపీ మాత్రమే’ అని మురళీధర్ రావు పేర్కొన్నారు. -
ఇదంతా మీడియా సృష్టే
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ బీజేపీలో అసంతృప్తి రేగడంతో ఆ పార్టీ జాతీయ నాయకత్వం స్పందించింది. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోపోయినా కన్నా లక్ష్మీనారాయణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతారని స్పష్టం చేసింది. అందరూ కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వంలో పనిచేస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీలో కొత్త, పాత అంటూ ఉండదని, అంతా ఒక్కటేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో రెండు గ్రూపులు లేవని, ఇదంతా మీడియా సృష్టేనని కొట్టిపారేశారు. కులాల ఆధారంగా తమ పార్టీ పదవులు ఇవ్వదని తెలిపారు. నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఆయన ఓబీసీ అంటూ ప్రచారం చేశారని గుర్తుచేశారు. కాగా, కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై అసంతృప్తితో ఉన్న సోము వీర్రాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన మద్దతుదారులు పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. తనకే పార్టీ అధ్యక్ష బాధ్యతలు దక్కుతాయని భావించిన వీర్రాజుకు ఆశాభంగం ఎదురవడంతో ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఆయన తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుందనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కర్ణాటకలో గెలుపు మాదే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ వస్తుందని మురళీధర్‌రావు విశ్వాసం వ్యక్తం చేశారు. తాము ఎవరితో కలవాల్సిన అవసరం లేదని, సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కర్ణాటకలో తెలుగువారు బీజేపీకి వ్యతిరేకంగా లేరని తెలిపారు. ఈ నెల 15 తర్వాత 2019 వ్యూహాలను వెల్లడిస్తామన్నారు. కర్ణాటకలో బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు ముందుకెళ్లినా, ఆయనకు ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు. -
‘కర్ణాటకలో తెలుగు ఓట్లు మావే’
సాక్షి, బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలకుగానూ కర్ణాటక ఇన్‌ఛార్జ్‌లుగా పనిచేస్తున్న తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావులు స్పందించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగువారి ఓట్లు కాంగ్రెస్ పార్టీకే పడుతాయని మధుయాష్కీ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడే అవకాశం లేదని కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించి తీరుతుందని తెలిపారు. రాష్ట్రంలో మరోసారి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తారన్నారు. 2019లో రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలో జరగనున్న ఎన్నికలపై కర్ణాటక ఫలితాలు ప్రభావం చూపుతాయని, ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కీలకమని పేర్కొన్నారు. 'కర్ణాటక రాష్ట్ర జనాభా దాదాపు ఆరు కోట్లు, వీరిలో తెలుగు ప్రజలు కోటికి పైగా ఉన్నారు. తెలుగువారి ఓట్లు మా పార్టీకి కలిసొచ్చే అంశం, వారు కాంగ్రెస్‌కే ఓటు వేస్తారని' పేర్కొన్నారు. 2004, 2009 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన మధుయాష్కీ ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ విధానాల చాలా నష్టపోయారు: మురళీధర్ రావు కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు ఎన్నికలపై స్పందిస్తూ... కర్ణాటకలో తెలుగు ప్రజలు బీజేపీపై నమ్ముతారని, వారి ఓట్లు తమ పార్టీకే వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ కన్నడ ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం పోయింది. ఇక్కడి ప్రజలు కాంగ్రెస్‌ను పూర్తిగా విస్మరించారు. కాంగ్రెస్ విధానాల వల్ల కన్నడ ప్రజలు చాలా నష్టపోయారు. వారి చర్యల వల్ల ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పూర్తిగా నష్టపోయింది’ అని వివరించారు. -
థర్డ్‌ఫ్రంట్ కేసీఆర్ పగటి కల!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: థర్డ్ ఫ్రంట్ అనేది కేసీఆర్ పగటికల అని.. అస్థిరత, అవినీతి, కొట్లాట తప్ప థర్డ్ ఫ్రంట్‌లో ఏమీ ఉండదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. మాజీ నక్సలైట్లు, ఆక్రమణదారులు, పాత కాంగ్రెస్ నేతల కలయికే టీఆర్ఎస్ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం కరీంనగర్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ‘థర్డ్‌ఫ్రంట్‌కు నాయకులు లేరు, ఓట్లు లేవు’అని అన్నారు. దేశ ప్రజలు మోదీకి, బీజేపీకి ప్రత్యామ్నాయం కోరుకోవడం లేదన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ విజయ పరంపరను కొనసాగించిందని, ఇదే విజయ పరంపర దక్షిణాది రాష్ట్రాలలో కూడా ఉంటుందని పేర్కొన్నారు. కర్ణాటకలో బీజేపీ గెలుపుతో దక్షిణాది రాష్ట్రాలకు ద్వారం తెరుచుకుంటుందని మురళీధర్‌రావు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో 119 స్థానాల నుంచి బీజేపీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని, నేర చరిత, అవినీతి ఆరోపణలు లేని వారు, వివాదరహితులను పార్టీ బరిలో దింపుతుందని తెలిపారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ పతనానికి రాహుల్ గాంధీ వేగంగా బాటలు వేస్తున్నారని అన్నారు. ఆయన అధ్యక్షుడు అయిన తర్వాతే ఆ పార్టీ ఓటములను మూట కట్టుకుంటుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక పాలన సాగిస్తోందన్నారు. 21వ శతాబ్దంలో దేశానికి బలమైన సుపరిపాలన ఇవ్వగలిగేది మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వమేనని మురళీధర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డితో పాటు కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పోల్సాని సుగుణాకర్‌రావు పాల్గొన్నారు. -
థర్డ్ ఫ్రంట్ అనేది టీఆర్ఎస్ పగటికల మాత్రమే
-
‘థర్డ్ ఫ్రంట్.. టీఆర్ఎస్ పగటికల’
సాక్షి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజావ్యతిరేక విధానాల పార్టీ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఆరోపించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నక్సలైట్లు, ఆక్రమణ దారులు, పాత కాంగ్రెస్ నేతల కలయికే టీఆర్ఎస్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధమని ఆయన తెలిపారు. థర్డ్ ఫ్రంట్ అనేది టీఆర్ఎస్ పగటికల అని.. అస్థిరత, అవినీతి, కొట్లాట తప్ప థర్డ్ ఫ్రంట్‌లో ఏమీ ఉండదన్నారు. కర్నాటకలో బీజేపీ గెలుపుతో దక్షిణాది రాష్ట్రాల్లో ద్వారం తెరుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి, బీజేపీకి రాజకీయ ప్రత్యామ్నాయం అవసరం లేదని, ప్రజలు కూడా ప్రత్యామ్నాయం కోరుకోవడం లేదన్నారు. మరోవైపు కాంగ్రెస్ పతనానికి వేగం పెంచే నాయకుడు రాహుల్ గాంధీ అని ఎద్దేవా చేశారు. -
వచ్చేది మా ప్రభుత్వమే!
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు అన్నారు. నగర బీజేవైఎం ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ అమీర్‌పేటలో జరిగిన నిరుద్యోగుల యువగర్జనలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అవినీతిని పారదోలి పేదల సంక్షేమం కోసం పనిచేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం కమీషన్లు, భూ దందాలను పెంచి పోషిస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్ పాత కాంగ్రెస్, టీడీపీ నాయకులను తమ పార్టీలో చేర్చుకుని తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వారిని పక్కన పెట్టిందన్నారు. నిరుద్యోగ నిర్మూలన కోసం బీజేవైఎం నడుం బిగించిందన్నారు. అధికారంలోకి వస్తే 3,000 నిరుద్యోగ భృతి: లక్ష్మణ్ తెలంగాణ ప్రభుత్వం రైతు సమన్వయకర్తలుగా గులాబీ దళాలను నియమించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. ఐటీ మంత్రి కేటీఆర్ గాలిమోటార్లలో తిరుగుతూ గాలి మాటలు చెప్పడం మాను కుని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 2019లో తాము అధికారంలోకి వస్తే రూ.మూడు వేల చొప్పున నిరుద్యోగ భృతిని ఇస్తామన్నారు. నగర బీజే వైఎం అధ్యక్షుడు ఎ.వినయ్‌కుమార్, నగర బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
‘నీతివంతమైన రాజకీయాలు చేయడం కష్టం’
హైదరాబాద్ : నల్ల ధనం, అవినీతిని రాజకీయాల్లో అరికట్టకపోతే నీతివంతమైన రాజకీయాలు చేయడం కష్టమని బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర బడ్జెట్‌పై అవగాహన సదస్సు జరిగింది. బడ్జెట్‌పై మురళీధర్ వివరణ ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. గత నాలుగేళ్ల పాలనలో అవినీతి ఆరోపణలు లేకుండా బీజేపీ ప్రభుత్వం పాలిస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రధాని మోదీ ప్రతిష్ట పై అనేక సార్లు టెస్టులు జరిగాయని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ నాయకులకు , పార్టీకి ప్రధాని పాపులారిటీ పై మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. తెలంగాణ ఆర్థిక మంత్రి అర్దాంతరంగా కేంద్రం ప్రభుత్వ కేటాయింపులపై వ్యతిరేకగళం విప్పుతున్నారని, జీఎస్టీ కౌన్సిల్లో ఎందుకు ఆర్థిక మంత్రి వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందన్నారు. ఇరిగేషన్, జాతీయరహదారుల శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దానికంటే ఎక్కువే కేటాయించిందని వ్యాఖ్యానించారు. జాతీయరహదారుల కేటాయింపుల్లో దేశంలోనే అత్యధికంగా తెలంగాణకు కేటాయించారని వివరించారు. మేడారం జాతరను జాతీయ పండగగా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసిందని, కానీ పండగకు కొద్దిరోజుల ముందు తీర్మానం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. దీంట్లో తెలంగాణ ప్రభుత్వం బాధ్యతారాహిత్యం కనిపిస్తోందన్నారు. చత్తీస్గడ్ సీఎం రమణ్ సింగ్ వస్తే కూడా సరిగా భద్రత ఏర్పాట్లు చేయలేకపోయిందని, కలెక్టర్ స్థాయి అధికారికి ఏర్పాట్ల భాద్యతను అప్పగించి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. -
ఐదు ఎంపీ సీట్లే లక్ష్యం!
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణలో వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాల్లోనూ పోటీ చేయాలని భావిస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం... అదే సమయంలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి సీట్ల సంఖ్యను పెంచుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. రాష్ట్రం నుంచి కనీసం ఐదు ఎంపీ సీట్లను దక్కించుకోవాలన్న లక్ష్యంతో కసరత్తు చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీలో గురువారం రాత్రి రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశమైన అమిత్‌షా బూత్‌స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాల్సిందేనని, ఇతర పార్టీ నేతలు పార్టీలోకి వచ్చే వాతావరణాన్ని సృష్టించాలని, వలసలను ఆకర్షించాలని స్పష్టం చేసినట్లు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. కరీంనగర్ నుంచి మురళీధర్‌రావు? గత ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి పోటీ చేసిన సీహెచ్ విద్యాసాగర్‌రావు మొత్తం పోలైన ఓట్లలో 19.06 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ స్థానం నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావును పోటీ చేయించాలని జాతీయ నాయకత్వం భావిస్తోంది. ఆయన కరీంనగర్ లేదా సికింద్రాబాద్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమేనన్న సంకేతాలను జాతీయ నాయకత్వం ముందుంచినట్లు తెలియవచ్చింది. ఇక నిజామాబాద్ నుంచి పోటీ చేసిన యెండల లక్ష్మీనారాయణ 21.79 శాతం ఓట్లతో మూడో స్థానంతోనే సరిపెట్టుకోగా మెదక్ నుంచి పోటీ చేసిన నరేంద్రనాథ్ పోలైన ఓట్లలో 15.3 శాతం ఓట్లతో మూడో స్థానానికే పరిమితమయ్యారు. మల్కాజిగిరిలో మిత్రపక్ష టీడీపీ అభ్యర్థి మల్లారెడ్డి గెలుపొందగా ఈసారి బీజేపీ మల్కాజిగిరి నుంచి బరిలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. హైదరాబాద్ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి డాక్టర్ భగవంత్‌రావుకు 32.05 శాతం ఓట్లు వచ్చాయి. ఇది ఎంఐఎం కంచుకోట కావడంతో ఇక్కడ పార్టీ రెండో స్థానానికి పరిమితమైంది. మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసిన డాక్టర్ నాగం జనార్దన్‌రెడ్డి 26.86 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఇక్కడ విజేతగా నిలిచిన టీఆర్ఎస్కు 32.91 శాతం ఓట్లు దక్కగా, రెండోస్థానంలో నిలిచిన కాంగ్రెస్‌కు 32.66 శాతం ఓట్లు దక్కడం గమనార్హం. భువనగిరి నుంచి పోటీ చేసిన పార్టీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి 15.11 శాతం ఓట్లతో మూడో స్థానంలోనే నిలవగా వరంగల్‌లో 15.90 శాతం ఓట్లతో కమలం మూడో స్థానానికే పరిమితమైంది. నల్లగొండలో మిత్రపక్షమైన టీడీపీ బరిలో నిలిచి రెండో స్థానం దక్కించుకుంది. ఈసారి నల్లగొండలో బీజేపీ బరిలో దిగనుంది. కేంద్ర జలవనరులశాఖ సలహాదారుగా, రాజస్తాన్ జలవనరులశాఖ సలహాదారుగా ఉన్న వెదిరె శ్రీరాంరెడ్డి నల్లగొండ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. గతంలో ఒకసారి ఇక్కడి నుంచి ఆయ న బరిలోకి దిగారు. ఇక ఖమ్మంలో టీడీపీ 34.51 శాతం ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచినా బీజేపీ ఇక్కడ బలంగా లేదు. ఎక్కడెక్కడ ఎంతెంత బలం? ప్రధానంగా నగర ప్రాంతాలపై బీజేపీ దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇందులో సికింద్రాబాద్, మల్కాజ్గిరి, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, భువనగిరి, మెదక్, నల్లగొండ, హైదరాబాద్ స్థానాలు ఉన్నా యని విశ్వసనీయంగా తెలియవచ్చింది. గత సాధారణ ఎన్నికల్లో 8 లోక్‌సభ స్థానాల్లో (సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, హైదరాబాద్, భువనగిరి, మహబూబ్‌నగర్) పోటీ చేసిన బీజేపీ సికింద్రాబాద్ నుంచే గెలుపొందింది. అయితే 2019లో ఈ 8 స్థానాలతోపాటు మల్కాజ్గిరి, నల్లగొం డ స్థానాలకూ పోటీపడి కనీసం ఐదిం టిని దక్కించుకోవాలన్న వ్యూహంతో బీజేపీ కేంద్ర నాయకత్వం వ్యూహం రచిస్తోంది. గత ఎన్నికల్లో 43.62 శాతం ఓట్లతో సికింద్రాబాద్ సీటును గెలుచుకున్న దత్తాత్రేయను మంత్రివర్గం నుంచి తప్పించడంతో వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకు టికెట్ దక్కే అవకాశాలు లేనట్టేనని పార్టీ పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. ఇక్కడి నుంచి కిషన్‌రెడ్డిని రంగంలోకి దింపాలని అధినాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కిషన్‌రెడ్డికి పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. -
'తెలంగాణలో కాంగ్రెస్‌కు స్థానం లేదు'
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్ స్థానం లేదని, కాంగ్రెస్‌కు ఉన్న అవలక్షణాలన్నీ అధికార టీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు విమర్శించారు. ఆయనిక్కడ మంగళవారం మాట్లాడుతూ తెలంగాణలో తామే ప్రత్యామ్నాయమన్నారు. ఈ రాష్ట్రంలో అవినీతి, నిరుద్యోగం, దళితులపై దాడులు పెరిగాయన్నారు. ఎంఐఎం పార్టీ రజాకార్ల వారసత్వ సంస్థ అని, టెర్రరిస్టులకు రక్షణ కవచమన్నారు. ముస్లిం మహిళలకు ఎంఐఎం చేసిందేమి లేదన్నారు. మతం ఆధారంగా ఇచ్చే రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని తెలిపారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారమే ట్రిపుల్ తలాక్‌పై పార్లమెంట్లో బిల్లు పెడుతున్నామన్నారు. విభజన చట్టంలోని ప్రతి హామీని నెరవేరుస్తామని.. ఉమ్మడి హైకోర్టును విభజన చేయాలని డిమాండ్ చేశారు. మరో వైపు గుజరాత్ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. ముక్త భారత నినాదంతో ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నామన్నారు. కర్ణాటక ఒక్క రాష్ట్రమే కాంగ్రెస్ ఆధీనంలో ఉందన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరిగే ఎన్నికల్లోకర్ణాటకను సైతం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. వారసత్వ, కుల, మతతత్వ రాజకీయాలకు అంతం పలికేందుకు బీజీపీ నడుం బిగించిదని స్పష్టం చేశారు. -
‘నిజమైన తుపానులు అనుకుని భ్రమపడొద్దు’
సాక్షి, తూర్పుగోదావరి : కృష్ణా, గోదావరి నదుల్లో వచ్చే సుడి గుండాల మాదిరిగా పోలవరం ప్రాజెక్టుపై చర్చ నడుస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు వ్యాఖ్యానించారు. కాకినాడలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ..పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పై ఎవ్వరికీ అనుమానం ఉండాల్సిన పని లేదన్నారు. పోలవరం నిర్మించే బాధ్యత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానిదని తెలిపారు. డబ్బుల కోసం వెనకాడకు అని చంద్రబాబు నాయుడికి చెప్పిన కారణంగానే పోలవరం ప్రాజెక్టు సాగుతోందన్నారు. టీ కప్పులో తుఫాన్లను చూసి నిజమైన తుఫాన్లు అనుకుని భ్రమపడవద్దని మురళీధర్ రావు హితవు పలికారు. -
బీజేపీ బలోపేతమే లక్ష్యం
♦ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ ♦ టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయే ♦ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు హన్మకొండ: తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం మిషన్ సౌత్–2019 ప్రత్యేక కార్యక్రమం తీసుకుని ముందుకు పోతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోల్సాని మురళీధర్‌రావు అన్నారు. శుక్రవారం హంటర్ రోడ్డులోని వేద బాంక్వెట్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిషన్ సౌత్ ద్వారా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రత్యేక వ్యూహంతో ముందుకు పోతున్నారన్నారు. దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు జాతీయ స్థాయిలోని ప్రముఖ నాయకులను ఎంపిక చేసి ప్రాంతాల వారీగా బాధ్యతలు అప్పగించారన్నారు. అన్ని రాష్ట్రాల్లో గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందన్నారు. దక్షిణాదిలో సొంతంగా బలం సంపాదించాలన్నదే ప్రధాన లక్ష్యమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యమ్నాయ అవకాశాలు లేవన్నారు. టీఆర్ఎస్కు ప్రత్యమ్నాయం బీజేపీ మాత్రమేనన్నారు. గతంలో పాలించిన కాంగ్రెస్‌కు ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు తేడా ఏమి లేదన్నారు. అవే రైతు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయన్నారు. రైతుల సమస్యలకు పరిష్కారం చూపుతుందనే విశ్వాసం టీఆర్ఎస్పై లేదన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీ జాతీయ నాయకత్వం శాయశక్తులా కృషి చేస్తుందన్నారు. సమావేశంలో బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్తినేని ధర్మారావు, ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, కిసాన్‌మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావు, నాయకులు సంతోష్ రెడ్డి, జగదీశ్వర్, గురుమూర్తి, శ్రీనివాస్, కూరపాటి వెంకటనారాయణ, వినోద్ పాల్గొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో దక్షిణాది కీలకం
► బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ► తెలంగాణలో పూర్తి స్థాయిలో బలపడేందుకు కార్యాచరణ ► ఏపీలో పొత్తులపై ఎన్నికల సమయంలోనే నిర్ణయం సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 350 పార్లమెంటు స్థానాల్లో విజయమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఇప్పటి నుంచే తగిన కార్యచరణ ప్రణాళిక రూపొందించినట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి దక్షిణాది కీలకం కానుందని, అన్ని దక్షిణ రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో బలపడేం దుకు క్షేత్రస్థాయి నుంచి కృషి చేస్తున్నట్లు పేర్కొ న్నారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. పార్టీ సంస్థాగత బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను వివరిం చారు. ఇప్పటి వరకూ బీజేపీ గెలవని 150 స్థానా లపై ప్రత్యేక దృష్టిసారించినట్టు వివరించారు. ఏపీ, తెలంగాణలో ఒంటరిగా బలపడేందుకు ప్రయత్ని స్తున్నామని చెప్పారు. ఎన్నికలప్పుడే నిర్ణయం: ఏపీలో బీజేపీ ఒంటరిగా బలోపేతమయ్యేం దుకు అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు మురళీధర్‌రావు తెలిపారు. అందులో భాగంగానే పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీలో త్వరలో పర్యటిస్తారన్నారు. ఏపీలో ఒంటరిగా పోటీ చేయడమా లేక పోత్తులు పెట్టుకోవడమా.. లేదం టే ఎన్నికల తర్వాత పొత్తుపెట్టుకోవడమా అనేది పార్టీ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో బలపడేందుకు అస్త్రాలు.. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి అన్ని ప్రయ త్నాలు చేస్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతే తమ ప్రధాన అస్త్రమని, సరైన సమయం లో పోరాటం ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఎంఐఎం అడుగులకు టీఆర్ఎస్ మడుగులొత్తు తూ విమోచన దినోత్సవాన్ని విస్మరిస్తోందని, తాము దాన్ని జరిపితీరుతామన్నారు. రాష్ట్ర పార్టీలో భారీ చేరికలు ఉంటాయని, బీజేపీకి జైకొట్టే వాళ్లందరినీ పార్టీలో చేర్చుకుంటామని చెప్పారు. తమిళనాడు రాజకీయాలు ఓ కొలిక్కి వచ్చాక కేంద్ర కేబినెట్, బీజేపీలో మార్పులు ఉంటాయన్నారు. అప్పుడే పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకాలు జరుగుతాయన్నారు. -
‘కాంగ్రెస్‌కు ప్రశ్నించే దమ్ము లేదు’
వేములవాడ(రాజన్న సిరిసిల్ల): తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దమ్ములేనిదైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు విమర్శించారు. పండిత్ దీన్‌దయాళ్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన ‘గడపగడపకు బీజేపీ’ కార్యక్రమం మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రశ్నించేందుకు కాంగ్రెస్ పార్టీకి దమ్ము సరిపోవడం లేదన్నారు. రానున్న రోజుల్లో ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీసే పార్టీగా బీజేపీ అవతరించబోతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విడుదల చేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజలకు, రైతులకు ఎంతో విశ్వాసం ఉందని.. వచ్చేరోజుల్లో తెలంగాణలో బలమైన శక్తిగా ఎదుగుతామని చెప్పారు. సీఎం కేసీఆర్ సర్వే పేరుతో జనాల్ని మోసం చేస్తున్నారని.. కేవలం ఇది మైండ్‌గేమ్ అని, హౌస్ సర్వేలను తమ పార్టీ ఏమాత్రం పట్టించుకోబోదన్నారు. -
దక్షిణాదిలో అమిత్ షా పర్యటన
-
‘2019 ఎన్నికల లక్ష్యంగానే అమిత్ షా పర్యటన’
నల్గొండ జిల్లా: 2019 ఎన్నికల లక్ష్యంగానే దక్షిణాదిలో అమిత్ షా పర్యటన ఉంటుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. దీనికి తెలంగాణను వేదిక చేసుకున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో బీజేపీ బలపడటానికే అమిత్ షా టూర్ ఫ్లాన్ చేశామని చెప్పారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని ఇప్పటి వరకు పాలించిన పార్టీలు మరిచిపోయాయని, వారి పోరాటపటిమ గుర్తుచేయడానికి నల్లగొండ జిల్లాలో విభిన్న ప్రాంతాల్లో అమిత్ షా పర్యటన ఉంటుందన్నారు. పార్టీలో చేరడానికి నల్లగొండ, హైదరాబాద్, ఢిల్లీలో మా నేతలను ఇతర పార్టీల వారు సంప్రదిస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో ఊహించని స్థాయిలో పార్టీలో చేరికలుంటాయన్నారు. -
ఆమె వల్లే సమస్యలన్నీ.. ఏదో ఒకటి చేయాలి
శోభను కట్టడి చేయాలి మురళీధర్రావ్కు అసంతృప్తుల ఫిర్యాదు! సాక్షి, బెంగళూరు: కర్ణాటక బీజేపీలో ఇటీవల ఏర్పడిన అనైక్యతకు సీనియర్ నాయకురాలు, ఎంపీ శోభా కరంద్లాజే కారణమని అసంతృప్త నాయకులు పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మురళీధర్రావ్కు ఫిర్యాదు చేశారు. ఆమెను కట్టడి చేస్తే అంతా సర్దుకుంటుందని చెప్పినట్లు సమాచారం. బీజేపీ సీనియర్ నాయకుడు కే.ఎస్ ఈశ్వరప్ప నాయకత్వంలో కొంతమంది యడ్యూరప్ప పై తిరుగుబావుటా ఎగురవేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హై కమాండ్ సూచన మేరకు మురళీధర్‌రావు సదరు అసంతృప్త నేతలతో శనివారం ఉదయం ఏడుగంటల నుంచి దాదాపు మూడు గంటల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కే.ఎస్ ఈశ్వరప్ప, మాజీ మంత్రి సొగడు శివణ్ణ, మాజీ ఎమ్మెల్సీ భానుప్రకాశ్‌తో సహా 24 మంది అసంతృప్తులు పాల్గొన్నారు. ‘యడ్యూరప్పే మా నాయకుడు. ఆయన మార్గదర్శంలోనే పార్టీ ఎన్నికలకు వెళ్లడానికి మాకు ఎటుంవంటి అభ్యంతరం లేదు. అయితే పార్టీ కార్యక్రమాలు, ముఖ్యమైన నిర్ణయాల్లో శోభ కరంద్లాజే అనవసర జోక్యం చేసుకుంటున్నారు. యడ్యూరప్ప కూడా ఆమెకే పెద్దపీట వేయడం వల్ల పార్టీ పటిష్టత కోసం మొదటి నుంచి కృషి చేసిన వారికి సరైన స్థానం దక్కడం లేదు. ఆమెను అదుపు చేస్తే పార్టీలో సమస్యలు సర్దుకుంటాయి’ అని చెప్పడమే కాకుండా ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా అందజేసినట్లు తెలుస్తోంది. బహిరంగ విమర్శలు వద్దన్న రావ్ అందరి మాటలు విన్న మురళీధర్‌రావ్ త్వరలోనే తాను అటు వైపు నాయకులతో కూడా మాట్లాడతానని అయితే ఇక పై ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగ వేదికపై యడ్యూరప్పకు, పార్టీకి విరుద్ధంగా విమర్శలు చేయకూడదని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అతిక్రమిస్తే కఠిన చర్యలకు పార్టీ వెనుకాడబోదని తేల్చిచెప్పారు. 2018 ఎన్నికలయ్యే వరకూ ఏ విషయాలనైనా పార్టీ లోపలే చర్చించాలని బీజేపీ అధినేత అమిత్‌షా హెచ్చరికగా మురళీధర్‌రావ్ అసంతృప్తులకు తెలిపారు. తాము ఇక పై బహిరంగంగా విమర్శలు చేయబోమని అసంతృప్తులు ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. -
ప్రభుత్వాన్ని కాపాడుకోడానికే.. కలుస్తున్నారు!
తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించే ఆలోచన ఏమీ లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు చెప్పారు. ఉప ఎన్నికల విషయంలో టీటీవీ దినకరన్ అధికార దుర్వినియోగానికి పాల్పడి దొరికేశారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు రెండూ కలవాలని చూస్తున్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అమిత్ షా... మే 23, 24, 25 తేదీలలో తెలంగాణలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పర్యటిస్తారని, ఆ తర్వాత మరోసారి సెప్టెంబర్ నెలలో కూడా పర్యటిస్తారని మురళీధర్ రావు తెలిపారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు చాలామంది తమతో టచ్‌లో ఉన్నారని అన్నారు. ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని వివరించారు. -
2019లో ఒంటరిగా తలపడతాం