
బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు
హైదరాబాద్ : నల్ల ధనం, అవినీతిని రాజకీయాల్లో అరికట్టకపోతే నీతివంతమైన రాజకీయాలు చేయడం కష్టమని బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర బడ్జెట్‌పై అవగాహన సదస్సు జరిగింది. బడ్జెట్‌పై మురళీధర్ వివరణ ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. గత నాలుగేళ్ల పాలనలో అవినీతి ఆరోపణలు లేకుండా బీజేపీ ప్రభుత్వం పాలిస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రధాని మోదీ ప్రతిష్ట పై అనేక సార్లు టెస్టులు జరిగాయని వ్యాఖ్యానించారు.
టీఆర్‌ఎస్ నాయకులకు , పార్టీకి ప్రధాని పాపులారిటీ పై మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. తెలంగాణ ఆర్థిక మంత్రి అర్దాంతరంగా కేంద్రం ప్రభుత్వ కేటాయింపులపై వ్యతిరేకగళం విప్పుతున్నారని, జీఎస్టీ కౌన్సిల్లో ఎందుకు ఆర్థిక మంత్రి వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందన్నారు. ఇరిగేషన్, జాతీయరహదారుల శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దానికంటే ఎక్కువే కేటాయించిందని వ్యాఖ్యానించారు.
జాతీయరహదారుల కేటాయింపుల్లో దేశంలోనే అత్యధికంగా తెలంగాణకు కేటాయించారని వివరించారు. మేడారం జాతరను జాతీయ పండగగా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసిందని, కానీ పండగకు కొద్దిరోజుల ముందు తీర్మానం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. దీంట్లో తెలంగాణ ప్రభుత్వం బాధ్యతారాహిత్యం కనిపిస్తోందన్నారు. చత్తీస్‌గడ్ సీఎం రమణ్ సింగ్ వస్తే కూడా సరిగా భద్రత ఏర్పాట్లు చేయలేకపోయిందని, కలెక్టర్ స్థాయి అధికారికి ఏర్పాట్ల భాద్యతను అప్పగించి చేతులు దులుపుకుందని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment