
బీజేపీ బలోపేతమే లక్ష్యం
♦ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ
♦ టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే
♦ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు
హన్మకొండ:
తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం మిషన్ సౌత్–2019 ప్రత్యేక కార్యక్రమం తీసుకుని ముందుకు పోతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోల్సాని మురళీధర్‌రావు అన్నారు. శుక్రవారం హంటర్ రోడ్డులోని వేద బాంక్వెట్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిషన్ సౌత్ ద్వారా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రత్యేక వ్యూహంతో ముందుకు పోతున్నారన్నారు. దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు జాతీయ స్థాయిలోని ప్రముఖ నాయకులను ఎంపిక చేసి ప్రాంతాల వారీగా బాధ్యతలు అప్పగించారన్నారు. అన్ని రాష్ట్రాల్లో గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందన్నారు.
దక్షిణాదిలో సొంతంగా బలం సంపాదించాలన్నదే ప్రధాన లక్ష్యమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యమ్నాయ అవకాశాలు లేవన్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యమ్నాయం బీజేపీ మాత్రమేనన్నారు. గతంలో పాలించిన కాంగ్రెస్‌కు ప్రస్తుత టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనకు తేడా ఏమి లేదన్నారు. అవే రైతు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయన్నారు. రైతుల సమస్యలకు పరిష్కారం చూపుతుందనే విశ్వాసం టీఆర్‌ఎస్‌పై లేదన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీ జాతీయ నాయకత్వం శాయశక్తులా కృషి చేస్తుందన్నారు. సమావేశంలో బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్తినేని ధర్మారావు, ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, కిసాన్‌మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావు, నాయకులు సంతోష్ రెడ్డి, జగదీశ్వర్, గురుమూర్తి, శ్రీనివాస్, కూరపాటి వెంకటనారాయణ, వినోద్ పాల్గొన్నారు.