ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024కి సంబంధించిన పూర్తి కేంద్ర బడ్జెట్‌ను జూలై 23న సమర్పించనున్నారు. మూడవసారి తిరిగి ఎన్నికైన తర్వాత బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మొదటిసారి ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇదే. దేశ ఆర్థిక వృద్ధి, అభివృద్ధి, ఆర్థిక విధానాలపై ప్రభుత్వ విజన్‌ను బడ్జెట్‌లో వివిరించే అవకాశం ఉందని సమాచారం.
లోక్‌సభలో ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమర్పణ ప్రారంభమవుతుంది. అయితే గతంలో బడ్జెట్‌ను ఉదయం 11 గంటలకు సమర్పించేవారు కాదు. 1999 వరకు బడ్జెట్‌ను సాయంత్రం 5 గంటలకు సమర్పించే ఆనవాయితీ ఉండేది. ఆ సమయంలో అన్నీ బ్రిటీష్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేవి. అప్పట్లో లండన్.. భారతదేశంలో ఏకకాలంలో బడ్జెట్ ప్రకటనలు ఉండేవని సమాచారం.
భారతదేశం యూకే కంటే 5 గంటల 30 నిమిషాలు ముందున్నందున, భారతదేశంలో సాయంత్రం 5 గంటల సమయం GMT ఉదయం 11:30కి అనుగుణంగా ఉంది. దీని వలన బ్రిటిష్ ప్రభుత్వానికి బడ్జెట్ ప్రకటనలను సమన్వయం చేయడం సులభతరం అయ్యేది. ఇదే ప్రక్రియ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా కొనసాగింది.
1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా బడ్జెట్ సమర్పణకు సంబంధించిన సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చాలని నిర్ణయించారు. భారత్ బ్రిటీష్ వారి సొత్తు కాదు, కాబట్టి లండన్ టైమ్ జోన్‌ను అనుసరించాల్సిన అవసరం లేదని.. బడ్జెట్‌ను అధ్యయనం చేయడానికి, చర్చించడానికి చట్టసభ సభ్యులు & అధికారులకు మరింత సమయం ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఫిబ్రవరి 27, 1999న యశ్వంత్ సిన్హా మొదటిసారిగా ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు. ఈ కొత్త సమయం శాశ్వత మార్పుగా మారింది. అప్పటి నుండి, అన్ని యూనియన్ బడ్జెట్‌లు ఉదయం 11 గంటలకు సమర్పించడం ఆనవాయితీగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment