presentation
-
అన్నిరంగాల్లో ఏఐదే కీలకపాత్ర
250 పరిశోధన పత్రాలతో సావనీర్ ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ (ఏఐ) అన్ని రంగాల్లో విస్తరిస్తోంది. ఇంటర్నెట్లో మనం వినియోగించేది ప్రతీది ఏఐపై ఆధారపడి పనిచేస్తుంది. ఏఐ గురించి ప్రాముఖ్యతను, దానిపై జరుగుతున్న పరిశోధనలను తెలిపేందుకు సిద్దిపేట వేదికైంది. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సూక్ష్మ జీవశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ విభాగాల ఆధ్వర్యంలో ఏఐపై జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది.మొదటి రోజు రీసెర్చ్‌లు చేసిన వాటిపై పోస్టర్ ప్రజంటేషన్ చేశారు. ఈ సదస్సు సందర్బంగా దేశంలోని పలు యూనివర్సిటీల ఏఐ అనుబంధ అంశాలపై జరిగిన రీసెర్చ్‌లను ఆహ్వానించారు. ఆయా యూనివర్సిటీలు ఆన్లైన్ ద్వారా పరిశోధన పత్రాలను పంపించాయి. – సాక్షి, సిద్దిపేట250 పరిశోధన పత్రాలతో సావనీర్ ఈ సదస్సు సందర్భంగా తెలంగాణతో పాటు తమిళనాడు, ఆంధ్రపదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ల నుంచి దాదాపు 250 పరిశోధన పత్రాలు వచ్చాయి. వాటిని ఒక్క చోట చేర్చి సావనీర్‌ను రూపొందించారు. దీనికి ఐఎస్బీఎన్ (ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నంబరు) లభించింది. దానిని శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సదస్సు శనివారం కూడా కొనసాగనుంది. ఏఐ ద్వారా డ్రగ్స్ కాంబినేషన్లు గుర్తించవచ్చు ప్రపంచంలో రెండవ అతి పెద్ద వ్యాధి బ్రెస్ట్ కేన్సర్. చెట్టు నుంచి వచ్చే కాంబినేషన్ బయో మెటాబోలైట్స్ ద్వారా బ్రెస్ట్ కేన్సర్‌ను నయం చేయవచ్చు. ఏఐ టూల్స్ ద్వారా కాంబినేషన్‌ను గుర్తించి ఆ డ్రగ్ సామర్థ్యాన్ని గుర్తించవచ్చు. ప్లాస్టిక్, స్మోకింగ్, ఫుడ్ ద్వారా కేన్సర్ బారిన పడుతున్నారు. ఉదాహరణకు తినుబండారాల కోసం గంటలకొద్దీ నూనెను మరగపెడుతారు. దీంతో అది విషంగా మారుతోంది. – డాక్టర్ పూర్ణచందర్,అసిస్టెంట్ ప్రొఫెసర్, సెంట్రల్ యూనివర్సిటీ, తమిళనాడు భవిష్యత్తులో ఏఐ కీలక పాత్ర భవిష్యత్తులో విద్యార్థులకు అనుకూలమైన అభ్యసన, అనుభవాలను అందించడంలో ఏఐ కీలక పాత్ర పోషించనుంది. బలాలు, బలహీనతల ఆధారంగా పాఠ్యాంశం డిజైన్‌కు ఏఐ ఎంతో ఉపయోగపడుతుంది. ఆటోమేటెడ్ గ్రేడింగ్ పద్ధతి ఇతర దేశాలలో వినియోగిస్తుండగా త్వరలో మన దేశంలో సైతం వినియోగంలోకి రానుంది. పిల్బాల్ని మనిషి వేసుకుంటే దాని ద్వారా దాదాపు 65 వేల ఫోటోలను తీసి అందిస్తోంది. ఇటీవల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పిల్బాల్ను టెస్ట్ చేశారు. పిల్బాల్తో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. ఏఐని ఎంత అభివృద్ధి చేసినా మానవునిపైనే ఆధారపడి పని చేస్తుంది. సైబర్ నేరస్తులను పట్టుకోవడంలో ఏఐ ప్రభావవంతమైన ఫలితాలను ఇస్తోంది. – రాఘవేందర్రావు, అసోసియేట్ ప్రొఫెసర్, నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాలడేటా పంపేప్పుడు జాగ్రత్తలు పాటించాలి.... తెలిసిన వారికి, తెలియని వారికి మొబైల్ ద్వారా డేటా పంపే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మనం పంపే డేటా ఏ యాప్ నుంచి పంపిస్తున్నామో వారికి సైతం చేరే అవకాశం ఉంటుంది. హ్యుమనైడ్స్ పద్ధతి–2030 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. హ్యుమనైడ్స్ అంటే మనిషి ఇంట్లో చేసే పనులు అన్ని రోబో చేస్తుంది. మోకాలు సర్జరీ రోబో ద్వారా చేయడం వలన కుట్ల సంఖ్య తగ్గుతుంది. – డాక్టర్ ప్రవీణ్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మెథడిస్ట్ ఇంజనీరింగ్ కళాశాల షుగర్‌తో కంటి చూపుపై ఎఫెక్ట్ షుగర్ ద్వారా తయారయ్యే ఉత్పత్తులను తినడం వలన కంటి చూపుపై ఏ విధంగా ఎఫెక్ట్ చూపుతుందో నా రీసెర్చ్ ద్వారా వివరించాను. పుణె యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశాను. ఇంటర్న్‌షిప్‌లో ఈ రీసెర్చ్ చేశాను. నా పరిశోధనను సావనీర్లో పబ్లిష్ చేయడం ఆనందంగా ఉంది. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. – శాలిని చౌహాన్, పుణె యూనివర్సిటీ -
బడ్జెట్.. 1999 ముందు వరకు ఒక లెక్క... తర్వాత ఒక లెక్క!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024కి సంబంధించిన పూర్తి కేంద్ర బడ్జెట్‌ను జూలై 23న సమర్పించనున్నారు. మూడవసారి తిరిగి ఎన్నికైన తర్వాత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మొదటిసారి ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇదే. దేశ ఆర్థిక వృద్ధి, అభివృద్ధి, ఆర్థిక విధానాలపై ప్రభుత్వ విజన్‌ను బడ్జెట్లో వివిరించే అవకాశం ఉందని సమాచారం.లోక్‌సభలో ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమర్పణ ప్రారంభమవుతుంది. అయితే గతంలో బడ్జెట్‌ను ఉదయం 11 గంటలకు సమర్పించేవారు కాదు. 1999 వరకు బడ్జెట్‌ను సాయంత్రం 5 గంటలకు సమర్పించే ఆనవాయితీ ఉండేది. ఆ సమయంలో అన్నీ బ్రిటీష్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేవి. అప్పట్లో లండన్.. భారతదేశంలో ఏకకాలంలో బడ్జెట్ ప్రకటనలు ఉండేవని సమాచారం.భారతదేశం యూకే కంటే 5 గంటల 30 నిమిషాలు ముందున్నందున, భారతదేశంలో సాయంత్రం 5 గంటల సమయం GMT ఉదయం 11:30కి అనుగుణంగా ఉంది. దీని వలన బ్రిటిష్ ప్రభుత్వానికి బడ్జెట్ ప్రకటనలను సమన్వయం చేయడం సులభతరం అయ్యేది. ఇదే ప్రక్రియ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా కొనసాగింది.1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా బడ్జెట్ సమర్పణకు సంబంధించిన సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చాలని నిర్ణయించారు. భారత్ బ్రిటీష్ వారి సొత్తు కాదు, కాబట్టి లండన్ టైమ్ జోన్‌ను అనుసరించాల్సిన అవసరం లేదని.. బడ్జెట్‌ను అధ్యయనం చేయడానికి, చర్చించడానికి చట్టసభ సభ్యులు & అధికారులకు మరింత సమయం ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.ఫిబ్రవరి 27, 1999న యశ్వంత్ సిన్హా మొదటిసారిగా ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు. ఈ కొత్త సమయం శాశ్వత మార్పుగా మారింది. అప్పటి నుండి, అన్ని యూనియన్ బడ్జెట్లు ఉదయం 11 గంటలకు సమర్పించడం ఆనవాయితీగా మారింది. -
అసెంబ్లీలో చంద్రబాబు స్కాం ప్రెజెంటేషన్
-
శ్రీవారి సేవలో సీఎం
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టువస్త్రాలను సమర్పించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండుసార్లు శ్రీవారిని దర్శించుకున్నారు. రెండు రోజుల పాటు తిరుపతి, తిరుమలలో గడిపిన సీఎం జగన్ శ్రీవారి సేవలో పాల్గొనడంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. తిరుపతిలో నూతనంగా నిర్మించిన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్, ఎస్వీ హాస్టల్ నూతన భవనాలను ప్రారంభించడంతోపాటు టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. మంగళ వాయిద్యాల నడుమ... మొదటి రోజైన సోమవారం రాత్రి శ్రీవారికి సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు. తొలుత తిరుపతి నుంచి రోడ్డు మార్గాన తిరుమల చేరుకున్న సీఎం జగన్ భక్తుల కోసం దాతల సహకారంతో టీటీడీ నిర్మించిన రెండు విశ్రాంతి గృహాలను ప్రారంభించారు. పద్మావతి అతిథి గృహంలో కొద్దిసేపు గడిపారు. అనంతరం శ్రీవారి ఆలయానికి ఎదురుగా కొలువై ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రధాన అర్చకులు ముఖ్యమంత్రికి పరివట్టం కట్టారు. అనంతరం సీఎం జగన్ ప్రభుత్వం తరఫున తీసుకొచ్చిన పట్టువస్త్రాలను తలపైన పెట్టుకుని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. ధ్వజ స్తంభానికి నమస్కరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళమాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు సీఎం జగన్‌ను ఆశీర్వదించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు, శ్రీవేంకటేశ్వర స్వామివారి కలంకారీ చిత్రపటాన్ని అందజేశారు. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, కార్య నిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి సీఎం వెంట ఉన్నారు. మరోసారి శ్రీవారిని దర్శించుకున్న సీఎం సోమవారం రాత్రి పద్మావతి అతిథి గృహంలో బస చేసిన ముఖ్యమంత్రి జగన్ మంగళవారం ఉదయం ప్రాతః కాల సమయంలో తిరుమల శ్రీవారిని మరోసారి దర్శించుకున్నారు. ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ముఖ్యమంత్రి జగన్‌కు వేదపండితులు వేదాశీర్వచనం అందచేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ముఖ్యమంత్రికి అందించారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రులు కొడాలి నాని, ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్సీలు సిపాయి సుబ్రమణ్యం, భరత్, ఈవో ఏవీ ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. ప్రాచీన సంప్రదాయాన్ని పాటిస్తూ గంగమ్మకు పూజలు ముఖ్యమంత్రి జగన్ సోమవారం సాయంత్రం తిరుమలకు బయలుదేరే ముందు ప్రాచీన సంప్ర దాయాన్ని పాటిస్తూ తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి, ఆదిమూలపు సురేష్, రోజా, తుడా చైర్మన్, టీటీడీ బోర్డు సభ్యుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గంగమ్మను శ్రీవేంకటేశ్వరుని సోదరిగా పురాణాలు చెబుతున్నాయి. ఏటా గంగమ్మ జాతర సందర్భంగా తిరుమల శ్రీవారి తరపున సంప్రదాయంగా గంగమ్మకు సారె పంపుతారు. సీఎం తిరుమల చేరుకునే ముందు గంగమ్మను దర్శించుకునే సంప్రదాయం చాలా దశాబ్దాల తరువాత గత సంవత్సరం నుంచి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి కృషితో పునఃప్రారంభమైంది. తిరుమలలోని పద్మావతి అతిథి గృహం ప్రాంతంలో దాతలు రాజేష్‌శర్మ, నరేంద్ర చౌదరి ఇ చ్చిన విరాళాలతో టీటీడీ వేర్వేరుగా నిర్మించిన 2 అతిథి గృహాలు వకుళామాత నిలయం, రచన విశ్రాంతి గృహాలను సీఎం ప్రారంభించారు. సోమవారం రాత్రి స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ముద్రించిన 2024 డైరీలు, క్యాలెండర్లను సీఎం జగన్ ఆవిష్కరించారు. ఇవి సెప్టెంబరు 22 నుంచి తిరుమల, తిరుపతిలో అందుబాటులో ఉంటాయి. అక్టోబరు రెండో వారం నుంచి ఇతర ప్రాంతాల్లో భక్తులకు అందుబాటులో ఉంటాయి. రూ.600 కోట్లతో 7 వేల మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు అన్నింటికన్నా సంతోషించే విషయం.. టీటీడీలో పనిచేస్తున్న దాదాపు 6,700 మంది ఉద్యోగులకు కచ్చితంగా ఇళ్ల స్థలాలు ఉండాలని, వారికి మంచి చేయాలన్న తపనతో వేగంగా అడుగులు వేశాం. రూ.313 కోట్లను ఖర్చు చేసి 3,518 మందికి ఇవాళ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం. మరో రూ.280 కోట్లు ఖర్చు చేసి ఇంకో 3,500 మందికి కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం. నెల నుంచి 45 రోజుల్లోగా ఇది కూడా పూర్తి చేస్తామని కలెక్టర్ చెప్పారు. దాదాపుగా రూ.600 కోట్లతో సుమారు 7 వేల మంది టీడీపీ ఉద్యోగులందరికీ ఇళ్ల పట్టాలిచ్చి వారి మొహల్లో సంతోషం చూసే మంచి కార్యక్రమం చేస్తున్నాం. 22 ఏ నుంచి తొలగించి పూర్తి హక్కులు తిరుపతిలో దాదాపు 8,050 మంది ఇళ్లు కట్టుకుని 22 ఏ సమస్యలో ఇరుక్కుని అమ్ముకోవాలనుకున్నా, పిల్లలకు ఇవ్వాలనుకున్నా కుదరక ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజుల కిందట వరదల సమయంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని నా దృష్టికి తెచ్చారు. ఆ సమస్యను పరిష్కరించి తిరుపతి ప్రజలకు మంచి చేస్తూ 22–ఏ నుంచి వాటిని డిలీట్ చేయించాం. చంద్రగిరిలో కూడా 2,500 మందిని 22–ఏ నుంచి డిలీట్ చేసి వారికి కూడా ఉపశమనం కలిగించాం. దేవుడి దయతో వీటన్నింటి వల్లా మంచి కోరుకుంటూ దాదాపు రూ.1,300 కోట్లకు సంబంధించిన పలు కార్యక్రమాలను ప్రారంభించుకుంటున్నాం. టెంకాయ కొట్టి వదిలేసిన టీడీపీ సర్కారు తిరుపతిలో గత ప్రభుత్వం టెంకాయ కొట్టి వదిలేసిన ప్రాజెక్టుని నాలుగేళ్లుగా చేయి పట్టుకుని నడిపిస్తూ శ్రీనివాస సేతుని పూర్తి చేసినట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. సోమవారం సాయంత్రం శ్రీనివాస సేతు వంతెనను ప్రారంభించిన సీఎం జగన్ ప్రజలకు అంకితం చేశారు. విద్యార్థులకు మరింత మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు నిర్మించిన శ్రీవేంకటేశ్వర కళాశాల హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. ‘శ్రీనివాస సేతు ప్రాజెక్టుకు 2019లో ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం టెంకాయ కొట్టి, జీవో ఇచ్చి వదిలేసింది. నాలుగేళ్లలో చిత్తశుద్ధితో పూర్తిచేసి ఇవాళ తిరుపతి ప్రజలకు అంకితం చేస్తున్నాం. దాదాపు రూ.650 కోట్ల వ్యయంతో నిర్మించిన 7 కి.మీ. పొడవైన ఈ ఫ్లైఓవర్‌తో భక్తులకు ఎంతో మేలు జరుగుతుంది. శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీ హాస్టళ్లకు సంబంధించి రూ.37.80 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన భవనాలను కూడా ఇవాళ ప్రారంభించుకుంటున్నాం. దీనివల్ల విద్యార్థులకు మరింత మెరుగైన వసతి అందుబాటులోకి రానుంది’ అని సీఎం పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. -
గోదావరిపై లిఫ్ట్ ఇరిగేషన్ ఘనత నాదే
సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్/మధురపూడి/సీతానగరం: గోదావరిపై ఉన్న ప్రతి లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చిన ఘనత తనకే దక్కుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్య టనలో భాగంగా మంగళవారం సీతానగరం మండలం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన ఆయన అనంతరం కోరుకొండ బహిరంగ సభలో ప్రసంగించారు. ఆవ భూముల్లో రూ.500 కోట్ల అవినీతి జరిగిందన్నారు. రాష్ట్రంలో జే–ట్యాక్స్ నడుస్తుంటే రాజానగ రంలో జక్కంపూడి ట్యాక్స్ నడుస్తోందని ఆరోపించారు. బ్లేడ్ బ్యాచ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబును పక్కన పెట్టు కుంటావా జగన్ అని ప్రశ్నించారు. ముని కూడలిలో గతంలో శిరోముండనానికి గురైన యువకుడితో మాట్లాడించారు. పురుషోత్త పట్నం ప్రాజెక్టు వద్ద ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పురుషోత్తపట్నం ఒక చరిత్రని, రెండులక్షల రైతుల జీవితాన్ని మార్చే ప్రాజెక్టుకు నీళ్లు అందించాలన్న ప్రాజెక్టును నాశనం చేశారన్నారు. తాను కట్టడం వల్లే దానిని వాడకూడదని జగన్ ఆలోచిస్తున్నాడన్నారు. ప్రజావేదికను కూల్చినట్టు ప్రాజెక్టు కూలిస్తే ఇక్కడి ప్రజలు తాటతీస్తారని హెచ్చరించారు. పోలవరంపై చేతులెత్తేశారు రాజమహేంద్రవరంలో సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల ఎత్తులోనే నిర్మాణమంటున్న సీఎం జగన్ దీనిని నిర్మించలేనని చేతులెత్తేసి, కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలంటున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రమే నిధులిస్తుందని, మనం చేయాల్సిందల్లా ఎలాంటి ఆరోపణలు తప్పులు చేయకుండా, వారి సూచనల ప్రకారం ప్రాజెక్ట్ నిర్మించడమేనని చెప్పారు. వైఎస్ జగన్ చేసిన పనుల వల్లే కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ మొత్తం పోయాయన్నారు. చేయాల్సిన నాశనంచేసి, ఇప్పుడు కేంద్రమే నిర్మించాలంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్ట్ నిర్మాణాలు ఎందుకు దెబ్బతిన్నాయనే దానిపై హైదరాబాద్ ఐఐటీ ఒక నివేదిక ఇచ్చిందని తెలిపారు. అందులో 14 కారణాలు చెబితే.. 13 కారణాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగానితనమేనని తేల్చాయని పేర్కొన్నారు. -
పుస్తకం.. ఓ బహుమానం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జాతీయ పుస్తక మహోత్సవం శుక్రవారం సందర్శకులతో పోటెత్తింది. మరో రెండు రోజుల్లో ప్రదర్శన ముగియనున్న దృష్ట్యా పుస్తకప్రియులు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ చివరి నాటికే ముగిసే పుస్తక ప్రదర్శన ఈ ఏడాది నూతన సంవత్సరంలోకి అడుగిడుతోంది. జనవరి ఒకటో తేదీన ప్రదర్శన ముగియనుంది. పుస్తక ప్రియులను విశేషంగా ఆకట్టుకొనే వైవిధ్యభరితమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. 300 స్టాళ్లతో ఈ సంవత్సరం పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఒకవైపు పుస్తక ఆవిష్కరణలు, మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తక సమీక్షలు, అమ్మకాలతో సందడి నెలకొంది. పుస్తక ప్రదర్శన కేవలం పుస్తకాల అమ్మకాలకు మాత్రమే పరిమితం కాకుండా రచయితలను, పాఠకులను ఒకచోట చేర్చే వేదికగా మారింది.ఈ నెల 22వ తేదీన ప్రారంభమైనప్పటి నుంచి పుస్తక ప్రియుల నుంచి అనూహ్యమైన స్పందన కనిపిస్తోందని నిర్వాహకులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ‘కొత్త సంవత్సరం పుస్తక పఠనంతో ప్రారంభం కావాలని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పుస్తకాలు చదవాలనే లక్ష్యంతో జనవరి 1వ తేదీ వరకు ప్రదర్శన ఉండేవిధంగా ఏర్పాటు చేశాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.’ అని బుక్ ఫెయిర్ కమిటీ ఉపాధ్యక్షులు కోయ చంద్రమోహన్ తెలిపారు. గత వారం రోజుల్లో సుమారు 5 లక్షల మందికి పైగా సందర్శకులు తరలివచ్చినట్లు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఒక వేడుకగా నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శన ఈ సంవత్సరం సైతం అదే పండుగ వాతావరణాన్ని తలపించింది. వైవిధ్యభరితమైన జాతీయ, అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలు ఈ ప్రదర్శనలో భాగస్వాములుగా నిలిచాయి. పుస్తక ప్రదర్శనలో యువత పెద్ద సంఖ్యలో కనిపించడం విశేషం. తెలంగాణ పబ్లిషర్స్, తెలుగు అకాడమీ, విశాలాంధ్ర, నవతెలంగాణ, నవోదయ వంటి సంస్థల్లో పోటీ పరీక్షలకు కావలసిన పుస్తకాలను కొనుగోలు చేయడం మొదలుకొని ఎమెస్కో, సేజ్, పెంగ్విన్, నవయుగ, వీక్షణం, అరుణతార వంటి పుస్తక ప్రచురణ సంస్థల స్టాళ్లలో లభించే విలువైన నవలలు, సాహిత్య విశ్లేషణ పుస్తకాల వరకు పాఠకులు ఎంతో ఇష్టంగా కొనుగోలు చేశారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సైతం తరలి వచ్చారు. పుస్తక స్పర్శ గొప్పది డిజిటల్ కంటే పుస్తకస్పర్శ గొప్పది. ప్రస్తుత సమాజం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. మార్కెట్ శక్తులు అలజడిని సృష్టిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మౌలికమైన ఆనందాన్ని ఇచ్చేది పుస్తకమే. బంధువులు, ఆత్మీయులు, స్నేహితుల నుంచి కూడా లభించని సుఖం, సంతోషం పుస్తకం నుంచి లభిస్తాయి. పుస్తకాలను ప్రేమించండి. – గోరటి వెంకన్న, ప్రముఖ గాయకుడు, ఎమ్మెల్సీ -
600 స్లయిడ్‌లతో ‘పీకే’ ప్రణాళిక
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. వరుస ఓటములతో కుదేలైన హస్తం పార్టీకి జవసత్వాలు తొడిగేందుకు ఆయన తనదైన ప్రణాళిక రచించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినాయకులతో వరుస మంతనాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా రెండు వారాల్లో మూడో పర్యాయం సోనియా గాంధీతో భేటీలు నిర్వహించారు. బేషరతుగా ఆయన తమ పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారని కాంగ్రెస్ వర్గాల సమాచారం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ 2.0 ప్రణాళికను పీకే టీమ్ తయారు చేసినట్టు తెలుస్తోంది. 600 స్లయిడ్‌లతో కూడిన ఈ ప్రణాళికను ఇప్పటివరకు కాంగ్రెస్ నేతలెవరూ చూడలేదని.. సోనియా కుటుంబ సభ్యులకు మాత్రమే సూచనప్రాయంగా వెల్లడించినట్టు సమాచారం. కాంగ్రెస్ పునరుద్ధరణ ప్రణాళికలో ఏయే అంశాలు పొందుపరిచారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే గతంలో ప్రతిపాదించిన అంశాలే కాంగ్రెస్ 2.0 ప్రణాళికలోనూ ఉండే అవకాశముందని పలు జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. 1984 నుంచి 2019 వరకు కాంగ్రెస్ పతనాన్ని ప్రస్తావిస్తూ, అందుకు గల కారణాలను ప్రణాళికలో పేర్కొన్నట్టు సమాచారం. వారసత్వ ముద్ర, వ్యవస్థాగత లోపాలు, ప్రజలకు చేరువకాలేకపోవడం, విజయాలను నిలబెట్టుకోలేకపోవడం వంటి అంశాలను ప్రధానంగా స్పృశించినట్టు తెలుస్తోంది. పార్టీ నాయకత్వ ఎంపిక ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని సూచించినట్టు సమాచారం. సోనియా గాంధీ అధ్యక్షురాలిగా కొనసాగాలని.. రాహుల్ గాంధీని పార్లమెంటరీ బోర్డు చీఫ్‌గా నియమించాలని ప్రతిపాదించారు. కాంగ్రెస్ నాయకత్వం నిర్దేశించిన విధంగా క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పని చేయడానికి గాంధీయేతర కుటుంబానికి చెందిన వారిని వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా వైస్ ప్రెసిడెంట్ చేయాలని పేర్కొన్నారు. పార్టీ పదవులన్నింటికీ నిర్ణీత పదవీ కాలం ఉండాలన్నారు. (క్లిక్: జహంగీర్‌పురి కూల్చివేతలు.. సారీ చెప్పిన కాంగ్రెస్ నేత) పొత్తులపై స్పష్టమైన వైఖరి, పార్టీ వ్యవస్థాపక సిద్ధాంతాలకు కట్టుబడటం, క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలతో బలమైన సంస్థాగత సైన్యం, మీడియా, డిజిటల్ ప్రచారానికి పటిష్టమైన యంత్రాంగం కావాలని ప్రణాళికలో సూచించినట్టు సమాచారం. వారసత్వ రాజకీయాలను నియంత్రించడానికి ‘ఒక కుటుంబం, ఒక టికెట్’ విధానం అమలు చేయాలని కూడా ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ 2.0 ప్రణాళికలో ఇవే అంశాలు ఉంటాయా, ఇంకా ఏమైనా మార్పులు చోటుచేసుకుంటాయా అనేది తొందరలోనే తెలిసే అవకాశముంది. (క్లిక్: ప్రశాంత్ కిషోర్ అంటేనే ఓ బ్రాండ్) -
సాక్షి ప్రీమియార్ లీగ్ విజేతలకు బహుమతి ప్రదానోత్సవం
-
నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ కు అధికారులు ప్రజెంటేషన్
-
4 ఏళ్లలో.. అరవై ఏళ్ల ప్రగతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాగునీటి శాఖ దేశానికే దిక్సూచిగా నిలిచిందని.. తెలంగాణ సాగునీటి రంగంలో 60 ఏళ్లపాటు జరిగినదానికి సమానంగా గత నాలుగేళ్లలో అద్భుతమైన ప్రగతి చోటుచేసుకుందని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గత అరవై ఏళ్లలో తెలంగాణలో ఇరవై లక్షల ఎకరాలు సాగులోకి వస్తే.. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో అంతే స్థాయిలో అదనపు ఆయకట్టు సాగులోకి వస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రాజెక్టుల రీ–డిజైనింగ్‌లో సోషల్ ఇంజనీర్‌గా వ్యవహరిస్తే.. క్షేత్రస్థాయిలో ఇంజనీర్లు, ఇతర సిబ్బంది సైనికుల్లా పనిచేశారని ప్రశంసించారు. గురువారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్‌లో ‘సాగునీటి ప్రాజెక్టులు– నాలుగేళ్ల ప్రగతి’అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. సీఎస్ ఎస్కే జోషితోపాటు సాగునీటి శాఖ ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, సీఈలు సునీల్, శంకర్, మధుసూదన్‌రావు ఇతర ఇంజనీర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సాగునీటి ప్రగతిపై మంత్రి ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తన పదేళ్ల హయాంలో 5.71 లక్షల ఎకరాలకే నీరిచ్చిందని, అన్ని ప్రాజెక్టులను పెండింగ్‌లోనే పెట్టిందని హరీశ్ ఆరోపించారు. అదే తమ ప్రభుత్వం వచ్చాక పాత వాటిని పూర్తి చేస్తూనే.. కొత్త ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తోందని చెప్పారు. అందరి సహకారంతో విజయం.. నిజాంసాగర్, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ల కింద మొత్తంగా 18.6 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉంటే.. ఈ ఏడాది రబీలో ఏకంగా 13 లక్షల ఎకరాలకు నీరందిందని హరీశ్‌రావు తెలిపారు. ‘‘ఇప్పుడు రైతాంగం ఎక్కడా నీటి కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేయడం లేదు. రైతులకు ఈ ఏడాది 13 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చిన ఘనత మన కేసీఆర్‌కే చెల్లింది. ప్రతిసారి శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్షాలు ఆయకట్టు చివరి భూములకు నీరు ఇవ్వాలన్న డిమాండ్లతో ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసేవి. కానీ ఇప్పుడు అలాంటి డిమాండ్ లేకపోవడం మా శాఖ గౌరవాన్ని ఇనుమడింపజేసింది. నీటి యాజమాన్య పద్ధతులు, ఇంజనీర్ల నిరంతర పర్యవేక్షణ, వివిధ శాఖలతో సమన్వయం కారణంగా ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టు వరకు నీరు అందించగలిగాం.’’అని పేర్కొన్నారు. ఇక మిషన్ కాకతీయ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు దాని అమలుకు ముందుకొచ్చాయని చెప్పారు. కాళేశ్వరం 19 ప్రాజెక్టులతో సమానం కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుత ప్రయోగమని, ఇది 19 ప్రాజెక్టుల నిర్మాణంతో సమానమని హరీశ్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు అనుమతుల సాధన ఓ రికార్డయితే.. ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టేలా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని చెప్పారు. 139 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో నడిచే పంపులు వినియోగించడం ఆసియాలోనే తొలిసారని వివరించారు. ఈ ఏడాదిలోనే పాత వరంగల్ జిల్లాతో పాటు సూర్యాపేట జిల్లాకు ఈ ప్రాజెక్టు తొలి ఫలితాలు అందుతాయని తెలిపారు. సీఎం కేసీఆర్ వినూత్న ఆలోచనా విధానం, దాన్ని అమలుచేస్తున్న సాగు నీటి శాఖ గొప్పతనంతో ప్రాజెక్టు పరుగులు పెడుతోందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,832 కిలోమీటర్లు నీటిని సరఫరా చేసే మార్గాలు, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్లు, 203 కిలోమీటర్ల గ్రావిటీ టన్నెళ్లు, 98 కిలోమీటర్ల ప్రెషర్ పైప్లైన్లు, 22 లిఫ్టులు, 21 పంపుహౌజ్‌లు, 4,627 మెగావాట్ల విద్యుత్ సబ్స్టేషన్లు ఉన్నాయని హరీశ్ చెప్పారు. ఇలా ఒక ప్రాజెక్టులో భాగంగా ఇన్నింటిని నిర్మించడం ప్రపంచ రికార్డన్నారు. సాగునీటి శాఖలో సుదీర్ఘ కాలం ఒకే ఐఏఎస్ అధికారి పనిచేయడం అరుదైన విషయమని, అలాంటి ఘనత సీఎస్ ఎస్కే జోషి గడించారని కొనియాడారు. ఈ సందర్భంగా నీటి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన అధికారుల ను మంత్రి మొమెంటోలతో సత్కరించారు. ప్రజెంటేషన్‌లోని ముఖ్యాంశాలివీ.. ♦ 2004–2014 మధ్య కాలంలో సాగులోకి వచ్చిన కొత్త ఆయకట్టు 5.71 లక్షల ఎకరాలుకాగా.. స్థిరీకరణ జరిగింది 93 వేల ఎకరాలే. ఇందులో ఏఎంఆర్పీ, ఎస్సారెస్పీ–2 కింద 5.56 లక్షల ఎకరాలకు నీరిచ్చినట్టు చెప్పినా పారింది 1.5 లక్షల ఎకరాలు మాత్రమే. ♦ టీఆర్ఎస్ నాలుగేళ్ల హయాంలో ఎనిమిది పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయగా.. మరో 11 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసింది. దీంతో కొత్తగా 10 లక్షల ఎకరాలకు నీరివ్వడంతోపాటు మరో 15.72 లక్షల ఎకరాలను స్థిరీకరించడం జరిగింది. 2018–19లో మరో 10 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. ♦ మిషన్ కాకతీయలో భాగంగా పునరుద్ధరించిన చెరువుల కింద మొదటి దశలో 6.73 లక్షల ఎకరాలు, రెండో దశలో 4.29 లక్షలు, మూడో దశలో 1.45 లక్షల ఎకరాలకు కలిపి మొత్తంగా 12.47 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. చెరువుల్లో 8.10 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. కొత్తగా 1.05 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది. ♦ మహబూబ్‌నగర్ జిల్లాలో నాలుగు (కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్) ఎత్తిపోతల పథకాల కింద 2016–17లో 4.5 లక్షల ఎకరాలకు, 2017–18 ఏడాది రబీలో 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు 700 చెరువులు నిండాయి. దీంతో వలసలు ఆగాయి. ♦ప్రభుత్వం తెలంగాణలో పాత సాగునీటి ప్రాజెక్టులను పునరుద్ధరించాలని సంకల్పించింది. నాగార్జునసాగర్, నిజాంసాగర్, ఘనపూర్ ఆనకట్ట కాలువల ఆధునీకరణ పనులను పూర్తిచేసి మొత్తం ఆయకట్టుకు నీరందిస్తున్నాం. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువల ఆధునీకరణ కోసం ప్రభుత్వం వెయ్యి కోట్ల నిధులను మంజూరు చేసింది. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. -
పెళ్లి వేడుక... గాజుల కానుక
అమలాపురం టౌన్ :ఆడంబరాలదే పైచేయి అవుతున్న నేటి వివాహ తంతులో సంప్రదాయానికి పెద్దపీట వేసి అందరినీ ఆకట్టుకున్నారు వంటెద్దు నారాయణ స్వామి. ఎన్ని పిండివంటలు పెట్టామా? ఎంత అట్టహాసంగా వివాహం చేశామా? అని తలపోస్తున్న ఈ ఆధునిక కాలంలో సంప్రదాయానికి ఆయన ఊపిరులూదారు. ఒకప్పుడు ఏ ఇంటైనా పెళ్లి జరుగుతుంటే ఆ ఉళ్లో ముత్తైదువలందరినీ ఇంటికి సాదరంగా ఆహ్వానించి గాజుల మూటలతో ఊరూరా...తిరిగి అమ్మే గాజులమలారం వారిని రప్పించి అందరికీ గాజులు తొడిగించేవారు. ఆ సంప్రదాయ వేడుకనే ‘గాజుల కానుక’ అంటారు. ఆ సంప్రదాయాన్నే నారాయణ స్వామి తన కుమారుడి వివాహంలో పునరుద్ధరించారు. ఆ విశేషాన్నే వివాహ ఆహ్వాన పత్రికపై ముద్రించడం విశేషం. వివరాల్లోకి వెళితే.. రాజమహేంద్రవరంలో రైల్వే ఉద్యోగిగా పని చేసి ఇటీవలే వంటెద్దు నారాయణ స్వామి పదవీవిరమణ చేశారు. నారాయణస్వామి, సుబ్బలక్షి ్మ దంపతుల కుమారుడు శ్రీరామ భూషణం అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. అతని వివాహం ఈనెల 11న జరగనుంది. ఆ సందర్భంగా అమలాపురంలోని వంటెద్దువారి వీధిలో తమ ఇంటికి ఆవీధి, కల్వకొలనువారి వీధిలలోని ముత్తైదువలను పిలిపించి గాజుల వేడుక కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గతంలో గాజుల అమ్మేవారిని తీసుకు వచ్చారు. అనేక రకాల గాజులను ప్రదర్శనగా ఉంచారు. వాటిని ముత్తైదువులకు తొడిగించారు. కనుమరుగైపోయిన ‘గాజుల పండుగ’ను సంప్రదాయబద్దంగా చేసిన నారాయణస్వామి దంపతులను ఆ ముత్తైదువలు అభినందించారు. -
'ప్రాణహిత’పై పర్యావరణ కమిటీకి ప్రజెంటేషన్
సాక్షి, హైదరాబాద్: ‘ప్రాణహిత’ ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ) అనుమతులకు సంబంధించి కేంద్ర పర్యా వరణ శాఖ పరిధిలోని ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) ఎదుట రాష్ట్ర అధికారులు గురువారం ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాణ హిత నీటిని తమ్మిడిహెట్టి ద్వారా మళ్లించే ప్రక్రియ పర్యావరణ, ఆర్థిక, నిర్వహణ పరంగా అనుసరణీయంగా ఉంటుందని వివరించారు. పర్యావరణ మదింపు చేసుకునేందుకు విధి విధానాలను (టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్–టీఓఆర్)ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. తొలుత రూ.1,919 కోట్ల అంచనా, 56 వేల ఎకరాలకు నీరందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. అయితే తర్వాత రూ.4,231 కోట్ల అంచనాతో 2 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక రూపొం దించారు. తమ్మిడిహెట్టి వద్ద 4.5 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మించి.. 14.4 టీఎంసీల నీటిని తరలి స్తారు. ఈ అన్ని అంశాలపై ఈఏసీ కమిటీ ముందు ప్రాజెక్టు సీఈ భగవంతరావు వివరణ ఇచ్చారు. -
వెంకన్నకు శిల్పకారుడి కానుక
తెనాలి: పట్టణానికి చెందిన శిల్పకారుడు చింతక్రింది భాస్కర్ స్థానిక వైకుంఠపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి కోసం ముచ్చటైన కిరీటం, కర్ణాభరణాలు రూపొందించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి కిరీటాన్ని పోలిన నమూనాతో వీటిని తయారు చేశారు. తన స్థోమతకు తగినట్టుగా రాగితో చేసిన కిరీటంపై బంగారు పూత పూశారు. ‘జకో’ అని పిలిచే ఆస్ట్రేలియాకు చెందిన రాళ్లను పొదిగారు. కిరీటం, కర్ణాభరణాలకు దాదాపు ఆరు వేల రంగురాళ్లను వినియోగించినట్టు భాస్కర్ చెప్పారు. శ్రీవేంకటేశ్వరస్వామికి శనివారం తన కానుకగా వీటిని సమర్పించనున్నట్టు విలేకరులకు తెలియజేశారు. శిల్పకళలో ప్రఖ్యాతి చెందిన అక్కల సోదరుల మేనల్లుడైన భాస్కర్ చిన్నతనం నుంచీ శిల్పకళలో ఎదిగారు. ఇంతకు ముందు భావనారుషి ఆలయానికి రెండు కిరీటాలు, పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థానానికి కవచం చేసి ఇచ్చినట్టు చెప్పారు. -
జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ఆటా పాటా
-
చార్మినార్‌లో హెరిటేజ్ డే సందడి
యాకుత్‌పురా: వరల్డ్ హెరిటేజ్ డేను పురస్కరించుకొని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సోమవారం చార్మినార్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్కియాలజీ సూపరింటెండెంట్ నిజాముద్దీన్ తాహేర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చార్మినార్‌తో పాటు నగరంలోని చారిత్రాత్మక కట్టడాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలికి చెందిన అవైస్ పాఠశాల విద్యార్థులు సాంసృ్కతిక కార్యక్రమాలను నిర్వహించారు. చారిత్రక కట్టడాల ఫోటోలను ప్రదర్శించారు. కార్యక్రమంలో అధికారులు బాబ్జీరావు, అనిల్ కుమార్, సిహెచ్. పెద్దింటి, జిలానీ పాషా, గోపాల్ రావు, సిహెచ్. అంజయ్య తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ హెరిటేజ్ డేను పురస్కరించుకొని చార్మినార్‌ను తిలకించేందుకు సందర్శకులకు సోమవారం ఉచిత ప్రవేశం కల్పించారు. అయితే దీనిపై ముందస్తు ప్రచారం లేకపోవడంతో ఆశించిన స్పందన లభించలేదు. -
ప్రజంటేషన్‌కు కాంగ్రెస్ సన్నాహాలు
హైదరాబాద్: అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు అనుమతి కోరుతూ స్పీకర్‌కు లేఖ రాయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. శనివారం గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. పవర్ పాయింట్ ప్రజంటేషన్‌తో పాటు వ్యాప్కోస్ సంస్థకు లీగల్ నోటీసులు ఇచ్చే అంశంపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. గతంలో తమకు ఒక రకంగా...ఇప్పుడు అధికార టీఆర్ఎస్ పార్టీకు మరో రకంగా ప్రాజెక్టు డిజైన్లు ఇవ్వడంపై వ్యాప్కోస్ సంస్థకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అన్ని ప్రాజెక్టులను సమర్థించాల్సిందేనని నేతలు అభిప్రాయపడ్డారు. -
ఆయన విమర్శల్లో పసలేదు: కవిత
హైదరాబాద్ : అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సాగునీటి ప్రాజెక్టులపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన విరమ్శల్లో పస లేదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బావుందని దేశమంతా కితాబు ఇస్తుంటే కాంగ్రెస్ నేతలు వాస్తవాలు విస్మరించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఆదివారం ఆమె హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ను విజన్ ఉన్న నాయకుడిగా అంతా కొనియాడుతుంటే, భట్టి చేసిన విమర్శలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. భట్టి మాటల్లో నిజం ఉంటే అసెంబ్లీకి హాజరయ్యేవారని, ఎలా ఎదుర్కోవాలో అర్ధం కాకే పలాయనం చిత్తగించారని పేర్కొన్నారు. గడిచిన అరవై ఏళ్ల అన్యాయాలను సీఎం కేసీఆర్ ఎండగడతారనే భయంతోనే అసెంబ్లీకి డుమ్మా కొట్టారని తెలిపారు. భట్టివిక్రమార్క చెప్పే మాట్లా వాస్తవం ఉంటే రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం సభ్యులతో అధ్యయనం చేసి సీఎం దృష్టికి తీసుకు వెళతామన్నారు. పాలక, ప్రతిపక్షాలు కలిసి చేసే నిర్ణయాలు ప్రజలకు మేలు చేస్తాయని కవిత వివరించారు. ఏ విషయాన్నైనా చర్చించడానికి అసెంబ్లీకి మించిన వేదిక ఏముంటుందన్నారు. తన ప్రజెంటేషన్‌కు ముందు అన్ని పార్టీల సభ్యులను మాట్లాడాలని , అన్ని విషయాలను చర్చించాలని కోరిన విషయాన్ని సీఎంను విమర్శించే ప్రతిక్షాలు గుర్తు చేసుకోవాలని ఎంపీ కవిత హితవు పలికారు. -
నిలువుటద్దంలా జల విధానం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించిన తెలంగాణ జల విధానం రైతాంగం పట్ల ఆయనకున్న నిబద్ధతకు అద్దం పట్టిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ గురువారం ఇచ్చిన ప్రజెంటేషన్ గురించి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. తెలంగాణ రైతుల ఆకాంక్షలను ముఖ్యమంత్రి ప్రసంగం ఆవిష్కరించిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రైతాంగానికి కలిగే ప్రయోజనాల గురించి గత దశాబ్ద కాలంగా ఉద్యమ నాయకుడిగా వివరిస్తూ వచ్చిన ఆయన సీఎంగా లక్ష్యాన్ని సాధిం చడానికి ముందుకెళుతున్నారని చెప్పారు. -
2022 కల్లా టాప్-3లో ఏపీ
పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయ రాష్ట్రం మాది ‘డిప్లమసీ ఫర్ డెవలప్మెంట్’ సదస్సులో సీఎం చంద్రబాబు న్యూఢిల్లీ: 2022 నాటికి దేశంలో అగ్రస్థానంలో ఉండే మూడు రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో ‘డిప్లమసీ ఫర్ డెవలప్మెంట్’ అనే అంశంపై జరిగిన రాయబారుల సదస్సులో బాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్ 974 కి.మీ. కోస్తాతీరంతో ఇండియా గేట్ వేగా మారింది. ఓడరేవులు, విమానాశ్రయాలు, రైల్వే, రోడ్డు రవాణా తదితర మౌలిక వసతులున్నాయి. వాటర్, గ్యాస్, పవర్, రోడ్, ఫైబర్ తదితర 5 గ్రిడ్లు, 7 మిషన్లతో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోంది. 2022 నాటికి టాప్-3 రాష్ట్రాల్లో ఒకటిగా ఉండబోతోంది. 2029 నాటికి హై హ్యాపీనెస్ ఇండెక్స్ రాష్ట్రంగా మారనుంది. 2050 నాటికి అత్యంత ప్రాధాన్యత గల అంతర్జాతీయ గేట్ వేగా మారుతుంది. విభిన్న పాలసీలతో పాలనను మెరుగుపరిచాం. పెట్టుబడులు తరలివచ్చేందుకు వీలుగా సౌర, పవన విద్యుత్ విధానాలు, ఇండస్ట్రియల్ పాలసీ, ఐటీ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీ, ఇండస్ట్రియల్ వాటర్ పాలసీ, టూరిజం పాలసీ, పీపీపీ పాలసీ, ప్రైవేట్ యూనివర్సిటీస్ పాలసీ, కార్మిక రంగ సంస్కరణలు.. ఇలా అనేక పాలసీలు రూపొందించాం. 24 గంటల కరెంటు, 4 లక్షల హెక్టార్ల ల్యాండ్ బ్యాంక్, 20 ఎంబీపీఎస్ కనెక్టివిటీ తదితర వసతులు ఏపీకి మాత్రమే సొంతం. విభిన్న రంగాల్లో పెట్టుబడులకు 9 క్లస్టర్లను రూపొందించాం. వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కాబోతున్నాయి. జాతీయ స్థాయి విద్యాసంస్థలు, ఐటీఐఆర్ నెలకొనబోతున్నాయి. పెట్టుబడులకు అపరిమితమైన వనరులు ఉన్నాయి’ అని చంద్రబాబు వివరించారు. సిట్ సలహాదారుతో భేటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ టాక్సెస్ మాజీ చైర్మన్, నల్లధనంపై కేంద్రం వేసిన స్పెషల్ ఇన్వెస్ట్‌గేషన్ టీమ్(సిట్)కు సలహాదారుగా ఉన్న కె.వి.చౌదరితో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. మంగళవారం ఉదయం ఢిల్లీలోని ఏపీ భవన్లో ఉన్న సీఎం కాటేజీలో ఇరువురూ భేటీ అయ్యారు. అలాగే ఎన్టీపీసీ చైర్మన్ అరూప్రాయ్తో కూడా సీఎం భేటీ అయ్యారు. విశాఖ సమీపంలోని పూడిమడక వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన 400 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు ప్రాజెక్టు, 1000 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్రాజెక్టులపై చర్చించారు. వాటికి 5 వేల ఎకరాల స్థలం అవసరమని, రాయితీపై స్థలం కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు చెప్పారు. అలాగే ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నెలకొల్పుతున్న ప్రాజెక్టులపైనా సమీక్షించారు. భారత్‌లో మలేిసియా హైకమిషనర్ దాతుక్ నైమున్ అషక్లి బిన్ మహ్మద్‌తోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. -
రాజధాని నిర్మాణానికి అన్ని రకాల సహకారం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అన్నిరకాలుగా సహకారాన్ని అందిస్తానని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. ఆయన బుధవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజధానిపై అధ్యయనంకోసం ఏర్పాటు చేసిన శివరామకృష్ణ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా తనను కలిసినట్లు తెలిపారు. వారి అభిప్రాయాలను ప్రజెంటేషన్ రూపంలో వివరించారని చెప్పారు. కొత్త రాజధాని నిర్మాణానికి పెద్ద ఎత్తున ట్రాన్సుపోర్టేషన్ నెట్వర్క్, రోడ్లు, బీఆర్టీఎస్, మెట్రోరైలు నెట్వర్క్, లింకు రోడ్లు అవసరమని, ఆ విషయంలో పట్టణాభివృద్ధి శాఖ తగిన సహకారం అందించాలని కోరినట్లు వివరించారు. రైల్వే, ఉపరితల రవాణా, పెట్రోలియం నేచురల్ గ్యాస్, ఇతరత్రా మంత్రిత్వశాఖలు తగిన విధంగా సహకరిస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం సాధ్యమవుతుందని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారని చెప్పారు. కేంద్రం నుంచి అన్ని రకాల సహకారాన్ని తప్పనిసరిగా అందిస్తాననే విషయాన్ని చెప్పినట్లు ఆయన తెలిపారు. -
సారూ.. గుక్కెడు నీళ్లివ్వండి
= గోడు వెళ్లబోసుకున్న జనం = తూతూ మంత్రంగా సాగిన కరవు బృందం పర్యటన కోలారు, న్యూస్‌లైన్ :గంపెడాశలు పెట్టుకున్న జనాన్ని కరువు బృందం పర్యటన నిరాశ పరిచింది. కోలారు జిల్లాలోని ముళబాగిలు, బంగారుపేట, శ్రీనివాసపురం తాలూకాలను కరువు ప్రాంతాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సోమవారం కేంద్ర అధ్యయన బృందం ఈ ప్రాంతాల్లో పర్యటించింది. ఉదయం 9 గంటలకు కోలారు చేరుకున్న కేంద్ర బృందానికి జిల్లా కలెక్టర్ డీకే రవి తన కార్యాలయంలో కరువు పరిస్థితుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం బంగారుపేటకు చేరుకున్న అధ్యయన బృందం పట్టణంలోని గంగమ్మన పాళ్య కాలనీకి వెళ్లి పరిశీలించారు. కాలనీ వాసులు ఖాళీ బిందెలతో స్వాగతం పలికారు. ఏడాది కాలంగా తమ వార్డులో నీరు లేదని. ట్యాంకర్ల కోసమే వేచి ఉండాల్సి వస్తోందని తెలిపారు. బంగారుపేట ఎమ్మెల్యే నారాయణస్వామి కేంద్ర బృందానికి నీటి ఎద్దడి గురించి వివరించారు. తాలూకాలో సకాలంలో వానలు రాకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. అనంతరం తాలూకాలోని బడమాకన హళ్లి గ్రామంలో కూడా మహిళలు ఖాళీ బిందెలతోనే కేంద్ర బృందానికి స్వాగతం పలికారు. గ్రామంలో మూడేళ్లుగా నీరు సక్రమంగా రావడంలేదని, మూడు వేల జనాభా ఉన్న గ్రామంలో తాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రంతా బిందె నీటి కోసం వేచి ఉండాల్సి వస్తోందని వాపోయారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షురాలు మంజుల వారికి పరిస్థితిని వివరించారు. అనంతరం టి గొల్లహళ్లి చెరువును పరిశీలించారు. అక్కడి నుంచి ముళబాగిలు తాలూకాలోని నత్త, బల్ల, కాశీపుర గ్రామాలలో పర్యటించారు. తాలూకాలోని ఊరుకుంట మిట్టూరు వద్ద వాటర్ రీచార్జి ప్లాంటును పరిశీలించారు. తాగునీటికే ప్రాధాన్యం కరువు పరిస్థితులను అధ్యయనం చేయడానికి వచ్చిన కేంద్ర బృందం రైతుల పంట నష్టం తదితర అంశాలపై కాకుండా తాగునీటి సమస్యపైనే దృష్టి కేంద్రీకరించింది. ఆయా గ్రామాలలో మహిళల నుంచి తాగునీటి సమస్య గురించి విన్నారే కాని పంట పొలాలను పరిశీలించలేదు. రైతులను ప్రశ్నించలేదు. వారి కష్టాలను అడిగి తెలుసుకోలేదు. కేంద్ర బృందం పరిశీలించాల్సిన జాబితాలో ఐపల్లి చెరువు ఉన్నా.. కేవలం కారులో నుంచే చెరువును పరిశీలిస్తూ ముందుకు సాగారు. రూ.318 కోట్ల ప్రస్తావన జిల్లాలో కరువు పరిస్థితులను ఎదుర్కోడానికి జిల్లా కలెక్టర్ రవి రూ. 318.86 కోట్ల ప్రతిపాదనలను కేంద్ర బృందం ముందు ఉంచారు. పశు పెంపకానికి రూ. 15 కోట్లు, తాగునీటి సమస్య పరిష్కారానికి రూ. 59.64 కోట్లు, పంటనష్టానికి రూ. 257.72 కోట్లు ఇవ్వాలని విన్నవించారు. అయితే వచ్చే ఐదేళ్లలో తాగునీటి సమస్యను ఎదుర్కోవడానికి అయ్యే ఖర్చుకు మాత్రమే ప్రతిపాదనలు ఇవ్వాలని కేంద్ర బృందం కలెక్టర్‌కు సూచించింది. కాగా, జిల్లాలోని కరువు పరిస్థితులపై ఈ నెల 26 న రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శితో కలిసి చర్చిస్తామని, అనంతరం జనవరి 10న కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని కేంద్ర బృందం వెల్లడించింది.