ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉద్యోగులపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని చాలామంది నిపుణులు భావించిందే.. నిజమని పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే వెల్లడించింది. జాబ్ మార్కెట్‌పై కృత్రిమ మేధస్సు (AI) ప్రతికూల ప్రభావం ఉంటుందని భారత ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పాదకతను పెంచుతుంది. అయితే ఈ ప్రభావం అనేకరంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల మీద పడుతుంది. రాబోయే రోజుల్లో ఏఐ ప్రతి రంగంలోనూ పెను మార్పులను తీసుకువస్తుంది. దీంతో ఉద్యోగాల సంఖ్య తగ్గుతుందని ఆర్ధిక సర్వే స్పష్టం చేసింది.
ఏఐ ప్రభావం ఒక్క భారతదేశం మీద మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో కూడా గణనీయమైన మార్పులు సంభవించే అవకాశం ఉంది. పని వేగవంతం కావడమే మాత్రమే కాకుండా.. అధిక ఉత్పత్తి ఏఐ వల్ల సాధ్యమవుతుంది. ఇప్పటికే పలు దిగ్గజ సంస్థలు ఏఐ వాడకాన్ని విపరీతంగా పెంచేస్తున్నాయి.
కస్టమర్ సర్వీస్, టీచింగ్, యాంకరింగ్ వంటి వాటిలో కూడా ఏఐ ప్రభావం చాలా ఉంది. కాబట్టి ఈ రంగాల్లో రాబోయే రోజుల్లో ఉద్యోగావకాశాలు తగ్గవచ్చు. కాబట్టి ఉద్యోగార్థులు తప్పకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన పలు విషయాల్లో నైపుణ్యాలు పెంచుకోవాలి. అప్పుడే ఏఐ యుగంలో కూడా మనగలగవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment