job market
-
కొత్త సంవత్సరంలో జాబ్స్ పెరుగుతాయా? తగ్గుతాయా?
వచ్చే ఏడాదిలో నియామకాలు జోరుగా సాగనున్నాయి. 9 శాతం మేర నియామకాలు పెరగనున్నట్టు జాబ్ ప్లాట్‌ఫామ్ ఫౌండిట్ (గతంలో మాన్స్టర్ ఏపీఏసీ) వెల్లడించింది. ముఖ్యంగా ఐటీ, రిటైల్, టెలికం, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగాల్లో నియామకాలు మెరుగ్గా ఉంటాయని అంచనా వేసింది. ఈ ఏడాది మొత్తం మీద 10 శాతం మేర ఉపాధి అవకాశాల్లో వృద్ధి ఉంటుందని, రానున్న రోజుల్లో ఈ ధోరణి వేగాన్ని అందుకుంటుందని తెలిపింది.కొత్త టెక్నాలజీలు, మారుతున్న వ్యాపార సంస్థల ప్రాధాన్యతలు 2025లో ఉద్యోగ మార్కెట్ తీరును నిర్ణయించనున్నట్టు ఫౌండిట్ పేర్కొంది. ఎడ్జ్ కంప్యూటింగ్, క్వాంటమ్ అప్లికేషన్స్, అత్యాధునిక సైబర్ సెక్యూరిటీ సిస్టమ్‌లు.. తయారీ, హెల్త్‌కేర్, ఐటీ రంగాల్లో మార్పును తీసుకురానున్నట్టు వివరించింది. 2023 జనవరి నుంచి 2024 నవంబర్ వరకు ఫౌండిట్ ప్లాట్‌ఫామ్‌పై డేటా విశ్లేషణ ఆధారంగా ఈ వివరాలను విడుదల చేసింది. రిటైల్ మీడియా నెట్‌వర్క్‌లు, ఏఐ ఆధారిత విశ్లేషణ టూల్స్‌తో ఈ–కామర్స్, హెచ్ఆర్, డిజిటల్ సేవల్లో నిపుణుల అవసరాల తీరును మారుతుందని పేర్కొంది. డిజిటల్ మార్కెటింగ్, యాడ్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ అనలైటిక్స్‌లో నిపుణులను సంస్థలు నియమించుకుంటాయని తెలిపింది. ఇదీ చదవండి: బీమా ప్రీమియంపై పన్ను మినహాయించేనా?ఈ ఏడాదీ నియామకాల్లో జోరు..2023తో పోల్చి చూసినప్పుడు ఈ ఏడాది అన్ని రంగాల్లో, అన్ని పట్టణాల్లో జాబ్ మార్కెట్ బలమైన వృద్ధిని చూసినట్టు ఫౌండిట్ తెలిపింది. తయారీలో 30 శాతం, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్‌లో 29 శాతం, రియల్ ఎస్టేట్‌లో 21 శాతం చొప్పున నియామకాలు పుంజుకున్నట్టు పేర్కొంది. అధికంగా కోయింబత్తూర్‌లో 27 శాతం, జైపూర్‌లోనూ 22 శాతం మేర నియామకాల్లో వృద్ధి కనిపించినట్టు తెలిపింది. చురుకైన పారిశ్రామిక కార్యకలాపాలు, డిజిటలైజేషన్‌కు మళ్లడం, పట్టణీకర సానుకూలించినట్టు వివరించింది. -
1.2 కోట్ల మందికి జాబ్ గండం.. గుబులు పుట్టిస్తున్న నివేదిక!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతి రోజురోజుకూ పెరుగుతోంది. మానవ ఉద్యోగాలను హరించేస్తోంది. రానున్న రోజుల్లో సాధారణ ఉద్యోగాలు పొందడం చాలా కష్టతరం చేయబోతోంది. ముఖ్యంగా ఏఐ ప్రభావానికి ఎక్కువగా గురయ్యే పరిశ్రమలలో పనిచేసేవారికి ముప్పు తప్పదని కెరీర్ నిపుణులు చెబుతున్నారు.బిజినెస్ ఇన్సైడర్ కథనం ప్రకారం.. ఏఐ ఆగమనం కస్టమర్ సర్వీస్ రెప్స్, క్యాషియర్లు, ఆఫీస్ అసిస్టెంట్లు, ప్రొడక్షన్ వర్కర్లకు పెద్ద హెచ్చరిక. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన లేబర్ మార్కెట్, డిజిటల్ టెక్ పరిశోధకుడు జార్జియోస్ పెట్రోపౌలోస్ ప్రకారం, "మీడియం-స్కిల్డ్" కార్మికులు సాంకేతికత ద్వారా స్థానభ్రంశం చెందే అవకాశం ఉంది.అధిక-నైపుణ్యం కలిగిన కార్మికులు కూడా తమ ప్రస్తుత ఉద్యోగాల్లోకి ఏఐని జోడించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్ల వంటివారి సేవలకు మాత్రం నిరంతర డిమాండ్ ఉంటుంది. ప్రధాన స్రవంతిలోకి ఏఐ మరింతగా చొచ్చుకుని రావడం వల్ల రానున్న దశాబ్దాల్లో మీడియం-స్కిల్డ్ కార్మికుల్లో అధిక నిరుద్యోగం ఏర్పడుతుందని పెట్రోపౌలోస్ అంచనా వేస్తున్నారు. 20 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ ఏఐతో నడిచే జాబ్ మార్కెట్‌కి మారుతుంది అంటున్నారాయన.యూఎస్ జాబ్ మార్కెట్లో ఏఐ ప్రభావం కారణంగా తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులు డిమాండ్ కోల్పోతారని అంచనా వేస్తున్నారు మెకిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ క్వెలిన్ ఎల్లింగ్రూడ్. ఈయన ప్రకారం.. 2030 నాటికి 1.2 కోట్ల మంది ఉద్యోగులు వేరే కెరీర్లను వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇక ఈ దశాబ్దం చివరి నాటికి 6,30,000 క్యాషియర్లు, 7,10,000 అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లు, 8,30,000 మంది సేల్స్ ఉద్యోగులు ఉపాధిని కోల్పోతారని మెకిన్సే అంచనా వేసింది. అన్ని పరిశ్రమల్లోని క్లర్క్‌ల సంఖ్య 1.6 కోట్లు తగ్గుతుందని ఈ సంస్థ గత ఏడాది ఒక నివేదికలో పేర్కొంది. -
ఉద్యోగులపై ఏఐ ఎఫెక్ట్.. ఆర్థిక సర్వేలో కీలక విషయాలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉద్యోగులపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని చాలామంది నిపుణులు భావించిందే.. నిజమని పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే వెల్లడించింది. జాబ్ మార్కెట్‌పై కృత్రిమ మేధస్సు (AI) ప్రతికూల ప్రభావం ఉంటుందని భారత ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పాదకతను పెంచుతుంది. అయితే ఈ ప్రభావం అనేకరంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల మీద పడుతుంది. రాబోయే రోజుల్లో ఏఐ ప్రతి రంగంలోనూ పెను మార్పులను తీసుకువస్తుంది. దీంతో ఉద్యోగాల సంఖ్య తగ్గుతుందని ఆర్ధిక సర్వే స్పష్టం చేసింది.ఏఐ ప్రభావం ఒక్క భారతదేశం మీద మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో కూడా గణనీయమైన మార్పులు సంభవించే అవకాశం ఉంది. పని వేగవంతం కావడమే మాత్రమే కాకుండా.. అధిక ఉత్పత్తి ఏఐ వల్ల సాధ్యమవుతుంది. ఇప్పటికే పలు దిగ్గజ సంస్థలు ఏఐ వాడకాన్ని విపరీతంగా పెంచేస్తున్నాయి.కస్టమర్ సర్వీస్, టీచింగ్, యాంకరింగ్ వంటి వాటిలో కూడా ఏఐ ప్రభావం చాలా ఉంది. కాబట్టి ఈ రంగాల్లో రాబోయే రోజుల్లో ఉద్యోగావకాశాలు తగ్గవచ్చు. కాబట్టి ఉద్యోగార్థులు తప్పకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన పలు విషయాల్లో నైపుణ్యాలు పెంచుకోవాలి. అప్పుడే ఏఐ యుగంలో కూడా మనగలగవచ్చు. -
2030 నాటికి జాబ్ మార్కెట్ షేక్.. కలవరపెడుతున్న రిపోర్ట్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వచ్చే దశాబ్దంలో జాబ్ మార్కెట్లో గణనీయమైన మార్పులకు కారణమవుతుంది. మెకిన్సే నివేదిక ప్రకారం.. 2030 నాటికి సుమారు 1.2 కోట్ల వృత్తిపరమైన పరివర్తనలకు దారితీస్తుంది. ఇది కోవిడ్ -19 మహమ్మారి సమయంలో కనిపించిన ఉద్యోగ మార్పులతో పోల్చదగిన వేగం.మెకిన్సే సీనియర్ పార్ట్నర్, దాని గ్లోబల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ క్వైలిన్ ఎలిన్‌గ్రుడ్ ఇటీవల జరిగిన మీడియా డే సందర్భంగా ఈ విషయాలను పంచుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పురోగతి కారణంగా కొన్ని రంగాలు ముఖ్యంగా హెల్త్ కేర్, స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం) రంగాలు వృద్ధిని చవిచూస్తాయని భావిస్తున్నారు.ప్రభావితమయ్యే రంగాలు ఇవే..ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావిత ఉద్యోగ మార్పులు ప్రధానంగా నాలుగు ప్రధాన విభాగాలలో కేంద్రీకృతమై ఉంటాయి. అవి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెన్స్, కస్టమర్ సర్వీస్ అండ్ సేల్స్, ఫుడ్ సర్వీస్ అండ్ ప్రొడక్షన్, మ్యాన్యుఫ్యాక్చరింగ్. ఈ విభాగాల్లో పునరావృత పనులు, డేటా కలెక్షన్, ప్రాథమిక డేటా ప్రాసెసింగ్ నిర్వహించే వారిపై మార్పు ప్రభావం ఉంటుందని ఎల్లిన్గ్రుడ్ పేర్కొన్నారు. ఈ విధులు ఆటోమేషన్‌కు ప్రధాన లక్ష్యమని, వీటిని ఏఐ సమర్థవంతంగా నిర్వహించగలదని ఆమె చెబుతున్నారు. 2030 నాటికి డిమాండ్ తగ్గుతున్న ఉద్యోగాల్లోని సుమారు 1.18 కోట్ల మంది కొత్త పనులకు మారాల్సి ఉంటుందని మెకిన్సే నివేదిక అంచనా వేసింది.ఈ మార్పులకు అనుగుణంగా ఉద్యోగులు క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఎలిన్‌గ్రుడ్ ఎత్తిచూపారు. అభివృద్ధి చెందుతున్న జాబ్ ల్యాండ్ స్కేప్ గురించి తెలుసుకోవడం, ఆటోమేషన్ కు తక్కువ అవకాశం ఉన్న నైపుణ్యాలను పెంపొందించుకోవడం వ్యక్తులకు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. మానవ సృజనాత్మకత, క్రిటికల్ థింకింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌ను యంత్రాలు భర్తీ చేయలేవు. ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టాలని ఆమె సూచిస్తున్నారు. -
ఈ ఏడాది నియామకాల్లో రికవరీ
ముంబై: డిసెంబర్లో జాబ్ మార్కెట్ కోలుకుంటున్న సంకేతాలు కనిపించిన నేపథ్యంలో ఈ ఏడాది నియామకాలు మెరుగుపడవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. 2024లో మొత్తం హైరింగ్ 8.3 శాతం వృద్ధి చెందవచ్చని భావిస్తున్నారు. కన్సల్టెన్సీ సంస్థ ఫౌండిట్ రూపొందించిన వార్షిక ట్రెండ్స్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం గతేడాది డిసెంబర్లో హైరింగ్‌లో 2 శాతం వృద్ధి నమోదైంది. కొత్త సంవత్సరంలో నియామకాల వృద్ధి 8.3 శాతంగా ఉండవచ్చని, బెంగళూరులో అత్యధికంగా 11 శాతం వృద్ధి నమోదు కావచ్చని నివేదిక పేర్కొంది. తయారీ, బీఎఫ్ఎస్ఐ, ఆటోమోటివ్, రిటైల్, ట్రావెల్, టూరిజం విభాగంలో హైరింగ్ ఎక్కువగా ఉండనుంది. 2022తో పోలిస్తే 2023లో హైరింగ్ కార్యకలాపాలు 5 శాతం తగ్గాయి. అయితే, డిసెంబర్లో కాస్త మెరుగ్గా 2 శాతం వృద్ధి కనపర్చింది. 2022 మధ్య నుంచి జాబ్ మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్న ట్రెండ్ 2023 ఆఖర్లో మారిందని నివేదిక తెలిపింది. ఉద్యోగావకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ సరైన వారిని నియమించుకోవడంలో వ్యాపార సంస్థలకు సవాళ్లు ఎదురవుతున్నాయని, జాబ్ ఓపెనింగ్స్, హైరింగ్ మధ్య వ్యత్యాసం ఇదే సూచిస్తోందని పేర్కొంది. గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు తమ ప్లాట్ఫామ్లో నమోదైన డేటాను విశ్లేషించిన మీదట ఫౌండిట్ ఈ నివేదికను రూపొందించింది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ 2023లో కొన్ని రంగాలు చెప్పుకోతగ్గ స్థాయిలో వృద్ధి కనపర్చాయి. మారిటైమ్, షిప్పింగ్ పరిశ్రమలో నియామకాలు 28 శాతం పెరిగాయి. అంతర్జాతీయంగా వాణిజ్యం పెరగడం, సరఫరా వ్యవస్థలో సమస్యలు తగ్గుముఖం పట్టడం ఇందుకు తోడ్పడ్డాయి. అలాగే రిటైల్, ట్రైవెల్, టూరిజం రంగాల్లో కూడా 25 శాతం వృద్ధి నమోదైంది. అడ్వరై్టజింగ్, మార్కెట్ రీసెర్చ్, పబ్లిక్ రిలేషన్స్ రంగాల్లో 18 శాతం పెరుగుదల కనిపించింది. æ 2024లో కొత్త టెక్నాలజీల్లో అనుభవమున్న నిపుణులకు డిమాండ్ పెరగనుంది. కృత్రిమ మేథ/మెíÙన్ లెరి్నంగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ నిపుణులకు గణనీయంగా అవకాశాలు ఉంటాయి. -
పాపం చైనా యువతకు ఎంత కష్టం వచ్చింది!
ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా (China)లో నిరుద్యోగం (Unemployment) తాండవిస్తోంది. అక్కడ యువత ఉద్యోగాలు దొరక్క అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఫ్రెషర్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తాజాగా సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేసిన జాంగ్ అనే యువతి ఉద్యోగం కోసం వేలకొద్దీ రెజ్యూమ్‌లను చైనీస్ కంపెనీలకు పంపినప్పటికీ, ఆమె ఎంచుకున్న మార్కెట్ పరిశోధన రంగంలో జాబ్ దొరకలేదు. నెలల తరబడి అన్వేషించినా ఉద్యోగం దొరక్కపోవడంతో నిరాశ నిస్పృహలకు గురైన 23 ఏళ్ల జాంగ్.. తాను యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే ఉద్యోగ అన్వేషణలో ఉన్న యువత మానసిక స్థితి ఎలా ఉంటుందన్నదానిపై ఓ సర్వే కూడా గమనార్హం. గ్రాడ్యుయేషన్ తర్వాత యువతపై ఎంత మానసిక ఒత్తిడి ఉంటుందో తనకూ అనుభవంలోకి వచ్చినట్లు ఇటీవల బీజింగ్‌లో జరిగిన రిక్రూట్మెంట్ ఫెయిర్‌లో ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీతో జాంగ్ పేర్కొంది. తాను పంపే ప్రతి పది రెజ్యూమ్‌లకు ఒక స్పందన మాత్రమే వస్తున్నట్లు ఆమె చెప్పింది. యువత నిరుద్యోగం విపరీతంగా పెరుగుతున్న సమయంలో చైనా జాబ్ మార్కెట్ (China Job Market) లోకి ప్రవేశించిన మిలియన్ల మంది గ్రాడ్యుయేట్లలో జాంగ్ ఒకరు. 16 నుంచి 24 సంవత్సరాల వయసున్న యువతలో నిరుద్యోగం జూన్ నెలలో రికార్ట్ స్థాయిలో 21.3 శాతానికి చేరింది. తమ దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నట్లు ప్రపంచానికి తెలియకుండా వయసు ఆధారిత ఉపాధి డేటా ప్రచురణను నిలిపివేస్తున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. సవాలుగా మారిన ఉద్యోగ సాధన అనుభవం లేని అభ్యర్థులు ఉద్యోగాలు సాధించడం సవాలుగా మారిందని బీజింగ్‌లో జరిగిన కెరీర్ ఫెయిర్లకు హాజరైన యువత పేర్కొన్నారు. యాంగ్ యావో మీడియాలో అనుభవం ఉన్న 21 ఏళ్ల నిరుద్యోగి. సెంట్రల్ బీజింగ్‌లో జరిగిన ఒక జాబ్ ఫెయిర్‌లో ప్రకటనలను చూసి నిరాశకు గురయ్యాడు. కారణం అక్కడ కంపెనీలు కేవలం సేల్స్, అడ్మినిస్ట్రేటివ్ జాబ్‌లు ఆఫర్ చేశాయి. అది కూడా తక్కువ జీతానికి పనిచేసేవారికే. బీజింగ్‌లోని తన కుటుంబానికి దగ్గరగా వెళ్లడం కోసం తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో తన మునుపటి ఉద్యోగాన్ని మానేసిన అతను ఇప్పుడు నెలల కొద్దీ వెతుకుతున్నా ఉద్యోగం దొరక్కపోవడంతో తీవ్ర ఆందోళన పడుతున్నాడు. ‘తలచుకుంటే రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు. ఉద్యోగం దొరకకపోతే జీవనం గడిచేదెలా?’ అని ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీతో వాపోయాడు. -
ఏప్రిల్‌లో ఆన్లైన్ హైరింగ్ తగ్గింది
ముంబై: వైట్ కాలర్ ఉద్యోగాల కోసం ఆన్లైన్ నియామకాలు ఏప్రిల్‌లో తగ్గాయని ఫౌండిట్ నివేదిక వెల్లడించింది. 2022 ఏప్రిల్‌తో పోలిస్తే గత నెలలో ఇది 6 శాతం క్షీణత నమోదైందని వివరించింది. ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ స్టార్టప్స్‌లో హైరింగ్ పెరిగిందని తెలిపింది. ‘ప్రస్తుత ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు వ్యాపారాలకు సవాలుతో కూడిన వాతావరణాన్ని సృష్టించాయి. నియామకా లు తగ్గినప్పటికీ ఉద్యోగార్థులకు అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో ఉద్యోగావకాశాలు పుష్క లంగా ఉన్నాయి. భారత స్టార్టప్ వ్యవస్థ ఒక మలుపు తీసుకుంది. జాబ్ మార్కెట్ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ నియామకాల విషయంలో మళ్లీ జోరు ప్రదర్శిస్తోంది’ అని తెలిపింది. టాప్–5లో ఎడ్టెక్.. ఉద్యోగావకాశాల పట్ల జాగ్రత్తతో కూడిన సెంటిమెంట్లు కొనసాగుతాయని ఆశిస్తున్నప్పటికీ, అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలపై ఆశాజనకంగా ఉంది. ప్రత్యేకించి స్టార్టప్‌లు ప్రతిభ, ఆవిష్కరణల కోసం డిమాండ్‌ను పెంచుతూనే ఉన్నాయి. స్టార్టప్ నియామకాల్లో టాప్–5 రంగాల్లో ఎడ్టెక్ ఉంది. బీఎఫ్ఎస్ఐ/ఫిన్‌టెక్, మీడియా, ఎంటర్టైన్మెంట్ వంటి ఇతర విభాగాలు కూడా స్టార్టప్ హైరింగ్‌లో గణనీయ డిమాండ్‌ను కలిగి ఉన్నాయి. ఆరోగ్య సేవలు, బీపీవో విభాగాలు తిరోగమన వృద్ధిని నమోదు చేశాయి. స్టార్టప్స్ హైరింగ్‌లో 33 శాతం వాటాతో బెంగళూరు టాప్‌లో నిలిచింది. ఢిల్లీ, ముంబై, పుణే సైతం మెరుగైన ప్రతిభ కనబరిచాయి. జోరుగా రిటైల్ రంగం.. రిటైల్ రంగం 22% వృద్ధి నమోదు చేసింది. ఈ రంగం అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో ఉద్యోగార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. ఈ వృద్ధికి ఈ–కామర్స్ గణనీయంగా దోహదపడింది. భారత్ ఇప్పుడు అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్లకు వేదికైంది. ఈ విస్తరణ రిటైల్ ఔట్లెట్లలో నిపుణులకు డిమాండ్‌ను పెంచింది. ఉద్యోగార్థులకు పుష్కలమైన అవకాశాలను రిటైల్ రంగం కల్పిస్తోంది. ఇతర విభాగాల్లో ఇలా.. ట్రావెల్, టూరిజం విభాగం 19 శాతం, టెలికం 14, ఎన్జీవో, సోషల్ సర్వీస్ 11, ప్రకటనలు, మార్కెట్ పరిశోధన, పబ్లిక్ రిలేషన్స్ 7, చమురు, వాయువు 3, షిప్పింగ్, మెరైన్‌లో హైరింగ్ 2 శాతం ఎగసింది. సాంకేతికత, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై ఆధారపడటం పెరుగుతున్న కారణంగా సైబర్ సెక్యూరిటీ నిపుణులకు అధిక డిమాండ్ ఉంది. బీఎఫ్ఎస్ఐ 4 శాతం, బీపీవో, ఐటీఈఎస్ విభాగంలో నియామకాలు 13 శాతం క్షీణించాయి. ఆరోగ్య సేవలు, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ 16, ఐటీ–హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ విభాగాలలో 22 శాతం తిరోగమన వృద్ధి నమోదైందని నివేదిక వివరించింది. -
1.4 కోట్ల ఉద్యోగాలు ఉఫ్! ప్రపంచ ఆర్థిక వేదిక సంచలన రిపోర్ట్
భారత జాబ్ మార్కెట్‌పై ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సంచలన నివేదిక వెలువరించింది. దేశంలో వచ్చే ఐదేళ్లలో భారత జాబ్ మార్కెట్ 22 శాతం క్షీణిస్తుందని, ప్రపంచ వ్యాప్తంగా 1.4 కోట్ల ఉద్యోగాలు ఊడిపోనున్నాయని ఆ రిపోర్ట్ పేర్కొంటోంది. ఇదీ చదవండి: International labour Day: 23 దేశాల్లో జీతాలు రూ.లక్షకుపైనే.. మరి భారత్‌లో...? అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. గత కొన్ని నెలలుగా అనేక కంపెనీలు లేఆఫ్స్ అమలు చేస్తున్నాయి. అమెజాన్, గూగుల్ వంటి పెద్ద పెద్ద టెక్ దిగ్గజాలు సైతం వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ జాబ్ మార్కెట్‌పై 800కు పైగా కంపెనీలతో సర్వే నిర్వహించిన డబ్ల్యూఈఎఫ్ ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. వచ్చే ఉద్యోగాల కన్నా పోయేవే ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా 2027 నాటికి 69 మిలియన్ల (6.9 కోట్లు) కొత్త ఉద్యోగాలు వస్తాయని, ఇదే సమయంలో 83 మిలియన్ల (8.3 కోట్లు) ఉద్యోగాలు ఊడిపోతాయని డబ్ల్యూఈఎఫ్ సర్వే ద్వారా అంచనా వేసింది. అంటే కొత్తగా వచ్చే ఉద్యోగాల కన్నా ఊడిపోయే ఉద్యోగాల సంఖ్యే ఎక్కువగా ఉంది. మొత్తంగా 1.4 కోట్ల ఉద్యోగాలు ఊడిపోనున్నాయని డబ్ల్యూఈఎఫ్ నివేదిక ద్వారా తెలుస్తోంది. జాబ్ మార్కెట్ క్షీణత భారత్‌లో 22 శాతంగా ఉంటుందని అంచనా వేసిన డబ్ల్యూఈఎఫ్ ప్రపంచ వ్యాప్తంగా 23 శాతంగా ఉంటుందని పేర్కొంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్, డేటాసెట్ విభాగాల్లో ఉన్న 673 మిలియన్ (67.3 కోట్లు) ఉద్యోగాల్లో 83 మిలియన్ (8.3 కోట్లు) ఉద్యోగాలను వచ్చే ఐదేళ్లలో తొలగించాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో 69 మిలియన్ (6.9 కోట్లు) ఉద్యోగాలు ఇవ్వనున్నాయి. ఫలితంగా 14 మిలియన్ల (1.4 కోట్లు) ఉద్యోగాలు పోతాయి. ఇది ప్రస్తుతం ఉపాధిలో 2 శాతం. ఆర్థిక వ్యవస్థ బలహీనపడటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కంపెనీలు అవలంబించడమే ఇందుకు కారణమని డబ్ల్యూఈఎఫ్ వెల్లడించింది. ప్రమాదంలో ఉన్న ఉద్యోగాలు ఇవే.. పెరుగుతున్న సాంకేతికత, డిజిటలైజేషన్ కారణంగా బ్యాంక్ టెల్లర్లు, క్యాషియర్లు డేటా ఎంట్రీ క్లర్క్‌ల వంటి క్లరికల్ ఉద్యోగాలు వేగంగా తగ్గుతాయని భావిస్తున్నారు. అయితే డేటా అనలిస్టులు, డేటా సైంటిస్టులు, బిగ్ డేటా నిపుణులు, ఏఐ మెషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్టుల ఉద్యోగాలు 2027 నాటికి సగటున 30 శాతం పెరుగుతాయని అంచనా. ఇదీ చదవండి: ఫ్రెషర్లకు గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్.. 44 వేల జాబ్ ఆఫర్లు.. అందరికీ ఉద్యోగాలు! -
ప్రస్తుత జాబ్‌లోనే కొనసాగుతాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలతోపాటు ఉద్యోగార్ధులు సైతం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. జాబ్ సైట్ ఇండీడ్ నివేదిక ప్రకారం.. ఇంటర్వ్యూలో పాల్గొన్న 47 శాతం మంది ఉద్యోగులు ఈ ఏడాదిలో ఉద్యోగాలు మారడానికి ఇష్టపడడం లేదు. అంటే తాము పనిచేస్తున్న సంస్థలోనే కొనసాగాలని నిర్ణయించారన్న మాట. 37 శాతం మంది 2023లో తమ కెరీర్ వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. కంపెనీలు ఇప్పుడు ఈ నిపుణులను నిలుపుకోవడానికి, ఆకర్షిస్తూ ఉండే మార్గాలను రూపొందించడంపై దృష్టి పెట్టాలి. వాల్యూవాక్స్ 2023 జనవరి–ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేలో వివిధ రంగాలకు చెందిన 1,157 కంపెనీలు, 1,583 ఉద్యోగార్థులు పాలుపంచుకున్నారు. ‘బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), హెల్త్‌కేర్ రంగాల్లో పెద్ద ఎత్తున నియామకాలు జరుగుతున్నాయి. ఈ విభాగాల్లో బలమైన భవిష్యత్ కనిపిస్తోంది. బీఎఫ్ఎస్ఐలో 71 శాతం, ఆరోగ్య సేవల్లో 64, నిర్మాణం, రియల్టీ 57, మీడియా, వినోదం 49, తయారీ 39, ఐటీ, ఐటీఈఎస్ 29 శాతం కంపెనీలు కొత్త వారిని చేర్చుకుంటున్నాయి. కొత్తగా జాబ్ మార్కెట్లోకి అడుగుపెట్టిన వారి సంఖ్య అక్టోబర్–డిసెంబర్‌తో పోలిస్తే 16 నుంచి 23 శాతానికి ఎగబాకింది. తాత్కాలిక ఉద్యోగులను పెద్దగా ఆమోదించడం కూడా ఈ ఏడాది జాబ్ మార్కెట్‌ను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు’ అని నివేదిక వివరించింది. -
చదువుల్లో ‘వివక్ష’ తొలగింపు కోసమే!
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చదివించుకునే కుటుంబాలకు – ‘ఇంగ్లిష్ మీడియం’ అందు బాటులోకి తీసుకురావాలని కొంతకాలం క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భిన్న అభిప్రాయాలకు, చర్చలకు దారి తీసింది. ఇప్పుడు ‘ఉచిత– పథకాల’ గురించి కోర్టుకు వెళ్లినట్టుగానే, అప్పట్లో ‘ఇంగ్లిష్– మీడియం’ విషయం కూడా కోర్టు వరకూ వెళ్ళింది. మన దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలైన 30 ఏళ్ళ కాలంలో విద్య, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన వారిలో ఎక్కువ మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండడం తెలిసిందే. మరి పరిస్థితి ఇలా ఉన్నప్పుడు, ఇప్పటికీ ఇంకా ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లల విద్య నాణ్యత విషయంగా ప్రభుత్వం ఎటువంటి వైఖరిని అనుసరించాలి? ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ తర్వాత, ఒక ఉద్యోగి ఇండియాలో పనిచేసినా లేదా విదేశాల్లో పనిచేసినా పని నాణ్యతా ప్రమాణాల విషయంలో ఈ రోజున ఎటువంటి వ్యత్యాసం లేదు. అటువంటప్పుడు చదువు పూర్తి చేసుకుని ‘జాబ్ మార్కెట్’లోకి వచ్చే యువతకు ప్రాథమిక విద్య స్థాయిలోనే ‘వర్క్ ప్లేస్’ సవాళ్లు ఎదుర్కొనే నైపుణ్యాలను బోధించడం ఇప్పుడు తప్పనిసరి అవుతుంది. ‘ప్రొఫెషనల్ కోర్సు’లు పూర్తి చేసుకుని, ఉద్యోగాల్లో చేరుతున్న దశలో నైపుణ్యాల బోధన లేని కారణంగానే, మళ్ళీ వారికీ ‘స్కిల్ డెవలప్మెంట్’ కోర్సులు అవసరం అవుతున్నాయి. ప్రభుత్వం ఆ అవసరాన్ని గుర్తించి దాన్ని కనుక పట్టించుకోకపోతే, చదివిన డిగ్రీలతో పనిలేకుండా... జీవిక కోసం ‘మార్కెట్’లో చౌక ‘లేబర్’గా వీరు మారుతారు. దాంతో వీరి చదువుల కోసం ప్రభుత్వం చేసిన ‘వ్యయం’, తిరిగి వీరి సర్వీసుల ద్వారా జాతీయ స్థూల ఉత్పత్తికి అవుతున్న ‘జమ’ మధ్య వ్యత్యాసం తగ్గదు. ఈ పరిస్థితిని అధిగమించడానికి, ప్రభుత్వ బడుల్లో చదివిన పిల్లలు స్థిరంగా– ‘జాబ్ మార్కెట్’లో నిలబడగలగడానికి– ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్య స్థాయిలో ఇవ్వాల్సిన తర్భీదు ఎలా ఉండాలి? కొన్నేళ్లుగా ‘ఇంటర్నేషనల్ స్కూళ్లు’ ఉనికిలోకి వచ్చాయి. వాటి ‘కేంపస్’లు కూడా విశాలమైన స్థలం, భవనాలు, వసతులతో అలరారుతున్నాయి. అటువంటప్పుడు– అదే కాలంలో అదే ప్రాంతంలోని సమాజాల్లో ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లలకు అందించే బోధనా ప్రమాణాలు ఎలా ఉండాలి? పబ్లిక్ స్కూళ్లలో ‘యజమాని’ ప్రభుత్వ స్కూళ్లలో ‘ఉద్యోగి’ తయారయ్యే ఇటువంటి వైరుధ్యం, వ్యత్యాసం ఇలా విద్యార్థికి ‘కిండర్ గార్డెన్’ దశలోనే మొదలవుతున్నప్పుడు, దీనిపై... సమీక్ష సంస్కరణల చర్యల అవసరం ఉందా లేదా? ఇంకా ఈ వ్యత్యాసం కొనసాగడానికి ప్రభుత్వం ‘చెక్’ పెట్టే చర్యలు కనుక చేపడితే, అందుకు మన పౌర సమాజ స్పందన ఎలా ఉండాలి? ఉపాధి అంశం కంటే సున్నితమైనది మరొకటి ఉంది. అది– ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల స్థాయిలో పిల్లలకు అందవలసిన ‘ఎమోషనల్ సపోర్ట్’. దీన్ని అర్థం చేసుకోవడానికి, ఒకప్పుడు మురికివాడలు అని మనం పిలిచిన పట్టణ శివారు కాలనీల్లోని పోలీస్ స్టేషన్లలో నమోదు అయ్యే ‘ఫ్యామిలీ కేసులు’ ఎటువంటివో చూస్తే, ఆ కుటుంబాల్లో పెరిగే పిల్లలకు బడిలో టీచర్ల నుంచి అందవలసిన సాంత్వన ఎటువంటిదో మనకు అర్థమవుతుంది. విజయవాడ వంటి రైల్వే జంక్షన్ పరిధిలో వీధి బాలల కోసం పని చేస్తున్న– ఎన్జీఓలు చెప్పగలరు– పిల్లల పట్ల మనం చూపే నిర్లక్ష్యం ముగింపు ఎలా ఉంటుందో! (క్లిక్: ప్రణాళికాబద్ధంగా దూరం చేస్తున్నారు!) పాఠశాల విద్యాశాఖలో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల విషయంలో జరుగుతున్న వాద వివాదాలను... బయట నుంచి, దూరం నుంచి చూస్తున్న పౌరసమాజపు క్రియాశీలత అవసరమైన సమయమిది. ఈ పిలుపు ఒకరికి అనుకూలం, మరొకరికి ప్రతికూలం కాదు. ఇది మన కొత్త రాష్ట్రం కోసం. (క్లిక్: ఎలా చూసినా సంక్షేమ పథకాలు సమర్థనీయమే!) - జాన్సన్ చోరగుడి సామాజిక విశ్లేషకులు -
కొత్త కొలువులు అరకొరే !
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ఎఫెక్ట్‌తో భారత్‌లో జాబ్ మార్కెట్ కుదేలైంది. రానున్న మూడు మాసాల్లో కేవలం 5 శాతం కంపెనీలే నూతన నియామకాలపై దృష్టి సారించగా, పలు కార్పొరేట్ కంపెనీలు లాక్డౌన్ పూర్తిగా ముగిసేవరకూ వేచిచూసే ధోరణిని కనబరుస్తున్నాయని తాజా సర్వే వెల్లడించింది. జులై-సెప్టెంబర్ క్వార్టర్లో నికర ఉపాథి రేటు సర్వే చేపట్టిన 15 ఏళ్ల కనిష్ట స్ధాయిలో 5 శాతంగా ఉందని మ్యాన్‌పవర్ గ్రూప్ ఎంప్లాయ్మెంట్ అవుట్‌లుక్ సర్వే వెల్లడించింది. సానుకూల హైరింగ్ ట్రెండ్‌ను కనబరిచిన 44 దేశాల్లో భారత్ టాప్ 4 స్ధానంలో ఉండటం మాత్రం ఊరట కలిగిస్తోంది. జపాన్, చైనా, తైవాన్లు వరుసగా 11 శాతం, మూడు శాతం, మూడు శాతం సానుకూల హైరింగ్ ధోరణులతో తొలి మూడుస్ధానాల్లో నిలిచాయి. ఆర్థిక మందగమనం, మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కార్పొరేట్ ఇండియా ఉద్యోగుల నియామకాల్లో హేతుబద్ధంగా వ్యవహరిస్తోందని, లాక్డౌన్ పూర్తిగా తొలగిన అనంతరం డిమాండ్ పెరిగే క్రమంలో నియామకాలు ఊపందుకునేలా వేచిచూసే ధోరణిని ప్రదర్శిస్తోందని మ్యాన్‌పవర్‌గ్రూప్ ఇండియా ఎండీ సందీప్ గులాటీ చెప్పుకొచ్చారు. భారత్‌లో ఆశావహ దృక్పథం నెలకొందని, ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజ్ పలు రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి సానుకూల పరిణామాల నేపథ్యంలో ఉద్యోగార్థుల ఆశలు నెరవేరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మైనింగ్, నిర్మాణ, బీమా, రియల్ ఎస్టేట్ రంగాల్లో జాబ్ మార్కెట్ ఆశాజనకంగా ఉంటుందని చెప్పారు. మధ్యతరహా సంస్ధల్లో హైరింగ్ అధికంగా ఉంటుందని ఆ తర్వాత భారీ, చిన్నతరహా సంస్ధలు నియామకాలకు మొగ్గుచూపుతాయని అంచనా వేశారు. లాక్డౌన్ సమయంలో సాంకేతికత నూతన ఒరవడికి దారితీసిందని అన్నారు. చదవండి : 10వేల ఉద్యోగాలిస్తాం: జొమాటో సీఈవో -
2018లో ఉద్యోగార్ధులు ఖుషీ
సాక్షి,న్యూఢిల్లీ: క్యాంపస్ ప్లేస్మెంట్లు ఊపందుకుంటుడటంతో 2018లో నియామకాల ప్రక్రియ జోరందుకుని జాబ్ మార్కెట్ మునుపటి కళ సంతరించుకుంటుందనే అంచనాలు వెల్లడయ్యాయి.జాబ్ ఆఫర్లు పెరగడంతో పాటు వేతన స్ధాయిలు, భిన్న రిక్రూటర్లు, ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ల వంటి అన్ని విభాగాల్లోనూ మెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు. అన్ని క్యాంపస్‌లలో జాబ్ ఆఫర్ల ఊపు కొనసాగుతుండటం సానుకూల సంకేతాలు పంపుతోంది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ నియామకాల కోసం 90 ఇంజనీరింగ్ కాలేజ్‌లు, బిజినెస్ స్కూల్స్‌ను ఎంపిక చేసుకుంది. ఐఐటీ బాంబేలో అంతర్జాతీయ ఆఫర్లు 2016లో 50 నుంచి ఈ ఏడాది 60కి పెరగడం గమనార్హం. మరోవైపు అమెరికాకు చెందిన క్లౌడ్ డేటా కంపెనీ రుబ్రిక్, ఆమ్‌స్టర్‌డ్యామ్‌కు చెందిన ఆప్టివర్, బ్రిటన్ కంపెనీ హల్మా తదితర సంస్థలు తొలిసారిగా భారత్ క్యాంపస్‌లలో నియామకాలు చేపడుతున్నాయి. అమెరికా, యూరప్‌కు చెందిన బహుళజాతి సంస్థలతో పాటు జపాన్, తైవాన్, దక్షిణ కొరియా, సింగపూర్ల నుంచి ఆసియా కంపెనీలు భారత ప్రొఫెషనల్స్‌ను రిక్రూట్ చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. టీమ్‌లీజ్ సర్వీసెస్ పలు సంస్థలతో కలిసి నిర్వహించన అథ్యయనంలోనూ జాబ్ మార్కెట్లో స్ధబ్థత వీడి ఉత్తేజం నెలకొన్నట్టు వెల్లడైంది. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఎఫ్ఎంసీజీ, కన్జూమర్ డ్యూరబుల్స్, కన్సల్టింగ్ రంగాల్లో నియామకాలు ఊపందుకోగా, కాగ్నిజెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, డెలాయిట్, క్యాప్‌జెమిని, విప్రో, అమెజాన్, ఈవై, హెచ్‌సీ టెక్, యాక్సెంచర్, కేపీఎంజీలు టాప్ రిక్రూటర్స్‌గా ఉన్నాయి.మరోవైపు స్టార్టప్‌లు కూడా పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్కు దిగుతుండటంతో 2018లో కొలువుల మార్కెట్ కళకళలాడుతుందని భావిస్తున్నారు. -
ఆ ఉద్యోగాలకు రోబోలతో ముప్పు లేదు!
హోస్టన్: ప్రస్తుతం అన్ని ఉద్యోగాల్లో రోబోల వినియోగం క్రమక్రమంగా పెరిగిపోతోంది. దీంతో చాలా మంది ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయింది. కానీ అధిక స్థాయిలో ఐక్యూతోపాటు ఆర్ట్స్, సైన్స్ రంగాలపై ఆసక్తి ఉన్నవారి ఉద్యోగాలకు మాత్రం ఎలాంటి ఢోకా ఉండబోదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యక్తిత్వ లక్షణాలు, వృత్తిపరమైన ఆసక్తి, మేధస్సు, సామాజిక ఆర్థిక స్థితులకు జాబ్ మార్కెట్లో ఏ మేరకు ప్రాధాన్యత ఉందో తెలుసుకునేందుకు దాదాపు 3.5 లక్షల మందిపై శాస్త్రవేత్తలు అధ్యయనం నిర్వహించారు. సామాజిక ఆర్థిక స్థితితో సంబంధం లేకుం డా అధిక స్థాయిలో మేధస్సు, పరిపక్వత, కలుపుగోలుతనంతోపాటు ఆర్ట్స్, సైన్స్‌లో ఎక్కువ ఆసక్తి కలిగినవారు రానున్న రోజుల్లో కంప్యూటర్ సంబంధిత ఉద్యోగాలను తక్కువ స్థాయిలో ఎంచుకుంటారని పరిశోధకులు చెబుతున్నారు. ఆయా ఉద్యోగాల కు కంపెనీలు కూడా వీరిని తక్కువగానే ఎంపిక చేసుకుంటాయని వివరించారు. ఐక్యూ స్థాయి ప్రతి 15 పాయింట్లు పెరిగే కొద్దీ కంప్యూటర్ సంబంధిత ఉద్యోగాల్లో చేరేవారు 7 శాతం తగ్గుతారని అసిస్టెంట్ ప్రొఫెసర్ రొడికా డామియన్ చెప్పారు. -
భారీగా ఉద్యోగాల కోతపెడుతున్న కంపెనీలివే!
ఐటీ, టెలికాం ఇండస్ట్రీ అత్యంత క్లిష్టతరమైన పరిస్థితులతో అతలాకుతలమవుతోంది. ఐటీ ఇండస్ట్రీకి ట్రంప్ ఎఫెక్ట్ భారీగా తగులుతుండగా... టెలికాం కంపెనీలు సైతం జియో దెబ్బకు కోలుకోలేని షాకుకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో దిగ్గజ ఐటీ, టెలికాం కంపెనీలన్నీ ఉద్యోగాలకోత బాట పట్టాయి. భారీగా ఉద్యోగులపై వేటు వేస్తూ ఇంటికి పంపిస్తున్నాయి. 2008-10లో నెలకొన్న పరిస్థితుల్లో ఇప్పుడు మళ్లీ కంపెనీల్లో చవిచూస్తున్నాయి. ఈ ఏడాది భారీగా ఉద్యోగాల కోత ప్రకటించిన లేదా ప్రకటించబోతున్న దిగ్గజ 10 కంపెనీల జాబితాను రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. కాగ్నిజెంట్ : ఓ వైపు ట్రంప్ ఎఫెక్ట్, మరోవైపు ఆటోమేషన్ ప్రభావం ఈ మల్టినేషనల్ ఐటీ దిగ్గజం దాదాపు 6000 మందికి గుడ్ బై చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. అంటే మొత్తం వర్క్ ఫోర్స్ లో 2.3శాతం మందిని కంపెనీ తీసేస్తోంది. కొత్త డిజిటల్ సర్వీసులోకి మరలే క్రమంలో ఐటీ ఇండస్ట్రి ఎదుర్కొంటున్న సంక్షోభంతో కాగ్నిజెంట్ తన ఉద్యోగులను తగ్గించుకుంటుంది. అంతేకాక ఇటీవల సీనియర్ ఉద్యోగులను సాదరంగా ఇంటికి సాగనంపే క్రమంలో 9నెలల జీతాలిస్తుందని కూడా రిపోర్టులు వస్తున్నాయి. డి ప్లస్ కేటగిరి ఉద్యోగులు సుహృద్భావం వాతావరణంలో సంస్థను విడిచిపెట్టాలని కోరుతూ ఈ-మెయిల్స్ ను కూడా పంపిందట. కాప్జెమిని : ఫ్రెంచ్ కు చెందిన ఐటీ సర్వీసుల దిగ్గజం కాప్జెమిని కూడా సుమారు 9000 మందిని ఇంటికి పంపించనున్నట్టు తెలిపింది. ఫిబ్రవరిలోనే 35 మంది వీపీ, ఎస్వీపీ, డైరెక్టర్లు, సీనియర్ డైరెక్టర్లను కంపెనీ వీడాలని కాప్జెమిని ఆదేశించింది. అంతేకాక తన ఆఫీసుల్లో ఒకటైన ముంబైలో 200 మందికి ఉద్వాసన పలకాలని కూడా నిర్ణయించింది. లేఆఫ్స్ గురించి స్పందించిన కంపెనీ, ఉద్యోగులను తీసే క్రమంలోనే కొత్త ఉద్యోగులను కంపెనీలోకి తీసుకుంటున్నామని తెలిపింది. ఇన్ఫోసిస్ : వచ్చే కొన్ని రోజుల్లో దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా ఉద్యోగుల కోత ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంబంధిత వర్గాల ప్రకారం ఈ కంపెనీ 1000 మందిని తీసేస్తుందని తెలుస్తోంది. దీనిలో గ్రూప్ ప్రాజెక్టు మేనేజర్లు, ప్రాజెక్టు మేనేజర్లు, సీనియర్ ఆర్కిటెక్ట్స్, హైయర్ లెవల్స్ వారు ఉండొచ్చని సంబంధిత వర్గాల సమాచారం. ఈ కంపెనీ ఇటీవలే భారతీయ టెక్కీలకు షాకిస్తూ అమెరికన్లకు 10000 ఉద్యోగాలను ప్రకటించింది. విప్రో: దేశంలో మూడో అతిపెద్ద టెక్ దిగ్గజం విప్రో కంపెనీ. పనితీరు బాగోలేదనే పేరుతో ఇప్పటికే ఈ కంపెనీ 600 నుంచి రెండు వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించేసినట్టు తెలిసింది. అంతేకాక కంపెనీలో అదనపు లేయర్లను తీసేయనుందట. టాటా టెలిసర్వీసెస్ : టాటా గ్రూప్ కు చెందిన ఈ కంపెనీ 500 నుంచి 600 మంది ఉద్యోగులను తీసేసింది. ఈ ఉద్యోగులందరూ సేల్స్, ఇతర సంబంధిత ఫంక్షన్స్ కు చెందిన వారని కంపెనీ తెలిపింది. వీరికి సెవరెన్స్ ప్యాకేజీని కూడా కంపెనీ ఆఫర్ చేసింది. ప్రతేడాది సర్వీసుకు ఒక జీతం చొప్పున కంపెనీ ఈ ఉద్యోగులకు ఇచ్చింది. ఎయిర్ సెల్ :ఈ ఏడాది ఫిబ్రవరిలో సెల్యులార్ సర్వీసెస్ మేజర్ ఎయిర్ సెల్ తన ఉద్యోగుల్లో 700 మందికి పింక్ స్లిప్ లు ఇచ్చింది. అంటే తమ ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగించింది. దేశీయ టెలికమ్యునికేషన్ రంగంలో ఇదే తొలి ఉద్యోగాల కోత. దేశవ్యాప్తంగా ఎయిర్ సెల్ లో దాదాపు 8000 మంది ఉద్యోగులున్నారు. స్నాప్ డీల్: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజంగా పేరున్న స్నాప్ డీల్ కూడా మార్కెట్లో అతలాకుతలమవుతోంది. ఈ ప్రభావం ఉద్యోగులపై భారీగా పడుతోంది. ఓ వైపు విక్రయ చర్చలు జరుపుతున్న ఈ కంపెనీ, ఉద్యోగాల కోతను ఫిబ్రవరిలోనే ప్రకటించింది. అయితే కరెక్ట్ గా ఎంతమందిపై ఈ ప్రభావం పడుతుందో తెలుపలేదు. కానీ మొత్తం వర్క్ ఫోర్స్ లో 30 శాతం మందిని మాత్రం కంపెనీ బయటికి పంపేయనుందని తెలుస్తోంది. అంటే కంపెనీలో ప్రత్యక్షంగా పనిచేస్తున్న 1000 మంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడనుందని సమాచారం. అంతేకాక 1000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులపై కూడా ప్రభావం పడనుందట. లీ ఎకో : చైనీస్ బిలీనియర్ అయిన జియా యుఎటింగ్ కంపెనీ లీఎకో కూడా 85 శాతం ఇండియా స్టాఫ్ ను తొలగించేసింది. అంతేకాక ఇద్దరు అధికారులు కంపెనీ నుంచి వైదొలిగారు. క్రాఫ్ట్స్ విల్లా, యప్మీ : సంప్రదాయ వస్త్రాలను మార్కెటింగ్ చేస్తున్న క్రాఫ్ట్స్ విల్లా, ఫ్యాషన్ పోర్టల్ యప్ మీ ఈ రెండు స్టార్టప్ లు గత కొన్ని వారాలుగా ఉద్యోగులకు పింక్ స్లిప్ లు ఇచ్చాయి. క్రాఫ్ట్స్ విల్లా 100 మందికి పైగా ఉద్యోగులను తీసేయగా.. యప్మీ కూడా ఇటీవల క్వాలిటీ కంట్రోల్ టీమ్స్, వేర్ హౌజింగ్ లో ఉద్యోగులను తొలగిస్తున్నట్టు తెలిపింది. -
కొలువులకు పండుగ కళ
న్యూఢిల్లీ: పండుగల సీజన్ నేపథ్యంలో జాబ్ మార్కెట్ కళకళ్లాడనుంది. అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో దాదాపు 3-4.5 లక్షల ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఈ-కామర్స్, ఆతిథ్య, రిటైల్ తదితర రంగాల్లో హైరింగ్‌కు భారీ డిమాండ్ ఉండటమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. వ్యాపార సెంటిమెంట్లు, పరిస్థితులు మెరుగవుతుండటంతో కొన్ని నెలలుగా నియామకాలూ పెరుగుతున్నాయి. తాజాగా పండుగ సీజన్ ఇందుకు మరింత ఊతం ఇవ్వనుంది. 5-15 శాతం మేర హైరింగ్ పెరగగలదని అంచనా వేస్తున్నట్లు ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ ఈడీ సుచిత దత్తా తెలిపారు. క్యాష్‌కరోడాట్‌కామ్ వెబ్సైట్ సహ వ్యవస్థాపకురాలు స్వాతి భార్గవ కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. డిస్కౌంటు ఆఫర్లు, షాపర్లు మళ్లీ మళ్లీ కొనుగోలు చేస్తుండటం వంటి కారణాలతో ఈ ఏడాది పండుగల సీజన్లో మిగతా కాలంతో పోలిస్తే లావాదేవీల సంఖ్య 300 శాతం పెరిగినట్లు వివరించారు. దీనికి అనుగుణంగా కంపెనీలు సిబ్బందిని కూడా పెంచుకోవాల్సి ఉంటుందని టీమ్‌లీజ్ సర్వీసెస్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ సుదీప్ సేన్ తెలిపారు. మెట్రో, కాస్మోపాలిటన్ సిటీల్లోని ఆర్గనైజ్డ్ రిటైల్ రంగంలోనే కనీసం 25,000 పైచిలుఉక ఉద్యోగాల కల్పన జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. భారత్‌లో ఏడాది పొడవునా ఏదో ఒక పండుగ ఉన్నా.. చివరి నెలల్లో దసరాతో మొదలు పెట్టి న్యూ ఇయర్ దాకా భారీగా షాపింగ్ జరుగుతుందని లేబర్‌నెట్ సర్వీసెస్ సీఈవో గాయత్రి వాసుదేవన్ చెప్పారు. ఈ నె లల్లో వివిధ ఉత్పత్తులు, సేవల అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని..తదనుగుణంగా కంపెనీలకు అదనంగా మానవ వనరులూ అవసరమవుతాయని ఆమె పేర్కొన్నారు. ఈ-కామర్స్ కంపెనీలు డెలివరీ సేవల కోసం పార్ట్ టైమ్ సిబ్బందిని తీసుకుంటున్నట్లు వివరించారు. అలాగే, ఎఫ్ఎంసీజీ కంపెనీలు కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్‌ను, రిటైల్ సంస్థలు సేల్స్ అసోసియేట్స్‌ను తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకుంటున్నట్లు గాయత్రి తెలిపారు. బోనస్‌లు.. ఎకానమీ కోలుకుంటున్న సంకేతాల కారణంగా ఉద్యోగాలు పండుగ బోనస్‌లు, ప్రోత్సాహకాలు మొదలైన వాటిని ఆశించవచ్చని సుదీప్ సేన్ చెప్పారు. అయితే, రంగాల వారీగా చూస్తే ఇది మిశ్రమంగా ఉంటుందన్నారు. ఐటీ రంగంలో బోనస్‌లు ఇవ్వడం కొనసాగుతుందని అయితే ఇది కచ్చితంగా నగదు రూపంలోనే కాకుండా ట్రావెల్ టికెట్లు, గిఫ్టులు, బీమా పాలసీలు (తొలి ఏడాది ఉచిత ప్రీమియంతో) మొదలైన వాటి రూపంలో ఉండొచ్చని సేన్ తెలిపారు. -
ఉద్యోగ సాధనకు.. సెల్ఫ్ రిఫరెన్స్!
దేశ విదేశాల్లో దాదాపు 70 శాతం కొలువులను సిఫార్సుల ద్వారానే భర్తీ చేస్తున్నారని మీకు తెలుసా? అంటే విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన అభ్యర్థులను కంపెనీలు నియమించుకుంటున్నాయి. ఇష్టమైన ఉద్యోగం సాధించాలంటే రిఫరెన్స్ ఉండాలి. మీ పేరును ఎవరైనా సిఫార్సు చేస్తే కంపెనీకి మీపై గురి కుదురుతుంది. జాబ్ ఆఫర్ లెటర్ ఇచ్చేందుకు ముందుకొస్తుంది. వ్యక్తుల ద్వారానే కాదు స్వయంగా కూడా ఇలాంటి రిఫరెన్స్‌లను సృష్టించుకోవచ్చు. జాబ్ మార్కెట్లో మీకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోగలిగితే కొలువు సాధన సులువవుతుంది. ప్రతిభను బహిర్గతం చేయాలి: మీకు ఉద్యోగం ఇవ్వాలంటే మీ అర్హతలు, నైపుణ్యాలు, మీరేం చేస్తున్నారు, ఏం చేయగలరో కంపెనీకి తెలియాలి. ఇంటర్నెట్ ద్వారా వీటిని తెలియజేయాలి. జాబ్ ప్రొఫైల్‌ను రూపొందించుకొని రిక్రూటర్లు చూసేందుకు వీలుగా ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురావాలి. మీకు మధురంగా పాట పాడడం వస్తే నిరభ్యంతరంగా పాడండి. దాన్ని వీడియోలో బంధించి, సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో, బ్లాగ్‌ల్లో పెట్టండి. మీకు వచ్చిన విద్యలన్నీ రిక్రూటర్లకు తెలియాలి. అప్పుడే వారు మీ పట్ల ఆసక్తి చూపుతారు. గతంలో చేసిన ఉద్యోగాలు, పూర్తి చేసిన ప్రాజెక్ట్‌లు, పని చేసిన కంపెనీలు, మీ వల్ల కంపెనీకి కలిగిన లాభాలు.. ఇలా మీకు సంబంధించిన వివరాలన్నీ జాబ్ ప్రొఫైల్‌లో ఉండాలి. కొలువు కావాలంటే మిమ్మల్ని మీరు రహస్యంగా దాచుకోకూడదు. మీ ప్రతిభను బహిర్గతం చేయండి. మీరేమిటో మీ ద్వారానే వెల్లడి కావాలి. మీ గురించి మీరే ప్రభావవంతంగా సిఫార్సు చేసుకోండి. బలమైన రెజ్యూమె: కొలువు వేటలో కీలకమైన సాధనం.. రెజ్యూమె. మీ అర్హతలు, నైపుణ్యాలు, అభిరుచులు, అనుభవాలు వంటివాటిని రిక్రూటర్‌కు క్లుప్తంగా తెలపాలి. రెజ్యూమె కూడా రిఫరెన్స్లాంటిదే. బలమైన రెజ్యూమెను రూపొందించుకొని సామాజిక అనుసంధాన వేదికల్లో పొందుపర్చండి. కంపెనీలు దీన్ని పరిశీలించి, సంతృప్తి చెందితే మీకు సమాచారం పంపుతాయి. వ్యాపారం విజయవంతం కావాలంటే సంబంధిత వినియోగదారులు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. ఉత్పత్తులను వారికి చేరవేయాలి. మిమ్మల్ని వినియోగించుకొనే సంస్థలు కూడా మీకు కస్టమర్లే. మీకు ఉద్యోగమిచ్చే కంపెనీలు ఎక్కడున్నాయో గాలించండి. మీ గురించి రిక్రూటర్లకు తెలియజేయండి. విద్యార్థినుల కోసం సీబీఎస్ఈ ఉడాన్ దేశంలో ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యార్థినుల శాతాన్ని పెంచడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ).. ఉడాన్ అనే కొత్త ప్రాజెక్టును ప్రారంభించింది. టాప్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలు పొందేలా దేశవ్యాప్తంగా ప్రతిఏటా 1000 మంది అమ్మాయిలకు ఉడాన్ ద్వారా శిక్షణనిస్తారు. వీరిలో సగం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల్లో ఉండేలా చూస్తారు. పదకొండు, పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థినులను జేఈఈలో విజయం దిశగా నడిపించడానికి ఉడాన్ ద్వారా ఆన్లైన్/ఆఫ్‌లైన్‌లో ఉచితంగా కోర్సులు నిర్వహిస్తారు. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 27 వెబ్సైట్: http://cbse.nic.in -
అనుభవం పెంచుకుంటేనే జాబ్ సొంతం
భారత్‌లో గత కొన్నేళ్లుగా ఉద్యోగ నియామకాల విధానంలో ఎన్నో మార్పులొచ్చాయి. జాబ్ మార్కెట్లో పోటీ విపరీతంగా పెరిగింది. షార్ట్‌లిస్ట్‌లో ప్రథమ స్థానంలో నిలిచి నచ్చిన కొలువు దక్కించుకోవాలంటే.. తగిన అర్హతలతోపాటు ప్రత్యేకమైన నైపుణ్యాలు ఉండాలి. ఆధునిక ధోరణులపై అవగాహన పెంచుకోవాలి. నేటి టెక్నాలజీ యుగంలో హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంది? రిక్రూటర్లు ఏయే మార్గాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారో తెలుసుకోవాలి. అనుభవజ్ఞులే మేలట: ఉద్యోగస్తులకే ఉద్యోగాలు దక్కుతున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజమని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఒక కంపెనీలో కొలువులో కొనసాగుతున్న వారినే నియమించుకొనేందుకు ఇతర కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని చెబుతున్నారు. ఎందుకంటే వారి అనుభవం, నైపుణ్యాలు తమకు తక్షణమే ఉపయోగపడతాయని భావిస్తున్నాయి. ఎలాంటి ఉద్యోగానుభవం లేని కొత్త అభ్యర్థుల కంటే ఇలాంటి వారే మేలని అంచనా వేస్తున్నాయి. కొలువు లేకుండా ఆరు నెలలపాటు ఖాళీగా ఉంటే మళ్లీ ఉద్యోగం దక్కడం కష్టమే. అడల్ట్ ఇంటర్న్షిప్స్: ఎంతో అనుభవం, పరిజ్ఞానం ఉన్నప్పటికీ చాలాకాలం ఖాళీగా ఉన్నవారి కంటే అప్పుడే ఒక కొలువు నుంచి బయటికొచ్చినవారికే కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త అభ్యర్థులు నిరాశ చెందాల్సిన పనిలేదు. అనుభవం పెంచుకుంటే కంపెనీల దృష్టిలో పడొచ్చు. జీతభత్యాలు లేకుండా పనిచేసేందుకు కొన్ని సంస్థలు అనుమతిస్తుంటాయి. వాటిలో చేరి పని నేర్చుకోవచ్చు. స్వచ్ఛంద సంస్థల్లోనూ చేరి, అనుభవం, పనితీరును మెరుగుపర్చుకోవచ్చు. ఇంటర్న్షిప్స్ కూడా ఉపయోగపడతాయి. నేడు అడల్ట్ ఇంటర్న్‌షిప్‌లు సర్వసాధారణంగా మారాయి. ఇక్కడ నేర్చుకున్న వృత్తిపరమైన పరిజ్ఞానం ఉద్యోగ సాధనకు తోడ్పడుతుంది. ఇలాంటి వాటివల్ల మీ రెజ్యూమెకు బలం పెరుగుతుంది. సోషల్ మీడియా: సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉన్నవారిని కంపెనీలు ఇష్టపడుతున్నాయి. ఇలాంటి వారికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, నెట్వర్క్ ఉంటాయని భావిస్తున్నాయి. సమాన అర్హతలున్న ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరు సోషల్ మీడియాలో ఎక్కువ క్రియాశీలకంగా ఉన్నారో చూస్తున్నాయి. అతడినే ఉద్యోగంలో చేర్చుకుంటున్నాయి. కాబట్టి మీరు కూడా సామాజిక మాధ్యమాల్లో భాగస్వామ్యాన్ని పెంచుకోండి. అంతేకాకుండా మిమ్మల్ని అనుసరించేవారిని, అభిమానులను, నెట్వర్క్, కాంటాక్ట్స్, ఎండార్స్మెంట్స్, రికమండేషన్లను కూడా సంస్థలు పరిశీలిస్తున్నాయి. వెబ్సైట్లలో మీ పోస్టులకు ఎక్కువ లైక్‌లు, కామెంట్లు వస్తే రిక్రూటర్ల దృష్టిలో మీరు ఒక మెట్టు పైకి ఎదిగినట్లే లెక్క. అందుకే ఫ్యాన్ క్లబ్లో ఎక్కువ మందిని చేర్చుకోండి. ఆధారాలు: గతంలో అభ్యర్థులు తమ గురించి తాము చెప్పుకోవడానికి ఆధారం.. రెజ్యూమె లేదా కరిక్యులమ్ విటే(సీవీ), రిఫరెన్స్‌ల జాబితా. ఇప్పుడు వీటి స్థానంలో మరికొన్ని చేరాయి. వైట్ పేపర్స్, ఆర్టికల్స్, ప్రజంటేషన్లు, బ్లాగ్పోస్టుల రూపంలో రిక్రూటర్లకు అభ్యర్థులు తమ అర్హతలు, నైపుణ్యాలు, పనితీరు గురించి తెలియజేయాల్సి ఉంటుంది. ఆయా ప్రూఫ్స్‌ను సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ప్రొఫైల్‌తోపాటు జతచేయాలి. -
విద్యార్థులకు కొలువు కిటుకులు!
నేటి విద్యార్థులే రేపటి ఉద్యోగార్థులు. చదువు పూర్తయిన తర్వాత దృష్టి సారించాల్సిందే.. కొలువుపైనే. నచ్చిన జాబ్ దక్కించుకోవాలంటే.. దరఖాస్తు ప్రక్రియ, మౌఖిక పరీక్షలపై ముందుగానే అవగాహన పెంచుకోవాలి. మన దేశంలో గత కొంతకాలంగా నియామక ప్రక్రియలో చాలా మార్పులొచ్చాయి. టెక్నాలజీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు కొలువుల కోసం పోటీ విపరీతంగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో జాబ్ మార్కెట్లో అభ్యర్థులు విజేతగా నిలవాలంటే కొలువు కిటుకులు కొన్ని తెలుసుకోవాల్సిందే! ఆన్లైన్ ప్రొఫైల్: ఉద్యోగానికి దరఖాస్తు చేసేముందు గూగుల్‌లో రంగ ప్రవేశం చేయండి. ప్రస్తుతం 48 శాతం మంది ఎంప్లాయర్స్ తమకు కావాల్సిన అభ్యర్థుల కోసం ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. సమీప భవిష్యత్తులో ఈ సంఖ్య రెట్టింపయినా ఆశ్చర్యం లేదు. కాబట్టి అంతర్జాలంలో మీకంటూ ఒక స్థానాన్ని సృష్టించుకోండి. మీ రెజ్యూమె, ప్రొఫైల్, ఫొటోగ్రాఫ్‌ను సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో రిక్రూటర్లు, హైరింగ్ మేనేజర్లకు అందుబాటులో ఉంచండి. వీడియో బయోడేటాను కూడా ఈ సైట్లలో చేర్చండి. ఈ ప్రొఫైల్, ఫొటోలు, వీడియో బయోడేటా అత్యుత్తమ నాణ్యతతో ఉండాలి. క్వాలిటీ తగ్గితే మీ అవకాశాలూ తగ్గిపోతాయి. రిక్రూటర్లు అభ్యర్థుల కోసం నేరుగా లింక్డ్‌ఇన్‌లోకి అడుగుపెడుతున్నారు. మీ అర్హతలు, నైపుణ్యాలను తెలియజేసే పర్సనల్ బ్రాండింగ్ ఫోర్ట్‌పోలియోను ఈ సైట్లో తప్పనిసరిగా పొందుపర్చండి. ఇతరుల కంటే మీరు మెరుగైన అభ్యర్థి అని దీనిద్వారా తెలియజేయండి. మౌఖిక పరీక్ష: దరఖాస్తు దశలో జరిగే వడపోతలో నెగ్గితే ఇంటర్వ్యూకు పిలుపు వస్తుంది. ఇందులో ప్రతిభ చూపితే కొలువు ఖాయమవుతుంది. జాబ్‌లో ప్రవేశానికి ఇది గేట్పాస్ లాంటిది. అభ్యర్థులు ఇంటర్వ్యూ స్కిల్స్ పెంచుకోవాలి. సరైన వస్త్రధారణ, బాడీ లాంగ్వేజ్, సమయస్ఫూర్తితో కూడిన సమాధానాలతో రిక్రూటర్‌ను మెప్పించొచ్చు. సిఫార్సులు: మీరు మీ రెజ్యూమెలో, ఆన్లైన్ ప్రొఫైల్‌లో పేర్కొన్న అంశాలకు బలం చేకూరాలంటే రికమండేషన్లు అవసరం. మీ గురించి తెలిసిన సీనియర్ ఎగ్జిక్యూటివ్, ప్రొఫెసర్, విద్యావేత్త లేక ఎవరైనా ప్రముఖులతో రికమండేషన్ చేయించుకోండి. అంటే.. మీ పేరును సూచిస్తూ వారు ఇచ్చిన లెటర్‌ను సామాజిక అనుసంధాన వేదికల్లో రెజ్యూమె, దరఖాస్తులతోపాటు పొందుపర్చండి. కృతజ్ఞతా పత్రం: ఇప్పుడు సందేశాలు, సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం కంప్యూటర్లలో ఈ-మెయిల్స్ ద్వారానే సాగుతోంది. కానీ, థాంక్యూ లెటర్ విషయంలో మాత్రం హైరింగ్ మేనేజర్లు పాతకాలం పద్ధతినే ఇష్టపడుతున్నారు. ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత కంపెనీ యాజమాన్యానికి కృతజ్ఞతలు చెప్పాల్సి ఉంటుంది. 58 శాతం ఎంప్లాయర్స్ ఈ కృతజ్ఞతా పత్రాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఒక కాగితంపై థాంక్యూ లెటర్ టైప్ చేసి, కంపెనీకి పోస్టు చేయండి. ఇది నామ్‌కే వాస్తేలా కాకుండా ఆకర్షణీయంగా ఉండాలి. అప్పుడే రిక్రూటర్ల దృష్టిలో మీ విలువ పెరుగుతుంది. కెరీర్ గురువు: మీలాంటి విద్యార్హతలు, అనుభవం, నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులు జాబ్ మార్కెట్లో లెక్కలేనంత మంది ఉంటారు. వారితో పోటీపడాలంటే మీకు ఒక గురువు, మార్గదర్శి ఉండాలి. కొంత ఖర్చయినా వెనుకాడకుండా కెరీర్ కోచ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. జాబ్ సెర్చ్ విషయంలో వీరు సహకరిస్తారు. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలో మార్గనిర్దేశం చేస్తారు. అవకాశాలు ఎక్కడున్నాయో తెలియజేస్తారు. ఎలా ఒడిసిపట్టుకోవాలో నేర్పిస్తారు. జాబ్స్, అడ్మిషన్స అలర్ట్స నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ పుణేలోని నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. లైబ్రరీ ట్రైనీ పోస్టుల సంఖ్య: 2 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలి. వయసు: 26 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 8 వెబ్సైట్: www.niapune.com సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆపరేట్ కం టెక్నీషియన్ - ట్రైనీ విభాగాలు: మెకానికల్, మెటలర్జీ, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్. అర్హతలు: సంబంధిత విభాగంలో మూడేళ్ల డిప్లొమా ఉండాలి. అటెండెంట్ కం టెక్నీషియన్ విభాగాలు: వెల్డర్, టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మోటార్ వెహికల్ అర్హతలు: పదో తరగతితో పాటు ఐటీఐ ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 26 వెబ్సైట్: www.sail.co.in -
ఇంజనీరింగ్..నైపుణ్యాలతోనే విజయ తీరాలకు..
నేటి పోటీ ప్రపంచంలో ఇంజనీరింగ్ పట్టా చేతపట్టుకొని బయటకు వస్తూనే నచ్చిన కంపెనీలో, మెచ్చిన ఉద్యోగంలో స్థిరపడాలన్నా, ఉన్నతంగా ఎదగాలన్నా సబ్జెక్టులో పరిజ్ఞానం ఒక్కటే సరిపోదు. జాబ్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు ఎంతో అవసరం. గతంతో పోల్చితే ప్రస్తుతం కంపెనీల అవసరాల్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. పరిస్థితులకనుగుణంగా మల్చుకుంటూ పోటీ వాతావరణంలో సంస్థను ఉన్నత స్థాయిలో నిలబెట్టే నైపుణ్యం గల మానవ వనరులను నియమించుకోవడానికి అవి ప్రాధాన్యమిస్తున్నాయి. అందుకే ఉద్యోగార్థులకు సరైన నైపుణ్యాల సాధన తప్పనిసరి అయింది. ప్రాక్టికల్ పరిజ్ఞానం ముఖ్యం ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది అప్లికేషన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్. తరగతి గదిలో నేర్చుకున్న అంశాలపై ప్రాక్టికల్‌గా పట్టు సాధించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇంజనీరింగ్ కళాశాలల్లో లేబొరేటరీలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. విద్యార్థులు వీటిలో ప్రాక్టికల్స్ చేసేందుకు ప్రాధాన్యమివ్వాలి. వీటివల్ల సబ్జెక్టుల భావనలపై సులువుగా పట్టు సాధించవచ్చు. ఓ అంశానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని వివిధ రకాలుగా అనువర్తింపజేసే నైపుణ్యాలను సొంతం చేసుకోవచ్చు. అందువల్ల అభ్యర్థులు ల్యాబ్ సెషన్స్‌ను నిర్లక్ష్యం చేయకుండా నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఉపయోగించుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్: ‘‘నాకు సబ్జెక్టుపై బాగా పట్టు ఉంది. నా దగ్గర సందేహాలు నివృత్తి చేసుకున్న వారికి సైతం ఉద్యోగాలు వచ్చాయి. నాకు మాత్రం ప్రతిసారీ నిరాశ ఎదురవుతోంది. నా పరిజ్ఞానాన్ని సరిగా కమ్యూనికేట్ చేయలేకపోతుండటమే దీనికి ప్రధాన కారణం’’- చాలా మంది విద్యార్థుల నోటి నుంచి వస్తున్న మాటలివి. ఎంత సబ్జెక్టు ఉన్నా సరిగా బహిర్గతం చేయలేకపోతే ఉద్యోగం దొరకడం ఎండమావే. అందుకే ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యం. అందుకే కోర్సులో చేరిన మొదటి రోజు నుంచే ఇంగ్లిష్‌లో మాట్లాడటానికి ప్రయత్నించాలి. ఈ దిశగా ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. ఆంగ్ల దినపత్రికలు, మ్యాగజైన్లను చదవడం, బీబీసీ వంటి చానల్స్ చూడటం ద్వారా ఆ భాషపై పట్టు సాధించవచ్చు. ఇతర నైపుణ్యాలు: కళాశాలలో వివిధ రకాల ఈవెంట్లు, టెక్నికల్ ఫెస్టివల్స్ నిర్వహించడం ద్వారా ఆర్గనైజింగ్ స్కిల్స్, జట్టుగా పని చేసే నైపుణ్యం అలవడుతుంది. ప్రాంగణ నియామకాల్లో విజయం సాధించేందుకు వెర్బల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జీడీలపై దృష్టిసారించాలి. ఇప్పుడు బహుళ జాతి సంస్థల్లో కెరీర్‌ను సుస్థిరం చేసుకోవాలనుకునే వారు ఫ్రెంచ్, స్పానిష్ తదితర భాషల్లో ఏదో ఒకదాన్ని నేర్చుకోవాలి. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికీ ఇవి ఉపయోగపడతాయి. కంప్యూటర్‌కు సంబంధించి సీ లాంగ్వేజ్‌ను కాలేజీలో ఎలాగూ నేర్పుతారు కాబట్టి దీనికి అదనంగా బయట మార్కెట్లో జావాను కూడా నేర్చుకుంటే అదనపు ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగం తీరిది.. నైపుణ్యాలతో నిండుకుండలా ఉండే మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ తదితర బ్రాంచ్‌ల ఇంజనీర్లను పరిశ్రమలు వివిధ విభాగాల్లో, వివిధ హోదాలతో నియమించుకుంటాయి. పరిశోధన-అభివృద్ధి, మ్యానుఫ్యాక్చరింగ్, సప్లయ్ చైన్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్స్ మేనేజ్మెంట్, ఆపరేషన్ ఎక్స్‌లెన్స్, స్ట్రక్చరల్ ప్లానింగ్, క్వాలిటీ కంట్రోల్, మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో బాధ్యతలను అప్పగిస్తాయి. సాధారణంగా సంస్థల ప్రతినిధులు ఉద్యోగుల ఎంపిక సందర్భంగా నిర్వహించే ఇంటర్వ్యూల్లో అభ్యర్థుల అకడమిక్ రికార్డు, కంప్యూటర్ పరిజ్ఞానాన్ని తెలుసుకుంటున్నాయి. సృజనాత్మకత, పనిలో వేగం-కచ్చితత్వం, తక్కువ ఖర్చుతో విలువైన ఫలితాలను రాబట్టే నైపుణ్యాలను పరీక్షిస్తున్నాయి. వేతనాలు: జూనియర్ మేనేజ్మెంట్ స్థాయి ఇంజనీర్లకు ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వేతనం ఉంటుంది. మిడిల్ మేనేజ్మెంట్లో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు, సీనియర్ ఇంజనీర్లకైతే రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు అందుతుంది. ఇంటర్న్‌షిప్‌తో ప్రాక్టికల్ అనుభవం ఓ విద్యార్థి తాను చేస్తున్న కోర్సుకు సంబంధించి కాలేజీలో నేర్చుకున్న అంశాలను ప్రాక్టికల్స్‌గా అన్వయించడానికి ఇంటర్న్‌షిప్ ఉపయోగపడుతుంది. మంచి కొలువులకు మార్గాన్ని సుగమం చేస్తుంది. రెండు, మూడు నెలల పాటు ఓ కంపెనీలో ఉంటూ సొంతం చేసుకున్న పని అనుభవం పటిష్టమైన కెరీర్‌కు పునాది వేస్తుంది. అందువల్ల విద్యార్థులు ఇంటర్న్‌షిప్ చేసేందుకు ఉత్సాహం చూపాలి. ప్రస్తుతం కొన్ని కంపెనీలు మూడో సంవత్సరం ప్రారంభంలో టెక్నికల్ ఫెస్ట్‌లను నిర్వహిస్తున్నాయి. వీటిలో మెరుగైన ప్రతిభను ప్రదర్శించిన వారికి తమ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పిస్తున్నాయి. ఇలాంటి వాటిని అందిపుచ్చుకోవాలి. ఇంటర్న్‌షిప్ సాధారణంగా వేసవి సెలవుల్లో రెండు నెలలపాటు ఉంటుంది. టాప్ స్టోరీ ‘‘దాదాపు 30 శాతం మంది ఐటీ/కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లకు కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో ఉపయోగించే ప్రాథమిక ైభావనలపై అవగాహన లేదు’’ - యాస్పైరింగ్ మైండ్స్ అధ్యయనంలో తేలిన విషయమిది! ‘‘భారత దేశంలో కళాశాలల నుంచి బయటకు వస్తున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో కేవలం 27 శాతం మందికి మాత్రమే ఉద్యోగ నైపు ణ్యాలు ఉన్నాయి’’ - నాస్కామ్ స్కిల్ సర్వే వెల్లడించిన అంశమిది! ప్రస్తుతం అంతా కార్పొరేట్ మయం.. నేటి పోటీ ప్రపంచంలో కంపెనీని ప్రగతి పథంలో పయనింపజేసే నిపుణులకే ఆకర్షణీయ వేతన ప్యాకేజీలతో ఉద్యోగాలు స్వాగతం పలుకుతున్నాయి. ఏటా దేశంలోని ఇంజనీరింగ్ కళాశాలల నుంచి బయటకు వస్తున్న లక్షల మందిలో కొంత మందికే ఉన్నత అవకాశాలు లభిస్తున్నాయి. మరి మిగతా వారి సంగతేమిటి? ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యకు హబ్‌గా ఉన్న హైదరాబాద్ విద్యార్థులు ఉజ్వల కెరీర్‌ను చేజిక్కించుకోవాలంటే ఏం చేయాలి? ఏ నైపుణ్యాలను సొంతం చేసుకోవాలి? తదితరాలపై ఫోకస్... కాలేజీ వైపు నుంచి విద్యార్థులందరికీ ఉపాధి అవకాశాలు లభించేలా కళాశాలలు తమ వంతు కృషి చేయాలి. కళాశాలకు పరిశ్రమల ప్రతినిధులను ఆహ్వానించి, వారి అవసరాలు తెలుసుకోవాలి. తదనుగుణంగా కరిక్యులంను మార్చాలి. కేవలం విద్యార్థులను తరగతి గదికే పరిమితం చేయకుండా, ప్రాక్టికల్ పరిజ్ఞానానికి చేరువ చేయాలి. వివిధ కార్యక్రమాల నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించాలి. ఇంటర్న్షిప్స్, అప్రెంటీస్‌షిప్ దిశగా విద్యార్థులను ప్రోత్సహించాలి. అవసరమైన సహాయం అందించాలి. -
గిరాకీ ఉన్న ఉద్యోగ నైపుణ్యాలు
జాబ్ మార్కెట్లో ఎలాంటి నైపుణ్యాలకు ఎక్కువ డిమాండ్ ఉందో తెలుసుకుంటే.. అభ్యర్థులు ఆయా స్కిల్స్‌ను పెంచుకునేందుకు వీలుంటుంది. తమలో ఉన్న నైపుణ్యాలకు ఎలాంటి ఉద్యోగాలు లభిస్తాయో కూడా తెలుస్తుంది. భవిష్యత్తులో మంచి ఉద్యోగావకాశాలను దక్కించుకోవాలంటే పట్టు సాధించాల్సిన స్కిల్స్‌పై అవగాహన వస్తుంది. కొలువుకు దరఖాస్తు చేసేటప్పుడు అభ్యర్థులు రెజ్యూమెలో తమ విద్యార్హతలు, నైపుణ్యాలను ప్రస్తావించాలి. మౌఖిక పరీక్షలోనూ ఈ స్కిల్స్‌పై ప్రశ్నలు సంధిస్తారు. విశ్లేషణ్మాతక ఆలోచనా విధానం, ఇతరులు చెప్పేది ఓపిగ్గా వినే లక్షణం.. ఇవి కూడా అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించే నైపుణ్యాలే. రిక్రూటర్లు ఇలాంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రస్తుతం గిరాకీ ఉన్న 10 జాబ్ స్కిల్స్ గురించి తెలుసుకుందాం. క్రిటికల్ థింకింగ్: ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే పరిస్థితిని విశ్లేషించి, ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించడానికి అభ్యర్థుల్లో లాజికల్, రీజనింగ్ స్కిల్స్ ఉండాలి. ప్రత్యామ్నాయంలోని లాభ నష్టాలను వివరించే సామర్థ్యం కూడా అవసరం. ప్రాబ్లమ్ సాల్వింగ్: సమస్యలను సరిగ్గా గుర్తించి, వాటి ప్రభావాన్ని అంచనా వేసి, గడువులోగా పరిష్కరించేందుకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. సమస్యలు సాంకేతికమైనా, సాధారణమైనా.. అవి మళ్లీ తలెత్తకుండా శాశ్వత పరిష్కార మార్గం చూపాలి. డెసిషన్ మేకింగ్: సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగల నేర్పు ఉన్న వ్యక్తులు వృత్తి, ఉద్యోగాల్లో అత్యున్నతంగా రాణిస్తారు. అందుకే రిక్రూటర్లు ఈ నైపుణ్యం గల అభ్యర్థులకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారు. యాక్టివ్ లిజనింగ్: ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినడం మంచి లక్షణం. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి. ఉద్యోగులకు ఈ స్కిల్ తప్పనిసరిగా ఉండాలని కంపెనీలు ఆశిస్తున్నాయి. కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్: ఇప్పుడు అన్ని పనులు కంప్యూటర్లలోనే జరుగుతున్నాయి. కాబట్టి అభ్యర్థులకు కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్‌పై పరిజ్ఞానం తప్పనిసరి. కంప్యూటర్ అప్లికేషన్లపై పట్టు పెంచుకోవాలి. మ్యాథమెటిక్స్: గణితంలో అర్థమెటిక్, ఆల్జీబ్రా, జామెట్రీ, కాలిక్యులస్, స్టాటిస్టిక్స్, వాటి అప్లై వంటివాటిపై స్కిల్స్ పెంచుకోవాలి. ఉత్పత్తి పెంపు: వ్యవస్థ ఎలా పనిచేయాలో స్వయంగా నిర్దేశించగలగాలి. ఉత్పత్తిని పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించాలి. మానిటరింగ్: అభ్యర్థులు తమ పనితీరును ఎప్పటికప్పుడు స్వయంగా అంచనా వేసుకోవాలి. అవసరాలకు తగ్గట్లు పనితీరును మెరుగుపర్చుకొనే లక్షణం చాలా ముఖ్యం. ప్రోగ్రామింగ్: వివిధ అవసరాలకు సొంతంగా కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను రాసే నైపుణ్యం ఉండాలి. సేల్స్ అండ్ మార్కెటింగ్: నేటి మార్కెటింగ్ యుగంలో ఉత్పత్తులను, సేవలను వినియోగదారులకు పరిచయం చేసే నైపుణ్యానికి కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి. ప్రభావవంతమైన మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించి, అమ్మకాలను, లాభాలను పెంచే అభ్యర్థుల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. కాబట్టి జాబ్ మార్కెట్లో ముందంజలో నిలవాలంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ స్కిల్స్ కచ్చితంగా ఉండాలి. జాబ్స్ అలర్ట్స: ఫీల్డ్ సూపర్వైజర్స్ రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. కాంట్రాక్ట్ పద్ధతిలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఫీల్డ్ సూపర్వైజర్స్పోస్టుల సంఖ్య: 50 అర్హతలు: ఎలక్ట్రానిక్స్/టెలి కమ్యూనికేషన్/కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో కనీసం మూడేళ్ల అనుభవం తప్పనిసరి. నిర్దేశిత వయోపరిమితి ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.. దరఖాస్తు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తులను పూర్తిచేసి, పోస్టు ద్వారా పంపాలి. చివరి తేది: అక్టోబర్ 14 వెబ్సైట్: www.railtelindia.com ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్స్ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ)... కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. హెడ్ కానిస్టేబుల్(టెలి కమ్యూనికేషన్) పోస్టులు: 229 వయోపరిమితి: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత: 45 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత. ఎంపిక: పరుగు పందెం, ఫిజికల్ టెస్టులు, రాత పరీక్ష, మెడికల్ టెస్టుల ద్వారా... దరఖాస్తు: ఆఫ్‌లైన్ విధానం ద్వారా.. చివరి తేది: అక్టోబర్ 24 వెబ్సైట్: http://itbpolice.nic.in/ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన బాబ్కార్డ్స్ లిమిటెడ్ (బీఓబీ) ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఆఫీసర్: 70 అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య.. ఎంపిక: ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: అక్టోబరు 9 ఆన్లైన్ టెస్టు తేది: డిసెంబరు 10 వెబ్సైట్: http://ibpsregistration.nic.in -
తాజా గ్రాడ్యుయేట్లకు అవకాశాలిక్కడ..!
నేటి జాబ్ మార్కెట్లో ఉద్యోగావకాశాలకు కొదవలేదు. ప్రొఫెషనల్ కోర్సులతో పాటు బీఏ/బీకామ్/బీఎస్సీ తదితర బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన వారికి సైతం కెరీర్ అవకాశాలు పుష్కలం. ఐటీ, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్, సేల్స్/మార్కెటింగ్, హాస్పిటాలిటీ అండ్ టూరిజం, ఫ్యాషన్‌తోపాటు మరెన్నో రంగాలు గ్రాడ్యుయేట్లకు ఆహ్వానం పలుకుతున్నాయి. గతంలో కంటే జాబ్ మార్కెట్ ఇప్పుడు వీరికి సానుకూలంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. యువ ప్రతిభావంతులను నియమించుకునేందుకు టాప్ కాలేజీలకు కంపెనీలు క్యూ కడుతుండటమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా విభాగాల్లో సిటీ యువతకు అందుబాటులో ఉన్న వివిధ కెరీర్ అవకాశాలపై ఫోకస్.. ఐటీ కొలువులు: ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉన్న కెరీర్లలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) ఒకటి. ఐటీపై ఆసక్తి ఉండి సైన్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఈ కెరీర్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో అడుగుపెట్టాలంటే.. టెక్నాలజీలో ప్రాథమిక అంశాలపై అవగాహనతోపాటు ఆసక్తి ఉండాలి. సృజనాత్మకంగా ఆలోచించగలిగే నేర్పు, ఎప్పటికప్పుడు సాంకేతిక అంశాలతో అప్డేట్ అయ్యే నైపుణ్యాలు తప్పనిసరి. ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్: అంకెలు, ఆడిట్లు, అకౌంట్లు, పన్నుల చుట్టూ తిరిగే రంగం ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్. కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసిన వారు పలు కార్పొరేట్ కంపెనీల్లోని ఫైనాన్స్ విభాగాల్లో ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. డిగ్రీ పూర్తిచేసిన యువత ముందు ఉన్న మరో అద్భుత అవకాశం బ్యాంక్ కొలువులు. ప్రొబేషనరీ ఆఫీసర్లు, క్లరికల్ ఉద్యోగాల కోసం ఏటా వేలాది జాబ్ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో ప్రతిభ చూపి బ్యాంకులో ఉద్యోగం సాధించొచ్చు. సేల్స్ అండ్ మార్కెటింగ్: కంపెనీ ఏదైనా మార్కెట్లో పోటీని తట్టుకుని నిలవాలంటే.. దాని ఉత్పత్తుల సేల్స్‌తోపాటు మార్కెటింగ్ తప్పనిసరి. కాబట్టి కంపెనీలు అధిక వేతనాలు చెల్లించి మార్కెటింగ్ నిపుణులను నియమించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చురుకైన, ఉత్సాహవంతులైన యువతకు మార్కెటింగ్‌లో విస్తృత అవకాశాలున్నాయి. సేల్స్ విభాగంలో పనిచేయాలంటే గ్రాడ్యుయేషన్ అర్హత తప్పనిసరి కానప్పటికీ అధిక సంఖ్యలో కంపెనీలు బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సును పూర్తి చేసిన వారిని నియమించుకుంటున్నాయి. ఏవియేషన్: భారత్‌లో ఏవియేషన్ రంగం గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తోంది. 2020 నాటికల్లా ప్రపంచంలోనే మనదేశం మూడో స్థానంలో నిలవనుందని, 2030 నాటికి మొదటి స్థానాన్ని సొంతం చేసుకోనుందని ఫిక్కీ-కేపీఎంజీ అంచనా. ఈ నేపథ్యంలో ఏవియేషన్‌లో గ్రౌండ్ లెవల్ జాబ్స్ నుంచి ఏరోప్లేన్ సర్వీసెస్ వరకు పెలైట్, గ్రౌండ్ డ్యూటీ, కేబిన్ క్రూ, ఎయిర్ హోస్టెస్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) తదితర విభాగాల్లో విస్తృతమైన ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఆతిథ్య, పర్యాటక రంగాలు: దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుండడంతో దేశంలో ఆతిథ్య, పర్యాటక రంగాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. ఫైవ్ స్టార్ హోటళ్లు, రిసార్టుల నిర్మాణం కారణంగా ఈ రంగాల్లో మానవ వనరులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్, ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్ విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. హోటల్ మేనేజ్మెంట్లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసిన వారికి మంచి అవకాశాలుంటాయి. గ్రాడ్యుయేషన్ తర్వాత కూడా ఎంబీఏ(హాస్పిటాలిటీ మేనేజ్మెంట్) /ఎంఎస్సీ(హాస్పిటాలిటీ మేనేజ్మెంట్) తదితర కోర్సులనభ్యసించొచ్చు. ఈ రంగంలో ప్రారంభంలోనే ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి. ఫ్యాషన్ టెక్నాలజీ: ప్రపంచీకరణ ప్రభావంతో ఫ్యాషన్, డిజైనింగ్ రంగాల విస్తృతి పెరుగుతోంది. కొత్త పుంతలు తొక్కుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా ఫ్యాషన్ నిపుణులకు డిమాండ్ అధికమవుతోంది. ప్రతిభ, సృజనాత్మక నైపుణ్యాలుండి ఫ్యాషన్‌పై ఆసక్తి ఉంటే.. ఎవరైనా ఈ రంగంలో ప్రవేశించవచ్చు. ‘ఫ్యాషన్’లో బ్యాచిలర్‌స డిగ్రీ కోర్సులు పూర్తిచేసిన వారు వస్త్ర, తోలు ఉత్పత్తులు, ఆభరణాల తయారీ పరిశ్రమల్లో ఎగ్జిక్యూటివ్‌లుగా, ఫ్యాషన్ డిజైనర్లుగా, ఇలస్ట్రేటర్లుగా ఎన్నో అవకాశాలను అందుకోవచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్)తోపాటు పలు ప్రైవేటు విద్యాసంస్థలు ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులను అందిస్తున్నాయి. మీడియా/జర్నలిజం/పబ్లిషింగ్: జర్నలిజం.. ఒక ఉత్సాహవంతమైన, సాహసోపేతమైన కెరీర్. ప్రజల పక్షాన నిలిచి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే వృత్తి. సామాజిక స్పృహ, భాషా ప్రావీణ్యం, కష్టపడి పనిచేసేతత్వం ఉన్నవారికి ఇది సరైన కెరీర్. దేశంలో కొత్త పత్రికలు, టీవీ చానళ్లు, ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్ వెలుస్తున్న నేపథ్యంలో జర్నలిజంలో అవకాశాలు విస్తృతం అవుతున్నాయి. దేశంలోని దాదాపు అన్ని యూనివర్సిటీలు మాస్ కమ్యూనికేషన్, జర్నలిజంలో డిప్లొమా, పీజీ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ తదితర కోర్సులను అందిస్తున్నాయి. ఈవెంట్స్ అండ్ పబ్లిక్ రిలేషన్స్: బర్త్‌డే పార్టీ, ఎడ్యుకేషన్ ఈవెంట్స్, ఇండస్ట్రియల్ మీటింగ్స్, మ్యారేజ్ ఫంక్షన్స్.. ఇలా కార్యక్రమమేదైనా నేటి కార్పొరేట్ యుగానికి అనుగుణంగా డిజైన్ చేయడానికి ఈవెంట్ మేనేజ్మెంట్/పబ్లిక్ రిలేషన్స్ సంస్థలు తప్పనిసరి అవుతున్నాయి. దీంతో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, నెట్వర్కింగ్ స్కిల్స్ ఉన్న ఉత్సాహవంతులైన, చురుకైన అభ్యర్థులకు ఈవెంట్ మేనేజ్మెంట్/పబ్లిక్ రిలేషన్స్ కెరీర్ నూరుశాతం సరిపోతుంది. కష్టపడి పనిచేసే తత్వం, గంటల కొద్దీ పనిచేసే ఓపిక, నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నవారు ఈ కెరీర్లో సులభంగా రాణిస్తారు. దేశంలోని పలు ఇన్స్టిట్యూట్లు సర్టిఫికెట్ నుంచి డిప్లొమా, పీజీ డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా, ఎంబీఏ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. సర్కారీ కొలువులు: ఉద్యోగ భద్రతతోపాటు మెరుగైన భవిష్యత్తుకు వేదికలు... ప్రభుత్వ కొలువులు. కింది స్థాయి ఉద్యోగాలు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలు మొదలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షలకు బ్యాచిలర్‌స డిగ్రీ అర్హతతో పోటీ పడొచ్చు. వందల సంఖ్యల్లో ఖాళీలకు లక్షల్లో దరఖాస్తులు వస్తున్నాయంటే సర్కారీ కొలువులకు ఉన్న ఆదరణ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీ అర్హతతో అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు అనేకం. క్రమబద్ధమైన, స్థిరమైన జీవనం కోరుకునేవారు ఈ ఉద్యోగాలకు పోటీ పడుతున్నారు. సైన్స్, కామర్స్, హ్యుమానిటీస్.. విభాగమేదైనా ప్రభుత్వ కొలువులకు యువత పోటీపడొచ్చు. పోటీ తీవ్రంగా ఉంటుంది కాబట్టి అభ్యర్థులు అందుకు తగ్గట్టుగా శ్రమిస్తే కోరుకున్న కొలువు ఖాయం అవుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలు: కార్పొరేట్ కంపెనీలకు ఏ మాత్రం తీసిపోకుండా పోటీపడుతూ అధిక వేతనాలు చెల్లించే కంపెనీలు.. ప్రభుత్వ రంగ సంస్థలు. వీటిలో మహారత్న, నవరత్న, మినీరత్న అనే కేటగిరీలున్నాయి. మినీరత్నలో మళ్లీ రెండు కేటగిరీలున్నాయి. మొత్తంగా దేశంలో 7 మహారత్న, 17 నవరత్న, 71 మినీరత్న కంపెనీలున్నాయి. వీటిలో శాశ్వత ఉద్యోగులుగా ఎంపికైన అభ్యర్థులకు అత్యుత్తమ జీత భత్యాలు, పదోన్నతులు, ఇతర సౌకర్యాలు లభిస్తున్నాయి. ఇవి కూడా ఎలాంటి ఒడిదుడుకులు లేని స్థిరత్వం ఉండే ఉద్యోగాలు. అంతేకాకుండా ఆర్థిక సంక్షోభ ప్రభావం ఉండని కొలువులు. ఆసక్తికే ప్రాధాన్యం! ‘‘బ్యాచిలర్‌స డిగ్రీ స్థాయిలో అభ్యసించిన కోర్సులకు సంబంధించిన అభ్యర్థులు తమ ఆసక్తి, అభిరుచికి తగిన కెరీర్‌ను ఎంపిక చేసుకోవాలి. డబ్బు ముఖ్యమైనదే అయినప్పటికీ కెరీర్ ఎంపికలో వేతనాలకు అవసరానికి మించిన ప్రాధాన్యత ఇవ్వొద్దు. ఏదైనా ఒక రంగంలో అడుగుపెట్టే ముందు తమ అభిరుచులు, సామర్థ్యాలను అంచనా వేసుకోవాలి. ఆ రంగంలో పోటీ, సవాళ్లను ఏమేరకు తట్టుకోగలరో తెలుసుకోవాలి. ఒక వేళ వేతనం ఆశించినంతగా లభించకపోతే నిరుత్సాహపడొద్దు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. భవిష్యత్తులో మీకు నచ్చిన రంగంలోనే ఎక్కువ సంపాదన పొందే అవకాశం లేకపోలేదు. కాబట్టి కెరీర్ నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి.’’ - డా.అడపా రామారావు, డీన్, కౌన్సెలింగ్ అండ్ కెరీర్ గెడైన్స్, జీఆర్ఐఈటీ -
జీవన నైపుణ్యాలు నేర్పే.. ఫినిషింగ్ స్కూల్స్
‘విద్యార్థులు కష్టపడి చదివి డిగ్రీలు సంపాదిస్తున్నారు కానీ.. జాబ్ మార్కెట్‌కు కావాల్సిన నైపుణ్యాలను పొందలేకపోతున్నారు’.. నేటి విద్యార్థుల తీరుపై పారిశ్రామిక వర్గాలు తరచుగా వ్యక్తం చేస్తున్న అభిప్రాయమిది. అటు నాస్కామ్, ఫిక్కీ వంటి సంస్థల సర్వేలు కూడా ఇదే విషయాన్ని పేర్కొంటున్నాయి. విద్యా సంస్థలు విద్యార్థుల కోసం ప్రాంగణ నియామకాలను నిర్వహిస్తున్నా.. చాలామంది తగిన స్కిల్స్ లేక ఉద్యోగ సాధనలో వెనుకంజలో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో మంచి కొలువు సాధించడానికి, కెరీర్లో అత్యుత్తమంగా రాణించడానికి కావాల్సిన జీవన నైపుణ్యాలను నేర్పే ఉద్దేశంతో ఏర్పాటైనవే.. ఫినిషింగ్ స్కూల్స్. నగరంలో ఎన్నో ఫినిషింగ్ స్కూల్స్ వివిధ కోర్సులను అందిస్తున్నాయి. ఆ వివరాలు.. ఫినిషింగ్ స్కూల్ అంటే.. ఫినిషింగ్ స్కూల్స్.. విదేశాల్లో బాగా పాపులర్. ఆయా దేశాల యూనివర్సిటీల్లో కోర్సు పూర్తయ్యేనాటికి.. అటు అకడమిక్ నైపుణ్యాలతోపాటు ఇటు జాబ్ మార్కెట్‌కు తగిన స్కి ల్స్‌ను కూడా విద్యార్థులకు నేర్పిస్తారు. తద్వారా ఉ ద్యోగంలో చేరేనాటికే అన్ని నైపుణ్యాలను విద్యార్థులు పుణికిపుచ్చుకుంటారు. ఈ కోవలోనే మనదేశంలో కూడా ఫినిషింగ్ స్కూల్స్ ఏర్పాటయ్యాయి. అయితే ఇవి ఎక్కువగా ప్రైవేటు రంగంలో ఉన్నాయి. జాబ్ మార్కెట్లో డిమాండ్ ఉన్న రంగాలకు సంబంధించి సర్టిఫికెట్, పీజీ డిప్లొమా కోర్సులను బోధిస్తున్నాయి. వీటి కరిక్యులమ్‌ను పారిశ్రామిక వర్గాల సలహాలు, సూచనల ప్రకారం రూపొందిస్తారు. అంతేకాకుండా క్లాస్ రూం టీచింగ్, ఇండస్ట్రీ ఇంటర్న్‌షిప్‌లకు సమ ప్రాధాన్యమిస్తారు. సమాజ, పరిశ్రమల అవసరాలకనుగుణంగా అభ్యర్థిని పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దుతారు. కోర్సుల్లో అంశాలివే బ్యాచిలర్స్ డిగ్రీ మూడో ఏడాదిలో చివరి మూడు నెలలు ఫినిషింగ్ స్కూల్ శిక్షణ ఇస్తారు. ఇందులో భాగంగా.. సోషల్ స్కిల్స్, కల్చరల్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, సాఫ్ట్ సిల్క్స్ వంటివి నేర్పిస్తారు. వేషధారణ (డ్రెస్సింగ్), బాడీలాంగ్వేజ్ (శరీర భాష), ఆత్మవిశ్వాసం, వ్యక్తిగత ప్రవర్తన, మానవ సంబంధాలు, అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచడం, సంభాషణా చాతుర్యం, సమయస్ఫూర్తి, భోజన మర్యాదలు, పార్టీల్లో, ఫంక్షన్స్‌లో వ్యవహరించాల్సిన పద్ధతులు, విదేశీ క్లయింట్స్‌తో వ్యవహరించగల నేర్పు.. ఇలా సందర్భానికి తగినట్లుగా ఆయా నైపుణ్యాలు పొందేలా ఫినిషింగ్ స్కూల్స్‌లో బోధన ఉంటుంది. ఇందుకోసం సైకాలజీ, మేనేజ్మెంట్, హెల్త్, బ్యూటీ, ఫుడ్ అండ్ డైట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ వంటి అంశాల్లో నిపుణులైనవారితో తరగతులు నిర్వహిస్తారు. పురుషులు, మహిళలకు వేర్వేరు ‘ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్’.. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణి ంచాలంటే ఇదే ప్రధాన సూత్రం. ఫినిషింగ్ స్కూల్ కరిక్యులంలో అబ్బాయిలు, అమ్మాయిలకు శిక్షణాంశాలు వేర్వేరుగా ఉంటాయి. నగరంలోని పలు మహిళా కళాశాలల్లో అందిస్తున్న అంశాలివి.. పోషకాలున్న ఆహారాన్ని తయారుచేయడం, ఇంటిని అందంగా తీర్చిదిద్దడం వంటి మహిళలకు అవసరమైన అంశాలతోపాటు పర్సనాలిటీ డెవలప్మెంట్, ఈ-బ్యాంకింగ్, ఈ-కామర్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివాటిని మహిళలకు నేర్పిస్తారు. వీటితోపాటు మైక్రోవేవింగ్, వెజిటెబుల్ కార్వింగ్, పర్సనల్ గ్రూమింగ్, ఏరోబిక్స్, యోగా తదితర అంశాలు కూడా ఉంటాయి. పురుషులకు తమ వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో రాణించేందుకు వీలుగా భావ వ్యక్తీకరణ సామర్థ్యాలు, సమయపాలన, ప్రజెంటేషన్ స్కిల్స్, టేబుల్ మేనర్స్ వంటి వాటిలో శిక్షణనిస్తారు. కెరీర్లో మరింత రాణింపు ‘గ్రాడ్యుయేషన్ చివర్లో క్యాంపస్‌లోనే ప్లేస్మెంట్ సాధించి కెరీర్లో స్థిరపడాలనేది ఇప్పటి యువతరం ఆలోచన. దీనికి తగినట్లుగా అవసరమైన నైపుణ్యాలను రూపొందించేందుకే ఫినిషింగ్ స్కూల్స్ అంటున్నారు విల్లామేరి కళాశాల అకడమిక్ ఇన్‌ఛార్జి రేవతిదేవి మాధుర్. జాబ్ మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు కేవలం అకడమిక్స్ అర్హతలు సరిపోవట్లేదని, అదనపు నైపుణ్యాలు ఉంటేనే కంపెనీలు ఉద్యోగాలిస్తాయని ఆమె చెబుతున్నారు. ముఖ్యంగా యువతులకు గృహాలంకరణ.. అందం, ఆరోగ్య సం బంధిత అంశాలపై నేర్చుకునే అంశాలు భావి జీవితంలో ఉపకరిస్తాయనేది ఆమె మాట. అంతేకాకుండా ప్రాక్టికల్‌గా ఎదురయ్యే సామాజిక, ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేందుకు ఇక్కడ నేర్చుకున్న ప్రొఫెషనల్ అంశాలు కెరీర్లో ఎదిగేందుకు తోడ్పడతాయని అంటున్నారు. ‘ప్రభుత్వ కళాశాలల్లో చేరే విద్యార్థినులకు ఈ తరహా శిక్షణ ఉపయోగకరం గా ఉంటుంది. దీన్ని మా క్యాంపస్‌లోనూ ప్రవేశపెట్టాలని యోచిస్తున్నాం’ అని అంటున్నారు వనితా మహావిద్యాలయ ప్రిన్సిపల్ డాక్టర్ బి.వాణి. కోర్సులను అందిస్తున్న ఇన్స్టిట్యూట్స్ లైఫ్ స్కిల్స్, కమ్యూనికేషన్స్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ వంటి కోర్సులను దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు, కళాశాలలు అందిస్తున్నాయి. అయితే ఎక్కువగా వ్యాల్యూ యాడెడ్ కోర్సులుగా ఇవి అందుబాటులో ఉన్నాయి. నగరంలో వివిధ ఇంజనీరింగ్ కళాశాలలు, మేనేజ్మెంట్ కళాశాలలు.. అకడమిక్ కోర్సులతోపాటే వీటిలో శిక్షణ ఇస్తున్నాయి. తద్వారా విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ పొందడానికి మార్గం సుగమం చేస్తున్నాయి. ఆల్‌రౌండ్ ప్రతిభకు కేరాఫ్ ఫినిషింగ్ స్కూల్స్ ‘‘నేడు వ్యక్తిగత, వృత్తిగత జీవితాల్లో రాణించాలంటే దానికి ఏకైక మార్గం.. ఫినిషింగ్ స్కూల్స్. శిక్షణ ద్వారా జీవన నైపుణ్యాలను అలవర్చుకుంటే కెరీర్లో మరింత ఉన్నతస్థానానికి చేరొచ్చు. డ్రెస్సింగ్, టైం మేనేజ్మెంట్, ఆటిట్యూడ్, ఆప్టిట్యూడ్, పర్సనల్ బిహేవియర్ ఇలా.. ప్రతిదీ జీవితంతో ముడిపడినదే. కాబట్టి లైఫ్ స్కిల్స్‌ను ప్రతి ఒక్కరూ పొందాలి. ముఖ్యంగా కార్పొరేట్ సంస్కృతి భాగ్యనగరంలో విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కోర్సులు చేసేందుకు యువత ఆసక్తి చూపుతోంది’’ - కవిత, డెరైక్టర్, పనాచే ఫినిషింగ్ స్కూల్ ఉస్మానియా యూనివర్సిటీ (దూరవిద్యా విధానంలో) వెబ్సైట్: www.oucde.org రాజీవ్‌గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్ - శ్రీపెరంబదూర్ కోర్సు: ఎంఏ లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ అర్హత: 45 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక: ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.. వెబ్సైట్: www.rgniyd.gov.in రామకృష్ణ మఠం - హైదరాబాద్, వెబ్సైట్: www.rkmath.org ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - రూర్కీ వెబ్సైట్:www.iitr.ac.in యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వెబ్సైట్: www.du.ac.in -
కెరీర్లో విసుగెత్తిపోయారా?
జాబ్ స్కిల్స్: మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం విసుగ్గా ఉందా? కొలువు నిర్జీవంగా, అనాసక్తిగా మారిందా? దీన్ని వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలని అనిపిస్తోందా? రొటీన్ లైఫ్ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారా? కొత్తగా ఏదైనా చేయాలని భావిస్తున్నారా?... జీవితంలో చాలామందికి ఏదో ఒక దశలో ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. కెరీర్లో విసుగు రావడానికి, ఉద్యోగ జీవితం చప్పగా మారడానికి చాలా కారణాలుంటా యని నిపుణులు చెబుతున్నారు. నిజాయతీ గా ప్రయత్నిస్తే.. జీవితంలో పునరుత్తేజం పొందొచ్చని, హ్యాపీగా ఉద్యోగం చేసుకో వచ్చని పేర్కొంటున్నారు. జాబ్ ఇష్టం లేకపోతే మరో రంగంలో అడుగుపెట్టి సక్సెస్ కావొచ్చని సూచిస్తున్నారు. మీరే స్థితిలో ఉన్నారు? జాబ్పట్ల విముఖత తలెత్తడానికి ప్రధానంగా చుట్టూ ఉన్న పరిస్థితులే కారణం. ఆఫీస్‌లో పై అధికారి, సహోద్యోగుల వైఖరి నచ్చక చాలామంది ఉద్యోగం వదిలేయాలని అనుకుంటారు. తమ కెరీర్లో డెడ్ ఎండ్‌కు వచ్చేసినట్లు భావిస్తుంటారు. ఆఫీస్‌లో ఎక్కువ సేపు పనిచేయడం, అదనపు బాధ్యతలను మోయాల్సి రావడం, విధి నిర్వహణలో తరచుగా ప్రయాణాలు, సేల్స్ టార్గెట్లు వంటివి ఉద్యోగులను తీవ్ర ఒత్తిళ్లకు గురిచేస్తాయి. కొందరు వీటిని భరించలేరు. కెరీర్లో ఎదుగుదల లేకపోయినా నీరసానికి గురవుతారు. తమకు ఆనందం కలిగించని కొలువులో ఇంకా ఎందుకు ఉండాలని ఆవేశపడుతుంటారు. తమపై బాస్‌ల పెత్తనం భరించలేని వారు కూడా కొలువుకు గుడ్‌బై చెప్పాలన్న ఆలోచనలో ఉంటారు. కానీ, మరో ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల ఇష్టంలేకపోయినా బలవంతంగా సర్దుకుపోతుంటారు. కొందరు ఉద్యోగంలో చేరినప్పుడు ఆఫీస్‌లో ఎలాంటి విధులు నిర్వర్తించారో.. ఐదేళ్ల తర్వాత కూడా అవే పనులు చేస్తుంటారు. కొత్త బాధ్యతలను చేపట్టి, కొత్త విషయాలను నేర్చుకొనేందుకు అవకాశం ఉండదు. తమ నైపుణ్యాలు వృథా అవుతున్నాయని వీరు బాధపడుతుంటారు. ఇంకొందరి పరిస్థితి మరోలా ఉంటుంది. ఆఫీస్‌లో చేద్దామంటే చేతినిండా పని ఉండదు. ఖాళీగా కూర్చోవడం వీరికి నచ్చదు. కొత్తకొత్త సవాళ్లను ఎదుర్కోవడం అంటే వీరికి చాలా ఇష్టం. కానీ, చేయడానికి పని లేకపోవడం వల్ల కెరీర్ పట్ల ఆసక్తిని కోల్పోతుంటారు. జాబ్‌లో అసంతృప్తి, అయిష్టం మరోరకం ఉద్యోగులు కూడా ఉంటారు. వీరికి తెల్లారుతుందంటేనే భయం. ఆఫీస్కెళ్లాలంటే బెంబేలెత్తిపోతుంటారు. కుర్చీలో కూర్చోగానే వీరి బుర్ర పనిచేయడం మానేస్తుంది. తాము మానసికంగా, శారీరకంగా బలహీనంగా మారినట్లు భావిస్తుంటారు. రోజు ఎలా గడుస్తుందా? అని క్షణక్షణం ఎదురుచూస్తుంటారు. వీకెండ్ కోసం చకోర పక్షుల్లా నిరీక్షిస్తుంటారు. జాబ్‌లో సంతృప్తి లేకపోవడం, వస్తున్న జీతం సరిపోకపోవడం, ఎన్నాళ్లు పనిచేసినా వేతనం పెరగకపోవడం వంటి కారణాలతోనూ కెరీర్ పట్ల అయిష్టాన్ని చూపేవారు కూడా ఉంటారు. స్వీయ సమీక్ష తప్పనిసరి కెరీర్‌ను, జీవితాన్ని ప్రేమించాలంటే మిమ్మల్ని మీరు సమీక్షించుకోండి. ఉద్యోగం పట్ల విసుగెత్తిపోయి నప్పుడు ఇలాంటి సమీక్ష తప్పని సరి. మీకున్న అర్హతలు, నైపుణ్యాలు, అనుభవాలు, మీ ఆర్థిక పరిస్థితి తదితర విషయాలను అంచనా వేసు కోండి. మీ లక్ష్యాలేంటి? వాటిని చేరుకొ నేందుకు ఏం చేయాలి? మీరేం చేయాలను కుంటున్నారు? మీరు ఏ విషయంలో నిష్ణాతులు? మీకున్న నైపుణ్యాలకు నిజంగా ఎంత వేతనం వస్తుంది? బయట జాబ్ మార్కెట్ ఎలా ఉంది? ఉద్యోగాలు దొరుకుతున్నాయా? లేదా? అనే విషయాలను తెలుసుకొనేందుకు మిమ్మల్ని మీరు ప్రశ్నించు కోండి. మీ ప్రస్తుత స్థితిని స్నేహితులకు, కుటుంబ సభ్యులకు తెలియజేయండి. పరిస్థితిని మీరు అతిగా ఊహించుకొని భయపడకుండా, వాస్తవాన్ని మీకు తెలిసేలా చేయడంలో వారు సహకరిస్తారు. ఆఫీస్‌లో సహచరులతోనూ మాట్లాడండి. చుట్టూ నిజంగా ఏం జరుగుతుందో తెలుసుకోండి. పరిస్థితిని మీరు తప్పుగా అర్థం చేసుకుంటే వారు సరిచేస్తారు. ఇతర రంగాల్లోని వారిని కూడా సంప్రదించండి. జాబ్ మార్కెట్ ఎలా ఉందో తెలుస్తుంది. ఆత్మవిశ్వాసం పెంచుకోండి లైఫ్ రొటీన్‌గా మారినప్పుడు స్వయంగా కొన్ని మార్పులు చేసుకోవాలి. ఉదయం యోగా చేయండి. దీనివల్ల మనసు, శరీరం రిలాక్స్ అవుతాయి. మీ రంగానికి సంబంధం లేని మరో ఆఫీస్‌ను సందర్శించండి. దీనివల్ల మీ పరిస్థితిని మరో కోణంలో చూసే అవకాశం లభిస్తుంది. వీకెండ్లో కొత్తగా ఏదైనా చేయండి. వీలుంటే డ్యాన్స్ క్లాస్‌లో చేరండి. లాంగ్ డ్రైవ్‌కు కూడా వెళ్లొచ్చు. కొత్త ప్రదేశాన్ని దర్శించండి. కంఫర్ట్ జోన్ నుంచి బయటికొచ్చి అప్పటిదాకా పరిచయం లేని కొత్త పనిచేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆఫీస్ పనుల్లోనూ మార్పులు చేసుకోండి. మరో టీమ్‌తో కలిసి పనిచేయండి. కొత్త బాధ్యతలను స్వీకరించండి. వేతనం సరిపోకపోతే ఆ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లండి. కొలువు మారాలని కచ్చితంగా నిర్ణయించుకుంటే.. మీ అర్హతలను పెంచుకోండి. -
ఎంబీఏ.. ఎందుకు? ఎలా?
ఏ కోర్సు చదివినాదాని అంతిమ లక్ష్యం.. ఉద్యోగమే. జాబ్ మార్కెట్ కోణంలో.. కొన్ని కోర్సుల ఎంపికలో ముఖ్యంగా ఎంబీఏ విషయంలో ప్రస్తుతం పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇతర కోర్సులతో పోల్చితే ఎంబీఏకు ఎక్కువ వ్యయం కావడం, కోర్సును పూర్తి చేయడానికి పట్టే సమయం, బాగా పేరున్న కాలేజీలో చదివితేనే ప్లేస్‌మెంట్స్ వంటి అంశాలు ఈ కోర్సు విశ్వసనీయతకు పరీక్షగా నిలుస్తున్నాయి. మరో వైపు మన హైదరాబాద్ విద్యార్థుల్లో ఎక్కువమంది మేనేజ్మెంట్ కోర్సులవైపు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తిచేసిన విద్యార్థుల్లోనూ ఈ ధోరణి కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఐఎస్బీ, ఐపీఈ, ఓయూ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లలో ఎంబీఏ కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. ప్రతిష్టాత్మక బీ స్కూల్స్ ఐఐఎంలలో ప్రవేశం కోసం అక్టోబర్‌లో జరిగే క్యాట్‌కు నగరంలోని విద్యార్థులు అప్పుడే సీరియస్ ప్రిపరేషన్ ప్రారంభించేశారు. ఈ నేపథ్యంలో జాబ్ మార్కెట్లో ఎంబీఏకు ఉన్న డిమాండ్, కోర్సు చేస్తే వచ్చే ప్రయోజనాలపై నిపుణుల విశ్లేషణ.. జీమ్యాక్ అధ్యయనం: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంబీఏకు జాబ్ మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది? ఎంతమంది ఎంప్లాయర్స్ ఎంబీఏ విద్యార్థులను రిక్రూట్ చేసుకోవాలనుకుంటున్నారనే విషయంపై గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ కౌన్సిల్ (జీమ్యాక్, ప్రపంచవ్యాప్తంగా మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రామాణికంగా పరిగణించే జీమ్యాట్ పరీక్షను నిర్వహించే సంస్థ) ఒక సర్వే నిర్వహించింది. ఈ అధ్యయనం మేరకు ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది మూడొంతుల మంది ఎంప్లాయర్స్ అంటే దాదాపు 87 శాతం కంపెనీలు.. బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్లను నియమించుకోవడం లేదా గతంతో పోల్చితే ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకునేందుకు సుముఖంగా ఉన్నాయి. అందుకనుగుణంగా హైరింగ్ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇతర సంస్థల అంచనాలు కూడా దాదాపు జీమ్యాక్ అంచనాలతో సరిపోతున్నాయి. పే ప్యాకేజ్: వేతనాల విషయానికొస్తే.. హైరింగ్- పేప్యాకేజ్ అనే అంశాలు ఒకదానితో ఒకటి సహ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. జీమ్యాక్ అంచనా ప్రకారం ఈ ఏడాది 42 శాతం కంపెనీలు ఎంబీఏ అభ్యర్థుల జీతాలను స్థిరంగా కొనసాగించే అవకాశముంది. 56 శాతం కంపెనీలు మాత్రం ద్రవ్యోల్బణ రేటు లేదా అంతకంటే ఎక్కువ శాతంతో ఎంబీఏల వేతనాలను పెంచే ఉద్దేశంతో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఎంబీఏ విద్యార్థులు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేమిటంటే.. కోర్సు పూర్తయ్యే నాటికి మంచి వేతనం లభిస్తుందా? లేదా? అనే ఆలోచనను పక్కనపెట్టండి. మీ నైపుణ్యాలకు తగిన ంత ప్రతిఫలం దక్కుతుందనే నమ్మకంతో ఉండండి. నెట్వర్క్ కీలకం: చాలా మంది తాము చేసిన వ్యయానికి ప్రతిఫలం దక్కుతుందా? లేదా? అనే భావనలో ఉంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఎంబీఏతో ప్రతిఫలం ఆశించడమనేది మీరు ఏర్పర్చుకునే నెట్వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు కోర్సులో భాగంగా సహ విద్యార్థులు, ప్రొఫెసర్లు తదితరులతో కలిసి పనిచేయాల్సి వస్తుంది. వీరే భవిష్యత్‌లో మీ క్లైంట్లు లేదా భాగస్వాములుగా, రెఫరెన్సగా మారే అవకాశం ఉంది. ఇది ఎంబీఏకు ఉన్న విలక్షణత. కాబట్టి గతంలో మాదిరిగా బిజినెస్ స్కూల్లోనే అంతా నేర్పిస్తారనే భావనతో కాకుండా మీ చుట్టూ ఉన్న వారందరితో మంచి నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించాలి. గతంలో మీరు చదువుకున్న సహచరులతో సంబంధాలను కొనసాగించాలి. తద్వారా అవకాశాలు మెరుగవుతాయి. అందుకే బిజినెస్ స్కూల్స్ అలూమ్నీ అసోసియేషన్లను ఎక్కువగా ప్రోత్సహిస్తుంటాయి. ప్రస్తుతం ఎంబీఏ తప్పనిసరి: ఎలాంటి బీ-స్కూల్స్‌కు వెళ్లకుండా, మేనేజ్మెంట్ డిగ్రీ లేకుండానే విజయం సాధించిన వ్యాపారవేత్తలు ఎందరో కనిపి స్తుంటారు. అలా అనీ ఎంబీఏతో ప్రయోజనం లేదనే భావన సరికాదు. కాలంతోపాటు వ్యాపార నిర్వహణలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. తదనుగుణంగా ఆయా వ్యవహారాలను పర్యవేక్షించడానికి నిపుణుల అవసరం పెరిగింది. ప్రస్తుత ప్రపంచంలో బిజినెస్ పరంగా తలెత్తే నిర్వహణ సమస్యలను తగ్గించడానికి ఎంబీఏ మంచి సాధనంగా ఉపయోగపడుతుంది. బీ-స్కూల్‌కు హాజరవడం ద్వారా వ్యాపారానికి సంబంధించిన ప్రాథమిక అంశాలపై అవగాహన పొందొచ్చు. ఈ క్రమంలో ఫైనాన్స్, మార్కెటింగ్, అకౌంటింగ్, స్ట్రాటజీ, బిజినెస్ మేనేజ్మెంట్ వంటి అంశాలను బోధిస్తారు. అంతేకాకుండా ఆయా రంగాల్లోని వాస్తవిక పరిస్థితులను వివరిస్తారు. వ్యక్తిగత అభివృద్ధి క్రమంలో మీ బలాలు- బలహీనతలపై విశ్లేషణ కూడా ఉంటుంది. అవసరం: చదువు పూర్తయిన తర్వాత కెరీర్ క్రమంలో క్లిష్టమైన సమస్యలు ఎదురవుతుంటాయి. వాటికి పరిష్కారం కనుక్కునే క్రమంలో విపరీతంగా ఆలోచిస్తుంటారు. ఒక పరిమితికి మించి ఆలోచనలు ఏమాత్రం ముందుకు సాగవు. అటువంటి పరిస్థితిలో మేనేజ్మెంట్ కోర్సు చేయడం మంచి ప్రేరణగా ఉపయోగపడుతుంది. తిరిగి గాడిలో పడడానికి పలు విధాలుగా దోహదం చేస్తుంది. అంతేకాకుండా సృజనాత్మక శక్తిని తిరిగి తెచ్చుకోవడంతోపాటు సమస్య పరిష్కారానికి అందుబాటులో ఉన్న వివిధ అవకాశాలపై అవగాహన కల్పిస్తుంది. పరిష్కారాలను పరీక్షించడం, తప్పుల నుంచి నేర్చుకోవడం వంటివి లక్షణాలు అలవడుతాయి. తద్వారా భవిష్యత్‌లో నిర్వహణ చాతుర్యంతోపాటు సహోద్యోగులతో సమన్వయం చేసుకునే నైపుణ్యం పెరుగుతుంది. స్పెషలైజ్డ్కు అవకాశాలెక్కువ: ఎంబీఏతో పోల్చితే స్పెషలైజ్డ్ ఎంబీఏ కోర్సు చేసిన వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. మేనేజ్మెంట్, లీడర్ షిప్ నైపుణ్యాలతోపాటు ఒక రంగానికి సంబంధించిన స్పెష లైజ్డ్ ఎంబీఏ కోర్సులను ఎంచుకోవడం కెరీర్ పరంగా ప్రయో జనంగా ఉంటుంది. ఉదాహరణకు హెల్త్‌కేర్ మేనేజ్మెంట్. సాధారణ ఎంబీఏ కంటే.. ఇలాంటి స్పెషలైజ్డ్ కోర్సులు చేసిన వారికే అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి. అంతేకాకుండా నచ్చిన రంగంలో స్థిరపడే అవకాశం ఉంటోంది. ఇటీవలి కాలంలో స్పెషలైజ్డ్ ఎంబీఏ చేసిన అభ్యర్థుల అవసరం 22 శాతం మేర పెరిగింది. అయితే స్పెషలైజ్డ్ ఎంబీఏ కోర్సుల్లో చేరే ముందు కొన్ని సూచనలను పాటించాలి. అవి.. సదరు స్పెషలైజ్డ్ కోర్సుకు సంబంధించి మార్కెట్ వాస్తవిక అవసరాలకనుగుణంగా నైపుణ్యాలను అందించే దిశగా బోధన సాగించే ఫ్యాకల్టీలు ఉన్న ఇన్స్టిట్యూట్లను ఎంచుకోవాలి. వేగంగా ఉన్నత స్థానాలకు: చాలా మంది తాము పని చేస్తున్న రంగంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ఎన్నో ఏళ్లు పడుతుంది. కానీ ఎంబీఏ కోర్సు చేస్తే స్వల్ప కాలంలో ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. ఎంబీఏ కోర్సు ఒక రకమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. తద్వారా టీమ్ ప్రాజెక్ట్‌లను విజయవంతంగా నడిపించే స్థాయికి ఎదుగుతారు. ఎందుకంటే.. తరగతి గదిలో మీ పనితీరును సమీక్షించడం, స్టూడెంట్ క్లబ్ వంటి కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా సంబంధిత నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి అవకాశం లభిస్తుంది. తద్వారా వ్యక్తిగత నైపుణ్యాలతోపాటు సమిష్టితత్వం అలవడుతుంది. బలాలు-బలహీనతలను విశ్లేషించుకోవడంతోపాటు పనితీరు మేరకు ఉత్తమమైన కెరీర్‌ను ఎంచుకోవడానికి ఎంబీఏ కోర్సు ఇతోధికంగా సహాయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు! ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణ నేపథ్యంలో ఉన్నత అవకాశాలందించే కోర్సుల్లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/మేనేజ్మెంట్ కోర్సులు ప్రథమ స్థానంలో ఉంటున్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా ఈ కోర్సులకు డిమాండ్ ఉంటుంది. యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న ఎంబీఏ కోర్సులో ఏటా సుమారు 100 మంది విదేశీ విద్యార్థులు ప్రవేశం పొందుతుండడమే దీనికి నిదర్శనం. ఉస్మానియా రెగ్యులర్ ఎంబీఏతోపాటు టెక్నికల్ మేనేజ్మెంట్ కోర్సును అందిస్తోంది. అలాగే ఇతర యూనివర్సిటీలు, ప్రైవేటు విద్యాసంస్థలు ఎంబీఏకు సమానమైన ఇతర మేనేజ్మెంట్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈవెంట్ మేనేజ్మెంట్, మీడియా మేనేజ్మెంట్, హెల్త్‌కేర్ మేనేజ్మెంట్, హాస్పిటల్ మేనేజ్మెంట్ విభాగాల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. రెగ్యులర్ ఎంబీఏ కోర్సులో రెండో సంవత్సరంలో స్పెషలైజేషన్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. విద్యానేపథ్యాన్ని అనుసరించి కూడా సంబంధిత మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరే అవకాశం ఏర్పడుతోంది. ఉదాహరణకు ‘మాస్టర్స్ డిగ్రీ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్’, ‘మాస్టర్స్ డిగ్రీ ఇన్ హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్’ కోర్సులను బీఫార్మసీ పూర్తి చేసిన వారు అభ్యసిస్తే మంచి అవకాశాలుంటాయి. ఎంబీఏ కోర్సులో రాణించాలంటే మంచి కమ్యూనికేషన్, మ్యాథమెటికల్ స్కిల్స్‌తో పాటు అదనపు నైపుణ్యాలు తప్పనిసరి. ప్రతి అంశాన్ని మార్కెటింగ్ కోణంలో ఆలోచించే వారు ఎంబీఏ మార్కెటింగ్ విభాగంలో రాణిస్తారు. మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లకు సేవలు, రిటైల్, మౌలిక రంగాలతోపాటు సాఫ్ట్వేర్ తదితర రంగాల్లోనూ ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు లభిస్తున్నాయి. - ప్రొఫెసర్. వి. శేఖర్, ప్రిన్సిపాల్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఉస్మానియా యూనివర్సిటీ. -
కొలువుకు దగ్గరి దారి.. ఇంటర్న్‌షిప్
జాబ్ స్కిల్స్: మీరు కళాశాల చివరి దశలో ఉన్నారా? కార్పొరేట్ ప్రపంచంతో మీకు పరిచయం ఉందా? ఉద్యోగాల గురించి ఏమైనా అనుభవం ఉందా?.. లేకపోతే మాత్రం వెంటనే ఇంటర్న్‌షిప్‌లో చేరండి. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు ఉద్యోగ జీవితానికి, వ్యాపారంలో అనుభవానికి పునాది పడేది ఇక్కడే. ఇంటర్న్‌షిప్‌తో మీ రెజ్యమెకు విలువ పెరుగుతుంది. జాబ్ మార్కెట్లో మీకు డిమాండ్ ఏర్పడుతుంది. నియామకాల విషయంలో సంస్థలు సాధారణంగా అనుభవానికే ప్రాధాన్యత ఇస్తుంటాయి. ఫ్రెషర్ల కంటే కొంత అనుభవం ఉన్నవారిని చేర్చుకునేందుకు ఆసక్తి చూపుతుంటాయి. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ద్వారా వర్క్ ఎక్స్‌పీరియెన్స్ వస్తుంది. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత సమయం వృథా చేయకుండా ఇంటర్న్‌షిప్‌లో చేరడం మంచిది. ఫ్యూచర్ జాబ్ కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడే ఇంటర్న్‌షిప్‌పై విద్యార్థులు ముందునుంచే అవగాహన పెంచుకోవాలి. ఇంటర్న్‌షిప్ అంటే? ఇది ఒకరకంగా జాబ్ ట్రైనింగ్ లాంటిదే. అంటే.. ఉద్యోగంలో చేరడానికి ముందు దానికి సంబంధించిన శిక్షణ పొందడం. తరగతి గదిలో పాఠాలు, పుస్తకాల ద్వారా నేర్చుకున్న పరిజ్ఞానానికి ఎంత విలువ ఉంటుందో ఇంటర్న్‌షిప్‌లో నేర్చుకున్నదానికీ అంతే విలువ ఉంటుంది. సాధారణంగా ప్రొఫెషనల్ కోర్సులను అభ్యసించే విద్యార్థులు ఇంటర్న్షిష్లో చేరుతుంటారు. ప్రతి విద్యా సంవత్సరం పూర్తయిన తర్వాత ఇంటర్న్‌షిప్ పూర్తిచేయడాన్ని ఒక కచ్చితమైన నిబంధనగా మార్చారు. ఇటీవలి కాలంలో దీని ప్రాధాన్యతను గుర్తించిన డిగ్రీ విద్యార్థులు కూడా ఇంటర్న్షిష్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. మెరుగైన భవిష్యత్తుకు ఇప్పటినుంచే పునాదిరాయి వేసుకోవాలంటే ఇంటర్న్‌షిప్ పూర్తిచేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటర్న్‌షిప్‌తో లాభాలేంటి? జాబ్ మార్కెట్‌పై విద్యార్థులకు అవగాహన పెరుగుతుంది. సంస్థల అవసరాలేంటి? అవి తమ ఉద్యోగుల నుంచి ఏం కోరుకుంటున్నాయి? సంస్థల కార్యకలాపాలు ఎలా ఉంటాయి? వంటి కీలకమైన విషయాలు తెలుస్తాయి. కంపెనీలో అనుభవజ్ఞులతో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది. వారి నుంచి కొత్త విషయాలు నేర్చుకొని, నైపుణ్యాలు పెంచుకునేందుకు వీలుంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. క్షేత్రస్థాయిలో పనిచేయడం వల్ల అక్కడి వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి. సదరు ఉద్యోగం మీకు తగినదో కాదో స్పష్టంగా తెలిసిపోతుంది. ఒక జాబ్‌లో చేరడాని కంటే ముందు ఆ జాబ్‌లోని లోతుపాతులు తెలుసుకొనే వెసులుబాటు ఇంటర్న్‌షిప్ ద్వారా లభిస్తుంది. ప్రొఫెషనల్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో అనుభవంలోకి వస్తుంది. కార్పొరేట్ కల్చర్‌తో పరిచయం ఏర్పడుతుంది. ప్రాక్టికల్ స్కిల్స్ మెరుగుపడతాయి. ఇంటర్న్‌షిప్‌లో పొందిన పని అనుభవం విద్యార్థిని ఒక మంచి ఉద్యోగిగా మార్చేందుకు దోహదం చేస్తుంది. ఇంటర్న్‌షిప్‌తో విద్యార్థులు తమ అర్హతలను పెంచుకోవచ్చు. దీంతో వారి రెజ్యుమెకు అదనపు విలువ పెరుగుతుంది. ఇలాంటి రెజ్యుమెలు కంపెనీల యాజమాన్యాలను ఆకర్షిస్తాయి. విద్యార్థులకు ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. కోర్సు పూర్తికాగానే ఉద్యోగం తాజాగా తెరపైకొచ్చిన ట్రెండ్ ఏమిటంటే... ఒక సంస్థలో ఇంటర్న్‌షిష్ చేసినవారికి అదే సంస్థలో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇలాంటివారికే యాజమాన్యాలు పెద్దపీట వేస్తున్నాయి. విద్యార్థి పనితీరు, స్వభావం, నైపుణ్యాల గురించి ఇంటర్న్‌షిప్‌లో తెలిసిపోతుంది. ఆకట్టుకొనే పనితీరును ప్రదర్శించిన విద్యార్థుల చేతికి జాబ్ ఆఫర్ లెటర్లు అందుతున్నాయి. కోర్సు పూర్తికాగానే నేరుగా కొలువులో చేరిపోవొచ్చు. ప్రస్తుతం జాబ్ మార్కెట్ ఎలా ఉందో అందరికీ తెలుసు. ఉద్యోగాలు సులభంగా దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటర్న్‌షిప్ ద్వారా ఒక సంస్థ నుంచి బ్యాక్అప్ ఆప్షన్ లభిస్తుండడం మంచిదే కదా! భవిష్యత్తులో ఉపయోగపడే వ్యక్తులతో పరిచయాలు, అనుబంధాలు పెంచుకోవడానికి ఉపయోగపడే గొప్ప వేదిక.. ఇంటర్న్‌షిప్.