ముంబై: డిసెంబర్‌లో జాబ్ మార్కెట్ కోలుకుంటున్న సంకేతాలు కనిపించిన నేపథ్యంలో ఈ ఏడాది నియామకాలు మెరుగుపడవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. 2024లో మొత్తం హైరింగ్ 8.3 శాతం వృద్ధి చెందవచ్చని భావిస్తున్నారు. కన్సల్టెన్సీ సంస్థ ఫౌండిట్ రూపొందించిన వార్షిక ట్రెండ్స్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం గతేడాది డిసెంబర్‌లో హైరింగ్‌లో 2 శాతం వృద్ధి నమోదైంది.
కొత్త సంవత్సరంలో నియామకాల వృద్ధి 8.3 శాతంగా ఉండవచ్చని, బెంగళూరులో అత్యధికంగా 11 శాతం వృద్ధి నమోదు కావచ్చని నివేదిక పేర్కొంది. తయారీ, బీఎఫ్‌ఎస్‌ఐ, ఆటోమోటివ్, రిటైల్, ట్రావెల్, టూరిజం విభాగంలో హైరింగ్ ఎక్కువగా ఉండనుంది. 2022తో పోలిస్తే 2023లో హైరింగ్ కార్యకలాపాలు 5 శాతం తగ్గాయి. అయితే, డిసెంబర్‌లో కాస్త మెరుగ్గా 2 శాతం వృద్ధి కనపర్చింది. 2022 మధ్య నుంచి జాబ్ మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్న ట్రెండ్ 2023 ఆఖర్లో మారిందని నివేదిక తెలిపింది.
ఉద్యోగావకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ సరైన వారిని నియమించుకోవడంలో వ్యాపార సంస్థలకు సవాళ్లు ఎదురవుతున్నాయని, జాబ్ ఓపెనింగ్స్, హైరింగ్ మధ్య వ్యత్యాసం ఇదే సూచిస్తోందని పేర్కొంది. గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు తమ ప్లాట్‌ఫామ్‌లో నమోదైన డేటాను విశ్లేషించిన మీదట ఫౌండిట్ ఈ నివేదికను రూపొందించింది.
నివేదికలోని మరిన్ని విశేషాలు..
ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ 2023లో కొన్ని రంగాలు చెప్పుకోతగ్గ స్థాయిలో వృద్ధి కనపర్చాయి. మారిటైమ్, షిప్పింగ్ పరిశ్రమలో నియామకాలు 28 శాతం పెరిగాయి. అంతర్జాతీయంగా వాణిజ్యం పెరగడం, సరఫరా వ్యవస్థలో సమస్యలు తగ్గుముఖం పట్టడం ఇందుకు తోడ్పడ్డాయి.
అలాగే రిటైల్, ట్రైవెల్, టూరిజం రంగాల్లో కూడా 25 శాతం వృద్ధి నమోదైంది. అడ్వరై్టజింగ్, మార్కెట్ రీసెర్చ్, పబ్లిక్ రిలేషన్స్ రంగాల్లో 18 శాతం పెరుగుదల కనిపించింది.
æ 2024లో కొత్త టెక్నాలజీల్లో అనుభవమున్న నిపుణులకు డిమాండ్ పెరగనుంది. కృత్రిమ మేథ/మెíÙన్ లెరి్నంగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ నిపుణులకు గణనీయంగా అవకాశాలు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment