వచ్చే ఏడాదిలో నియామకాలు జోరుగా సాగనున్నాయి. 9 శాతం మేర నియామకాలు పెరగనున్నట్టు జాబ్ ప్లాట్‌ఫామ్ ఫౌండిట్ (గతంలో మాన్‌స్టర్ ఏపీఏసీ) వెల్లడించింది. ముఖ్యంగా ఐటీ, రిటైల్, టెలికం, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగాల్లో నియామకాలు మెరుగ్గా ఉంటాయని అంచనా వేసింది. ఈ ఏడాది మొత్తం మీద 10 శాతం మేర ఉపాధి అవకాశాల్లో వృద్ధి ఉంటుందని, రానున్న రోజుల్లో ఈ ధోరణి వేగాన్ని అందుకుంటుందని తెలిపింది.
కొత్త టెక్నాలజీలు, మారుతున్న వ్యాపార సంస్థల ప్రాధాన్యతలు 2025లో ఉద్యోగ మార్కెట్ తీరును నిర్ణయించనున్నట్టు ఫౌండిట్ పేర్కొంది. ఎడ్జ్ కంప్యూటింగ్, క్వాంటమ్ అప్లికేషన్స్, అత్యాధునిక సైబర్ సెక్యూరిటీ సిస్టమ్‌లు.. తయారీ, హెల్త్‌కేర్, ఐటీ రంగాల్లో మార్పును తీసుకురానున్నట్టు వివరించింది. 2023 జనవరి నుంచి 2024 నవంబర్ వరకు ఫౌండిట్ ప్లాట్‌ఫామ్‌పై డేటా విశ్లేషణ ఆధారంగా ఈ వివరాలను విడుదల చేసింది. రిటైల్ మీడియా నెట్‌వర్క్‌లు, ఏఐ ఆధారిత విశ్లేషణ టూల్స్‌తో ఈ–కామర్స్, హెచ్‌ఆర్, డిజిటల్ సేవల్లో నిపుణుల అవసరాల తీరును మారుతుందని పేర్కొంది. డిజిటల్ మార్కెటింగ్, యాడ్ మేనేజ్‌మెంట్, హెచ్‌ఆర్ అనలైటిక్స్‌లో నిపుణులను సంస్థలు నియమించుకుంటాయని తెలిపింది.
ఇదీ చదవండి: బీమా ప్రీమియంపై పన్ను మినహాయించేనా?
ఈ ఏడాదీ నియామకాల్లో జోరు..
2023తో పోల్చి చూసినప్పుడు ఈ ఏడాది అన్ని రంగాల్లో, అన్ని పట్టణాల్లో జాబ్ మార్కెట్ బలమైన వృద్ధిని చూసినట్టు ఫౌండిట్ తెలిపింది. తయారీలో 30 శాతం, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్‌లో 29 శాతం, రియల్ ఎస్టేట్‌లో 21 శాతం చొప్పున నియామకాలు పుంజుకున్నట్టు పేర్కొంది. అధికంగా కోయింబత్తూర్‌లో 27 శాతం, జైపూర్‌లోనూ 22 శాతం మేర నియామకాల్లో వృద్ధి కనిపించినట్టు తెలిపింది. చురుకైన పారిశ్రామిక కార్యకలాపాలు, డిజిటలైజేషన్‌కు మళ్లడం, పట్టణీకర సానుకూలించినట్టు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment