jobs 2025
-
కొత్త సంవత్సరంలో జాబ్స్ పెరుగుతాయా? తగ్గుతాయా?
వచ్చే ఏడాదిలో నియామకాలు జోరుగా సాగనున్నాయి. 9 శాతం మేర నియామకాలు పెరగనున్నట్టు జాబ్ ప్లాట్‌ఫామ్ ఫౌండిట్ (గతంలో మాన్స్టర్ ఏపీఏసీ) వెల్లడించింది. ముఖ్యంగా ఐటీ, రిటైల్, టెలికం, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగాల్లో నియామకాలు మెరుగ్గా ఉంటాయని అంచనా వేసింది. ఈ ఏడాది మొత్తం మీద 10 శాతం మేర ఉపాధి అవకాశాల్లో వృద్ధి ఉంటుందని, రానున్న రోజుల్లో ఈ ధోరణి వేగాన్ని అందుకుంటుందని తెలిపింది.కొత్త టెక్నాలజీలు, మారుతున్న వ్యాపార సంస్థల ప్రాధాన్యతలు 2025లో ఉద్యోగ మార్కెట్ తీరును నిర్ణయించనున్నట్టు ఫౌండిట్ పేర్కొంది. ఎడ్జ్ కంప్యూటింగ్, క్వాంటమ్ అప్లికేషన్స్, అత్యాధునిక సైబర్ సెక్యూరిటీ సిస్టమ్‌లు.. తయారీ, హెల్త్‌కేర్, ఐటీ రంగాల్లో మార్పును తీసుకురానున్నట్టు వివరించింది. 2023 జనవరి నుంచి 2024 నవంబర్ వరకు ఫౌండిట్ ప్లాట్‌ఫామ్‌పై డేటా విశ్లేషణ ఆధారంగా ఈ వివరాలను విడుదల చేసింది. రిటైల్ మీడియా నెట్‌వర్క్‌లు, ఏఐ ఆధారిత విశ్లేషణ టూల్స్‌తో ఈ–కామర్స్, హెచ్ఆర్, డిజిటల్ సేవల్లో నిపుణుల అవసరాల తీరును మారుతుందని పేర్కొంది. డిజిటల్ మార్కెటింగ్, యాడ్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ అనలైటిక్స్‌లో నిపుణులను సంస్థలు నియమించుకుంటాయని తెలిపింది. ఇదీ చదవండి: బీమా ప్రీమియంపై పన్ను మినహాయించేనా?ఈ ఏడాదీ నియామకాల్లో జోరు..2023తో పోల్చి చూసినప్పుడు ఈ ఏడాది అన్ని రంగాల్లో, అన్ని పట్టణాల్లో జాబ్ మార్కెట్ బలమైన వృద్ధిని చూసినట్టు ఫౌండిట్ తెలిపింది. తయారీలో 30 శాతం, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్‌లో 29 శాతం, రియల్ ఎస్టేట్‌లో 21 శాతం చొప్పున నియామకాలు పుంజుకున్నట్టు పేర్కొంది. అధికంగా కోయింబత్తూర్‌లో 27 శాతం, జైపూర్‌లోనూ 22 శాతం మేర నియామకాల్లో వృద్ధి కనిపించినట్టు తెలిపింది. చురుకైన పారిశ్రామిక కార్యకలాపాలు, డిజిటలైజేషన్‌కు మళ్లడం, పట్టణీకర సానుకూలించినట్టు వివరించింది. -
2025 నాటికి 10 లక్షల ఐటీ ఉద్యోగాలు
న్యూఢిల్లీ: 2025 సంవత్సారానికి దేశంలో 10 లక్షల నిపుణులైన ఐటి ఉద్యోగులను సైబర్ సెక్యూరిటీ రంగం నియమించుకునే అవకాశం ఉందని నాస్కామ్ అంచనావేస్తోంది. సైబర్ సెక్యూరిటీ రంగంలో నిపుణులైన వారికి డిమాండ్ భారీగా పెరుగుతుందని చెపుతోంది. ఈ రంగంలో దాదాపు మూడువేల అయిదువందలకోట్లు లాభాలను ఆర్జించనున్న నేపథ్యంలో ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయని భావిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాల నిరోధానికిగాను ఇంత పెద్ద మొత్తంలో ఐటి నిపుణులు కావాల్పి వస్తుందని సైబర్ సెక్యూరిటీ టాస్క్ ఫోర్స్ ప్రతినిధి రాజేంద్ర పవార్ తెలిపారు. సైబర్ భద్రతా రంగంలో 3వేల అయిదువందల కోట్ల రూపాయల ఆదాయం సమకూరనుందని నాస్కామ్ అంచనా వేసింది. ఈ రంగంలో పెరుగుతున్న ఆదరణ, ఆదాయం నేపథ్యంలో లక్షలాది ఐటి నిపుణులను ఆయా సంస్థలు నియమించుకుంటారని నాస్కామ్ భావిస్తోంది. అలాగే ఉనికిలోకి వస్తున్న చిన్న కంపెనీల మూలంగా ఐటి నిపుణుల ఆవశ్యకత మరింత పెరగనుందన్నారు. భవిష్యత్తు సుమారు వెయ్యి స్టార్ట్ ఆప్ లు రాబోతున్నాయన్నారు. ఆయా సంస్థలపై సైబర్ దాడి సంఘటనలు పెరుగుతున్నందువల్ల సైబర్ భద్రతకు ప్రాముఖ్యత ఇవ్వక తప్పదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ సురక్షితపై సెక్యూరిటీ రంగ నిపుణులపై పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతారన్నారు. కాగా గత ఏడాది నాస్కామ్, సైబర్ భద్రతా పరిష్కారాల లక్ష్యంగా టాస్క్ ఫో ర్స్ ను ఏర్పాటు చేసింది. సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ లో ఇండియా ను గ్లోబల్ హబ్ గా రూపొందించే ప్రణాళికతో దీన్ని రూపొందించింది. నాస్కామ్ , డాటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఐటి సంస్థ సిమాంటెక్ సంయుక్తంగా 'నేషనల్ ఆక్యుపేషనల్ స్టాండర్డ్స్' ను బుధవారం ప్రారంభించింది. దీని ద్వారా సిమాంటెక్ సంస్థ సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ చేస్తున్న మహిళా అభ్యర్థులకు వెయ్యి రూపాయల స్కాలర్ షిప్ ను ప్రకటించింది.