గిరాకీ ఉన్న ఉద్యోగ నైపుణ్యాలు | will find to develop Job skills in Job market | Sakshi
Sakshi News home page

గిరాకీ ఉన్న ఉద్యోగ నైపుణ్యాలు

Published Fri, Sep 26 2014 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 PM

గిరాకీ ఉన్న ఉద్యోగ నైపుణ్యాలు

గిరాకీ ఉన్న ఉద్యోగ నైపుణ్యాలు

జాబ్ మార్కెట్‌లో ఎలాంటి నైపుణ్యాలకు ఎక్కువ డిమాండ్ ఉందో తెలుసుకుంటే.. అభ్యర్థులు ఆయా స్కిల్స్‌ను పెంచుకునేందుకు వీలుంటుంది. తమలో ఉన్న నైపుణ్యాలకు ఎలాంటి ఉద్యోగాలు లభిస్తాయో కూడా తెలుస్తుంది. భవిష్యత్తులో మంచి ఉద్యోగావకాశాలను దక్కించుకోవాలంటే పట్టు సాధించాల్సిన స్కిల్స్‌పై అవగాహన వస్తుంది. కొలువుకు దరఖాస్తు చేసేటప్పుడు అభ్యర్థులు రెజ్యూమెలో తమ విద్యార్హతలు, నైపుణ్యాలను ప్రస్తావించాలి. మౌఖిక పరీక్షలోనూ ఈ స్కిల్స్‌పై ప్రశ్నలు సంధిస్తారు.
 
 విశ్లేషణ్మాతక ఆలోచనా విధానం, ఇతరులు చెప్పేది ఓపిగ్గా వినే లక్షణం.. ఇవి కూడా అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించే నైపుణ్యాలే. రిక్రూటర్లు ఇలాంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రస్తుతం గిరాకీ ఉన్న 10 జాబ్ స్కిల్స్ గురించి తెలుసుకుందాం.
 క్రిటికల్ థింకింగ్: ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే పరిస్థితిని విశ్లేషించి, ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించడానికి అభ్యర్థుల్లో లాజికల్, రీజనింగ్ స్కిల్స్ ఉండాలి. ప్రత్యామ్నాయంలోని లాభ నష్టాలను వివరించే సామర్థ్యం కూడా అవసరం.
 ప్రాబ్లమ్ సాల్వింగ్: సమస్యలను సరిగ్గా గుర్తించి, వాటి ప్రభావాన్ని అంచనా వేసి, గడువులోగా పరిష్కరించేందుకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. సమస్యలు సాంకేతికమైనా, సాధారణమైనా.. అవి మళ్లీ తలెత్తకుండా శాశ్వత పరిష్కార మార్గం చూపాలి.
 
 డెసిషన్ మేకింగ్: సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగల నేర్పు ఉన్న వ్యక్తులు వృత్తి, ఉద్యోగాల్లో అత్యున్నతంగా రాణిస్తారు. అందుకే రిక్రూటర్లు ఈ నైపుణ్యం గల అభ్యర్థులకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారు.
 యాక్టివ్ లిజనింగ్: ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినడం మంచి లక్షణం. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి. ఉద్యోగులకు ఈ స్కిల్ తప్పనిసరిగా ఉండాలని కంపెనీలు ఆశిస్తున్నాయి.
 కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్: ఇప్పుడు అన్ని పనులు కంప్యూటర్లలోనే జరుగుతున్నాయి. కాబట్టి అభ్యర్థులకు కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్‌పై పరిజ్ఞానం తప్పనిసరి. కంప్యూటర్ అప్లికేషన్లపై పట్టు పెంచుకోవాలి.  
 మ్యాథమెటిక్స్: గణితంలో అర్థమెటిక్, ఆల్జీబ్రా, జామెట్రీ, కాలిక్యులస్, స్టాటిస్టిక్స్, వాటి అప్లై వంటివాటిపై స్కిల్స్ పెంచుకోవాలి.  
 ఉత్పత్తి పెంపు: వ్యవస్థ ఎలా పనిచేయాలో స్వయంగా నిర్దేశించగలగాలి. ఉత్పత్తిని పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించాలి.
 మానిటరింగ్: అభ్యర్థులు తమ పనితీరును ఎప్పటికప్పుడు స్వయంగా అంచనా వేసుకోవాలి. అవసరాలకు తగ్గట్లు పనితీరును మెరుగుపర్చుకొనే లక్షణం చాలా ముఖ్యం.
 ప్రోగ్రామింగ్: వివిధ అవసరాలకు సొంతంగా కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను రాసే నైపుణ్యం ఉండాలి.
 
 సేల్స్ అండ్ మార్కెటింగ్: నేటి మార్కెటింగ్ యుగంలో ఉత్పత్తులను, సేవలను వినియోగదారులకు పరిచయం చేసే నైపుణ్యానికి కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి. ప్రభావవంతమైన మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించి, అమ్మకాలను, లాభాలను పెంచే అభ్యర్థుల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. కాబట్టి జాబ్ మార్కెట్‌లో ముందంజలో నిలవాలంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ స్కిల్స్ కచ్చితంగా ఉండాలి.
 
 జాబ్స్ అలర్‌‌ట్స: ఫీల్డ్ సూపర్‌వైజర్స్
 రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. కాంట్రాక్ట్ పద్ధతిలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
  ఫీల్డ్ సూపర్‌వైజర్స్‌పోస్టుల సంఖ్య: 50
 అర్హతలు: ఎలక్ట్రానిక్స్/టెలి కమ్యూనికేషన్/కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో కనీసం మూడేళ్ల అనుభవం తప్పనిసరి.
 నిర్దేశిత వయోపరిమితి ఉండాలి.
 ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా..
 దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తులను పూర్తిచేసి, పోస్టు ద్వారా పంపాలి.
 చివరి తేది: అక్టోబర్ 14
 వెబ్‌సైట్: www.railtelindia.com
 
 ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్స్
 ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ)... కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
  హెడ్ కానిస్టేబుల్(టెలి కమ్యూనికేషన్)
 పోస్టులు: 229
 వయోపరిమితి: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
 అర్హత: 45 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత.
 ఎంపిక: పరుగు పందెం, ఫిజికల్ టెస్టులు, రాత పరీక్ష, మెడికల్ టెస్టుల ద్వారా...
 దరఖాస్తు: ఆఫ్‌లైన్ విధానం ద్వారా..
 చివరి తేది: అక్టోబర్ 24
 వెబ్‌సైట్: http://itbpolice.nic.in/
 
 బ్యాంక్ ఆఫ్ బరోడా
 బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన బాబ్‌కార్డ్స్ లిమిటెడ్ (బీఓబీ) ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.
 ఆఫీసర్: 70
 అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
 వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య..
 ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: అక్టోబరు 9
 ఆన్‌లైన్ టెస్టు తేది: డిసెంబరు 10
 వెబ్‌సైట్: http://ibpsregistration.nic.in

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement