
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్ పురోగతి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచ జాబ్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే ఏఐలో వస్తున్న పురోగతి కొందరికి అవకాశాలు సృష్టిస్తుంటే.. ఇంకొందరి పాలిట శాపంగా మారుతోంది. ముఖ్యంగా భారతదేశంలోని నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్లు ఏఐలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలు నేర్చుకోవడం విఫలమవుతున్నారని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, సరైన సాంకేతిక నైపుణ్యాలులేక వాటికి దూరంగా ఉంటున్నారని తెలియజేస్తున్నారు. నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ల ఉద్యోగ జీవితాలను ఏఐ ఎలా ప్రభావితం చేస్తుందో టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఉద్యోగావకాశాల సవాళ్లు
నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్లు ఎదుర్కొంటున్న ప్రాథమిక సమస్య మెరుగైన ఉద్యోగావకాశాలు లేకపోవడం. వారికి ఆ ఉద్యోగాలకు తగిన సాంకేతిక నైపుణ్యాలు లేవపోవడమే కారణం. దాంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత జాబ్ మార్కెట్ అవసరాలను వారు తీర్చలేకపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏఐ నైపుణ్యాలు కలిగిన వారికి బలమైన డిమాండ్ ఉన్నప్పటికీ, నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్లు దీన్ని అందిపుచ్చుకోవడం లేదు. టెక్నికల్ స్కిల్స్ మాత్రమే కాకుండా అడాప్టబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్ వంటి కీలకమైన నాన్ టెక్నికల్ స్కిల్స్ కూడా వారికి కెరియర్‌కు గుదిబండగా మారుతున్నాయి.
ఎంప్లాయిబిలిటీ రేటు తగ్గుదల
భారత్‌లో నాన్ టెక్ గ్రాడ్యుయేట్ల ఎంప్లాయిబిలిటీ రేటు గణనీయంగా పడిపోయిందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. దానికితోడు చాలా కంపెనీలు ఏఐ వాడకాన్ని పెంచుతుండడం, వాటిని ఈ గ్రాడ్యుయేట్లు అందిపుచ్చుకోలేక పోతుండడం ప్రధాన కారణంగా ఉన్నాయి. ఈ ధోరణి వారి నైపుణ్యాలను పెంచుకోవాల్సిన తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతుంది.
పరిష్కారం ఇలా..
పరిశ్రమ డిమాండ్లు, నాన్-టెక్ గ్రాడ్యుయేట్ల సామర్థ్యాల మధ్య అంతరాన్ని పూడ్చడానికి, మెరుగైన సాఫ్ట్ స్కిల్స్, టెక్నికల్ నాలెడ్జ్ అవసరం. గ్రాడ్యుయేట్లు క్రిటికల్ థింకింగ్, సృజనాత్మకత, సమర్థవంతమైన కమ్యూనికేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వంటి సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి పెట్టాలి. నిరంతరం మారుతున్న పని వాతావరణంలో వృద్ధి చెందడానికి ఈ నైపుణ్యాలు ఎంతో తోడ్పడుతాయి.
ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా రూ.2,000 కోట్లతో అదానీ స్కూల్స్
విద్యా సంస్థల పాత్ర కీలకం
భవిష్యత్ శ్రామిక శక్తికి విద్యార్థులను సిద్ధం చేయడంలో విద్యా సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. నైపుణ్య అంతరాలను పరిష్కరించడానికి సమగ్ర విధానాన్ని అవలంబించాలి. ఇంటర్ డిసిప్లినరీ కోర్సులను ఏకీకృతం చేయడం, అనుభవపూర్వక అభ్యసనను ప్రోత్సహించడం, విద్యార్థులను రియల్‌టైమ్ ప్రాజెక్టుల్లో నిమగ్నమయ్యేలా ఏర్పాటు చేయడం వంటి అంశాలను పరిగణించాలి. దీని ద్వారా విద్యా సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత జాబ్ మార్కెట్లో విజయం సాధించడానికి అవసరమైన విభిన్న నైపుణ్యాలతో గ్రాడ్యుయేట్లను సన్నద్ధం చేసే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment