
వాట్సాప్ మాతృ సంస్థ మెటా.. తన కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్ కోసం కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా ఇప్పడు యూజర్ స్టేటస్ అప్‌డేట్‌లకు మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
ఇప్పటి వరకు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవాలంటే.. ఒక ఫోటో లేదా లింక్స్ వంటివాటికి మాత్రమే సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఫీచర్ ద్వారా ఫోటోకు మాత్రమే కాకుండా, టెక్స్ట్, వీడియోలకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా 24 గంటల వరకు డిస్‌ప్లే అవుతుంది.
వాట్సాప్ స్టేటస్‌కు మ్యూజిక్ యాడ్ చేసుకోవడం ఎలా?
➤వాట్సాప్ ఓపెన్ చేసి.. సాధారణంగా స్టేటస్ పెట్టుకోవడానికి ఉపయోగించే అప్‌డేట్స్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి.
➤తరువాత యాడ్ స్టేటస్ మీద క్లిక్ చేసి.. గ్యాలరీ నుంచి ఫోటో ఎంచుకోవాలి.
➤ఫోటో సెలక్ట్ చేసుకున్న తరువాత.. పైన కనిపించే మ్యూజిక్ సింబల్ మీద క్లిక్ చేయగానే.. ఆటోమాటిక్ మ్యూజిక్ లిస్ట్ కనిపిస్తుంది. అవి వద్దనుకుంటే.. మీకు కావలసిన పాటను మీ మ్యూజిక్ లైబ్రరీ నుంచి సెలక్ట్ చేసుకోవాలి ఉంటుంది.
➤పాటను ఫోటో కోసమయితే 15 సెకన్లు, వీడియో కోసం 60 సెకన్ల వరకు ఉపయోగించుకోవచ్చు.
➤అవసరమైతే మ్యూజిక్ స్టిక్కర్ స్థానాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ సెలక్ట్ చేసుకున్న తరువాత స్టేటస్ అప్లోడ్ చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: పోస్టాఫీస్ పథకాల వడ్డీ రేట్లు ప్రకటించిన కేంద్రం