భారతదేశంలో 82 శాతం మంది నిపుణులు 2025లో కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నారని లింక్డ్ఇన్(LinkedIn) ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడించింది. ఉద్యోగం(new job) సంపాదించడం గతంలో కంటే ప్రస్తుతం మరింత సవాలుగా మారినట్లు తెలియజేసింది. గతేడాది కంటే ఈసారి ఉద్యోగం సంపాదించడం మరింత కష్టతరం కానుందని 55% ఉద్యోగార్థులు నమ్ముతున్నట్లు లింక్డ్‌ఇన్ తెలిపింది.
లింక్డ్‌ఇన్ తెలిపిన వివరాల ప్రకారం..
2024లో జాబ్ మార్కెట్ మందకొడిగా ఉంది. దాంతో ఉద్యోగం మారాలనుకున్న చాలా మంది తాము చేస్తున్న కంపెనీల్లోనే కొనసాగుతున్నారు.
గతేడాది నుంచి కొత్త అవకాశాల కోసం వెతుకుతున్నవారు, ఇప్పటికే ఉద్యోగం మారాలనుకుంటున్నవారు అధికమయ్యారు.
2025లో 82 శాతం మంది నిపుణులు కొత్త ఉద్యోగం కోసం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ పయనం
కఠినమైన జాబ్ మార్కెట్ ఉన్నప్పటికీ, ఉద్యోగార్థుల్లో కొలువు సంపాదిస్తామనే ఆశావాదం పెరుగుతోంది.
58% మంది జాబ్ మార్కెట్ మెరుగుపడుతుందని, 2025లో కొత్త అవకాశాలు వస్తాయని నమ్ముతున్నారు.
గతేడాది కంటే ఈసారి ఉద్యోగం సంపాదించడం మరింత కష్టతరం కానుందని 55% ఉద్యోగార్థులు నమ్ముతున్నారు.
ఉద్యోగులను అన్వేషించడంలో హెచ్‌ఆర్ ప్రొఫెషనల్స్ కూడా ఒత్తిడిని అనుభవిస్తున్నారు.
అర్హత కలిగిన ప్రతిభావంతులను(professionals) కనుగొనడం మరింత సవాలుగా మారిందని 69% మంది తెలిపారు. దీంతో 2025లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే విధానంలో మార్పు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment