New job
-
కొత్త ఉద్యోగం కోసం నిపుణులు పడిగాపులు
భారతదేశంలో 82 శాతం మంది నిపుణులు 2025లో కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నారని లింక్డ్ఇన్(LinkedIn) ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడించింది. ఉద్యోగం(new job) సంపాదించడం గతంలో కంటే ప్రస్తుతం మరింత సవాలుగా మారినట్లు తెలియజేసింది. గతేడాది కంటే ఈసారి ఉద్యోగం సంపాదించడం మరింత కష్టతరం కానుందని 55% ఉద్యోగార్థులు నమ్ముతున్నట్లు లింక్డ్ఇన్ తెలిపింది.లింక్డ్ఇన్ తెలిపిన వివరాల ప్రకారం..2024లో జాబ్ మార్కెట్ మందకొడిగా ఉంది. దాంతో ఉద్యోగం మారాలనుకున్న చాలా మంది తాము చేస్తున్న కంపెనీల్లోనే కొనసాగుతున్నారు.గతేడాది నుంచి కొత్త అవకాశాల కోసం వెతుకుతున్నవారు, ఇప్పటికే ఉద్యోగం మారాలనుకుంటున్నవారు అధికమయ్యారు.2025లో 82 శాతం మంది నిపుణులు కొత్త ఉద్యోగం కోసం చేస్తున్నారు.ఇదీ చదవండి: ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ పయనంకఠినమైన జాబ్ మార్కెట్ ఉన్నప్పటికీ, ఉద్యోగార్థుల్లో కొలువు సంపాదిస్తామనే ఆశావాదం పెరుగుతోంది.58% మంది జాబ్ మార్కెట్ మెరుగుపడుతుందని, 2025లో కొత్త అవకాశాలు వస్తాయని నమ్ముతున్నారు.గతేడాది కంటే ఈసారి ఉద్యోగం సంపాదించడం మరింత కష్టతరం కానుందని 55% ఉద్యోగార్థులు నమ్ముతున్నారు.ఉద్యోగులను అన్వేషించడంలో హెచ్ఆర్ ప్రొఫెషనల్స్ కూడా ఒత్తిడిని అనుభవిస్తున్నారు.అర్హత కలిగిన ప్రతిభావంతులను(professionals) కనుగొనడం మరింత సవాలుగా మారిందని 69% మంది తెలిపారు. దీంతో 2025లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే విధానంలో మార్పు వచ్చింది. -
వింత ఉద్యోగం: పెళ్లిళ్లు చెడగొట్టడమే పని, భారీ ఆదాయం కూడా!
సమాజంలో ఒకపుడు పెళ్ళిళ్ల పేరయ్యలకు, ఇపుడు మ్యారేజ్ బ్యూరోలకున్న క్రేజ్ ఏపాటిదో అందరికీ తెలిసిందే. వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలనేది మ్యారేజ్ బ్రోకర్స్ ఆచరించే కామన్ సూత్రం. ప్రస్తుతం ఇదో పెద్ద వ్యాపారంగా మారిపోయింది. కానీ డబ్బులు తీసుకొని మరీ పెళ్లిళ్లను చెడగొట్టే (మ్యారేజ్ బ్రేకింగ్) ఉద్యోగం గురించి విన్నారా? ఇలాంటి జాబ్కూడా ఒకటి ఉందా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే మీరీ కథనాన్ని చదవాల్సిందే!కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు ప్రపంచంలోని వివిధ రకాల ఉద్యోగాల గురించి విన్నాం. వీటిలో కొన్ని సాధారణ ఉద్యోగాలు మరికొన్ని విచిత్రమైనవి, గొప్పవి, గౌరవనీయమైనవి, కష్టతరమైనవి ఇలా రకరకాలు. కానీ స్పెయిన్ దేశానికి చెందిన ఎర్నెస్టో (Ernesto ) అనే వ్యక్తి ఒక వింత పనిలో బిజీగా ఉన్నాడు. అంతేకాదు ఇందుకు భారీగా డబ్బులు కూడా సంపాదిస్తున్నాడు. ఆడిటీ సెంట్రల్ వెబ్సైట్ ప్రకారం ఈ విచిత్రమైన జాబ్ గురించి ఎర్నెస్టో స్వయంగా సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో ఇదేం చోద్యం రా బాబూ అంటూ నెటిజనులు విస్తుపోతున్నారు. దీంతో ఇతగాడు స్పెయిన్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు.డబ్బు కోసమే ఈ పనిచేస్తున్నా కొంతమంది పెళ్లి తరువాత సుఖంగా కాపురాలు చేసుకుంటోంటే, మరి కొంతమందికి మాత్రం అదొక పీడకలగా మారిందట. అందుకే చాలా మంది క్లయింట్లు తమ మ్యారేజ్‌ని బ్రేక్ చేయమని తనను ఆశ్రయిస్తున్నారని చెబుతున్నాడు ఎర్నెస్టో. ఇందులో తన ఖాతాదారులనుంచి కనీసం రూ. 46,135 వసూలు చేస్తాడు. పెళ్లి ఎలా చెడగొడతాడంటేఫీజు తీసుకున్న తర్వాత రోజునుంచి మనోడి పని షురూ అవుతుంది. అమ్మాయి, అబ్బాయి వివరాలు తీసుకుంటాడు. సరిగ్గా పెళ్లి జరుగుతున్న సమయానికి అక్కడ వాలిపోతాడు. అతిథులందరి ముందు అమ్మాయి లేదా అబ్బాయి ఇద్దరిలో ఒకర్ని ప్రేమిస్తున్నట్లు నటిస్తాడు. పారిపోదాం రమ్మంటూ ఆస్కార్ లెవల్లో నటిస్తూ నానా హంగామా చేస్తాడు. దెబ్బకి పెళ్లికి కేన్సిల్. క్లయింట్ ఖుష్.అదిరిపోయే ట్విస్టు కూడా ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ఈ సమయంలోఅవతలివాళ్లు ఇతడిని కొట్టినా, చెంపదెబ్బ కొట్టినా అదనపు ఛార్జీ చెల్లించుకోవాలి. ప్రతి స్లాప్కి,4600 రూపాయలు అదనంగా తీసుకుంటాడు. అందుకే ఎక్కువ దెబ్బలు తినే ప్రయత్నం చేస్తాడట. చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు తనను ఈ పని చేయమని వేడుకుంటారని చెబుతున్నాడు ఎర్నెస్టో. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పెళ్లిళ్ల సీజన్లో మనోడి డిమాండ్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుందట.ఇదీ చదవండి : డ్రీమ్ వెడ్డింగ్: భారతీయ దుస్తులతో అమెరికాలో ఘనంగా, ఫోటోలు వైరల్ -
14 ఏళ్లకే వేలకోట్ల కంపెనీలో జాబ్.. ఎవరీ కైరాన్ క్వాజీ?
Youngest Engineer Kairan Quazi: తెలివికి వయసుతో సంబంధం లేదని మళ్ళీ నిరూపించాడు 14 ఏళ్ల 'కైరాన్ క్వాజీ' (Kairan Quazi). త్వరలోనే ఈ చిన్నారి ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్ కంపెనీలో ఇంజనీర్ ఉద్యోగంలో చేరనున్నారు. ఇప్పటికే ఇతడు స్పేస్ఎక్స్ టెక్నాలజీ ఛాలెంజింగ్ ఇంటర్వ్యూను కూడా క్లియర్ చేసాడు. ఇంత గొప్ప విజయం సాధించిన కైరాన్ క్వాజీ ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన క్వాజీ 11 సంవత్సరాల వయసులోనే కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ చదవడం ప్రారంభించాడు. గత మే నెలలో శాంటా క్లారా యూనివర్సిటీ (SCU) నుంచి కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ పూర్తి చేసాడు. చిన్నప్పటి నుంచి స్పేస్ఎక్స్లో పనిచేయాలని కోరిక ఉన్న క్వాజీ ఆ వైపుగానే అడుగులు వేసాడు. అనుకున్నది సాధించాడు. జాబ్‌కి సెలెక్ట్ అయిన వెంటనే కైరాన్ క్వాజీ లింక్డ్ఇన్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఇందులో నా నెక్స్ట్ స్టాప్ స్పేస్ఎక్స్. నేను త్వరలో ఇంజినీరింగ్ బృందంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేరుతాను. కంపెనీ నా వయసుని చూడలేదు.. నా సామర్థ్యం మాత్రమే చూసిందని రాసాడు. సంస్థ నుంచి వచ్చిన కన్ఫర్మేషన్ లెటర్ స్క్రీన్‌షాట్ కూడా ఇందులో యాడ్ చేశారు. (ఇదీ చదవండి: క్వీన్ ఎలిజబెత్కే గిఫ్ట్ ఇచ్చేంత కుబేరుడితడు.. భారతదేశపు ఫస్ట్ బిలీనియర్!) View this post on Instagram A post shared by Kairan Quazi (@thepythonkairan) క్వాజీ తన ఫ్యామిలీతో కలిసి స్పేస్ఎక్స్లో పనిచేయడం ప్రారంభించేందుకు కాలిఫోర్నియాలోని ప్లెసాంటన్ నుంచి వాషింగ్టన్కు వెళ్లాలని యోచిస్తున్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇతడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ ద్వారా ఉద్యోగ ఇంటర్వ్యూకి సిద్ధమవుతున్నట్లు తెలియజేశాడు. ఈ పోస్ట్ చేసిన కొన్ని వారాల తర్వాత, ఉద్యోగానికి సెలెక్ట్ అయినట్లు వెల్లడించారు. (ఇదీ చదవండి: ఈ బాలీవుడ్ కపుల్స్ కొన్న లగ్జరీ కారు ధర ఎంతో తెలుసా?) View this post on Instagram A post shared by Kairan Quazi (@thepythonkairan) నిజానికి క్వాజీ తన తొమ్మిదేళ్ల వయసులో మూడవ తరగతి చదువుతున్నప్పుడు ఇంటెల్ ల్యాబ్స్‌లో AI రీసెర్చ్ కో-ఆప్ ఫెలోగా ఇంటర్న్‌షిప్ పొందాడు. ఆ తరువాత 11 సంవత్సరాల వయసులో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో రీసర్చ్ ప్రారంభించాడు. 2022 లో సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ Blackbird.AIలో మెషిన్ లెర్నింగ్ ఇంటర్న్‌గా నాలుగు నెలలు పనిచేశాడు. కాగా తన తల్లి వాల్ స్ట్రీట్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. కైరాన్ తండ్రి ముస్తాహిద్ క్వాజీ ఒక ఇంజనీర్ కావడం విశేషం. -
అందరి తీర్పూ ఆమె ఉద్యోగంపైనే!
రన్నింగ్ రేస్ ట్రాక్ సిద్ధంగా ఉంది. పోటీదారులందరూ పరుగుకు సిద్ధంగా ఉన్నారు. విజిల్ వినిపించగానే వింటి నుంచి వదిలిన బాణంలా దూసుకుపోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందరికంటే ముందు లక్ష్యాన్ని చేరాలనే కసి వారందరిలో సమానంగా ఉంది. ఉన్నట్లుండి... ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎలా వచ్చిందో తెలియదు... ఉరకడానికి సిద్ధంగా ఉన్న ఓ అథ్లెట్ కాలికి ఓ బంధనం చుట్టుకుంది. అయినా పట్టించుకోకుండా పరుగు మొదలు పెట్టినప్పటికీ కాలు తేలికగా నేలను తాకడం లేదు. బరువుగా కదులుతోంది. మనసులో అలజడి. మెదడు నిండా ప్రశ్నలు... ఆందోళన పెరిగిపోతోంది. పోటీ నుంచి తప్పుకోవడమా లేక పోటీదారుల జాబితాలో ఆఖరున నిలబడడమా? ఎటూ తేల్చుకోలేని నిస్సహాయత. ఇదీ ఉద్యోగం చేస్తున్న సగటు మహిళ పరిస్థితి. ఎల్కేజీ నుంచి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అబ్బాయిలతో సమానంగా దీటుగా తన ఉనికిని నిలబెట్టుకుంటున్న మహిళ... తల్లి కావడం కోసం కెరీర్లో రాజీ పడక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆ తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరడం ప్రైవేట్ రంగంలో అంత సులువుగా ఏమీ జరగడం లేదు. ఆ విరామాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని బిడ్డ పెరిగిన తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరిన మహిళలకు కూడా తమ ఉద్యోగం నిత్యపోరాటం దినదినగండంగానే ఉంటోంది. ఇంట్లో ఏ అవసరం వచ్చినా అందరి కళ్లూ ‘ఆమె ఉద్యోగం’ వైపే మళ్లుతాయి. ‘ఉద్యోగం మానేయచ్చు కదా’ ఉచిత సలహాల పర్వం మొదలవుతుంది. ఏది మంచి పరిష్కారం? రజని ఓ పెద్ద ప్రైవేట్ స్కూల్లో టీచర్. భర్త కూడా ఉద్యోగి. ఇద్దరు పిల్లలు. ఇద్దరూ కాలేజ్కొచ్చారు. అత్తగారికి వయసు రీత్యా అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. హాస్పిటల్లో చేర్చి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి ఇంటికి తీసుకువచ్చారు. పరామర్శకు వచ్చిన బంధువులందరిదీ ఒకటే సలహా. ఇంట్లో అందరూ ఉద్యోగాలకు, చదువులకు వెళ్లి పోతే ఎలాగ! ఆమెకు తోడుగా ఒకరు ఇంట్లో ఉంటే మంచిది కదా! మంచిదే... ఆ ఒకరు ఎవరు? అందరి తీర్పూ ‘ఆమె ఉద్యోగం’ మీదనే. ‘ఉదయం నేను అన్నీ అమర్చి వెళ్తాను. అత్తమ్మను రోజంతా చూసుకోవడానికి ఒక డొమెస్టిక్ అసిస్టెంట్ లేదా నర్సును పెట్టుకుంటాను. నేను ఉద్యోగం మానడం కంటే మరొకరికి ఉద్యోగం కల్పించడం మంచి పరిష్కారమేమో కదా... ఆలోచించండి’ అని చెప్పి చూసింది రజని. ఆ పరిష్కారం ఎవరికీ నచ్చడం లేదు. ఎవరి ముఖంలోనూ ప్రసన్నత లేదు. మారు మాట్లాడకుండా ఉద్యోగం మానేసింది రజని. నాలుగు నెలలకు అత్తగారు పూర్తిగా కోలుకున్నారు. ఇప్పుడు ఉద్యోగానికి వెళ్దామంటే స్కూల్లో తన ఉద్యోగం తన కోసం ఎదురు చూస్తూ ఉండదు. అప్పటికీ ఏ క్లాస్ ఇస్తే ఆ క్లాసు చెప్పడానికి సిద్ధమై వెళ్లింది. ‘అకడమిక్ ఇయర్ మధ్యలో అలా మానేశారు. పిల్లలకు సిలబస్ పూర్తి కావాలి కదా వేరే టీచర్ని అపాయింట్ చేశాం. ఎవరైనా మానేసినప్పుడు ‘అవసరమైతే’ తెలియచేస్తాం’ అన్నారు ప్రిన్సిపల్... ఇక మీరు వెళ్లవచ్చు అనే అర్థాన్ని ధ్వనింపచేస్తూ. ‘ఆ అవసరం’ రాకపోవచ్చనే భావం కూడా అవగతమైంది రజనికి. ప్రసూతి విరామాన్ని స్వీకరించడానికి, ఆ మేరకు కెరీర్లో వెనుకబాటును స్వాగతించడానికి మాతృత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. కోడలి బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉద్యోగంలో కొనసాగడానికి, మల్టీటాస్కింగ్‌కి కూడా తాను సిద్ధమే. కానీ ఈ నిర్ణయం ఒప్పనే వాళ్లేరి? రజనిలాగ ఎందరో! ఇది ఒక్క రజని సమస్య మాత్రమే కాదు. సాఫ్ట్వేర్, ఇతర కార్పొరేట్ రంగాలలో మహిళలకు కూడా దాదాపుగా ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయి. కుటుంబ కారణాలరీత్యా ఉద్యోగం మానేసిన వాళ్లు తిరిగి ఉద్యోగాన్ని సంపాదించుకోవడం చిన్న సవాల్ కాదు. అన్ని రకాల అడ్డంకులనూ ఎదుర్కొని కేవలం 27 శాతం మహిళలు మాత్రమే తిరిగి ఉద్యోగినులవుతున్నారు. వారిలో పదహారు శాతం మాత్రమే కొత్త ఉద్యోగాన్ని తన సమర్థతకు దీటుగా సంపాదించుకోగలుగుతున్నారు. మిగిలిన వాళ్లు దొరికిన ఉద్యోగంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇది ఒక కోణం మాత్రమే. నాణేనికి మరో వైపు పరిశీలిస్తే అంతులేని ఆందోళన కలుగుతోంది. కుటుంబ అవసరాల కారణంగా ఉద్యోగం మానేసినప్పటికీ ఆ తర్వాత ఇంట్లో కనీసంగా మనిషిగా కూడా చూడడం లేదనే ఆవేదనతో కన్నీళ్లను దిగమింగుకుంటున్నారు. చివరికి వైవాహిక బంధాన్ని వదులుకోవడానికి సిద్ధమవుతున్నారని చెప్పారు న్యాయవాది పార్వతి. చేజార్చుకుంటే కష్టమే! ‘‘నా క్లయింట్ ఒకావిడ ఉన్నత చదువులు చదివింది. భార్యాభర్తలు యూఎస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఆమెను ఉద్యోగం మానేయమని భర్త నుంచి ఒత్తిడి మొదలైంది. ‘అతడి తల్లిదండ్రులు ఆరు నెలల పాటు యూఎస్‌లో ఉండడానికి వస్తున్నారు. వాళ్లను సౌకర్యంగా చూసుకోవడం కోసం భార్యను ఉద్యోగం మానేయమని’ అతడి డిమాండ్. ‘అంత చదివి ఉద్యోగంలో కీలక స్థాయికి చేరిన దశలో ఉద్యోగం మానేస్తే తిరిగి ఇలాంటి ఉద్యోగం తెచ్చుకోవడం సాధ్యం కాద’నేది ఆమె వాదన. ఒకవేళ ఆమె భర్త ఒత్తిడికి తలొగ్గి ఉద్యోగం మానేస్తే... ఆరు నెలల తర్వాత ఆమె తిరిగి వెళ్లేసరికి ఆమె ఉద్యోగం ఆమె కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. సంస్థలు కూడా ఆమెకిచ్చే జీతంతో ఇద్దరు జూనియర్లను చేర్చుకోవచ్చని లెక్కలు వేసుకుంటాయి. మహిళలు మగవాళ్లతో సమానంగా చదువుతున్నారు, ఉద్యోగం తెచ్చుకుంటున్నారు. అయితే ఆ ఉద్యోగాన్ని కొనసాగించడంలో మాత్రం మన భారతీయ సమాజంలో ఆమెకు అడుగడుగునా అవాంతరాలే ఎదురవుతున్నాయని చెప్పడానికి ఎటువంటి సందేహమూ అక్కర్లేదు. ఫ్యామిలీ కౌన్సిలర్లు, లాయర్లను సంప్రదిస్తున్న మహిళలే అందుకు ఉదాహరణ’’ అంటారామె. ‘ఆమెను ఉద్యోగం చేయనిస్తున్నాం కదా’ అని తమ విశాలత్వాన్ని చాటుకునే భర్తలకు కొదవలేదు. అలాగే తాము ఎప్పుడు మానేయమంటే అప్పుడు మానేయడమే ఆమె ముందున్న ఆప్షన్ అనే ధోరణికి కూడా కొదవలేదు. చివరికి ‘ఆమె ఉద్యోగం’ ఆమెది కాకుండా పోతోంది. చట్టం అందరికీ ఒక్కటే! కానీ... మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961లో వచ్చింది. అప్పుడు పన్నెండు వారాల వేతనంతో కూడిన సెలవు ఉండేది. తర్వాత 26 వారాలకు పొడిగించింది ప్రభుత్వం. అయితే ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగినులకు మాత్రమే అమలవుతున్నాయి. ప్రైవేట్ రంగంలో ఎక్కువ కంపెనీలు ఈ చట్టం పరిధిలోకి రానివే ఉంటున్నాయి. ప్రైవేట్ సెక్టార్లో యాభై మంది ఉద్యోగులున్న సంస్థ మాత్రమే ఈ చట్టం పరిధిలోకి వస్తుంది. దాంతో అనేక చిన్న చిన్న కంపెనీలు ఈ చట్టం పరిధిలోకి రావడం లేదు. ఈ పరిస్థితి ఆ కంపెనీల్లో పని చేసే మహిళలకు పెద్ద సమస్యగా మారుతోంది. డెలివరీ తర్వాత, కుటుంబ కారణాల రీత్యా ఉద్యోగంలో విరామం తీసుకున్న వాళ్లు ఆ తర్వాత కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సి వస్తోంది. – పార్వతి, న్యాయవాది – వాకా మంజులారెడ్డి -
మరిన్ని కొత్త కొలువులు!: నౌకరీ.కామ్ సర్వే
న్యూఢిల్లీ: కొత్త కొలువుల సృష్టితో రానున్న కాలంలో జాబ్ మార్కెట్ ఆశావహంగా ఉండనుంది. ఈ ఏడాది జాబ్ మార్కెట్ మంచి వృద్ధిని నమోదు చేస్తుందని నౌకరీ.కామ్ అభిప్రాయపడింది. సర్వే ప్రకారం.. ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో కొత్త ఉద్యోగాల సృష్టి ఉంటుందని దాదాపు 66 శాతం మంది రిక్రూటర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా 4-8 ఏళ్ల అనుభవం ఉన్న ఉద్యోగులకు డిమాండ్ అధికంగా ఉంటుంది. బీఎఫ్ఎస్ఐ, ఐటీ పరిశ్రమల్లో ఎక్కువ ఉద్యోగ నియామకాలు నమోదుకానున్నాయి. అవకాశాల వృద్ధితో కొన్ని రంగాల్లో ఉద్యోగులకు అధిక వేతనాలు లభించనున్నాయి. దాదాపు 68 శాతం మంది రిక్రూటర్లు ఉద్యోగ వేతనాలను 10 శాతం పైగా పెంచనున్నారు. -
కొత్తగా ఉద్యోగంలో చేరారా?
అయితే ఒకసారి ఇది చదవండి.... చదువు పూర్తయిన వెంటనే కొత్తగా ఉద్యోగంలో చేరారా? అయితే మీరు ఈ సూచనలు పాటిస్తే ఉద్యోగంలో కూడా బ్రహ్మాండంగా రాణించవచ్చు. టైమ్ విషయంలో కచ్చితత్వాన్ని పాటించండి. ఉద్యోగంలో క్రమశిక్షణకు ఇదే మొదటి మెట్టు. ఎలా పడితే అలా కాకుండా సీట్లో హుందాగా కూర్చోవాలి. ఆఫీసులో అడుగు పెట్టిన తరువాత వ్యక్తిగత ఫోన్లు మాట్లాడడం తగ్గించండి. ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ‘‘ఆఫీసు నుంచి వచ్చిన తరువాత చేస్తాను’’ అని నిర్మొహమాటంగా చెప్పండి. మీరు పని చేస్తున్న డెస్క్ చిందరవందరగా కాకుండా నీట్‌గా కనిపించాలి. టేబుల్ గందరగోళంగా ఉంటే, అది మీ మూడ్‌ను కూడా ప్రభావితం చేస్తుంది. ఆఫీసులో గట్టిగా మాట్లాడడం, చెడు మాటలు మాట్లాడం లాంటివి చేయవద్దు. పనికి సంబంధించి మీలో ఏ కొత్త ఐడియా వచ్చినా మీ పై అధికారితో పంచుకోండి. ‘ఇది నా డ్యూటీ కాదు’ అనే మాట ఎప్పుడూ నోటి నుంచి రానివ్వవద్దు. రిజర్వ్‌గా ఉండడం అనేది మీ అలవాటైతే కావచ్చుగానీ, ఎంత కలుపుగోలుగా ఉంటే అంత మంచిది. {పతి విషయానికీ పక్క వారి మీద ఆధారపడకూడదు. సొంతంగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఉద్యోగరీత్యా అప్పగించిన బాధ్యతలు అస్పష్టంగా ఉంటే, సందేహాలు నివృత్తి చేసుకోవాలి. ‘అడిగితే ఏమనుకుంటారో’ అనుకుంటే ఇబ్బందుల్లో పడతారు. గాసిప్‌లకు దూరంగా ఉండండి. పని మీద మాత్రమే ఎక్కువ దృష్టి పెట్టండి. ‘ఈ పని నేను చేయగలను’ అనే ఆత్మవిశ్వాసం కళ్లలో ఎప్పుడూ కనబడాలి.