కొత్తగా ఉద్యోగంలో చేరారా?
అయితే ఒకసారి ఇది చదవండి....
చదువు పూర్తయిన వెంటనే కొత్తగా ఉద్యోగంలో చేరారా? అయితే మీరు ఈ సూచనలు పాటిస్తే ఉద్యోగంలో కూడా బ్రహ్మాండంగా రాణించవచ్చు.
టైమ్ విషయంలో కచ్చితత్వాన్ని పాటించండి. ఉద్యోగంలో క్రమశిక్షణకు ఇదే మొదటి మెట్టు.
ఎలా పడితే అలా కాకుండా సీట్లో హుందాగా కూర్చోవాలి.
ఆఫీసులో అడుగు పెట్టిన తరువాత వ్యక్తిగత ఫోన్‌లు మాట్లాడడం తగ్గించండి. ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ‘‘ఆఫీసు నుంచి వచ్చిన తరువాత చేస్తాను’’ అని నిర్మొహమాటంగా చెప్పండి.
మీరు పని చేస్తున్న డెస్క్ చిందరవందరగా కాకుండా నీట్‌గా కనిపించాలి. టేబుల్ గందరగోళంగా ఉంటే, అది మీ మూడ్‌ను కూడా ప్రభావితం చేస్తుంది.
ఆఫీసులో గట్టిగా మాట్లాడడం, చెడు మాటలు మాట్లాడం లాంటివి చేయవద్దు.
పనికి సంబంధించి మీలో ఏ కొత్త ఐడియా వచ్చినా మీ పై అధికారితో పంచుకోండి.
‘ఇది నా డ్యూటీ కాదు’ అనే మాట ఎప్పుడూ నోటి నుంచి రానివ్వవద్దు.
రిజర్వ్‌గా ఉండడం అనేది మీ అలవాటైతే కావచ్చుగానీ, ఎంత కలుపుగోలుగా ఉంటే అంత మంచిది.
{పతి విషయానికీ పక్క వారి మీద ఆధారపడకూడదు. సొంతంగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి.
ఉద్యోగరీత్యా అప్పగించిన బాధ్యతలు అస్పష్టంగా ఉంటే, సందేహాలు నివృత్తి చేసుకోవాలి. ‘అడిగితే ఏమనుకుంటారో’ అనుకుంటే ఇబ్బందుల్లో పడతారు.
గాసిప్‌లకు దూరంగా ఉండండి. పని మీద మాత్రమే ఎక్కువ దృష్టి పెట్టండి.
‘ఈ పని నేను చేయగలను’ అనే ఆత్మవిశ్వాసం కళ్లలో ఎప్పుడూ కనబడాలి.