వింత ఉద్యోగం: పెళ్లిళ్లు చెడగొట్టడమే పని, భారీ ఆదాయం కూడా! | do yoknow about marriage breaker, ruins relationships by taking money | Sakshi
Sakshi News home page

వింత ఉద్యోగం: పెళ్లిళ్లు చెడగొట్టడమే పని, భారీ ఆదాయం కూడా!

Published Wed, Sep 18 2024 11:49 AM | Last Updated on Wed, Sep 18 2024 1:42 PM

 do yoknow about marriage breaker, ruins relationships by taking money

సమాజంలో ఒకపుడు పెళ్ళిళ్ల పేరయ్యలకు,  ఇపుడు మ్యారేజ్‌ బ్యూరోలకున్న క్రేజ్‌ ఏపాటిదో అందరికీ తెలిసిందే. వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలనేది మ్యారేజ్‌ బ్రోకర్స్ ఆచరించే కామన్‌ సూత్రం.  ప్రస్తుతం ఇదో  పెద్ద వ్యాపారంగా మారిపోయింది. కానీ డబ్బులు తీసుకొని మరీ  పెళ్లిళ్లను చెడగొట్టే (మ్యారేజ్‌ బ్రేకింగ్‌) ఉద్యోగం గురించి విన్నారా? ఇలాంటి జాబ్‌కూడా ఒకటి ఉందా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే మీరీ కథనాన్ని చదవాల్సిందే!


కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు ప్రపంచంలోని వివిధ రకాల ఉద్యోగాల గురించి విన్నాం. వీటిలో కొన్ని సాధారణ ఉద్యోగాలు మరికొన్ని విచిత్రమైనవి, గొప్పవి, గౌరవనీయమైనవి, కష్టతరమైనవి ఇలా రకరకాలు. కానీ స్పెయిన్ దేశానికి చెందిన  ఎర్నెస్టో (Ernesto )  అనే వ్యక్తి  ఒక వింత పనిలో బిజీగా ఉన్నాడు. అంతేకాదు  ఇందుకు భారీగా డబ్బులు కూడా సంపాదిస్తున్నాడు.   

ఆడిటీ సెంట్రల్ వెబ్‌సైట్ ప్రకారం ఈ  విచిత్రమైన జాబ్ గురించి ఎర్నెస్టో స్వయంగా సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో ఇదేం చోద్యం రా బాబూ అంటూ నెటిజనులు విస్తుపోతున్నారు.  దీంతో ఇతగాడు స్పెయిన్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు.

డబ్బు కోసమే  ఈ పనిచేస్తున్నా 
కొంతమంది పెళ్లి తరువాత సుఖంగా కాపురాలు చేసుకుంటోంటే, మరి కొంతమందికి మాత్రం అదొక పీడకలగా మారిందట. అందుకే చాలా మంది క్లయింట్లు తమ  మ్యారేజ్‌ని బ్రేక్‌ చేయమని తనను ఆశ్రయిస్తున్నారని చెబుతున్నాడు ఎర్నెస్టో. ఇందులో తన ఖాతాదారులనుంచి కనీసం రూ. 46,135 వసూలు చేస్తాడు. 

పెళ్లి ఎలా చెడగొడతాడంటే
ఫీజు తీసుకున్న తర్వాత రోజునుంచి మనోడి పని షురూ అవుతుంది. అమ్మాయి, అబ్బాయి వివరాలు తీసుకుంటాడు.  సరిగ్గా పెళ్లి జరుగుతున్న సమయానికి అక్కడ వాలిపోతాడు.  అతిథులందరి ముందు అమ్మాయి లేదా అబ్బాయి ఇద్దరిలో  ఒకర్ని ప్రేమిస్తున్నట్లు నటిస్తాడు. పారిపోదాం రమ్మంటూ ఆస్కార్‌ లెవల్లో నటిస్తూ నానా హంగామా  చేస్తాడు. దెబ్బకి పెళ్లికి కేన్సిల్‌.  క్లయింట్‌ ఖుష్‌.

అదిరిపోయే ట్విస్టు కూడా 
ఇక్కడ ఇంకో ట్విస్ట్‌ ఏంటంటే.. ఈ సమయంలోఅవతలివాళ్లు ఇతడిని కొట్టినా, చెంపదెబ్బ కొట్టినా అదనపు ఛార్జీ చెల్లించుకోవాలి. ప్రతి స్లాప్‌కి,4600 రూపాయలు అదనంగా తీసుకుంటాడు. అందుకే ఎక్కువ దెబ్బలు తినే ప్రయత్నం చేస్తాడట. 

చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు  తనను ఈ పని చేయమని  వేడుకుంటారని చెబుతున్నాడు ఎర్నెస్టో. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పెళ్లిళ్ల సీజన్‌లో మనోడి డిమాండ్‌ మాత్రం ఒక రేంజ్‌లో ఉంటుందట.

ఇదీ చదవండి : డ్రీమ్‌ వెడ్డింగ్‌: భారతీయ దుస్తులతో అమెరికాలో ఘనంగా, ఫోటోలు వైరల్‌


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement