ఇంటర్వ్యూలో ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతారా? యువతి పోస్ట్‌ వైరల్‌ | UK Based Indian Woman Says HR Asked Her About Marriage Plans | Sakshi
Sakshi News home page

ఇంటర్వ్యూలో ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతారా? యువతి పోస్ట్‌ వైరల్‌

Nov 22 2024 12:27 PM | Updated on Nov 22 2024 12:59 PM

UK Based Indian Woman Says HR Asked Her About Marriage Plans

ఉద్యోగం కావాలంటే అనేక ఇంటర్వ్యూలను ఎదుర్కోక తప్పదు. సంబంధిత ఇంటర్వ్యూలో సెలెక్ట్‌ అవ్వాలంటే  టీం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి  ఉంటుంది. ఉద్యోగ అర్హతలు, సామర్థ్యం, అనుభవం, ఫైనల్‌గా జీతం లాంటి ప్రశ్నలు సాధారణంగా ఉంటాయి. కానీ ఒక మహిళా అభ్యర్థి  తన అనుభవాన్ని సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది. ఈ వింత ప్రశ్న ఎదురు కావడంతో షాక్‌ అ అయ్యానంటూపేర్కొంది. దీంతో ఇది వైరల్‌గా  మారింది.

యూకేకు చెందిన భారత సంతతికి చెందిన జాన్హవి జైన్‌  తన అనుభవాన్ని ఎక్స్‌లో షేర్‌ చేసింది. దీని ప్రకారం ఓ జాబ్ ఇంటర్వ్యూలో సదరు కంపెనీ హెచ్ఆర్ ఉద్యోగి వయసు ఎంత అని అడిగారు.  పాతికేళ్లు అని తను జవాబు చెప్పింది. అయితే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందాఅని అడగడంతో  అవాక్కయ్యానంటూ  చెప్పుకొచ్చింది జాన్హవి.  తాను విన్నది నిజమేనా? లేక పొరబడ్డానా? అని ఒక్క క్షణం గందరగోళంలో పడిపోయానని తెలిపింది. ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారా? అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు  లక్ష 20వేల వ్యూస్‌, వందల కమెంట్లు వెల్లువెత్తాయి. 

భారత దేశంలో తమకూ ఇలాంటి అనుభవం ఎదురయ్యాయని చాలామంది సమాధానం ఇచ్చారు. కొంతమంది అయితే పెళ్లి, పిల్లల ప్లానింగ్‌ గురించి కూడా అడుగుతారు కొన్ని మారవు అంతే కొందరు, ‘‘ఏం చేస్తాం మనం, గర్భసంచులతో  పుట్టాం కదా, మనకి కొన్నితప్పవు’’ అని ఒక  మహిళ వ్యాఖ్యానించారు.  ‘‘నాకు ఇందులో తప్పు ఏమీ కనిపించడం లేదు. ఇది వారి ప్రాజెక్ట్ , టైమ్‌లైన్ కోసం. ఎక్కువ పనిచసేవాళ్లు కావాలి. వారి పనిని ప్రభావితం చేసేలా కుటుంబ బాధ్యతలు వద్దనుకుంటారు" అని మరో  వినియోగదారు  మద్దతివ్వడం  గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement