కొడుకు కల సాకారం కోసం...ఒక టీవీ నటి సాహసం, వైరల్‌ స్టోరీ | Spanish Actress Gives Birth To Late Son Daughter Fulfils His Last Wish | Sakshi
Sakshi News home page

కొడుకు కల సాకారం కోసం...ఒక టీవీ నటి సాహసం, వైరల్‌ స్టోరీ

Published Sat, Apr 13 2024 12:06 PM | Last Updated on Sat, Apr 13 2024 12:21 PM

Spanish Actress Gives Birth To Late Son Daughter Fulfils His Last Wish - Sakshi

కొడుకు వీర్యంతో  బిడ్డను కన్న 68 ఏళ్ల తల్లి..!

అమ్మ ఎపుడైనా అమ్మే. అమ్మకు ప్రత్యామ్నాయం లేదు. మాతృత్వపువిలువ, కన్నపేగు మమకారం తెలుసు. అందుకే కేన్సర్‌తో చనిపోయిన కొడుకుకల సాకారం కోసం పెద్ద  సాహసానికి పూనుకుంది. 68 ఏళ్ల వయసులో ఒక టీవీ స్టార్‌ కొడుకు వీర్యంతో వారసురాలికి జన్మనిచ్చిన ఘటన సంచలనంగా మారింది. 

సహజంగా పిల్లలకు కనే అవకాశం  లేనపుడో, మరేకారణాల రీత్యానో సరోగసీని ఆశ్రయిస్తుంటారు. కానీ కొడుకు కోసం సరోగసీని ఎందుచుకుంది స్పెయిన్‌ దేశానికి చెందిన  టీవీ నటి అనా బ్రెగాన్. ఈమెకు అలెస్‌ లెక్వియో అనే కొడుకు ఉండేవాడు.  అయితే దురదృష్టవశాత్తూ కేన్సర్‌తో 27 ఏళ్లకే కన్నుమూశాడు. 

అయితే మరణానికి ముందు అలెస్‌కు తండ్రి కావాలన్న కోరిక బలంగా ఉండేది. అందుకే తన స్పెర్మ్‌ను భ్రద (ఫ్రీజ్‌) పర్చుకున్నాడు.  ముందస్తు ప్రమాదాన్ని ఊహించాడో ఏమో, విధి ఫలితమో గానీ కొన్నాళ్లకు కేన్సర్‌ బారిన పడ్డాడు. తన కల నెరవేరకుండానే చనిపోయాడు. 

అయితే తండ్రి కావాలన్న ఆశతో అఎస్‌ లెక్వియో తన వీర్యాన్ని భద్రపర్చిన విషయం ఇంట్లో లభించిన రశీదు ఆధారంగా అనా ఓబ్రెగాన్‌ తెలుసుకుంది. అంతే తల్లి మనసు తన కొడుకు కలసాకారం కోసం ఆరాటపడింది. దీనికి సంబంధించిన 2023లో వైద్యులను సంప్రదించింది.  అన్ని పరీక్షల అనంతరం సరోగసికీ ఓబ్రెగాన్‌ శరీరం సహకరిస్తుందని వెల్లడించారు. దీంతో ప్రాణాలకు తెగించి మరీ కొడుకు వీర్య కణాలతో గర్భం దాల్చి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాపాయికి అనిత అని పేరుపెట్టుకుంది.  ఫస్ట్‌ బర్త్‌డే సందర్భంగా ఈ విషయాలను స్వయంగా అనా ఇన్‌స్టాలో ఫోటోలతో సహా షేర్‌ చేసింది.  

“అనితా, నీకు ఏడాది నిండింది. అగాధమైన చీకటిలో మునిగిపోయి, విపరీతమైన బాధతో ఛిద్రమైపోయిన నా హృదయాన్ని కాంతితో నింపేశాయ్‌... నీ చిరునవ్వు,  ముద్దు ముద్దుమాటలు, నీ బుడిబుడి అడుగులు ఇవి చాలు నాకు.. మీ నాన్న నన్ను ఎంత ప్రేమతో చూసాడో అదే ప్రేమతో నన్ను చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఇప్పటివరకూ ఎవరూ  నన్ను అలా చూడలేదు. ” అని పోస్ట్‌ చేసింది. ఇది నెటిజనుల  చేత కంటతడిపెట్టిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement