ఆ దేవుడు పిలుస్తున్నాడు..నటి పవిత్ర ఆఖరి ఇన్‌స్టా పోస్ట్‌, వీడియో వైరల్‌ | RIP Pavithra Jayaram lastInstagram Post With Husband Challa Chandu Goes Viral | Sakshi
Sakshi News home page

ఆ దేవుడు పిలుస్తున్నాడు.. నటి పవిత్ర ఆఖరి ఇన్‌స్టా పోస్ట్‌, వీడియో వైరల్‌

Published Mon, May 13 2024 12:03 PM | Last Updated on Mon, May 13 2024 12:51 PM

 RIP Pavithra Jayaram lastInstagram Post With Husband Challa Chandu Goes Viral

కన్నడ బుల్లితెర నటి పవిత్రా జయరామ్ అకాల మరణం పరిశ్రమ వర్గాలను, తోటి నటీనటులను సహోద్యోగులు,అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.   త్రినయని తిలోత్తమ  పాత్రతో   తెలుగు వారికి దగ్గరైన పవిత్ర మరణంపై పలువురు సంతాపం  ప్రకటించారు. అయితే చనిపోయిందన్న వార్త వెలుగులోకి రావడానికి కొన్ని గంటల ముందు సోషల్‌ మీడియాలో జవిత్ర జయరామ్‌ చందర్‌ చివరి  ఇన్‌స్టా  పోస్ట్‌ ఒకటి  వైరల్  మారింది.  నటుడు, భర్త చందూతో కలిసి చేసిన రీల్‌ నెట్టింట్‌ చక్కర్లు కొడుతోంది.

త్రినయని సీరియల్‌లో   సోదరుడిగా నటించిన భర్త చల్లా చందుని ట్యాగ్‌ని చేస్తూ ఆమె చివరి  ఇన్‌స్టా పోస్ట్‌ ఇది. "నా ప్రేమ ఎప్పుడూ నీదే పాపా @chandrakanth_artist మిస్ యూ పాపా ఎందుకు అంత ఏడుస్తున్నావు నన్ను నీతోనే వున్నారా పిచ్చోడా లవ్ యు మామా" అని క్యాప్షన్‌ ఉన్న పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.

 అలాగే ‘‘ఆల్వేస్‌ మై లవ్‌  ఫర్‌ యూ మామా, లవ్‌ యూ సో మచ్‌.. చాలా సమయం నీతో  గడపాలని అనుకున్నా.. కానీ, ఆ దేవుడు  పిలుస్తున్నాడు.. నాన్నా, నువ్వ టైమ్‌కి తిను’’ అంటూ  మరో పోస్ట్‌  ఉంది. 

దీంతో ఫ్యాన్స్‌  కమెంట్స్‌ వెల్లువెత్తాయి. ఆమె చనిపోయిన తరువాత పోస్ట్‌లు ఎలా పెడుతున్నారు అని కొంతమంది సందేహం వ్యక్తం చేయగా, ఆమె భర్త చందూనే పోస్ట్‌ చేస్తున్నాడు మరికొంతమంది కమెంట్‌ చేయడం గమనార్హం. 

మదర్స్‌ డే రోజు విషాదం ఆర్‌ఐపీ పవిత్ర  అంటూ చాలామంది నెటిజన్లు స్పందించారు. కన్నడిగులు మిమ్మల్ని గుర్తుంచుకుంటూ ఉంటారు.. ఓం శాంతి పవిత్ర మామ్  అంటూ కన్నడ ఫ్యాన్స్‌ సంతాపం ప్రకటించారు.  త్రినయని సీరియల్‌లో పవిత్ర  ఆన్-స్క్రీన్ సోదరుడు పరశురామ్‌గా చంద్రకాంత్‌ నటించిన సంగతి తెలిసిందే.

పవిత్రా జయరాం  మృతిపై నటుడు సమీప్ ఆచార్య సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా తన విచారాన్ని వ్యక్తం చేశారు.  “మీరు ఇక లేరనే వార్తతో మేల్కొన్నాను. ఇది నమ్మశక్యంగా లేదు. నా తొలి ఆన్‌స్క్రీన్ తల్లి, మీరు ఎప్పుడూ ప్రత్యేకమే.” అంటూ  పోస్ట్‌ చేశారు.  కాగా ఆంధ్రప్రదేశ్‌లోని మెహబూబా నగర్ సమీపంలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.  ఈ ప్రమాదంలో చంద్రకాంత్‌తో అపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్ తదితరులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. 
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement