బాలీవుడ్ బుల్లితెర నటి డాలీ సోహి (48) క్యాన్సర్‌తో ఇవాళ కన్నుమూసింది. ఆరు నెలలుగా గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందతూ మార్చి 8న ఉదయం తుదిశ్వాస విడిచింది. డాలీ సోహి కుటుంబంలో రెండు రోజుల్లోనే మరో విషాదం చోటు చేసుకుంది. ఎందుకంటే నటి కన్నుమూయడానికి ముందు రోజే.. ఆమె సోదరి అమందీప్ సోహి కూడా ప్రాణాలు విడిచింది.
అయితే డాలీ సోహి తన మరణానికి ముందు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. గతనెల 20న ఆస్పత్రిలో చేరినప్పుడు చివరిసారిగా పోస్ట్ చేసింది. ఆమె తన ఇన్‌స్టాలో రాస్తూ ఈ ప్రపంచంలో అతిపెద్ద వైర్‌లెస్ కనెక్షన్ ప్రార్థన. అది మాత్రమే అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సమయంలో మీ ప్రార్థనలు అవసరం అంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెట్టారు. ఇవాళ ఆమె కన్నుమూయడంతో ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు. కాగా.. ఇటీవలే గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన కోసం పూనమ్ పాండే మరణించిదంటూ ఫ్రాంక్ చేసిన సంగతి తెలిసిందే.
జాండిస్‌తో ఆమె సోదరి మృతి..
పచ్చకామెర్ల వ్యాధి(జాండిస్) తీవ్రం కావడంతో ఆమె మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇద్దరు బిడ్డలు తమను వదిలేసి వెళ్లిపోయారంటూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా బుల్లితెర ప్రేక్షకులకు డాలీ సుపరిచితురాలే! మేరీ ఆషిఖి తుమ్ సే హి, ఖూబ్ లడీ మర్దానీ.. జాన్సీకి రాణి, పరిణీతి వంటి పలు సీరియల్స్ ద్వారా ఆమె ఆడియన్స్‌కు దగ్గరైంది.
Comments
Please login to add a commentAdd a comment