Dolly
-
క్యాన్సర్‌తో బుల్లితెర నటి మృతి.. కన్నీళ్లు తెప్పిస్తోన్న చివరి పోస్ట్!
బాలీవుడ్ బుల్లితెర నటి డాలీ సోహి (48) క్యాన్సర్‌తో ఇవాళ కన్నుమూసింది. ఆరు నెలలుగా గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందతూ మార్చి 8న ఉదయం తుదిశ్వాస విడిచింది. డాలీ సోహి కుటుంబంలో రెండు రోజుల్లోనే మరో విషాదం చోటు చేసుకుంది. ఎందుకంటే నటి కన్నుమూయడానికి ముందు రోజే.. ఆమె సోదరి అమందీప్ సోహి కూడా ప్రాణాలు విడిచింది. అయితే డాలీ సోహి తన మరణానికి ముందు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. గతనెల 20న ఆస్పత్రిలో చేరినప్పుడు చివరిసారిగా పోస్ట్ చేసింది. ఆమె తన ఇన్‌స్టాలో రాస్తూ ఈ ప్రపంచంలో అతిపెద్ద వైర్లెస్ కనెక్షన్ ప్రార్థన. అది మాత్రమే అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సమయంలో మీ ప్రార్థనలు అవసరం అంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెట్టారు. ఇవాళ ఆమె కన్నుమూయడంతో ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు. కాగా.. ఇటీవలే గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన కోసం పూనమ్ పాండే మరణించిదంటూ ఫ్రాంక్ చేసిన సంగతి తెలిసిందే. జాండిస్‌తో ఆమె సోదరి మృతి.. పచ్చకామెర్ల వ్యాధి(జాండిస్) తీవ్రం కావడంతో ఆమె మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇద్దరు బిడ్డలు తమను వదిలేసి వెళ్లిపోయారంటూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా బుల్లితెర ప్రేక్షకులకు డాలీ సుపరిచితురాలే! మేరీ ఆషిఖి తుమ్ సే హి, ఖూబ్ లడీ మర్దానీ.. జాన్సీకి రాణి, పరిణీతి వంటి పలు సీరియల్స్ ద్వారా ఆమె ఆడియన్స్‌కు దగ్గరైంది. View this post on Instagram A post shared by Dolly Sohi (@dolly_sohi) -
డోలీ కట్టి.. మూడు కిలోమీటర్లు
ఏటూరు నాగారం: డోలీ కట్టి మూడు కిలోమీటర్ల మేర ఓ గర్భిణిని కుటుంబసభ్యులు మోసుకొచ్చి, అనంతరం 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించిన ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. ఏటూరునాగారం మండలం రాయబంధం గొత్తికోయగూడేనికి చెందిన గర్భిణి సోది పోసికి ఆదివారంరాత్రి పురిటినొప్పులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని గ్రామస్తులు ఆశ కార్యకర్తకు తెలియజేయగా ఆమె 108 సిబ్బందికి సమాచారం ఇచ్చింది. గ్రామానికి సరైన రోడ్డుమార్గం లేకపోవడంతో అక్కడికి అంబులెన్సు రాదని సిబ్బంది చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మంచానికి తాళ్లుకట్టి డోలీగా మార్చి మూడు కిలోమీటర్ల దూరం మోసుకొచ్చారు. ఆ తర్వాత అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. -
రచ్చే కాదు... ఇంట కూడా గెలిచా!!
నాకు తిక్కుంది కానీ దానికో లెక్కుంది అన్నట్లుగా ఆమె ఎంబీఏ చేసింది. దిల్లీలో చక్కటి జీతంతో సకల సదుపాయాలతో పెద్ద పేరున్న బహుళజాతి సంస్థలో ఉద్యోగం ఆమెది. అలాంటిది, బంగారంలాంటి ఉద్యోగాన్ని, అందులో కంపెనీ ఇచ్చిన హోదాని, ఆ హోదాకు తగ్గ సౌకర్యాలనూ వదులుకుని బిహార్‌లోని మారుమూల ప్రాంతమైన గయ జిల్లా షాదిపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచింది. తాను మెట్టిన గ్రామాభివృద్ధి కోసం పాటుపడుతోంది. ఆమే డాలీ. ఎందుకలా చేశావని అడిగితే ఇలా చెప్పింది. ‘‘నిజానికి నేనీ పని ఎప్పుడో చేసుండాల్సింది, చేశాను కూడా. అయితే అప్పుడు కుదరలేదు. 2015లో మా పెళ్లయింది. భర్త, మామగారు చాలా మంచివారు. అయితే అది పల్లెటూరు కావడంతో నేను అక్కడ ఉండలేకపోయాను. తిరిగి ఢిల్లీ వెళ్లిపోయి, ఎప్పటిలాగే నా ఉద్యోగం చేసుకుంటూ సెలవ దొరికినప్పుడు వచ్చి కొద్దిరోజులు గడిపి వెళ్లేదానిని. అలా కొద్దికాలం గడిచింది. ఇంతలో పంచాయతీ ఎలక్షన్లొచ్చాయి. అంతవరకు జనరల్ స్థానంగా ఉన్న మా గ్రామ పంచాయతీని మహిళలకు కేటాయించారు. మా మామగారు, మా వారు ఆ స్థానానికి నన్ను పోటీ చేయమన్నారు. నేను ముందు ఆశ్చర్యపోయాను. తర్వాత చాలా ఆలోచించాను. ఢిల్లీ వంటి మహానగరంలో పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో మంచి జాబ్ చేసుకుంటున్న నేను మారుమూల పల్లెటూళ్లో సర్పంచ్‌గా పోటీ చేయడమా? అనుకున్నాను. మా వారు, మా వారు నన్ను 13 వార్డులున్న ఈ పంచాయతీకి సర్పంచ్ పోటీ చేయడం ఆషామాషీ వ్యవహారమేమీ కాదని, గెలవడం కూడా అంత తేలికేమీ కాదని, అయితే బాగా ఆలోచించుకోమన్నారు. ఆ ఊరికి నేను కొత్త. పైగా అప్పటికే నేను ఢిల్లీలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాను. నా వేషభాషలు, మాటలు చూసిన గ్రామస్థులు ఇంత ఆధునికంగా ఉన్న ఈమె ఈ ఊరికి ఎంపికై ఏం చేస్తుంది అనుకున్నారో ఏమో, మా కుటుంబానికి ఎంతో పలుకుబడి, డబ్బు ఉన్నప్పటికీ వాళ్ళెవరూ నన్ను నమ్మేలా కనిపించలేదు. దాంతో నేను దానిని సవాల్‌గా తీసుకున్నాను. ఉద్యోగంలో వచ్చే సవాళ్లను ఏ విధంగా అయితే అధిగమించే దానినో, ఈ సర్పంచ్ పదవికోసం అదేవిధంగా కృషి చేయాలనుకున్నాను. గ్రామీణుల నుంచి ఇతరులను వేరు చేసే వాటిలో ముఖ్యమైనవి వస్త్రధారణ, భాష, సంస్కృతి. మా కుటుంబానికి రాజకీయాలు ఏమీ కొత్తకాదు. నేను అడుగుపెట్టేటప్పటికే మా అత్తగారు లేరు కానీ, మా అత్తగారు గతంలో సర్పంచిగా పని చేసినట్లు విన్నాను. అందుకే అప్పటివరకూ చాలా ఆధునికంగా ఉన్న నేను నా వస్త్రధారణను, ఆహార్యాన్ని పూర్తిగా మార్చుకున్నాను. నిండుగా చీరకట్టు, నుదుట బొట్టు, చేతులకు గాజులు, కంటికి కాటుక, తలపై ముసుగుతో నేను పూర్తిగా అక్కడి అమ్మాయిలా మారిపోయాను. మాట తీరును కూడా మార్చుకున్నాను. కనిపించిన వారినందరినీ ఆప్యాయంగా పలకరించడం, వారి కష్టసుఖాలను కనుక్కోవడం, పెద్దవాళ్లకు గౌరవప్రదంగా నమస్కరించడం వంటి పద్ధతులతో వారికి నా పట్ల నమ్మకం కలిగించాను. ఇదంతా నేను సర్పంచ్ పదవిని ఆశించి చేసినవి కాదు. ఎంత పెద్ద చదువులు చదివినా, ఉద్యోగంలో రకరకాల సవాళ్లు ఎదురుకాకుండా ఉండవు కదా... మన తెలివితేటలు, ఓర్పు, నేర్పుతో వాటిని ఏ విధంగా అధిగమిస్తామో, అలాగే ఇది కూడా అనుకున్నాను. అందుకే వారికి తగ్గట్టు నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను. ఆ గ్రామానికి మౌలిక వసతులు కల్పించడం, అందరూ చదువుకునేలా చేయడం, గ్రామస్థుల సమస్యలు పరిష్కరించడం ముఖ్యలక్ష్యాలుగా ఎంచుకున్నాను. అంతే! వారు నన్ను మంచి మెజారిటీతో గెలిపించారు. అప్పటినుంచి నేను పూర్తి సమయాన్ని గ్రామాభివృద్ధి కోసమే కేటాయిస్తున్నాను. నన్ను నమ్మి నాకు ఓటు వేసి గెలిపించిన వారందరూ నా వారే అనుకున్నాను. రకరకాల కుటుంబ సమస్యలతో నా దగ్గరకొచ్చిన వారికి నాకు చేతనైన రీతిలో కౌన్సిలింగ్ ఇచ్చి వారి సమస్యలను పరిష్కరించాను. గ్రామంలో స్త్రీ విద్య కోసం కృషి చేశాను. పంచాయతీకి నిధుల కేటాయింపు కోసం కృషి చేశాను. అక్కడ ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నాకు చేతనైన రీతిలో ఆధునికీరించాను. రోడ్లు మరమ్మతు చేయించడం, వీధి దీపాలు వెలిగేలా చూడటం, పంచాయతీకి రావలసిన పన్నులను సక్రమంగా వసూలయేలా చర్యలు తీసుకోవడం వంటివన్నీ చేస్తూపోయాను. పురుషాధిక్య భావనలు ఉన్న ఆ గ్రామంలో అందరూ నన్ను గౌరవించడం, వారి ఇళ్లలో జరిగే శుభకార్యాలకు నన్ను ఆహ్వానించడం వంటి వాటితో చిత్రంగా నా కార్పొరేట్ ఉద్యోగంలో ఉన్న పోటీ, పరుగులు తీయడం, చికాకు, ఆందోళన, టెన్షన్లు వంటివి ఇక్కడ లేవు. నేను ఉద్యోగం చేస్తే కేవలం డబ్బు మాత్రమే వచ్చేది. అదే ఇక్కడ సర్పంచ్‌గా ఉండటం వల్ల ఎందరో గ్రామీణుల జీవితాలను బాగు చేయగలిగానన్న ఆత్మసంతృప్తి, మానసిక ప్రశాంతత కలిగాయి. అప్పుడు అనిపించింది... ఇంట గెలిచి రచ్చగెలువు అన్న సామెత ఉట్టిది కాదని... నేను బయటే కాదు, ఇంట కూడా గెలిచాననీ’’ పెద్ద చదువులు చదువుకున్న ప్రతి వారూ పెద్ద కంపెనీలలోనే పని చేసి రెండు చేతులా సంపాదించాలని ఏమీ లేదు, పెద్ద మనసుతో సొంత వూళ్లో సొంత ప్రజలకు సేవ చేసినా తృప్తితో గుండెలు నింపుకోవచ్చునని డాలీ ఉదంతం చెబుతోంది. (క్లిక్ చేయండి: సాహస రాణి.. ‘ఎందుకొచ్చిన రిస్క్’ అన్నవాళ్లే ఎక్కువ, కానీ!) -
కాబోయే అమ్మకు ఎంత కష్టమో.. !
శృంగవరపుకోట రూరల్: ఎస్.కోట మండలం దారపర్తి పంచాయతీ పరిధిలోని గిరిశిఖర గ్రామం కురిడికి చెందిన ఎం.పెంటమ్మ అనే గర్భిణికి మంగళవారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. స్థానిక మహిళలు సుఖప్రసవానికి ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో డోలీలో 20 కిలోమీటర్లు మోసుకొచ్చి దబ్బగుంటకు చేర్చారు. అక్కడి నుంచి ఆటోలో ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ప్రాథమిక వైద్యం అందించి విజయనగరం ఘోషాస్పత్రికి రిఫర్ చేశారు. కురిడి గిరిశిఖర గ్రామం కావడం, సరైన దారి సదుపాయం లేకపోవడంతో అత్యవసర వేళ కష్టాలు తప్పడంలేదని గిరిజనులు వాపోతున్నారు. గిరిశిఖర గిరిజన గ్రామాలకు త్వరితగతిన బీటీ రోడ్డు సౌక ర్యం కల్పించాలని గిరిజన పెద్దలు జె.గౌరీషు, ఆర్.శివ, సన్యాసిరావు, మాజీ సర్పంచ్ మాదల బుచ్చయ్య కోరారు. -
ఇక వారిని ‘అయ్యప్పే ఆదుకోవాలి’
సాక్షి, న్యూఢిల్లీ : ‘అప్పుడు నాకు పాతికేళ్లు. యవ్వనంతో దృఢంగా ఉన్నా. సైన్యంలో చేరేందుకు కసరత్తు చేసి బలంగా తయారయ్యాను. అయినప్పటికీ సైన్యం శారీర దారుఢ్య పరీక్షలో పాస్‌కాలేక పోయాను. కొల్లాం జిల్లా పునలూరులోని మా గ్రామానికి వచ్చి పడ్డాను. ఇక చాలు, వచ్చి నా ఉద్యోగంలో చేరంటూ నా తండ్రి ఆదేశించాడు. చేసేదేమీలేక పుణ్యమూ, పురుషార్థమూ రెండూ దక్కుతాయనుకొని వచ్చి ఈ వృత్తిలో చేరాను. ఇప్పుడు నాకు 53 ఏళ్లు. దాదాపు 30 ఏళ్లుగా పనిచేస్తున్నాను. కొండలెక్కేటప్పుడు భరించలేని ఒళ్లు నొప్పులు వస్తాయి. పంటి బిగువున నొప్పిని భరిస్తాను. అప్పుడప్పుడు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది. విశ్రాంత వేళలో కూడా కీళ్ల నొప్పులు, వెన్నుముక నొప్పి వేధిస్తాయి. ప్రతి రోజు పెయిన్ కిల్లర్స్ వేసుకొనిదే నిద్రరాదు’ శబరిమల ఆలయం వద్ద డోలి సర్వీసులో పనిచేసే సత్యన్ తెలిపారు. ఇక్కడ డోలి అంటే రెండు కర్రల మధ్య ఓ వెదురు కుర్చీని బిగిస్తారు. ఆ వెదురు కుర్చీలో భక్తులను కూర్చో బెట్టుకొని నలుగురు కూలీలు తీసుకెళ్లడమే డోలీ సర్వీసు. దానిలో భక్తులను పంబా నది నుంచి నాలుగు కి లోమీటర్ల దూరంలోని సన్నిధానం అయ్యప్ప ఆలయానికి తీసుకెళతారు. సముద్ర మట్టానికి 914 మీటర్ల ఎత్తులో సన్నిధానం ఉంది. అక్కడికి భక్తులు చెప్పులకు పాదరక్షలు లేకుండా అడ్డదిడ్డంగా ఉండే అటవి బాటలో వెళ్లాల్సి ఉండేది. శారీరకంగా బలహీనంగా ఉండే భక్తులకు అలా వెళ్లడం కష్టం కనుక 1966లో కేవలం పది డోలీలతో ఈ సర్సీసు ప్రారంభమైంది. అప్పటి ‘ట్రావన్‌కోర్ దేవసం బోర్డు’ చైర్మన్ ప్రక్కులం భాసి ఈ డోలి సర్వీసును ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బోర్డు ఆధ్వర్యంలోనే ఈ డోలి సర్వీసులు నడుస్తున్నాయి. ప్రస్తుతం 500 డోలీలు ఉండగా, వాటిని లాగేందుకు 2000 మంది కూలీలు పనిచేస్తున్నారు. ఒక్కో భక్తుడి నుంచి డోలీ సర్వీసు కింద 4,200 రూపాయలను వసూలు చేస్తారు. అందులో 200 రూపాయలు దేవసం బోర్డుకు వెళుతుంది. నాలుగు వేల రూపాయలను నలుగురు కూలీలు సమంగా పంచుకోవాలి. సీజన్లో ఒక్కో కూలీకి 70 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఆదాయం వస్తుంది. సీజనంటే ప్రస్తుతం నడుస్తున్న మండల సీజన్. ఈ సీజన్లో 41 రోజులు అయ్యప్ప ఆలయం తెరచి ఉంటుంది. ఇది మలయాళం క్యాలండర్ ప్రకారం వృశ్చిక మాసంలో వస్తుంది. ఆ తర్వాత మకరవిలక్కసు సీజన్ వస్తుంది. అదో 20 రోజులు, రెండు సీజన్లు కలిసి 61 రోజులు ఆలయం తెరచి ఉంటుంది. ఈ సీజన్లోనే డోలీ కూలీలకు ఎక్కువ ఆదాయం వస్తుంది. మొత్తం ఏడాదిలో 126 రోజులు మాత్రమే అయ్యప్ప ఆలయం తెరచి ఉంటుంది. డోలీ కూలీలు బస్టాండుకు వెళ్లి భక్తులను అక్కడే ఎక్కించుకొని పంబా నది తీరానికి రావాలి. నదిలో స్నానమాచరించాక మళ్లీ వారిని ఎక్కించుకొని కొండపైన అయ్యప్ప ఆలయానికి తీసుకెళ్లాలి. ఆ భక్తులే అదే రోజు వెనక్కి వస్తానంటే తీసుకరావాలి. మరుసటి రోజు వస్తానంటే మరుసటి రోజే తీసుకరావాల్సి ఉంటుంది. వారు భక్తులను రెండు గంటల్లో కొండపైకి తీసుకెళతారు. మార్గమధ్యంలో పది నిమిషాల చొప్పున మూడుసార్లు ఆగుతారు. వారికి గతంలో పంబా నది తీరాన విశ్రాంతి మందిరం ఉండేది. గత ఆగస్టు నెలలో వచ్చిన వరదల్లో అది కాస్త కొట్టుకుపోయింది. ఇప్పుడు ఆరు బయటే వారి విశ్రాంతి. కేరళలోని వివిధ ప్రాంతాలకు చెందిన డోలీ కూలీలు సీజనంతా ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. వారు దేవసం బోర్డు పరిధిలో కాంట్రాక్టు కూలీలుగా పనిచేస్తున్నందున వారికి సెలవులు లేవు. రోగమొస్తే, నొప్పొస్తే ఉచిత వైద్య సౌకర్యం లేదు. మంచాన పడినా పింఛను సౌకర్యం లేదు. ఒకప్పుడు ముళ్ల పొదలు, కొనదేలి కోసుకుపోయే రాళ్ల మీది నుంచి వెళ్లాల్సి ఉండేది. ఇప్పుడు సిమ్మెంట్ రోడ్డు మీద వెళుతున్నారు. భక్తులులాగే వీరు కూడా పాద రక్షలు లేకుండానే వెళ్లాలి. రావాలి. వృత్తి కారణంగా వారికి కీళ్ల నొప్పులే కాకుండా ‘డిస్క్ పొలాప్స్’ లాంటి వెన్నుముఖ జబ్బులు కూడా వస్తున్నాయి. 53 ఏళ్లు వచ్చినా మన సత్యన్ ఇప్పటికీ దృఢంగా ఉన్నట్లు కనిస్తున్నాడుకానీ చాలా మంది కూలీలు 50 ఏళ్లకే చనిపోతారట. ఇప్పుడు వారికి నిరుద్యోగం భయం పట్టుకుంది. యాత్రికుల తాకిడి ఎక్కువవడం, వారి నుంచి టీడీబీకి వస్తున్న ఆదాయం కూడా పెరగడంతో భక్తుల సౌకర్యార్థం పంబా నది నుంచి సన్నిధానం వరకు ‘రోప్ వే’ను ప్రవేశ పెట్టాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో డోలీ సర్వీసులు రద్దు కానున్నాయి. అప్పుడు తాము రోడ్డున పడతామని వారు ఆందోళన చెందుతున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలంటూ పాలక, ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇక తమకు అయ్యప్పే దిక్కని, ఆయన ఎలా కాపాడుతారో చూడాలి అని వారు మొరపెట్టుకుంటున్నారు. అన్ని వయస్కుల మహిళలను ఆలయంలోకి అనుమతించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంపై రాష్ట్ర అసెంబ్లీలో కుమ్ముకుంటున్న పాలక, ప్రతిపక్షాలకు వీరి గురించి పట్టించుకునే తీరికెక్కడిది! సోమవారం కూడా కేరళ అసెంబ్లీ స్తంభించిపోయింది. -
20 నుంచి పవన్ 'కాటమరాయుడి' జోరు!
హైదరాబాద్: పవన్ కల్యాణ్ తాజా సినిమా 'కాటమరాయుడు' ఎట్టకేలకు పట్టాలు ఎక్కబోతోంది. ఈ నెల 20 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన 'వీరమ్' సినిమా రీమేక్‌గా 'కాటమరాయుడు' వస్తున్న సంగతి తెలిసిందే. 'సినిమా ప్రధాన షూటింగ్ ఈ నెల 20న ప్రారంభం కానుంది. రాజకీయ కమిట్మెంట్ల నుంచి బయటపడి ఈ నెల 24 నుంచి పవన్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటారు. మొదటి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో జరగనుంది' అని చిత్ర యూనిట్‌కు సంబంధించిన అత్యంత విశ్వసనీయ వర్గాలు ఐఏఎన్ఎస్ వార్తాసంస్థకు తెలిపారు. ఈ ఏడాది వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యంలో 'గోపాల గోపాల' ఫేం దర్శకుడు డాలీతో కలిసి జట్టు కట్టి పవన్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పవన్, అతని సన్నిహితుడు శరత్ మరార్.. ఉమ్మడిగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్ సరసన కాజల్ మరోసారి నటించనుంది. -
పవన్ కొత్త సినిమా.. తెరపైకి క్రేజీ టైటిల్!
పవన్ కల్యాణ్ కొత్త సినిమా టైటిల్ విషయమై మరో కేజ్రీ పేరు తెరపైకి వచ్చింది. ఈ ఏడాది వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యంలో 'గోపాల గోపాల' ఫేం దర్శకుడు డాలీతో కలిసి జట్టు కట్టి పవన్ కొత్త సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ సన్నిహితుడు శరత్ మరార్.. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో నాయికగా శృతిహాసన్ ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ విషయమై పలు కథనాలు వెబ్ మీడియాలో ప్రచారమవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు 'కడప కింగ్' అనే టైటిల్ ఖరారు చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా సినిమాకు 'కాటమరాయుడు' అనే టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. 'అత్తారింటికి దారేది' సినిమాలో ఫేమస్ అయిన 'కాటమరాయుడు' పాటను పవన్ స్వయంగా పాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త సినిమాకు ఈ పేరును టైటిల్‌గా పెడితే ప్రజల్లోకి బాగా వెళుతుందని చిత్రయూనిట్ భావిస్తున్నదని చెప్తున్నారు. అయితే, చిత్ర యూనిట్ మాత్రం టైటిల్ విషయంలో ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మొదట 'ఖుషీ' దర్శకుడు ఎస్జే సూర్యను తీసుకున్నారు. కానీ, అతడు బిజీ కావడంతో డాలీ ఈ ప్రాజెక్టును టేకాప్ చేశారు. -
అభిమానులకు పవన్ బర్త్ డే గిఫ్ట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు తీపి కబురు అందింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవన్ కొత్త సినిమా పట్టాలెక్కేసింది. ప్రస్తుతానికి పవన్ షూటింగ్లో పాల్గొనకపోయినా.. త్వరలోనే యూనిట్‌తో జాయిన్ అవుతాడన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడట పవన్. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను పవన్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు అదే రోజు సినిమా టైటిల్‌ను అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాను తమిళ సూపర్ హిట్ సినిమా వీరంకు రీమేక్‌గా రూపొందిస్తున్నారన్న టాక్ వినివిస్తున్నా.. యూనిట్ సభ్యుల నుంచి మాత్రం కన్ఫర్మేషన్ లేదు. సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమాతో నిరాశపరిచిన పవన్ కళ్యాణ్, ఈ సారి ఎలాగైన భారీ హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. అనుప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. -
పవన్ లేకుండానే షూటింగ్ స్టార్ట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఈ నెల ఆరో తేదిన పట్టాలెక్కబోతోంది. ఇప్పటికే కథ కథనాలు సిద్ధంగా ఉన్న ఈ సినిమాకు గోపాల గోపాల ఫేం డాలీ దర్శకుడు. పవన్ సన్నిహితుడు శరత్ మరార్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య దర్శకత్వం వహించాల్సి ఉన్నా.. ఆయన నటుడిగా బిజీ కావటంతో డాలీని తీసుకున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ 6వ తేది నుంచి ప్రారంభమవుతున్నా.. ఆ షూటింగ్లో పవన్ పాల్గొనే అవకాశం లేదన్న టాక్ వినిపిస్తోంది. కారణాలేంటో తెలియకపోయినా.. మరో వారం తరువాతే పవన్ షూటింగ్‌కు హారవుతారని తెలుస్తోంది. అయితే గతంలో సర్థార్ గబ్బర్‌సింగ్ షూటింగ్ సమయంలో కూడా పవన్ తొలి షెడ్యూల్‌కు హాజరు కాలేదు. దీంతో ఇది పవన్ సెంటిమెంట్ అన్న టాక్ కూడా వినిపిస్తోంది. -
ఆగస్టు 6న సెట్స్ మీదకు..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు డేట్ కుదిరింది. చాలా రోజులుగా ఈసినిమా విషయంలో వస్తున్న రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పెడుతూ ఆగస్టు తొలి వారంలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందంటూ ప్రకటించారు చిత్రయూనిట్. గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ముందుగా ఈ సినిమాను ఎస్ జె సూర్యను దర్శకుడిగా ఎంపిక చేసినా.. సూర్య నటుడిగా బిజీ అవ్వటంతో ఆ స్థానంలో డాలీని తీసుకున్నారు. మరోసారి పవన్ సన్నిహితుడు శరత్ మరార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. -
పవన్ కొత్త సినిమా ఆగిపోయిందా..?
సర్థార్ గబ్బర్ సింగ్ తరువాత పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమాపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. చాలా రోజులు క్రితమే తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య దర్శకత్వంలో ఓ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు పవన్. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో పవన్ సన్నిహితుడు శరత్ మరార్, ఈ సినిమాను భారీగా తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. అయితే అనుకోకుండా సూర్య నటుడిగా బిజీగా కావటంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఎస్ జె సూర్య బదులుగా గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాలని భావించాడు పవన్. అయితే సూర్య ప్రీ ప్రొడక్షన్ పనులు మధ్యలోనే ఆపేయటంతో డాలీ మొదటినుంచి కొత్తగా స్క్రిప్ట్ మీద వర్క్ చేయటం మొదలు పెట్టాడట. దీంతో సినిమా సెట్స్ మీదకు వెళ్లటానికి మరింత సమయం పట్టేలా ఉంది. కానీ ఇప్పటికే పవన్ డిసెంబర్ నుంచి త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు డేట్స్ ఇచ్చాడు. అంటే మరో 5 నెలల్లోనే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్ పనులను పూర్తి చేయాలి. కానీ పవన్ కళ్యాణ్, డాలీల వర్కింగ్ స్టైల్ తెలిసిన వాళ్లు మాత్రం ఇంత తక్కువ టైంలో సినిమా పూర్తవ్వటం అసాధ్యం అని ఫీల్ అవుతున్నారు. పవన్ కూడా ఇలాగే ఆలోచించి ఈ ప్రాజెక్ట్‌ను పక్కనే పెట్టేయాలని భావిస్తున్నాడట. -
తెలుగు తెరపై మరో వందకోట్ల సినిమా..?
తెలుగు సినిమా బడ్జెట్ పరిధులు చెరిగిపోతున్నాయి. రీజినల్ సినిమా కూడా వందకోట్ల వసూళ్లు సాధించగలదని తేలిపోవటంతో ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు సన్నద్దమవుతున్నారు. ఇప్పటికే బాహుబలి, పులి లాంటి సినిమాలు వెండితెర మీద సందడి చేయగా.., మరిన్ని చిత్రాలు అదే కోవలో రూపొందనున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ కొత్త సినిమాపై ఇలాంటి వార్తే బయటకు వచ్చింది. ముందుగా ఈ సినిమాకు దర్శకుడిగా ఎస్ జె సూర్యను ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో గోపాల గోపాల దర్శకుడు డాలీని తీసుకొని షూటింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నారు. చిత్రయూనిట్ నుంచి బయటకు రాకముందే సినిమా విశేషాలను తెలియజేస్తూ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు సూర్య. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విశేషాలను వెల్లడించారు. పవన్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాకు వందకోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్టు తెలిపారు. సినిమాలో పవన్ రాయలసీమ ఫ్యాక్షనిస్టుగా నటిస్తున్నారని, సినిమా అంతా పంచెకట్టులోనే ఉంటారని తెలిపారు. అయితే తనకు రాయలసీమ ప్రాంతంపై అవగాహన లేని కారణంగా కథాకథనంలో ఆకుల శివ సహాయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన కొద్ది రోజులకే సూర్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. మరి ప్రస్తుత దర్శకుడు డాలీ, సూర్య ప్లాన్ చేసినట్టుగానే తెరకెక్కిస్తాడో లేదో చూడాలి. -
మరోసారి దేవుడి పాత్రలో..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి దేవుడి పాత్రలో కనిపించనున్నాడట. ఇప్పటికే గోపాల గోపాల సినిమాలో మోడ్రన్ కృష్ణుడిగా ఆకట్టుకున్న పవన్. ఈ సారి త్రివిక్రమ్ సినిమాలో దేవుడి పాత్రలో నటించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అ..ఆ.. సినిమాతో సూపర్ హిట్ కొట్టిన త్రివిక్రమ్, ప్రస్తుతం పవన్‌తో చేయబోయే సినిమా కోసం స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టాడు. ఈ సినిమాకు 'దేవుడే దిగివచ్చినా' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. కథా కథనాలు ఎంటో చెప్పకపోయినా టైటిల్‌ను బట్టి ఈ సినిమాలో పవన్ దేవుడి పాత్రలో కనిపిస్తాడని భావిస్తున్నారు. గతంలో ఖలేజా సినిమాలో మహేష్ బాబును దేవుడిగా చూపించిన త్రివిక్రమ్, ఈ సారి పవర్ స్టార్‌ను అదే తరహాలో చూపించే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న పవన్ డిసెంబర్ నుంచి త్రివిక్రమ్ సినిమా షూటింగ్లో పాల్గొననున్నాడు. -
మరోసారి దేవుడి పాత్రలో..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి దేవుడి పాత్రలో కనిపించనున్నాడట. ఇప్పటికే గోపాల గోపాల సినిమాలో మోడ్రన్ కృష్ణుడిగా ఆకట్టుకున్న పవన్. ఈ సారి త్రివిక్రమ్ సినిమాలో దేవుడి పాత్రలో నటించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అ..ఆ.. సినిమాతో సూపర్ హిట్ కొట్టిన త్రివిక్రమ్, ప్రస్తుతం పవన్‌తో చేయబోయే సినిమా కోసం స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టాడు. ఈ సినిమాకు 'దేవుడే దిగివచ్చినా' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. కథా కథనాలు ఎంటో చెప్పకపోయినా టైటిల్‌ను బట్టి ఈ సినిమాలో పవన్ దేవుడి పాత్రలో కనిపిస్తాడని భావిస్తున్నారు. గతంలో ఖలేజా సినిమాలో మహేష్ బాబును దేవుడిగా చూపించిన త్రివిక్రమ్, ఈ సారి పవర్ స్టార్‌ను అదే తరహాలో చూపించే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న పవన్ డిసెంబర్ నుంచి త్రివిక్రమ్ సినిమా షూటింగ్లో పాల్గొననున్నాడు. -
పవన్ మాట నిలబెట్టుకున్నాడా?
సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో నిరాశపరిచిన పవన్ ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమా మీద దృష్టిపెట్టాడు. ఇప్పటికే కథ కూడా రెడీ అయిపోయినా సాంకేతిక నిపుణులు, నటీనటుల ఎంపిక జరుగుతోంది. ముందుగా ఈ సినిమాను తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య దర్శకత్వంలో చేయాలని భావించిన పవన్, ఆ తర్వాత మరో దర్శకుడితో చేసేందుకు రెడీ అవుతున్నాడు. గోపాల గోపాల సినిమా ఆడియో ఫంక్షన్ లో ఆ చిత్ర దర్శకుడు డాలీకి, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ కు మరో అవకాశం ఇస్తానంటూ సభాముఖంగా పవన్ చెప్పాడు. ఇప్పుడు తన తాజా చిత్రానికి ఆ ఇద్దరి తీసుకున్నాడు. సంగీత దర్శకుడిగా అనూప్ ను ఎప్పుడో కన్ఫామ్ చేసిన పవన్, ఇటీవలే డాలీని దర్శకుడిగా ఎనౌన్స్ చేశాడు. దాంతో... అప్పుడు ఇచ్చిన మాట ప్రకారమే పవన్ వాళ్లకు చాన్స్ ఇచ్చాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. -
డాలీ దర్శకత్వంలో ఓ మైగాడ్!
బాలీవుడ్లో సంచలనాత్మక విజయం సాధించిన చిత్రం ‘ఓ మైగాడ్’. అక్షయ్ కుమార్, పరేష్ రావెల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతోపాటు, బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఇందులో మోడ్రన్ కృష్ణుడిగా అక్షయ్ కుమార్ నటించారు. ‘ఓ మైగాడ్’ తెలుగులో రీమేక్ అవుతుందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో నటించడానికి పవన్ కల్యాణ్ ఆసక్తి చూపిస్తున్నారని అప్పట్లో ఫిలింనగర్లో అనుకున్నారు కూడా. ఇప్పుడా ప్రాజెక్ట్‌కి వెంకటేష్ పచ్చజెండా ఊపినట్టుగా తెలిసింది. ఇందులో అభినవ కృష్ణుడిగా కనిపించడానికి ఆయన ఉత్సాహం చూపిస్తున్నారట! పరేష్ రావెల్ పాత్రను తెలుగులో ఎవరు చేస్తారనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘తడాఖా’ చిత్రాలతో మంచిపేరు సంపాదించుకున్న కిషోర్ కుమార్ పార్థసాని (డాలీ) ఈ చిత్రానికి దర్శకునిగా ఎంపికయ్యారు. డి.సురేష్‌బాబుతో కలిసి మరో నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు సమాచారం. ఫిబ్రవరిలో ఈ చిత్రం షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.