20 నుంచి పవన్‌ 'కాటమరాయుడి' జోరు! | Pawan Kalyan Katamarayudu to roll from September 20 | Sakshi
Sakshi News home page

20 నుంచి పవన్‌ 'కాటమరాయుడి' జోరు!

Published Thu, Sep 15 2016 2:17 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

20 నుంచి పవన్‌ 'కాటమరాయుడి' జోరు! - Sakshi

20 నుంచి పవన్‌ 'కాటమరాయుడి' జోరు!

హైదరాబాద్‌: పవన్‌ కల్యాణ్‌ తాజా సినిమా 'కాటమరాయుడు' ఎట్టకేలకు పట్టాలు ఎక్కబోతోంది. ఈ నెల 20 నుంచి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన 'వీరమ్' సినిమా రీమేక్‌గా 'కాటమరాయుడు' వస్తున్న సంగతి తెలిసిందే.

'సినిమా ప్రధాన షూటింగ్‌ ఈ నెల 20న ప్రారంభం కానుంది. రాజకీయ కమిట్‌మెంట్ల నుంచి బయటపడి ఈ నెల 24 నుంచి పవన్‌ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. మొదటి షెడ్యూల్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లో జరగనుంది' అని చిత్ర యూనిట్‌కు సంబంధించిన అత్యంత విశ్వసనీయ వర్గాలు ఐఏఎన్‌ఎస్‌ వార్తాసంస్థకు తెలిపారు.

ఈ ఏడాది వచ్చిన సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యంలో 'గోపాల గోపాల' ఫేం దర్శకుడు డాలీతో కలిసి జట్టు కట్టి పవన్‌ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పవన్‌, అతని సన్నిహితుడు శరత్ మరార్.. ఉమ్మడిగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్‌ సరసన కాజల్‌ మరోసారి నటించనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement