భారీ మార్కెట్ కోసం పవన్ ప్లాన్స్ | Pawan, Trivikram film release in three languages | Sakshi
Sakshi News home page

భారీ మార్కెట్ కోసం పవన్ ప్లాన్స్

Published Tue, Jun 20 2017 2:27 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

భారీ మార్కెట్ కోసం పవన్ ప్లాన్స్ - Sakshi

భారీ మార్కెట్ కోసం పవన్ ప్లాన్స్

సర్థార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాలతో నిరాశపరిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమాతో భారీ వసూళ్లు సాధించాలని భావిస్తోంది పవన్ టీం. అందుకే ఈ సినిమాను ఒకేసారి మూడు భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. పవన్ త్రివిక్రమ్ల సినిమాను తెలుగుతో పాటు.. తమిళ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ మూడు భాషల్లో టైటిల్ ఫిక్స్ చేసే పనిలో ఉన్నారట. టైటిల్స్ ఫైనల్ అయిన వెంటనే ఫస్ట్ లుక్ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు.. ఇతర భాషల మీద దృష్టి పెడుతుండటంతో పవన్ కూడా అదే ప్లాన్లో ఉన్నాడు. త్రివిక్రమ్ సినిమాతో భారీ వసూళ్లు సాధించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement