
పవర్‌ఫుల్ ఛాన్స్
ఎవరు.. ఎవరు..? పవన్‌కల్యాణ్ పక్కన నటించబోయే కథానాయికలు ఎవరు? ఫిల్మ్‌నగర్ ప్రముఖులతో పాటు ప్రేక్షకుల్లోనూ ఈ చర్చ జరుగుతోంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రంలో ఇద్దరు, ఆర్.టి. నేసన్ చిత్రంలో ఒకరు. మొత్తం మీద ముగ్గురు కథానాయికలు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కి కావాలి. అందులో ఒకరు ఇప్పుడు ఖరారయ్యారు. పవన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మించనున్న చిత్రంలో ఓ నాయికగా కీర్తీ సురేశ్ ఎంపికయ్యారు.
ఈ ఏడాది జనవరి 1న విడుదలైన ‘నేను.. శైలజ’తో ఈ మలయాళీ ముద్దుగుమ్మ తెలుగుకి పరి చయమయ్యారు. ప్రస్తుతం నాని ‘నేను లోకల్’లో నటిస్తున్నారు. ఇప్పుడు డాలీ దర్శకత్వంలో ‘కాటమరాయుడు’ చేస్తున్న పవన్, త్వరలోనే త్రివిక్రమ్ సినిమా సెట్స్‌లోకి వస్తారట. పవన్ సరసన ఛాన్స్‌తో, ‘‘అయామ్ వెరీ హ్యాపీ’’ అని కీర్తీ సురేశ్ ఆనందం వ్యక్తం చేశారు.