సీమ టు సాఫ్ట్‌వేర్‌! | Pawan is an IT analyst in Trivikram's film | Sakshi
Sakshi News home page

సీమ టు సాఫ్ట్‌వేర్‌!

Published Tue, Mar 14 2017 11:51 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Pawan is an IT analyst in Trivikram's film

రాయలసీమ నుంచి రావడమే ఆలస్యం హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పవన్‌కల్యాణ్‌ జాయిన్‌ కానున్నారట! పవన్‌కు సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ అవసరం ఏముంది? అని ఆలోచిస్తున్నారా! ఆయనలోని హీరోకి అవసరమే మరి. ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘కాటమరాయుడు’. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే.

అందులో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేసే ఐటీ ఎనలిస్ట్‌గా పవన్‌ కనిపిస్తారట! ఏప్రిల్‌ తొలి వారంలో త్రివిక్రమ్‌ సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుందని సమాచారం. ‘కాటమరాయుడు’లో పవన్‌ రాయలసీమ ఫ్యాక్షనిస్ట్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పంచెకట్టులో ఆయన లుక్‌ అభిమానులకు మాంచి కిక్‌ ఇచ్చింది. ఈ లుక్‌కి పూర్తి భిన్నంగా త్రివిక్రమ్‌ సినిమాలో లుక్‌ ఉంటుందట. సై్టలిష్‌ అండ్‌ ట్రెండీగా కనిపిస్తారట. డాలీ దర్శకత్వంలో శరత్‌మరార్‌ నిర్మిస్తున్న ‘కాటమరాయుడు’ ప్రీ రిలీజ్‌ వేడుకను ఈనెల 18న నిర్వహించి, 24న సినిమా విడుదల చేయాలనుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement