పవన్‌ కొత్త సినిమా.. తెరపైకి క్రేజీ టైటిల్! | pawan new film title is katamarayudu | Sakshi
Sakshi News home page

పవన్‌ కొత్త సినిమా.. తెరపైకి క్రేజీ టైటిల్!

Published Wed, Aug 31 2016 7:04 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్‌ కొత్త సినిమా.. తెరపైకి క్రేజీ టైటిల్! - Sakshi

పవన్‌ కొత్త సినిమా.. తెరపైకి క్రేజీ టైటిల్!

పవన్‌ కల్యాణ్‌ కొత్త సినిమా టైటిల్‌ విషయమై మరో కేజ్రీ పేరు తెరపైకి వచ్చింది. ఈ ఏడాది వచ్చిన సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యంలో 'గోపాల గోపాల' ఫేం దర్శకుడు డాలీతో కలిసి జట్టు కట్టి పవన్‌ కొత్త సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పవన్‌ సన్నిహితుడు శరత్ మరార్.. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో నాయికగా శృతిహాసన్‌ ఎంపికైన విషయం తెలిసిందే.

ఈ సినిమా టైటిల్‌ విషయమై పలు కథనాలు వెబ్‌ మీడియాలో ప్రచారమవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు 'కడప కింగ్' అనే టైటిల్‌ ఖరారు చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా సినిమాకు 'కాటమరాయుడు' అనే టైటిల్‌ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. 'అత్తారింటికి దారేది' సినిమాలో ఫేమస్‌ అయిన 'కాటమరాయుడు' పాటను పవన్‌ స్వయంగా పాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త సినిమాకు ఈ పేరును టైటిల్‌గా పెడితే ప్రజల్లోకి బాగా వెళుతుందని చిత్రయూనిట్‌ భావిస్తున్నదని చెప్తున్నారు. అయితే, చిత్ర యూనిట్‌ మాత్రం టైటిల్‌ విషయంలో ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మొదట 'ఖుషీ' దర్శకుడు ఎస్‌జే సూర్యను తీసుకున్నారు. కానీ, అతడు బిజీ కావడంతో డాలీ ఈ ప్రాజెక్టును టేకాప్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement