కాటమరాయుడు మొదలెట్టేశాడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కాటమరాయుడు. గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫ్యాక్షనిస్ట్ పాత్రలో కనిపించనున్నాడు. తమిళ సినిమా వీరం కు రీమేక్ తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఉగాది కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అయితే సినిమా రిలీజ్కు ఇంకా రెండు నెలల సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే బిజినెస్ మొదలెట్టేశారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా సీడెడ్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయన్న ప్రచారం జరుగుతోంది. సర్థార్ గబ్బర్సింగ్ లాంటి డిజాస్టర్ తరువాత పవన్ హీరోగా తెరకెక్కిన సినిమా అయినా కాటమరాయుడు బిజినెస్ పరంగా దూసుకుపోతోంది.
సీడెడ్ బాహుబలి తరువాత అత్యధిక మొత్తానికి కాటమరాయుడు రైట్స్ అమ్ముడవ్వడం పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కిక్ ఇస్తోంది. పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.