'ఎవడున్నాడన్నదే ముఖ్యం' : కాటమరాయుడు | Katamarayudu teaser | Sakshi
Sakshi News home page

'ఎవడున్నాడన్నదే ముఖ్యం' : కాటమరాయుడు

Published Sat, Feb 4 2017 4:17 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

'ఎవడున్నాడన్నదే ముఖ్యం' : కాటమరాయుడు - Sakshi

'ఎవడున్నాడన్నదే ముఖ్యం' : కాటమరాయుడు

పవర్ స్టార్ అభిమానులు చాలా రోజులు ఎదురుచూస్తున్న కాటమరాయుడు టీజర్ రిలీజ్ అయ్యింది. న్యూ ఇయర్ కి, సంక్రాంతికి అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిన చిత్రయూనిట్ ఫైనల్ పవన్ అభిమానులకు కిక్ ఇచ్చే పవర్ ఫుల్ టీజర్ ను రిలీజ్ చేశారు. పవన్ లుక్స్ క్యారెక్టరైజేషన్ తెలిసేలా రూపొందించిన టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్  కూడా అదిరిపోయింది.

ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడున్నాడన్నదే ముఖ్యం అంటూ పవన్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ సినిమా పక్కా మాస్ ఎంటర్టైనర్ అని కన్ఫామ్ చేసేస్తుంది. టీజర్ ఎక్కువగా భాగం పవన్ ను సీరియస్ గానే చూపించిన యూనిట్ ఒక్క షాట్ లో పవన్ డ్యాన్స్ మూమెంట్ ను చూపించారు. తమిళ సూపర్ హిట్ వీరంకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈసినిమా టీజర్ లో ఎక్కడా ఆ ఫ్లేవర్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement