
అందం, అభినయంతో దశాబ్దానికిపైగా కుర్రకారు మనసుదోచుకుని వారి డ్రీమ్ గాళ్ అనిపించుకుంది స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. అగ్రహీరోలతో సినిమాలు, వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. సీన్‌కట్‌చేస్తే కుర్ర హీరోయిన్లు రావడం, సినిమా అవకాశాలు తగ్గడంతో రేసులో కొద్దిగా వెనకబడింది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కాజల్‌కు మళ్లీ మంచి రోజులు వచ్చినట్టు కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’రూపంలో అనుకోని అవకాశం దక్కించుకున్న కాజల్.. మరో బంపర్‌ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ‘వకీల్ సాబ్’తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్. వెణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ తుది దశకు చేరకుంది. ఈ చిత్రం షూటింగ్ జరుగుతుండగానే మరో రెండు సినిమాలను లైన్లో పెట్టారు పవన్. విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్, గబ్బర్‌సింగ్‌తో భారీ విజయాన్ని అందించిన హరీష్ శంకర్‌ల సినిమాలకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతోంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్ర లేటేస్ట్ అప్‌డేట్ అభిమానుల్ని అలరిస్తోంది.
పవన్-హరీష్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాలో హీరోయిన్ ఎవరనేదానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. పూజా హెగ్డే, లావణ్య త్రిపాఠిల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం కాజల్ అగర్వాల్‌ను చిత్ర బృందం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కాజల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అనధికారిక సమాచారం. అయితే ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉందట. ప్రధాన కథానాయికగా కాజల్‌ను ఎంపిక చేశారని, మరో హీరోయిన్ ఎవరనేదానిపై దర్శకుడు ఇంకా స్పష్టతకు రాలేదని తెలుస్తోంది. ఇక ఆచార్య, పవన్ సినిమాతో కాజల్ మళ్లీ టాప్ రేసులోకి రావడం పక్కా అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చదవండి:
బాలయ్య సినిమాలో లేడీ విలన్?
నా మనసులో కొందరు ఉన్నారు
Comments
Please login to add a commentAdd a comment