పవన్ కొత్త సినిమా ఆగిపోయిందా..?
సర్థార్ గబ్బర్ సింగ్ తరువాత పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమాపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. చాలా రోజులు క్రితమే తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య దర్శకత్వంలో ఓ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు పవన్. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో పవన్ సన్నిహితుడు శరత్ మరార్, ఈ సినిమాను భారీగా తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. అయితే అనుకోకుండా సూర్య నటుడిగా బిజీగా కావటంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ఎస్ జె సూర్య బదులుగా గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాలని భావించాడు పవన్. అయితే సూర్య ప్రీ ప్రొడక్షన్ పనులు మధ్యలోనే ఆపేయటంతో డాలీ మొదటినుంచి కొత్తగా స్క్రిప్ట్ మీద వర్క్ చేయటం మొదలు పెట్టాడట. దీంతో సినిమా సెట్స్ మీదకు వెళ్లటానికి మరింత సమయం పట్టేలా ఉంది.
కానీ ఇప్పటికే పవన్ డిసెంబర్ నుంచి త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు డేట్స్ ఇచ్చాడు. అంటే మరో 5 నెలల్లోనే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్ పనులను పూర్తి చేయాలి. కానీ పవన్ కళ్యాణ్, డాలీల వర్కింగ్ స్టైల్ తెలిసిన వాళ్లు మాత్రం ఇంత తక్కువ టైంలో సినిమా పూర్తవ్వటం అసాధ్యం అని ఫీల్ అవుతున్నారు. పవన్ కూడా ఇలాగే ఆలోచించి ఈ ప్రాజెక్ట్‌ను పక్కనే పెట్టేయాలని భావిస్తున్నాడట.