డాలీ దర్శకత్వంలో ఓ మైగాడ్!
డాలీ దర్శకత్వంలో ఓ మైగాడ్!
Published Mon, Dec 23 2013 11:14 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
బాలీవుడ్‌లో సంచలనాత్మక విజయం సాధించిన చిత్రం ‘ఓ మైగాడ్’. అక్షయ్ కుమార్, పరేష్ రావెల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతోపాటు, బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఇందులో మోడ్రన్ కృష్ణుడిగా అక్షయ్ కుమార్ నటించారు. ‘ఓ మైగాడ్’ తెలుగులో రీమేక్ అవుతుందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో నటించడానికి పవన్ కల్యాణ్ ఆసక్తి చూపిస్తున్నారని అప్పట్లో ఫిలింనగర్‌లో అనుకున్నారు కూడా.
ఇప్పుడా ప్రాజెక్ట్‌కి వెంకటేష్ పచ్చజెండా ఊపినట్టుగా తెలిసింది. ఇందులో అభినవ కృష్ణుడిగా కనిపించడానికి ఆయన ఉత్సాహం చూపిస్తున్నారట! పరేష్ రావెల్ పాత్రను తెలుగులో ఎవరు చేస్తారనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘తడాఖా’ చిత్రాలతో మంచిపేరు సంపాదించుకున్న కిషోర్ కుమార్ పార్థసాని (డాలీ) ఈ చిత్రానికి దర్శకునిగా ఎంపికయ్యారు. డి.సురేష్‌బాబుతో కలిసి మరో నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు సమాచారం. ఫిబ్రవరిలో ఈ చిత్రం షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.
Advertisement
Advertisement