Oh My God
-
Oh My God 2: శివుడిగా అక్షయ్ కుమార్.. లుక్ అదిరిందిగా!
టాలీవుడ్ స్టార్స్ పవన్ కల్యాణ్, వెంకటేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘గోపాల గోపాల’ రీమేక్ అన్న విషయం తెలిసిందే. 2012లో విడుదలైన దాని హిందీ మాతృక ‘ఓ మై గాడ్’ మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో లీడ్ రోల్స్‌లో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, పరేశ్ రావెల్ నటించారు. ఇప్పుడు ఈ సినిమాకి సిక్వెల్ రానుంది. మొదటి ‘ఓఎమ్‌జీ’లో కృష్ణుడిగా కనిపించాడు అక్షయ్. కాగా ఈ సారి రాబోతున్న ‘ఓఎమ్‌జీ 2’లో శివుడిగా కనిపించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ని ట్విట్టర్లో రిలీజ్ చేశాడు ఈ నటుడు. ఇంతకుముందు ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ అనే వినూత్న కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇప్పుడు మరో సోషల్ ఇష్యూతో రానున్నట్లు ఈ స్టార్ తెలిపాడు. దీనికి అందరి ఆశీర్వాదాలు, ఆదరణ కావాలని కోరాడు. ‘ఈ జర్నీలో అందరినీ ఆ ఆదియోగి ఆశీర్వదిస్తాడు. హర హర మహదేవ్’ అంటూ రాసుకొచ్చాడు. చదవండి: మనం కలిస్తే చోలే భాటురే తిందాం.. కేబీసీ కంటెస్టెంట్‌కి తాప్సీ ఆఫర్ ‘कर्ता करे न कर सके शिव करे सो होय ..’ 🙏🏻 Need your blessings and wishes for #OMG2, our honest and humble attempt to reflect on an important social issue. May the eternal energy of Adiyogi bless us through this journey. हर हर महादेव@TripathiiPankaj @yamigautam @AmitBrai pic.twitter.com/VgRZMVzoDy — Akshay Kumar (@akshaykumar) October 23, 2021 -
కరోనా సెగ:అర్థాంతరంగా నిలిచిపోయిన షూటింగ్
సాక్షి,ముంబై: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి, లాక్డౌన్ ముగిసిన అనంతరం షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించుకున్న బాలీవుడ్ మూవీ ‘ఓ మైగాడ్-2’ కు కరోనా షాక్ తగిలింది. యూనిట్లో ఏకంగా ఏడుగురికి కరోనా సోకడంతో అర్థాంతరంగా షూటింగ్‌ను నిలిపివేశారు. వచ్చే రెండు వారాల పాటు షూటింగ్‌ను నిలిపివేసినట్టు నిర్మాత్ అశ్విన్ వర్దే ప్రకటించాడు. అమిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్ నటిస్తున్నారు. వీరిద్దరికి కోవిడ్-19 నెగెటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా షూటింగ్లోపాల్గొనాల్సి ఉంది. కొన్ని రోజుల క్రితం సభ్యులలో ఒకరికి పాజిటివ్ నిర్ధారణ కాగా, అతడిని హోం క్వారంటైన్‌కి తరలించారు. అయితే ఇతర సభ్యులకు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రావడంతో తిరిగిషూట్ను ప్రారంభించారు. కానీ రెండు రోజుల వ్యవధిలోనే కరోనా లక్షణాలు కనిపించిన నేపథ్యంలో పరీక్షలు నిర్వహించగా వారికి పాజిటివ్‌గా తేలింది. దీంతో టీమ్ సభ్యులందరూ కోలుకునే వరకు రెండు వారాల పాటు షూట్‌ను నిలిపివేశారు. అక్షయ్ కుమార్, పరేశ్ రావల్, మిథున్ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఓ మై గాడ్’. దీనికి సీక్వల్గా పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్ ప్రధాన పాత్రల్లో ‘ఓ మై గాడ్-2’ గా రానుంది. ఈ చిత్రంలో అక్షయ్ మరోసారి దేవుడి పాత్రలో నటించబోతున్నాడు. సుదీర్ఘ విరామం తరువాత కొత్త మార్గదర్శకాలతో ఇటీవల బాలీవుడ్ షూటింగ్ పనులు పుంజుకున్న సంగతి తెలిసిందే. -
మరోసారి దేవుడి పాత్రలో అక్షయ్ కుమార్
బాలీవుడ్ మోస్ట్ బిజియెస్ట్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు. ఇప్పటికే ఆయన నటించిన సూర్యవంశీతో పాటు మరో మూడు సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా అక్షయ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అక్షయ్ కుమార్, పరేశ్ రావల్, మిథున్ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఓ మై గాడ్’. ఈ సినిమాని తెలుగులో‘గోపాల గోపాల’గా రీమేక్ చేశారు. ఇందులో విక్టరీ వెంకటేశ్, పవన్ కల్యాణ్ హీరోలుగా నటించారు. ఇప్పుడు ‘ఓ మై గాడ్’కి సీక్వెల్ రాబోతుంది. పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్ ప్రధాన పాత్రల్లో ‘ఓ మై గాడ్-2’తెరకెక్కబోతుంది. ఈ చిత్రంలో అక్షయ్ మరోసారి దేవుడి పాత్రలో నటించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ కోసం ఆయన 15 రోజుల కేటాయించారు. అమిత్ రాయ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్ట్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. -
ఓరి దేవుడా!
శ్రీవెంకటేశ్వర విజువల్స్ పతాకంపై వి. శ్రీవాత్సవ్ దర్శకత్వంలో వేణు ముక్కపాటి నిర్మించిన చిత్రం ‘ఓ మైగాడ్’. తనీష్, మేఘశ్రీ, పావని ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రానికి రాజ్ కిరణ్ సంగీత దర్శకుడు. హైదరాబాద్‌లో జరిగిన ఆడియో ఆవిష్కరణ వేడుకలో నిర్మాత డి.ఎస్.రావు సీడీని ఆవిష్కరించి, దర్శక-రచయిత శివశక్తి దత్తాకు అందించారు. ‘‘నా శిష్యుడు శ్రీవాత్సవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విజయవంతం కావాలి’’ అని శివశక్తి దత్తా అన్నారు. ఇది సోషియో ఫాంటసీ చిత్రమని తనీష్ పేర్కొన్నారు. చంద్రమహేశ్ దగ్గర ‘హనుమంతు’ చిత్రానికి దర్శకత్వ శాఖలో చేశాననీ, విజయేంద్ర ప్రసాద్ దగ్గర కూడా చేసిన అనుభవంతో ఈ చిత్రానికి దర్శకత్వం వహించానని దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో శోభారాణి, చంద్రమహేష్, మేఘశ్రీ పాల్గొన్నారు.ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: రాజు తోట, కో-ప్రొడ్యూసర్: చనమాల పురుషోత్తం. -
మీకోసమే.. దేవుడు పంపించాడు!!
-
భక్తుడి దెబ్బకు దేవుడే దిగివస్తే..?
-
పవన్ ఎలాంటి మార్పులూ కోరలేదు!
ఇండస్ట్రీ హిట్ ‘అత్తారింటికి దారేది’ తర్వాత పవన్‌కల్యాణ్ చేస్తున్న చిత్రం ‘గోపాల గోపాల’. బాలీవుడ్ ‘ఓ మైగాడ్’కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో హిందీలో పరేశ్‌రావల్ చేసిన పాత్రను వెంకటేశ్, అక్షయ్‌కుమార్ పోషించిన కృష్ణుడి పాత్రను పవన్ కల్యాణ్ చేస్తున్న విషయం తెలిసిందే. ‘ఈ క్రేజీ మల్టీస్టారర్‌కి స్క్రిప్టే ప్రధాన బలం’ అని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అయితే... మీడియాలో మాత్రం ఈ సినిమాపై రకరకాల ఊహాగానాలు వినపడుతున్నాయి. పాత్ర పరంగా, తన ఆహార్యం పరంగా దర్శకుడు డాలీకి పవన్ కల్యాణ్ కొన్ని మార్పులు సూచించారట. అయితే... తాను సూచించిన మార్పులేమీ డాలీ చేయకపోవడం... పవన్‌కి బాధ కలిగించిందనీ ఏవేవో గాలి వార్తలు వచ్చాయి. సినిమా ప్రారంభమై రోజులు గడుస్తున్నా... మొన్నటి దాకా పవన్ సెట్స్‌కి రాకపోవడానికి కారణం ఇదేనని ఆ గాసిప్ సారాంశం. కానీ, ఈ వార్తలను యూనిట్ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. పవన్ ఈ సినిమా స్క్రిప్టులో ఎలాంటి మార్పులూ కోరుకోలేదనీ, ‘గోపాల గోపాల’ విషయంలో ఆయన పూర్తి సంతృప్తితో ఉన్నారనీ యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. మాతృక ‘ఓ మైగాడ్’లో అక్షయ్‌కుమార్ పాత్ర నిడివి ఎంత ఉంటుందో పవన్ కల్యాణ్ పాత్ర నిడివి కూడా అంతే ఉంటుందని వారు చెబుతున్నారు. సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి రాసిన డైలాగులను పవన్, తదితరులు బాగా ఆస్వాదిస్తున్నారట. షూటింగ్ మొదలైన తర్వాత కూడా సెట్స్‌కి రావడానికి పవన్ ఇంత టైమ్ తీసుకోవడానికి... దానికి కారణం కేవలం ఆయన వెన్నునొప్పే అని తెలిసింది. కొన్ని రోజులుగా ఆయన వెన్ను నొప్పితో బాధ పడుతున్నారు. ఈ కారణంగానే... తన మాజీ భార్య రేణూ దేశాయ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన మరాఠీ చిత్రం ‘ఇష్క్ వాలా లవ్’ ఆడియో వేడుకకు కూడా అతిథిగా వెళ్లలేకపోయారు పవన్. వెన్నునొప్పి కాస్త తగ్గడంతో ఇప్పుడు ‘గోపాల గోపాల’ షూటింగ్లో హుషారుగా పాల్గొంటున్నారని తెలిసింది. -
పవన్ తో కలిసి నటిస్తోన్న మిధున్
-
ఇటు కుటుంబం కోసం ఆరాటం...అటు దేవుడిపై పోరాటం
మేఘజలం కోసం ఎదురుచూసే చాతకపక్షిలా... కొత్తదనం ఉన్న సినిమాల కోసం ఆతృతగా, ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఎంత ఎదురు చూసినా... వారి దాహార్తిని తీర్చే సినిమాలు మాత్రం రావడం లేదు. అయితే... త్వరలో రెండు సినిమాలు రాబోతున్నాయి. వైవిధ్యం కోసం వెంపర్లాడే ప్రేక్షకుని దాహార్తిని ఆ రెండు సినిమాలూ పూర్తి స్థాయిలో తీర్చేస్తాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. వాటిలో ఒకటి ‘దృశ్యం’. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న భార్యాబిడ్డల్ని... ఆ ఇంటిపెద్ద ఎలా రక్షించుకున్నాడు అనేది ఈ సినిమా కథాంశం. మలయాళంలో మోహన్‌లాల్ నటించిన ‘దృశ్యం’ ఈ చిత్రానికి మాతృక. పక్కింటి కథలా సింపుల్‌గా అనిపించినా... కథనం, పాత్రల తీరు తెన్నులు చాలా వైవిధ్యంగా అనిపిస్తాయి. తెలుగు తెరకు ఇది కచ్చితంగా కొత్త ప్రయత్నం. ఇక రెండో సినిమా విషయానికొస్తే... బాలీవుడ్ ‘ఓ మై గాడ్’ తెలుగు రీమేక్. దేవుడిపైనే కేసు వేసిన ఓ సామాన్యుడి కథ. మనుషుల మనసుల్లో నలుగుతున్న పలు ప్రశ్నలకు సమాధానంగా ఉంటుందీ సినిమా. బాలీవుడ్లో పరేశ్‌రావెల్, అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 26 నుంచి హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడా స్టూడియోలో వేసిన సెట్లో ‘ఓ మైగాడ్’ తెలుగు వెర్షన్ చిత్రీకరణ మొదలు కానుంది. ఈ రెండు సినిమాలకూ కథానాయకుడు వెంకటేశే కావడం నిజంగా విశేషమే. నటునిగా ఆయనఆకలిని, కొత్తదనం కోసం తపించే ప్రేక్షకుల దాహార్తిని ఒకేసారి తీర్చేసే పనిలో నిమగ్నమైపోయారు వెంకటేశ్. ‘దృశ్యం’లో ఆయనది సగటు మనిషి పాత్ర అయితే... ‘ఓ మైగాడ్’లో ఆయనది ప్రజల మనిషి పాత్ర. ప్రశ్నించే పాత్ర. 28 ఏళ్ల కెరీర్లో వెంకటేశ్ ఎన్ని వైరైటీ పాత్రలు చేసినా... ఈ రెండు పాత్రలు మాత్రం ఆయన కెరీర్లో ప్రత్యేకం. ఇక ‘దృశ్యం’లో కథానాయికగా మీనా నటిస్తుండగా, నదియా ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. శ్రీప్రియ దర్శకత్వంలో సురేశ్‌ప్రొడక్షన్స్ సంస్థ ఆ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘ఓ మైగాడ్’ రీమేక్ విషయానికొస్తే... సురేశ్‌ప్రొడక్షన్స్, శరత్‌మరార్ కలిసి నిర్మించనున్నారు. పవన్‌కల్యాణ్ ఇందులో శ్రీకృష్ణునిగా వైవిధ్యమైన పాత్రలో కనిపించనుండటం విశేషం. ఈ చిత్రం ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుంది. ఇందులో కథానాయికగా పలువురు హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. ‘కొంచెం ఇష్టం కొంచెం ఇష్టం’ ఫేం కిషోర్‌కుమార్(డాలీ) ఈ చిత్రానికి దర్శకుడు. -
ఓ మై గాడ్...!
అనుకున్నవన్నీ జరగనిదే జీవితం. సినిమా పరిశ్రమ కూడా అంతే. ఊహించని పరిణామాలు ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. అష్టా చమ్మా గడుల్లో పావుల్లా... ఇక్కడి పరిస్థితుల్లో నిలకడ ఉండదు. రీసెంట్గా అలాంటి పరిస్థితే నయనతార విషయంలో ఎదురైందట. ‘ఓ మై గాడ్’ తెలుగు రీమేక్‌లో నటించడానికి నయనతార పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. అయితే... ఇప్పుడు ఆ సినిమా నుంచి నయన తప్పుకున్నారని టాక్. వివరాల్లోకెళ్తే... వెంకటేశ్ ‘రాధ’ చిత్రం ఆగిపోవడంతో... ఆ సినిమాకు సంబంధించిన నయనతార డేట్స్‌ని ‘ఓ మైగాడ్’కి ట్రాన్స్ఫర్ చేశారు. అయితే... కథానుగుణంగా ‘రాధ’లో నయనతారది హీరోకు సమానమైన పాత్ర. ‘ఓ మైగాడ్’లో మాత్రం ఆమెది చాలా చిన్న పాత్ర. చిక్కంతా ఇక్కడే వచ్చింది. ‘రాధ’ చిత్రంలో నటించడానికి భారీ పారితోషికం అడిగారట నయనతార. అవే డేట్స్‌ని ఇప్పుడు ‘ఓ మైగాడ్’కు వాడుతున్నారు కాబట్టి, సదరు చిత్ర నిర్మాతలను అదే మొత్తం పారితోషికంగా ఇవ్వాలని నయన డిమాండ్ చేసినట్లు తెలిసింది. అయితే... పాత్ర చిన్నది అవ్వడంతో అంత పారితోషికం మేం ఇవ్వలేమని కరాఖండీగా చెప్పేశారట సదరు చిత్ర నిర్మాతలు. ‘‘పాత్ర చిన్నదో పెద్దదో నాకు అనవసరం. నా డేట్స్ మీ దగ్గరున్నాయి. దానికి తగ్గ పారితోషికం మీరు ఇవ్వాల్సిందే’ అనేది నయన వాదన. దానికి ‘ఓ మై గాడ్’ నిర్మాతలు ససేమిరా అనడంతో... ‘ఓ మై గాడ్’ నుంచి నయన తప్పుకున్నారని తెలిసింది. మరి నయనతార స్థానాన్ని భర్తీ చేసే ఆ లక్కీ హీరోయిన్ ఎవరో చూడాలి. ఏది ఏమైనా... ఓ గొప్ప అవకాశాన్ని నయనతార చేజార్చుకున్నారని ఫిలింనగర్ టాక్. -
‘ఓ మైగాడ్’లో నయన?
కథానాయికలు డేట్స్ ఇవ్వడం, అనివార్య కారణాల వల్ల సినిమా ఆలస్యమైతే... సదరు నిర్మాతలు ఆ డేట్స్‌ని వేరే సినిమాకు ఉపయోగించుకోవడం అప్పుడప్పుడూ జరుగుతుంటుంది. ఇటీవల నయనతార విషయంలో అదే జరిగిందట. వివరాల్లోకెళితే.. వెంకటేశ్-మారుతి కాంబినేషన్లో రూపొందాల్సిన ‘రాధ' చిత్రంలో నయనతార కథానాయికగా నటించాల్సి ఉంది. కానీ... కొన్ని కారణాల వల్ల ‘రాధ' సెట్స్‌పైకి వెళ్లలేదు. దాంతో నయన డేట్స్‌ని వృధా చేయలేని నిర్మాత డీవీవీ దానయ్య... వెంకటేశ్ హీరోగా రూపొందనున్న ‘ఓ మై గాడ్’ రీమేక్‌కి ఆ డేట్స్‌ని ఇచ్చేశారట. ఇది సినీవర్గాల్లో వినిపిస్తున్న తాజా వార్త. కిషోర్‌కుమార్(డాలీ) దర్శకత్వంలో డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్ కలిసి నిర్మించనున్న ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్ ప్రత్యేక పాత్ర పోషించనున్న విషయం తెలిసిందే. మాతృక పరంగా చూస్తే.. ఈ భారీ మల్టీస్టారర్‌కి కథానాయికతో పనిలేదు. అయితే... కథలో జనరంజకమైన కొన్ని మార్పులు చేసి వెంకటేశ్‌కి జోడీగా నయనతారను నటింపజేస్తున్నారట దర్శకుడు డాలీ. ఇందులో నయన పాత్రను భిన్నంగా డిజైన్ చేస్తున్నట్లు తెలిసింది. నటిగా ఆమెను మరో స్థాయిలో కూర్చోబెట్టేలా ఈ పాత్ర ఉంటుందని వినికిడి. ‘రాధ' మిస్సయినా.. ‘ఓ మైగాడ్’తో అద్భుతమైన ఛాన్స్ కొట్టేసి నయనతార లక్కీ హీరోయిన్ అనిపించుకున్నారన్నది ఫిలింనగర్ టాక్. -
దేవుడిపై కేసు వేసేది వచ్చే నెలలోనే!
ప్రయోగాత్మక చిత్రాల్లో కూడా నటించి మెప్పించగల సత్తా ఉన్న కథానాయకుడు వెంకటేశ్. ప్రస్తుతం ఆయన చేస్తున్న మలయాళ రీమేక్ ‘దృశ్యం’ కానీ, చేయనున్న బాలీవుడ్ రీమేక్ ‘ఓ మైగాడ్’ కానీ... రెండూ ప్రయోగాత్మక కథాంశాలే కావడం విశేషం. మలయాళంలో మోహన్‌లాల్, బాలీవుడ్లో పరేశ్‌రావెల్ చేసిన పాత్రల్ని తెలుగులో వెంకటేశ్ చేయడం నిజంగా ఆసక్తికరమైన విషయమే. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమాలు కావాల్సినంత వినోదాన్ని పంచుతాయని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ‘దృశ్యం’ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉండగా ‘ఓ మైగాడ్’ చిత్రాన్ని మే నెలలో మొదలుపెట్టనున్నారు వెంకీ. విధి కారణంగా సర్వం కోల్పోయిన ఓ వ్యక్తి... సూటిగా దేవునిపైనే న్యాయస్థానంలో కేసు దాఖలు చేయడం ఈ సినిమా కథాంశం. ఆసక్తికరమైన మలుపులతో వినోదంగా ఈ సినిమా సాగుతుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు, చేర్పులు కూడా ఈ చిత్రానికి చేస్తున్నట్లు సమాచారం. ఇందులో పవన్‌కల్యాణ్ కృష్ణుడిగా ఓ ప్రత్యేక పాత్ర పోషించనున్న విషయం తెలిసిందే. ఆయన కూడా మే నుంచి ఈ చిత్రానికి డేట్స్ ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే వెంకటేశ్‌తో రెండు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఓ కథానాయిక ఇందులో వెంకీతో జతకట్టనున్నారు. వెంకటేశ్, పవన్‌కల్యాణ్‌లతో పాటు... మరో స్టార్ కూడా ఈ చిత్రంలో నటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్ కలిసి నిర్మించనున్న ఈ చిత్రానికి ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘తడాఖా’ చిత్రాల ఫేం కిషోర్‌కుమార్(డాలీ) దర్శకుడు -
గబ్బర్‌సింగ్ మళ్లీ గుర్రం ఎక్కుతున్నాడు!
‘ఓ మైగాడ్’ తెలుగు రీమేక్‌లో పవన్‌కల్యాణ్ నటించనున్నారు. ఇటీవల ఈ వార్త వెలుగు చూసింది. అంతకు ముందే.. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారితో పవన్ భారీ డీల్ కుదుర్చుకున్నారని, ఆ సంస్థ నిర్మించబోయే చిత్రాల్లో పవన్ నటించబోతున్నారని ఓ వార్త మీడియాలో హంగామా చేసింది. పవర్‌స్టార్‌ని కేంద్రంగా చేసుకుని పుట్టుకొస్తున్న ఈ వార్తల మధ్య ‘గబ్బర్‌సింగ్-2’ నిజంగా నలిగిపోతున్నాడు. అసలు ఆ సినిమా ఉన్నట్టా? లేనట్టా? స్క్రిప్ట్ వర్క్ మొదలైంది. సంపత్‌నందిని దర్శకునిగా తీసుకున్నారు. మరి ఉన్నట్లుండి పవన్‌కి ఈ కొత్త కమిట్మెంట్లేంటి? ఇప్పుడు ఫిలింనగర్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఎట్టకేలకు ఆ చర్చకు తెర పడింది. ‘గబ్బర్‌సింగ్’ రెండోసారి గుర్రం ఎక్కేస్తున్నాడు. ఈ నెలలోనే ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించడానికి నిర్మాత శరత్ మరార్ సన్నాహాలు చేస్తున్నారు. మార్చిలో కానీ, ఏప్రిల్‌లో కానీ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. వీలైతే... ‘ఓ మైగాడ్’ తెలుగు రీమేక్‌కు సమాంతరంగా ‘గబ్బర్‌సింగ్-2’ షూటింగ్‌ను కూడా జరపాలని శరత్ మరార్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
తెలుగు 'కృష్ణుడు' ఎవరు?
కనుమరుగైపోతున్న మల్టీ స్టారర్ చిత్రాలకు గత సంవత్సరం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో మరోసారి టాలీవుడ్ నటుడు వెంకటేశ్ ఊపిరిపోశాడు. సీతమ్మ వాకిట్లో.. విజయం తర్వాత మరోసారి వెంకటేశ్ మల్టీ స్టారర్ చిత్రానికి సిద్ధమైనట్టు సమాచారం. హిందీలో ఘన విజయం సాధించిన 'ఓ మై గాడ్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి వెంకీ పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తోంది. గుజరాతీ నాటకం 'కంజి విరుద్ కంజి', ఆస్ట్రేలియన్ చిత్రం 'ది మ్యాన్ హూ స్యూడ్ గాడ్' లను స్పూర్తిగా తీసుకుని బాలీవుడ్ లో 'ఓ మై గాడ్' చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, పరేశ్ రావెల్ ప్రధాన పత్రాలు పోషించారు. పరేశ్ రావెల్ పాత్రలో వెంకటేశ్ నటించనున్నారు. అయితే ఈ చిత్రంలో కృష్ణ పరమాత్ముడి పాత్ర అత్యంత కీలకం. అయితే ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న కృష్ణుడి పాత్రకు నలుగురి పేర్లను ప్రధానంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కృష్ణుడి పాత్రకు సూపర్ స్టార్ రజనీ కాంత్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు పేర్లపై నిర్మాత డి సురేశ్ బాబు దృష్టిని సారించినట్టు తెలుస్తోంది. ఒకవేళ నలుగురు అగ్రనటుల్లో కృష్ణుడి పాత్రను పోషించడానికి ఎవరు ముందుకు వచ్చినా, తెలుగు 'ఓ మై గాడ్' చిత్రానికి బ్రహ్మండమైన క్రేజ్ వస్తుందని సినీ విమర్శకులు, పండితులు అభిప్రాయపడుతున్నారు. కృష్ణుడి పాత్రకు రజనీ, చిరంజీవి, పవన్, మహేశ్ లో ఎవరు ఓకే చెబుతారో అని అభిమానులు ఆతృతగా వేచి చూస్తున్నారు. -
డాలీ దర్శకత్వంలో ఓ మైగాడ్!
బాలీవుడ్లో సంచలనాత్మక విజయం సాధించిన చిత్రం ‘ఓ మైగాడ్’. అక్షయ్ కుమార్, పరేష్ రావెల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతోపాటు, బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఇందులో మోడ్రన్ కృష్ణుడిగా అక్షయ్ కుమార్ నటించారు. ‘ఓ మైగాడ్’ తెలుగులో రీమేక్ అవుతుందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో నటించడానికి పవన్ కల్యాణ్ ఆసక్తి చూపిస్తున్నారని అప్పట్లో ఫిలింనగర్లో అనుకున్నారు కూడా. ఇప్పుడా ప్రాజెక్ట్‌కి వెంకటేష్ పచ్చజెండా ఊపినట్టుగా తెలిసింది. ఇందులో అభినవ కృష్ణుడిగా కనిపించడానికి ఆయన ఉత్సాహం చూపిస్తున్నారట! పరేష్ రావెల్ పాత్రను తెలుగులో ఎవరు చేస్తారనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘తడాఖా’ చిత్రాలతో మంచిపేరు సంపాదించుకున్న కిషోర్ కుమార్ పార్థసాని (డాలీ) ఈ చిత్రానికి దర్శకునిగా ఎంపికయ్యారు. డి.సురేష్‌బాబుతో కలిసి మరో నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు సమాచారం. ఫిబ్రవరిలో ఈ చిత్రం షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.